రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు.!

రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్

బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పట్ల వివక్షపాతంతో కనీస అవసరాలు తీర్చకుండా మద్దతు ధర ప్రకటించకుండా ఈ ప్రభుత్వం కాలం గడుపుతూ పని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా రైతుల ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఖాతాలో ఇంతవరకు డబ్బులు పడకుండా ఉండకపోవడం దారుణమని తెలియజేశారు ఇలాంటి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అదోగమనంగా ఉందని వివరించారు. నేడు పాకాల వర్షంతో అనేక మంది రైతులకు పంట నష్టం వాటిల్లిన వారికి తగిన పరిహారం ప్రభుత్వం కల్పించాలని తెలియజేశారు. అంతేకాకుండా నేడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పాలన అని చెప్పి, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా
,రైతుల సమస్యలు , నిరుద్యోగు లను పట్టించుకోకుండా, చేనేత కార్మికులు కూడా పట్టించుకోకుండా కాలం గడుపుతూ ముందుకు సాగుతుంది అని తెలియజేశారు, అడ్డదారి
పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమి పట్టించుకోక, అవినీతి పాలనగ రాష్ట్ర మేలుతున్నారని తెలియజేశారు. అంతేకాకుండా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూ రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టౌన్ ఉపధ్యక్షులు ఎండి సత్తార్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబీకార్ రాజన్న, వరస కృష్ణహరి, గుండారపు కృష్ణారెడ్డి, వెంగళ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మనేని అమర్నాథ్, బండి జగన్ ఒగ్గు బాల్ లింగం, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు భోజనాల ఏర్పాట్లు.

‘రైతులకు భోజనాల ఏర్పాట్లు’

ఆమనగల్ /నేటి ధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగలులోని మార్కెట్ చైర్మెన్ శ్రీమతి యాట గీతా నర్సింహ సొంత డబ్బుతో రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసి మంచి మనసు చాటుకున్న మార్కెట్ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ మార్కేట్ ఆవరణలోని రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేశారు.

ఆమనగల్లు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ లో వడ్లు అమ్మటానికి వచ్చిన రైతుల కోసం సోమవారం నుండి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ బోజనాలు, మంచి నీళ్ళ వసతులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేస్తూ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటి వరకు ఈ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుల కోసం ఎవ్వరూ బోజనాలు ఏర్పాటు చేయలేదు, మొదటి సారి రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ గారికి మరొక్కసారి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

అలాగే రైతుల కోసం క్వింటాల్ కి రూ 500 బోనస్ ఇస్తున్న ప్రజా ప్రభుత్వంకి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అన్నారు.

రైతులను ఆదుకోవాలని సంకల్పంతో రైతుల కోసం ఎన్నో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎప్పటికి రుణపడి ఉంటాము అని పలువురు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న మంచి పనుల పై సంతొషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ వస్పుల శ్రీశైలం, తాళ్ళ రవీందర్, అజీమ్,రమేష్ గౌడ్, నరేష్ నాయక్,అంజయ్య గుప్తా, శ్యామసుందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి ఉపాధ్యక్షుడు షాబుద్దీన్ , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న BRS నాయకులు.

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు ఆపద వస్తే అండగా ఉండే నాయకుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 60 వ జన్మదిన వేడుకలు

*-కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న బి ఆర్ఎస్ నాయకులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

పేదల పెన్నిధిగా..ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని..ఆపదొస్తే అండగా ఉండే భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ లు కేక్ కట్ చేసి, సీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన గండ్ర వెంకట రమణారెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, అభివృద్ధి అంటేనే గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తుకు వచ్చేలా..భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సున్నితమైన మనసు కలిగిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో..నిండు నూరేళ్లు..ఆయురారోగ్యాలతో..అష్టైశ్వర్యాలతో..మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేసే యోగ్యం కల్పించాలని ఆ దేవున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

49 సార్లు రక్తదానం చేసిన పి ఇటీ మురళి కృష్ణ.

49 సార్లు రక్తదానం చేసిన పి ఇటీ మురళి కృష్ణ

అభినందిoచిదిన అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి నేటిధాత్రి :,

 

 

49 సార్లు రక్తదానం చేసిన పీ ఇ టి మురళీకృష్ణ ను సన్మానం చేసి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అభినందించారు
ప్రజలకు అత్యవసరమైన సేవలలో రక్తం తయారు చేసేది కాదని ఒకరూ ఇస్తేనే వస్తుంది అలాంటిది 49 సార్లు ఇచ్చి 49 మందిని రక్షించిన మురళీకృష్ణ సమాజానికి ఎంతో సేవ చేశాడని, రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని కొత్త రక్తం వచ్చి మన ఆరోగ్యం గా ఉంటామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆపదలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడలని కోరా రు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు రిటైర్డ్ ఎం ఈ ఓ ధర్మారెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు అహ్మద్, ఎస్సీ ,ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,ఐక్యవేదిక నాయకులు గౌనికాడి యాదయ్య, కురుమూర్తి,శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.

ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు

రాష్ట్రంలో నేటి నుంచి నమోదు

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలిపారు.కాగా రాష్ట్ర వ్యాప్త నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని అని మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏ.డీ.ఏ మాట్లాడుతూ రైతుల విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చని అన్నారు. ఆధార్‌ సంఖ్యతో అనుసంధానమైన, పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారని పేర్కొన్నారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోందని వాటికి సరైన గణాంకాలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించిందని ఏడీఏ వివరించారు.ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు,పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయని, రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదని దీంతో వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారిందని పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్‌ తెలంగాణ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.కాగా ప్రక్రియ పట్ల మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు శిక్షణ ఇచ్చిందన్నారు.

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు వ్యవసాయ శాఖ..

Agriculture

 

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కోసం భూయాజమాన్య పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, ఫోన్‌ నంబర్‌తో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.కాగా ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని ఏడీఏ దామోదర్ రెడ్డి తెలిపారు.ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు..

రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు..రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొందని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలియజేశారు.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.

 

Students

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు

వరంగల్, నేటిధాత్రి

 

 

రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు ఇది అందని ద్రాక్షగా మారుతుందన్న ఆవేదనను తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎలేందర్ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది పేద కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తినడం జరిగింది. ఇప్పుడు అదే సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది అన్నారు. ప్రస్తుతం 16.25 లక్షల మంది పథకానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో పేదలు ఈ అవకాశాన్ని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పథకం కింద నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి, సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం.

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం.

సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. నర్సంపేట మాదన్నపేట రోడ్ సిపిఐ కాలనీ వద్ద ఉన్న కామ్రేడ్ పంజాల చంద్రమౌళి 8 వ వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేశారు.కాగా స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మేకల రవి మాట్లాడారు.
అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి పేదప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి

దున్నేవాడికి భూమి కావాలని నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అనేక భూ పోరాటాలు చేసి భూములను సాధించిన చరిత్ర కలిగిన పంజాల చంద్రమౌళిది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ సభకు అధ్యక్షత వహించగా సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే బాష్మియా పనస ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు లక్ష్మణ్ అక్క పెళ్లి రమేష్ తోట చంద్రకళ జిల్లా నాయకులు కందిక చెన్నకేశవులు గడ్డం యాకయ్య మియాపురం గోవర్ధన్ పాలక కవిత భానోతు వీరు నాయక్ చింతకింది కుమారస్వామి అయిత యాకయ్య గడ్డం నాగరాజు అక్బర్ ఇల్లందులసాంబయ్య యాదగిరి సతీష్ మమతా శైలజ తదితరులు పాల్గొన్నారు.

నేత కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం.

నేత కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం

బత్తుల విఠల్ కుటుంబాన్ని
ఈ ప్రభుత్వం ఆదుకోవాలని

బీ ఆర్టి యు జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుడు బత్తుల విఠల్ అనే వ్యక్తి ఆత్మహత్య పాల్పడడం జరిగినది.
ఈ ఘటనకు సంబంధించి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ..
మాది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పిస్తామని గొప్పలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. సిరిసిల్లలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్లకు వచ్చి కూడా నేతన్నల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నేతన్నలకు నిరంతర ఉపాధితో పాటు వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు అండగా నిలిచి నేతన్నలకు మనోదైర్యం కల్పించిన గొప్ప మనసున్న నాయకులు కెసిఆర్. కేటీఆర్ నని అన్నారు. ఆకలి చావులు ఆత్మహత్యలు లేకుండా చేసిన ఘనత కెసిఆర్, కేటీఆర్ దేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి మెరుగైన కూలి వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఆత్మహత్యలు లేకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బత్తుల విఠల్ కుటుంబాన్ని పరిమర్శించి వారి కుటుంబానికి బి.ఆర్.యస్ పార్టీ అండగా ఉంటుందని తెలుపడం జరిగింది.వీరివెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దూస వినయ్. బి.ఆర్.యస్ సీనియర్ నాయకులు బత్తుల రమేష్ ఉన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం.

వెంకటాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ముఖ్య అతిధిగా హాజరైన మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలో వెంకటాపురం గ్రామం లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతుల అవగాహన కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం,సాగుఖర్చును తగ్గించుట,అవసరం మేరకు రసాయనాలు వినియోగం,రైతు సోదరులకు రసీదులను భద్రపరుచుకోవడం,పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు,చెట్లను పెంచడం,సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు గ్రామంలోని వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. రాజు,డాక్టర్ కే.స్వాతి, వ్యవసాయ విస్తరణాధికారులు కాటంరాజు,వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు, వెంకటాపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.

శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 


శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత సమేత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం,శిఖర పూజ, కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు

 

Mata Jayanti celebrations.

 

శ్రీ చంద్రశేఖర శివచార్య మహాస్వామి బెమల్ ఖేడ్, బసవలింగ అవధూత గిరి మహరాజ్ , మాతృశ్రీ మఠం శివలీలమ్మ, రాచయ్య స్వామి, కేతకీ టెంపుల్ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, సిద్దయ్య స్వామి, నాగరాజ్ పటేల్,లింగం గౌడ్ , ఈశ్వరప్ప పాటిల్, తదితర భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

బిఆర్టియి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారందరికీ లేబర్ శాఖ ద్వారా సంక్షేమ పథకాలు అందజేయాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.ఐస్ క్రీమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షుడు కొమురయ్య అధ్యక్షతన జరిగింది. గోనె యువరాజు మాట్లాడుతూ దేశంలో నాలుగున్నర కోట్ల మంది కార్మికులు రోజువారీగా పనులు చేసుకుంటూ కార్మిక చట్టాల అమలుకు దూరంగా ఉంటున్నారని వారందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే పార్లమెంటులో సమగ్ర బిల్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా చట్ట సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులు సమ్మె చేయబోతున్నారని ఆ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా చెరుపల్లి కొమరయ్య, కార్యదర్శిగా ఎండి అజీమ్, ఉపాధ్యక్షులుగా సలేంద్ర చేరాలు, కోశాధికారిగా గుండు స్వామి, కమిటీ సభ్యులుగా అన్నే బోయిన రాజు, జి సారయ్య,రాజు, మహేందర్ ,నరసయ్య ,శ్రీను బద్రు, పాషా ఎన్నికైనారు.

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్.!

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది.
పహాల్గంలోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత దేశంలో ఉన్న పాకిస్థానీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా

BJP district president

 

అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ దుమాల శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి శ్రీ గొప్పాడి సురేందర్ రావు, ఒబిసి మోర్చా అధ్యక్షుడు శ్రీ నంద్యాడపు వెంకటేష్, మరియు మాజీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు శ్రీ పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పెగళ్ళపాటి.

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పెగళ్ళపాటి

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన గోవిందు పుష్ప అనే నిరుపేద మహిళ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాగా కడు నిరుపేదలైన మృతురాలి కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు, కర్మకాండల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గీసుకొండ గ్రామానికి ఆమె బంధువులు, గీసుకొండ గ్రామ శ్రీమంతుడు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణకు తెలిపి సహాయం కోరారు.కాగా మానవత్వంతో స్పందించిన లక్ష్మీనారాయణ వెంటనే రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ నగదును ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, మృతురాలి బంధువులు ఇనుముల ప్రభాకర్, కోట అయిలయ్య, అశోక్, రాజు, బరిగెల యాకూబ్ కలిసి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

సరస్వతి శిశు మందిర్.!

సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ :పట్టణ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ్లనం ను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు, చదువొక్కటేనా..
విద్యతో పాటు బుద్ధులు బుద్ధులతో పాటు విలువలు..
క్రమశిక్షణా కట్టుబడి దేశభక్తి జాతీయభావనను
నరనరమున నింపి… వినయవిధేయతలు,ధర్మనిష్టా సత్సాంప్రదాయ సదాచారాలు కణకణమున అలవర్చిన మన బడి…బడి కాదు అది వ్యక్తిత్వ నిర్మాణ ధర్మక్షేత్రం సమాజ నిర్మాణ కార్య క్షేత్రం మనందరిలో ఏకాత్మతా భావనను నింపిన దైవ క్షేత్రం..బడి కాదు అది బ్రతుకు నేర్పిన అమ్మ ఒడి..మన శిశు మందిర్ గుడి..!ఆ దైవ క్షేత్రం..ఆ ధర్మక్షేత్రం..ఆ కార్య క్షేత్రం..స్మరిస్తూ శారదామాతా ఒడిలో స్నేహాతులు కలుసుకుని వాళ్ళ బాల్యపు మధుర స్మృతులను,మరపురాని అనుభవాలను వారి ఆచార్యులతో పంచుకున్న విద్యార్థులు మన పాఠశాల 2000-2001 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత బాల్య మిత్రులు అంతా ఒక్కటిగాఏర్పడి చిన్న నాటి మధుర జ్ఞాపకాలను అందరితో కలసి పంచుకున్నారు. పాఠశాలలో దాదాపు 4 లక్షల వ్యయంతో 2 తరగతి గదులను మరియు రేలింగ్ వేయించి ఆధునీకరించడం జరిగిందని పాఠశాల అధ్యక్షులు సాయి రెడ్డి విఠల్ రెడ్డి అన్నారు,పాఠశాల తిరిగి పునర్ వైభవం లోకి రావడానికి పూర్వవిద్యార్థులు,పూర్వ ఆచార్యులు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు గోకుల కృష్ణయ్య ,పూర్వ ఆచార్యులు మరియు పూర్వ విద్యార్ధి పరిషత్ సభ్యులు గిరీష్,మహేష్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ
అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన

కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

*కీలపట్లలో శాశ్వత విద్యుత్ సమస్య పరిష్కారం..

*కీలపట్లలో శాశ్వత విద్యుత్ సమస్య పరిష్కారం..

*అంతరాయం లేకుండా త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా..

*గృహ అవసరాలతో పాటు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం…

*రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్..

గంగవరం(నేటి ధాత్రి) మే05:

 

 

గంగవరం మండలంలోని కీలపట్ల పంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్య శాశ్వతంగా పరిష్కారానికి నోచుకుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కీలపట్లలోని కోనేటి రాయస్వామి ఆలయంలో స్వామి వారిని ఆదివారం ఆయన దర్శించుకుని పంచాయతీ కేంద్రంలో రూ.60 లక్షల ఆర్డీఎస్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన నాలుగు 100 కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల తో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కీలపట్ల గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్బంగా చేపట్టే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో విద్యుత్ తీగల కారణంగా ఇబ్బందులు ఉండేవన్నారు. గ్రామస్తులు మరియు భక్తుల శ్రేయస్సు దృష్ట్యా 60 లక్షలతో గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు 100కేవి ట్రాన్స్ ఫా
ర్మర్లను మరియు సమస్య అనేదే ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అదనంగా 25 కేవి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేశామన్నారు. దీంతో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండడమే కాకుండా లో ఓల్టేజి సమస్య అనే మాటే ఉండదన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల అవసరాలకే గాక 24 గంటలు త్రీఫేస్ విద్యుత్ ను వాడుకోనేందుకు వీలుందన్నారు. దాంతో పాటు పంచాయతీ పరిధిలో చిన్న పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. అతి తక్కువ సమయంలో ఆర్డీఎస్ కాంట్రాక్టర్ లు మరియు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. కీలపట్ల పంచాయతీ పరిధిలో ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకోవడం, రోడ్లు,గృహాలు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఈఈ శ్రీనివాస మూర్తి, ఏడి చిన్నబ్బ, కన్స్ట్రక్షన్ ఏడి రెడ్డి కుమార్, ఏఈ రామక్రిష్ణ, మరియు టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ చంద్ర శేఖర్, వేణు, గిరిధర్ గోపాల్, రాము,శీనప్ప, శ్రీనివాసులు, జనసేన నాయకులు చంద్ర తదితరులున్నారు..

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గండ్ర వెంకటరమ ణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు మండ ల కేంద్రంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానా యకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డిమరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

Gangula Manohar Reddy.

 

 

అనంతరం గవర్న మెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురా రోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.

Gangula Manohar Reddy.

ఈ కార్యక్ర మంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి, మండల సోషల్ మీడి యా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మ కంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లినందం, గడిపే విజయ్, ధైనంపల్లిసుమన్, పోతురమణారెడ్డి సావుళ్ళ కిష్టయ్య, నర్రరాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాలశ్యామాజీ, అట్లతిరుపతి, రంగుమహేం దర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్లభానుచందర్, పైండ్లశంకర్, ఫైండ్లశ్రీనివాస్, కోగీలరవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, రామరాజు, రమేష్ , మొగిలి,సుభాష్, వైద్యుల సాం బరెడ్డి, మస్కే సుమన్ , నాగరాజు ,దేవయ్య,రేణికుం ట్ల సంతోష్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలో కొప్పుల గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న ఎస్ఎస్ సి పూర్వ విద్యార్థులు 2000-2001 బ్యాచ్ విద్యార్థులు అందరు కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ను లలిత కన్వెన్షన్ హాల్ పరకాలలో జరుపుకోవ డం జరిగింది ఇట్టి సమావేశా నికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు రవీందర్ ముక్తవరం శ్రీనివాసచారి, రేగులమొగిలి, వేములపల్లి మొగిలి,అడిదల మోహన్ రెడ్డి పసునూటి సంపత్, ఆడెపు ఆనంద్,అల్వాల శ్రీధర్, కల్లెపూ సమ్మయ్య , ఆనాటి విద్యా కమిటీ చైర్మన్ అయిన తడక చంద్రమౌళి గౌడ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన డం జరిగిందిఉపాధ్యాయులం దరూ మాట్లాడుతూ మీలాంటి ఇంత మంచి బ్యాచ్ ని సమావేశం ఏర్పరచుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ 50 ఒకే చోట చేరి ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ తరగతి గదిలో జరిగే ప్రతీది గుర్తు చేసుకుంటూ ఉపాధ్యా యులకు విద్యార్థుల మధ్య జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్క విద్యార్థి మంచి స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో బండి రాజు, సామల శ్రీనివాస్, ఆకుతోట తిరుపతి, రాంపల్లి రాము, మరియు ఆలువాల హేమలత తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version