తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ రాయితీ చెల్లింపు గడువు మే మాసం 31 వరకు పొడిగింపు చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన. పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పురపాలక సంఘం కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకుల హౌస్ అరెస్టులతో నిర్బంధించడం అప్రజాస్వామికమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పేర్కొన్నారు.మహిళా నేతల హౌస్ అరెస్టుల పట్ల వై గీత ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగంగా ప్రదర్శన ప్రపంచస్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని కోరారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికంగా దివాల తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికే ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని ఆరోపించారు. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్యతోపాటు ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి,ఇతర జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడం అప్రాజస్వామిక చర్యగా భావిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గీత ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.
ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి :
తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
పిజేటిఏయూ వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo
కరీంనగర్, నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలo దేశరాజుపల్లి గ్రామంలోని రైతువేదిక నందు నిర్వహించడం జరిగినది. వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త మరియు అధిపతి డా.ఉషారాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు ముఖ్యమైన అంశాలైన తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రశీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్ట పరిహారాన్ని పొందండి అని తెలిపారు. ఈకార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎంసి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల మరియు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ రైతులందరూ యూరియ వాడకాన్ని తగ్గించి, చెట్లని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా . ఏ.విజయభాస్కర్ సాగు నీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనే విషయాలు రైతులకు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రావు రైతులను ఉద్దేశిస్తూ మామిడి, కూరగాయ, ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలిపారు. అనంతరం టిఎస్ఎస్డిసి రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు నాణ్యమైన విత్తన లభ్యత మరియు ధరల వివరాలను వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సహ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, సీడ్ ఆఫీసర్ మౌనిక , ఉద్యాన శాఖ ఆఫీసర్ రోహిత్, విఏఎస్ మనోహర్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, సంపత్, గోవర్ధన్ సుమారు నూటా యాభై ఏడు మంది రైతులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ పేరిట అమాయక గిరిజనులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి
గుండాల,నేటిధాత్రి:
గుండాల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం కు వచ్చిన టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్ రావు మండల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్గడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి ప్రజానీకాన్ని స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్న కేంద్రంలోని మనువాద మతోన్మాద ప్రభుత్వం నిసిగ్గుగా మావోయిస్టుల ఏరివేత పేరుతో అనేకమంది పేరుతో అనేకమంది ఆదివాసి యువకులను దారుణంగా చంపి రాజ్య హింసకు పాల్పడుతూ మధ్య భారత దేశంలోని ఆదివాసి ప్రజానీకం. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ అడవిని, అడవిలో గల సహజ, ఖనిజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న విరోచత పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని, హత్యకాండను ప్రతికటిద్దాం ఈ దేశ మూలవాసులు అనాదిగా అడవిని వాగులు, వంకలు, ఒర్రెలు, చెట్టు పుట్ట మరియు మూగజీవాలతో సహజీవనం చేస్తూ, తర తరాలుగా అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న ఆదివాసి ప్రజానీకాన్ని, అడవి నుండి ఖాళీ చేసి, సహజ, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేసేందుకు కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఒక ప్రక్కన మావోయిస్టులను దేశంలో నుండి ఏరిపారేసామని గొప్పలు చెబుతున్న పాలకులు, ఈనాడు ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న నెపంతో అడవిలో ప్రశ్నించే శక్తులు లేకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.భారతదేశ రాష్ట్రపతి 5. 6 షెడ్యూల్ ప్రాంతంలో జన్మించి రాజకీయంగా ఎదిగి, ఈనాడు ఆయా తెగల మీద ఫాసిస్టు ప్రభుత్వం ఆదివాసీలపై ఆపరేషన్ కగారు పేరుతో హననం చేస్తుంటే, మౌన ముని వలె ప్రేక్షక పాత్ర పోషించడం తగదు. దేశ సరిహద్దు ప్రాంతంలో ఉండవలసిన సైన్యం ఆదివాసి గూడాలపై పడి మరణ హోమం కలిగించడం బాధాకరం. ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట, పాట, వేట, ఆదివాసీల సంస్కృతి, వారిని అడవికి దూరంగా పారామిలటరీ దళాలు తరుముతున్నాయి. తెలంగాణలో పారా మిలటరీ మరియు బిఎస్ఎఫ్ క్యాంపులను సత్వరమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.
టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే మెదక్ నియోజకవర్గం కూడా ఈ పార్టీకి మంచిపట్టున్న నియోజకవర్గం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఏ కార్యక్రమం చేసిన వేరువేరుగా చేయడం పట్ల కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నారు. బహిరంగంగా విభేదాలు బయటపడకున్న లోలోపల మాత్రం విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఇప్పటినుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని పలువురి అభిప్రాయం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్లడంతో పాటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు.
Congress.
ఈ క్రమంలో అనుకున్న విధంగా ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఖండించకపోవడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రావ్ వ్యాఖ్యల పట్ల పార్టీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. అయితే ఆ కార్యకర్తను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టిన కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు ఇటీవల కేటీఆర్ ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. కేటీఆర్ సైతం మెదక్ నియోజకవర్గంలో నాయకుల పనితీరు పట్ల సంతృప్తిగా లేదని పలువురి వాదన. ఏది ఏమైనా ఇంటి పోరే కారుకు తిను సవాలుగా మారే ప్రమాదం ఉంది.
స్వాములకు అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు
పరకాల నేటిధాత్రి :
మండలంలోని మల్లక్కపేట గ్రామంలోని ఈ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో బొజ్జం కవిత కిషన్ దంపతులు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి మాల ధరించిన దాదాపు 250 మంది స్వాములకు అన్నప్రసాదం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్,ఇఓ వెంకటయ్య,అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,డైరెక్టర్స్ దొమ్మటి శంకరయ్య,నిట్టె బాలరాజు,బొజ్జం రాజేందర్ అలాగే,నల్ల విష్ణువర్థన్ రెడ్డి,భక్తులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో పాటు. తంగళ్ళపల్లి. గీత నగర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న. టీ. జి. పాలీసెట్.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు. ఎలా జరుగుతున్నాయని ఎగ్జామ్స్ సెంటర్లో నిర్వహించిన. సీసీ కెమెరాల పరిధిలో పరిశీలించి వివరాలు అడిగి. కెమెరాల పరిశీలన ఎలా ఉందని తెలుసుకున్నారు ప్రవేశ పరీక్ష సజావుగా ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ తెలిపారు. అలాగే. తంగళ్ళపల్లి జెడ్పిహెచ్ఎస్. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటార్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కోరగా పంచాయతీ . సెక్రెటరీ కి. ప్రతిపాదనలు అందజేయాలని ప్రిన్సిపల్ కి సూచించారు. ఇట్టి తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట. ప్రిన్సిపల్ . సూపర్డెంట్. శంకర్ నారాయణ శారద ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రక్క గ్రామ నీటి ట్యాంకర్ ద్వారా రోడ్డుపై నీటిని చల్లుతున్న వైనం
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం రెవెల్లి గ్రామ చెరువులో మట్టి తవ్వకాలు జరిపేందుకు రంగాపూర్ గ్రామం పెద్దపల్లి మండలం మరియు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఏఎన్ఆర్ బ్రిక్స్ కు గ్రామపంచాయతీ వారు మే రెండున తీర్మానం అందించగా, ఇరిగేషన్ అధికారులు మే8న అనుమతులిచ్చారు. నిబంధనల ప్రకారం రెండు వేల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తరలించాలని, తవ్వకాల కోసం రెండు ప్రొక్లెయిన్ మట్టి తరలింపు కోసం పది లారీలను మాత్రమే ఉపయోగించాలని, ఉదయం 6 నుండి సాయంత్రం 6 తీసుకోవాలని పర్మిషన్ లో పేర్కొన్నారు.
Gram Panchayat
కాని మట్టి తరలింపు కోసం పర్మిషన్ పొందిన సదరు కాంట్రాక్టర్ నిబంధనలు ఏం చేయవు, అధికారులు పట్టించుకోరు అనుకున్నాడో ఏమో గాని, పరిమిషన్ లేని లారీలను వాడటమే కాకుండా రాత్రి ఆరు గంటల తర్వాత కూడా ఇష్టారీతిన మట్టి తరలింపు చేపడుతున్నారు.
Gram Panchayat
ఇదిలా ఉండగా రాగంపేట గ్రామపంచాయతీ కి సంబంధించిన నీటి ట్యాంకర్ ను సంబంధిత కాంట్రాక్టర్ రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో మట్టి తరలిస్తున్న లారీలు వెళ్లే దారిలో నీటిని పట్టుతుండడం విశేషం. ఈవిషయమై రాగంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ ను వివరణ కోరగా మేము ట్యాంకర్ ను ఎవరికీ ఇవ్వలేదని తెలియజేశారు.
Gram Panchayat
తమ ఆధీనంలో ఉండాల్సిన ట్యాంకర్ పక్క గ్రామంలో నీటిని పడుతున్న ఏమీ తెలియనట్టు ఉన్నా పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మట్టి తవ్వకాలు చేపట్టిన సమయంలో పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అటువైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై మండలంలోని ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇట్టి విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి సంప్రదించడానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె కార్యాలయానికి ప్రతిరోజు ఆలస్యంగా వచ్చుచున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు.
Gram Panchayat
ఇదే విషయమై గ్రామ ప్రత్యేక అధికారిని వివరణ కోరగా కార్యదర్శి పై ఎంపీఓకి ఆలస్యంగా వచ్చుచున్నారని తెలియజేశామని మరియు మట్టి తరలింపుపై ఎంపీఓకి సమాచారం అందజేశామని తెలియజేశారు.నిబంధనలు విస్మరించి అనుమతి లేని వాహనాల ద్వారా మట్టి తరలిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంత జరుగుతున్నా సదరు కాంట్రాక్టర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్న కాంట పెడతలేరు అంటూ. వడ్లు కొంట.లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందంటూ జిల్లెల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై భారీగా ఎక్కడికక్కడ వాహనాలు . నిలిచి. రాకపోకలకు ఇబ్బంది జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ .ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని. ఈ సందర్భంగా జిల్లాల గ్రామస్తులు తెలిపారు అలాగే. మండేపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్డెక్కి. నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగారు. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు మండలంలో ప్రతి గ్రామంలో వడ్ల. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు ఉన్నతాధికారులకు విన్నవించారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ ప్రజలు. రైతులు. మండపల్లి గ్రామ ప్రజలు. రైతులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత. పోలీసులు వెళ్లి ధర్నా చేస్తున్న వారిని . శాంతింప చేసి. సంబంధిత అధికారులతో మాట్లాడి వరి ధాన్యం. కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలను . క్రమబద్ధకరించి. వాహనాలు సజావుగా పోయేటట్టు రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు
కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక వైకుం ఠధామం వద్దకు వెళ్లే దారిలో భారీ మురుగు కాలువ ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈకాలువ కారణం గా స్మశానవాటికకు వెళ్లేమార్గం అడ్డంకులతో కూడుకున్నది దీంతో అంత్యక్రియలు, ఇతర ఆ చారాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ ము రుగు కాలువ నీరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తూ దుర్వాసన వెదజల్లుతుంది. ఈ సమస్య వల్ల స్మశానవాటికకు వెళ్లేవారు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మురుగు కాలువ వల్ల మార్గం పూర్తిగా మునిగిపోయింది. అంత్యక్రియలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని స్థాని కులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మురు గు కాలువను మూసివేసి స్మశానవాటికకు సరైన మార్గం ఏర్పాటు చేయాలని స్థానికు లు కోరుతున్నారు. ఈవిషయంలో తహశీల్దార్ కార్యాలయం తగిన చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈసమస్యపై అధికారుల స్పం దన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.
◆ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాసీ కాను మరియు వక్ఫ్ బచా ప్రచారం, ముస్లిం పర్సనల్ లా బోర్డు జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకంగా వక్ఫ్ బచా దస్తూర్ బచా ప్రచారం యొక్క కేంద్ర నిరసన అఖిల పక్ష సాధారణ సమావేశం మే 24వ తేదీ శనివారం అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని ఆలోచనా విధానాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగిస్తారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవస్థాపక కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో అన్ని ఇస్లామిక్ సోదరులు తమ మతం లేదా మతంతో సంబంధం లేకుండా పాల్గొని, తమ ఐక్యత, జాతీయ సంఘీభావం, మతపరమైన గర్వం మరియు సజీవ దేశంగా నిరూపించుకోవాలని మరియు ఈ వివాదాస్పద నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా తమ సమిష్టి నిరసనను నమోదు చేయాలని అభ్యర్థించారు.
ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా పనులు ముందే ముగించాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి నవీద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ కూలీలు పాల్గొన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే కాలి పోతు న్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు వివరాల్లో కెళితే శాయంపేటమండలం పత్తిపాక గ్రామానికి చెందిన అన్న బోయిన రఘుపతి అనే రైతు మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగు చేశారు పంట చేతికి అంద డంతో మొక్కజొన్న కోసి వాటిని పొలంలో కుప్పగా పోసి మార్కెట్ చేసేందుకు నిలువ ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించ డంతో పొలంలోని మూడున్నర.
Agriculture
ఎకరాలలో మొక్కజొన్న పంట సుమారు ఖాళీ బూడిదయింది పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపో యింది అప్పటికే మొక్కజొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి దృశ్యాన్ని చూసి రైతు లబోది బో అంటూ గుండె బాదుకు న్నాడు. రైతు స్థానిక వ్యవసా య అధికారికి ఫిర్యాదు మేర కు ఏవో గంగా జమున కాలిపో యిన కంకులు పరిశీలించగా 60% కాలి పోయినట్లు గుర్తిం చారు. రైతుకు పంట నష్టం జరిగినట్లు నిర్ధారించడం జరిగింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.