కల్వకుర్తిలో ఘన వసంత పంచమి వేడుకలు

కల్వకుర్తిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలో సుభాష్‌నగర్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 77 మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేయించుకోగా, సుమారు 250 మంది తల్లిదండ్రులు, పోషకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రబంధకారిణి సభ్యురాలు శ్రీమతి నిర్మల అక్షరాభ్యాసం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు సేవకుల రాజు, విద్వత్ సమితి సభ్యులు సూరం తిరుపతి రెడ్డి దామోదర్ రెడ్డి ,ప్రబంధ కారిణి సభ్యులు కూన కిశోర్ ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సరస్వతి శిశు మందిర్.!

సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ :పట్టణ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ్లనం ను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు, చదువొక్కటేనా..
విద్యతో పాటు బుద్ధులు బుద్ధులతో పాటు విలువలు..
క్రమశిక్షణా కట్టుబడి దేశభక్తి జాతీయభావనను
నరనరమున నింపి… వినయవిధేయతలు,ధర్మనిష్టా సత్సాంప్రదాయ సదాచారాలు కణకణమున అలవర్చిన మన బడి…బడి కాదు అది వ్యక్తిత్వ నిర్మాణ ధర్మక్షేత్రం సమాజ నిర్మాణ కార్య క్షేత్రం మనందరిలో ఏకాత్మతా భావనను నింపిన దైవ క్షేత్రం..బడి కాదు అది బ్రతుకు నేర్పిన అమ్మ ఒడి..మన శిశు మందిర్ గుడి..!ఆ దైవ క్షేత్రం..ఆ ధర్మక్షేత్రం..ఆ కార్య క్షేత్రం..స్మరిస్తూ శారదామాతా ఒడిలో స్నేహాతులు కలుసుకుని వాళ్ళ బాల్యపు మధుర స్మృతులను,మరపురాని అనుభవాలను వారి ఆచార్యులతో పంచుకున్న విద్యార్థులు మన పాఠశాల 2000-2001 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత బాల్య మిత్రులు అంతా ఒక్కటిగాఏర్పడి చిన్న నాటి మధుర జ్ఞాపకాలను అందరితో కలసి పంచుకున్నారు. పాఠశాలలో దాదాపు 4 లక్షల వ్యయంతో 2 తరగతి గదులను మరియు రేలింగ్ వేయించి ఆధునీకరించడం జరిగిందని పాఠశాల అధ్యక్షులు సాయి రెడ్డి విఠల్ రెడ్డి అన్నారు,పాఠశాల తిరిగి పునర్ వైభవం లోకి రావడానికి పూర్వవిద్యార్థులు,పూర్వ ఆచార్యులు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు గోకుల కృష్ణయ్య ,పూర్వ ఆచార్యులు మరియు పూర్వ విద్యార్ధి పరిషత్ సభ్యులు గిరీష్,మహేష్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version