రామ్‌చరణ్‌ 18 ఏళ్ల కెరీర్‌.. ‘పెద్ది’ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌…

 రామ్‌చరణ్‌ 18 ఏళ్ల కెరీర్‌.. ‘పెద్ది’ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌

మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ చిరుత సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమయ్యారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007 సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది.

మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) ‘చిరుత’ (Chirutha) సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమయ్యారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007 సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది. చరణ్‌ డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో మెప్పించారు. తదుపరి మగధీర, నాయక్‌, రంగస్థలం వంటి భారీ చిత్రాలతో హిట్స్‌ అందుకున్నారు. చిరంజీవి తగ్గ కుమారుడనిపించుకున్నారు. మెగాపవర్‌స్టార్‌ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) గ్లోబల్‌స్టార్‌ అనిపించుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘చిరుత’ ప్రేక్షకుల ముందుకొచ్చి నేటికి 10 వసంతాలు పూర్తి చేసుకుంది. (18 years of RamcharanCareer)ఈ సందర్భంగా ‘పెద్ది’ టీమ్‌ (Peddi) ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘మా ‘పెద్ది’ 18 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నారు.. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్బాలను ఇచ్చాడు. మున్ముందు ‘పెద్ది’ నుంచి చాలా పెద్ద సర్‌ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ కథతో తెరకెక్కుతోంది. వృద్థి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌తోపాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. ‘ఒకే పని సెసేనాకి..  ఒకే నాగ బతికేనాకి… ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే  సేసెయ్యాల… పుడతామా యేటి మళ్లీ’ అంటూ కొద్ది రోజులు క్రితం విడుదల చేసిన గ్లింప్స్‌ సినిమాకు మంచి హైప్‌ తీసుకొచ్చింది. 

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్.

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ సర్పంచులు ఎస్ వరుణ కుమారి పబ్బ సదయ్య వారి ఆధ్వర్యంలో మైలారం గ్రామంలో భూక్య సమ్మయ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సమ్మయ్య నాయక్ మాట్లాడుతూ గ్రామ కమిటీ అధ్యక్షునిగా నాకు సహకరించిన పార్టీ నాయకులకు గ్రామ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు గ్రామ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మోరే మహిపాల్ ప్రధాన కార్యదర్శి కుసుమ మహేందర్ కోశాధికారి దౌడు రమేష్ కార్యదర్శి జంగా రవి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి డిసిఓ వాల్య నాయక్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని సహకార సంఘం జిల్లా డిసిఒ వాల్య నాయక్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లను ఆదేశించారు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓద్దుల పల్లె మైలారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు వర్ష ప్రభావం సూచనల నేపథ్యంలో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు ఈ సందర్భంగా రైతులతో కొనుగోలు కు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు రైతులు ధాన్యం విక్రసించిన వెంటనే ట్రక్ సీట్ ఇవ్వాలన్నారు అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు ప్రక్రియలో కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని ఆయన సూచించారు అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలో పరదాలను సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాల్లో ఇన్చార్జీలు పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సి ఓ పుట్ట సురేష్ ఓద్దుల పల్లె ఇన్చార్జి కుక్క ముడి సంపత్ మైలారం ఇంచార్జి కండే కుమార్ రైతులు పాల్గొన్నారు.

తిరుపతి నాయక్ ను పరమర్శించిన మాజీఎమ్మెల్యే.!

తిరుపతి నాయక్ ను పరమర్శించిన మాజీఎమ్మెల్యే సుంకేరవిశంకర్

కరీంనగర్ నేటిధాత్రి:

బిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ విజయవంతం కొరకు బస్సుల ఏర్పాట్లు కార్యక్రమంలో ప్రైవేట్ కాలేజీకి వెళ్లిన సందర్భంగా మాజీ కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు తన కాలికి ఫ్రాక్చర్ అయి గాయపడిన విషయం తెలుసుకొని తిరుపతి నాయక్ స్వగృహం చింతకుంట శాంతి నగర్ లో కలిసి పరామర్శించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్.
ఈసందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన విషయాలు తెలుసుకుని త్వరగా కోలుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడిన తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక ఉంచుతానని పార్టీ మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యదిలో ఉంచుకుంటారని రవిశంకర్ తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గంగయ్య, తదితరులు ఉన్నారు.

తిరుపతి నాయక్ ను పరామర్శించిన కమలాకర్.!

 

తిరుపతి నాయక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, నేటిధాత్రి:

టిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చింతకుంట మాజీ ఎంపీటీసీ, కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి ఫ్రాక్చరయి గాయపడిన విషయం తెలుసుకొని వారి స్వగృహం శాంతినగర్ లో కలిసి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈసందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడుతున్న తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యాదిలో ఉంచుకుంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version