గండిపేట:ప్రతి ఒక్కరు హరితహారం మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని పెంచేందుకు కృషి చేస్తే రాబోవు తరాలకు మంచి వాతావరణం అందుతుందని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ తెలిపారు.శుక్రవారం బండ్లగూడ జాగిర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ వార్డు స్పెషల్ బ్లాక్,సి బ్లాక్ లలో హరితహారంలో భాగంగా మొక్కలను పంపిణి చేసిన బి.జె.ఎం.సి.మేయర్ బుర్ర మహేందర్ గౌడ్.ఈ కార్యక్రమంలో హఫీజ్ ఖాన్, సుమన్,నదీం,బిల్ కలెక్టర్ అస్లం,కాలనీ వాసులు పాల్గోన్నారు.
Category: Latest news
జూటా మాటల..జూటా పార్టీ.. బిజెపి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర
కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర
కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర
రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర
బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర
సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర
“నేటిధాత్రి” న్యూఢిల్లీ
అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పరుస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.లోకసభలో బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలు మాట్లాడిన తీరు పట్ల ఆయన
అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బలంగా తిప్పికొట్టారు.ఢిల్లీ లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయిందని,ఈ విషయంలో రేవంత్ అర్థంపర్థం లేని నిరాధార ఆరోపణలకు దిగడం శోచనీయమన్నారు.ఎంపీ రవిచంద్ర ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు తదితర ఎంపీలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా,ఏ మాత్రం సహకరించనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణను
అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అద్భుతమైనదని, కేంద్ర ప్రభుత్వం దీనికి 86పైసల సాయం కూడా చేయలేదని ఎంపీ వద్దిరాజు సుస్పష్టంగా చెప్పారు.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నిండు లోకసభలో అబద్ధం చెప్పడం అభ్యంతరకరమన్నారు.సంవత్సరం పైగా అధికార బీజేపీ పార్లమెంట్ నడవకుండా,దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా తప్పించుకుంటున్నదని ఆయన నిశితంగా దుయ్యబట్టారు.ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు,అదానీ ఆర్థిక కుంభకోణాల గురించి చర్చించకుండా 50లక్షల కోట్ల జాతీయ బడ్జెట్ ను ఆమోదింపజేసుకున్న తీరును ఈ సందర్భంగా రవిచంద్ర గుర్తుచేశారు.అలాగే,ప్రస్తుత సమావేశాలలో మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న కల్లోల పరిస్థితులపై చర్చ జరుగకుండా,సభలో సమాధానం ఇవ్వకుండా అధికార పక్షం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పరుస్తున్నదని ఎంపీ వద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమంగా తరగాలిస్తున్న 28 క్వింటాళ్ల నల్ల బెల్లం,50 కిలోల పటిక పట్టివేత
ముగ్గురు వ్యక్తుల అరెస్టు, వాహనం సీజ్
– కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి
కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
58 బస్తాల అక్రమ నల్లబెల్లం,పటికను రవాణా చేస్తున్న అశోక్ లేయలాండ్ వాహనంను, ముగ్గురు నేరస్థులను పట్టుకున్నట్టు కేసముద్రం ఎస్సై కోకిల తిరుపతి వెల్లడించారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కల్వల గ్రామంలో కేసముద్రం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఎండి అమీర్ ఇంటి వద్ద అనుమానస్పదంగా ఉన్న అశోక్ లేయలాండ్ వాహనంను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 2,85,000/- విలువ గల 58 బస్తాల నల్లబెల్లం (28క్వింటల్స్ ),50కేజీ పటికను పట్టుకొని ఎండి అమీర్,మునికుంట్ల నరేష్,ఎండి అజారుద్దీన్ ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకొనారు.వారిని విచారించాగా బీదర్ నుండి అక్రమంగా నల్లబెల్లం తెచ్చి కేసముద్రం చుట్టుపక్కల అమ్ముతున్నామని తెలిపారు. ముగ్గురు నేరస్థుల నుండి 58 బస్తాల నల్లబెల్లం (28క్వింటల్స్ ),50కేజీ పటిక,అశోక్ లేయలాండ్ వాహనంను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సై తిరుపతి వివరించారు.
ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం
రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్
నేటిధాత్రి మునుగోడు
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్.
ఈ కార్యక్రమంలో మునుగోడు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచ్లు ముఖ్య నాయకులు ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వార్డ్ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
*అభ్యర్థుల ఎంపికలో భట్టి కీ రోల్…నివేదిక కోరిన రాహుల్..?*
Rahul Gandhi gave importance to Bhatti :
తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.
ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్
విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
కాంగ్రెస్ “గ్యారంటీ” తో కొత్త మలుపు… బీఆర్ఎస్ లో కుదుపు
Congress Party :
తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాదితులు, డయాలసిస్ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.
ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, వారి ధనిక మిత్రులు ఓవైపు ఉంటే.. మరోవైపు రైతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్‌లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ గా మారింది. కేసీఆర్ ఓట్ బ్యాంక్ చెల్లా చెదురు అవ్వటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.
భట్టికి రాహుల్ ప్రాధాన్యత…ఒకే కారులో గన్నవరంకు..మంతనాలు
Khammam Janagarjana Sabha Update :
ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో గన్నవరం వరకు వెళ్లారు. పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేసారు.
ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట…కార్యకర్తలంతా ఒకే సభ అన్నట్లుగా నిర్వహించటం పైన రాహుల్ హ్యాపీ ఫీలయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణంకు చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్ అంటే.. బీజేపీ రిష్తేదార్ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.
రాహుల్ ఇదే సభలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు అంటూ చెబుతున్న సమయంలో సభలో హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి. సభ ప్రాంగణంకు చేరుకున్న సమయం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవలాను వివరించారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పైన ఖమ్మం వేదికగా గర్జించారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు.
ఎదుర్కోవటం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న అంశాలు.. పార్టీలోని పరిస్థితుల పైన భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు
*కాంగ్రెస్ మేనియా..హోరెత్తుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర*
Janagarjana Sabha In Khamma :
తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖమ్మం నగరం వైపే పరుగులు తీస్తున్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీనే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు లక్షల మందితో జనగర్జన సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.
భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భట్టి విక్రమార్క భరత వాక్యం పలికాడని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్రమార్క తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు – వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు..మరెన్నో ప్రజాసమస్యను గుర్తించడానికి వేదికగా నిలిచింది.
ఇప్పటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వతంత్ర తెలంగాణ రాజకీయాలకు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా భట్టి పాదయాత్రతో కాంగ్రేస్ మేనియా మొదలైంది. తాజాగా ఖమ్మం నగరంలో తలపెట్టిన జనగర్జన సభతో భట్టి విక్రమార్క నామస్మరణం హోరెత్తుతున్నది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు.
పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల సర్కిల్ హోర్డింగ్ లు, భారీ కటౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగరేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.
*ఖమ్మం వైపు ఢిల్లీ చూపు … ప్రగతి భవన్ లో తర్జన భర్జన*
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
అగ్ర నేతే సత్కరించటం అనేది అరుదైన సందర్భం. ఇప్పుడు భట్టికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర మొదలైంది. నేతలను ఏకం చేసింది. పార్టీకి వచ్చిన ఆదరణ, కార్యకర్తల్లో కొత్త జోష్, కేడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భట్టి యాత్ర పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
దీంతో, భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సందడి చేస్తున్నారు. ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేసారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.
అటు బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే భయం వెంటాడుతోంది. పార్టీ నాయకత్వం మార్పు పైన డైలమాలో నేతలు ఉన్నారు. రాహుల్ వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపు ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పంజుకోవటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సమయంలోనే ఖమ్మం సభకు అధికార బీఆర్ఎస్ అవాంతరాలు కలిగించే ప్రయత్నం చేస్తోంది. సభకు ముందు బస్సులు ఇవ్వటానికి అంగీకరించిన ఆర్టీసీ..
ఆ తరువాత నో చెబుతోంది. మంత్రుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లేని చెక్ పోస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభ – భట్టి విక్రమార్క యాత్ర – రాహుల్ రాక – నేతల చేరికలు పైన ప్రగతి భవన్ లో చర్చలు సాగుతున్నాయి. నిఘా నివేదికల పైన తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు
Congress wave in Telangana :
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు – తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించిన అంశం. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది కూడా ఇదే అంశం. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కిమీ నడిచిన భట్టిని పార్టీ తరపున రాహుల్ సత్కరించనున్నారు. ఖమ్మం వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నడుమ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగి మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సభ సక్సెస్ అవ్వటం ఖాయమని గ్రహించిన రేవంత్ అలర్ట్ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పైన పర్యవేక్షణకు రంగంలోకి దిగారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ స్థాయి ఆదరణ తిరిగి దక్కుతుందని పార్టీ ముఖ్యులే అంచనా వేయలేదు. పార్టీ కోసం భట్టి చొరవ తీసుకొని పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రభత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచారు. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో మమేకం అయ్యారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం అవసరమని వివరించారు. ఈ ఆదరణ కాంగ్రెస్ నేతలను కదలించింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలంతా ఒక్కటయ్యారు. ఈ ఐక్యత, ఆదరణ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించింది. భట్టి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కు కారణమైన భట్టి యాత్ర ముగింపు సభకు రాహుల్ తరలి వస్తున్నారు. లక్షలాది మంది సమక్షంలో భట్టి విక్రమర్కను సన్మానించనున్నారు.ఇప్పుడు ఖమ్మం సభ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. పార్టీకి పెరిగిన ఆదరణ..భవిష్యత్ కార్యాచరణ పైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ఖమ్మంలో జరగనున్న జనగర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున ఉండటం, కాంగ్రెస్ పై ప్రజల ఆదరణ, కార్యకర్తల్లో జోష్, ఇవన్ని పెరగటం చూసిన అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం సభా వేదికగా జరిగే చేరికలు, రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్ – బీజేపీకి సవాల్ గా మారుతున్నాయి.ఖమ్మం సభ వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఖమ్మం సభ నిర్వహణపైన ఇప్పటి వరకు రేవంత్ అంటీ ముట్టనట్లు ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే నేరుగా భట్టి వద్దకు వెళ్లి సభా నిర్వహణ పైన చర్చించారు.
అ చర్చలకు పొంగులేటిని ఆహ్వానించారు. సభకు జనగర్జన గా అక్కడే పేరు ఖరారు చేసారు. థాక్రే రాష్ట్రంలోనే మకాం వేసారు. సభ జరిగే రోజున రాహుల్ గాంధీ వస్తుండటంతో మొదట టీపీసీసీ అధ్యక్షుడిగా సభ వరకు పరిమితం అయ్యేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కానీ మారుతున్న పరిణామాలు, నేరుగా రాహుల్ టీమ్ సభ పైన ఫోకస్ చేయటం, సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇప్పుడు రేవంత్ ఖమ్మం బాట పట్టారు. ముందస్తు ఏర్పాట్ల పై పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక కేంద్రంగా నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
*తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్..ఖమ్మం జనగర్జన..భట్టికి అరుదైన గుర్తిం పు*
ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్కు పునర్జీవం అయిం ది. కొత్త చరిత్రకు శ్రీకారం
చుట్టిం ది. ఉద్య మాన్ని తలపిం చేలా పీపుల్స్ మార్చ్ సాగిం చిన పోరాట
యోధుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుం ది.
భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారిం ది. కేడర్ లో జోష్
పెం చిం ది. ఎన్ని కల వేళ సమరానానికి సైన్యం లో పోరాట కసిని పెం చిం ది.
దీనిని గుర్తిం చిన హైకమాం డ్ భట్టికి అరుదైన గౌరవం అం దిస్తోం ది. ఖమ్మం
గడ్డపైన లక్షలాది మం ది కార్య కర్తల సమక్షం లో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
పార్టీ తరపున సత్క రిం చనున్నా రు. ఇదే సభలో ముఖ్య నేతల
చేరికలు…తెలం గాణ భవిష్య త్ పై భరోసా ఇస్తూ ఎన్ని కల సమరశం ఖం
పూరిం చేం దుకు ఖమ్మం జనగర్జన వేదికగా నిలవనుం ది.
ఒక్క తెలం గాణలోనే కాదు…కాం గ్రెస్ పార్టీలో గల్లీ నుం చి ఢిల్లీ వరకు వినిపిస్తున్న
పేరు మల్లు భట్టి విక్రమార్క . దక్షిణాదిని కర్ణాటక తరువాత కాం గ్రెస్ నాయకత్వం
ఫోకస్ చేసిన రాష్ట్రం తెలం గాణ. తెలం గాణ ఇచ్చిన రాష్ట్రం గా కాం గ్రెస్ క
అధికారం దక్కా లి…రాహుల్ ప్రధాని కావాలి. ఈ రెం డు అం శాలే లక్ష్యం గా
బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్య తిరేక నిర్ణయాల పై ప్రజల మధ్య నుం చే భట్టి
నిలదీసారు. వారికి అం డగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం
అయ్యా రు. ఎన్ని ఇబ్బం దులు వచ్చినా..అనారోగ్య సమస్య లు తలెత్తినా వెనుకడుగు
వేయలేదు. ఈ యాత్రతో నేతలం దరు ఏకం అయ్యా రు. కాం గ్రెస్ శ్రేణులు తరలి
వచ్చారు. అగ్ర నేతలు సం ఘీభావం ప్రకటిం చారు. ప్రజలు మద్దతుగా నిలిచారు.
అం దుకే ఇప్పు డు భట్టి పీపుల్స్ మార్చ్ కు ఇం త పాపులారిటీ వచ్చిం ది.
భట్టి యాత్ర ద్వా రా తెలం గాణ కాం గ్రెస్ లో వచ్చిన మార్పు ను హైకమాం డ్
గుర్తిం చిం ది. దీం తో భట్టి యాత్రకు సరైన గుర్తిం పు ఇవ్వా లని నిర్ణయిం చిం ది.
ఇదే సమయం లో పార్టీలో ముఖ్యు ల చేరికల పైన భట్టి చేసిన ప్రయత్నా లు
సఫలం అయ్యా యి. అన్నిం టికీ సరైన వేదిక ఖమ్మం గా నిర్ణయిం చారు. ఇక్క డ
నుం చే పార్టీ నేత రాహుల్ గాం ధీ తెలం గాణ పైన తమకున్న అభిమానం
చాటుతూ..భవిష్య త్ లో ఏ విధం గా తెలం గాణ కోసం ఎటువం టి నిర్ణయాలు
అమలు చేసేది ప్రకటిం చనున్నా రు. ఇక్క డ నుం చే బీఆర్ఎస్ ప్రభుత్వం పై
గర్జనకు సిద్ధమయ్యా రు. ఈ సభకు జనగర్జనగా పేరు ఖరారు చేసారు.
సీఎల్పీ నేత భట్టితో తాజాగా పార్టీ రాష్ట్ర వ్య వహారాల ఇం ఛార్జ్ థాక్రే
సమావేశమయ్యా రు, ఖమ్మం సభ ఏర్పా ట్ల పైన చర్చిం చారు. పార్టీలో చేరనున్న
మాజీ ఎం పీ పొం గులేటిని సమావేశానికి ఆహ్వా నిం చారు. ఖమ్మం సభ వం ద
ఎకరాల్లో నిర్వ హిం చేలా కసరత్తు ప్రారం భిం చారు. భట్టి చారిత్రాత్మ క యాత్ర
ముగిం పు సభగా.. పొం గులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వ హిం చేం దుకు
నిర్ణయిం చారు. ఈ సభ ద్వా రా కాం గ్రెస్ అధికారం లోకి వస్తూనే దగా పడిన
తెలం గాణ ప్రజల కోసం ఏం చేయనుం దో స్ప ష్టత ఇవ్వ నున్నా రు. ఖమ్మం సభకు
రాష్ట్ర వ్యా ప్తం గా కాం గ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నా రు. కాం గ్రెస్ ప్రభం జనం ఖమ్మం
నుం చే మొదలు కానుం ది. కర్ణాటక ఎన్ని కల్లో విజయం తరువాత ఇప్పు డ
కాం గ్రెస్ వరుస నిర్ణయాలతో దేశ వ్యా ప్తం గా అం దరి చూపు ఖమ్మం జనగర్జన
సభ వైపే చూస్తోం ది. ఈ సభ కోసం ఏర్పా ట్లు ప్రతిష్ఠాత్మ కం గా జరుగుతున్నా యి.
భట్టి పాదయాత్ర పై రాహుల్ ఆరా.. ప్రశంసలు
Rahul Gandhi enquiry about the Bhatti Vikramarka People’s March :
తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం..వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నేతలు రాహుల్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని..వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందాయి.
కర్ణాటక తరువాత దక్షిణాదిన తెలంగాణ కాంగ్రెస్ కు కీలకంగా మారింది. తెలంగాణలో భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ యాత్ర కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో పార్టీకి అధికారం.. ప్రధానిగా రాహుల్ లక్ష్యంగా భట్టి ప్రకటించారు. రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కనున్నారు. భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగింది. ఈ వేదిక అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. వీరందరినీ భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది.
ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల పైన భట్టి ప్రజల మధ్యనే ఉంటూ పోరాటం ప్రారంభించారు. పేద ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ..పేద వర్గాలతో మమేకం అయ్యారు. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని, ముఖాముఖి మాట్లాడుతూ, సభలు పెడుతూ.. ప్రజలతో నడుస్తూ భట్టివిక్రమార్క ప్రజలకు చేరువయ్యారు. పార్టీ నేతలతో భట్టికి ఉన్న సత్సంబంధాలతో అందరివాడుగా నిలిచారు. భట్టి యాత్రలో నేతలతా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ నేతలు హాజరైన మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన ఎక్కడిక్కడ స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర సాగిస్తున్నారు.
ఈ నెల 15న భట్టి జన్మదినం నాడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనూ భట్టి పాదయాత్ర గురించి ఆరా తీస్తున్నారు. భట్టి పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు పర్యటించటం.. భట్టికి స్థానికులు ఫిర్యాదు చేసిన అంశాల పరిష్కారినికి చొరవ తీసుకోవటం ద్వారా భట్టి యాత్ర ఆ పార్టీలో ఎంత కలవరపాటుకు గురి చేస్తుందనేది స్పష్టం అవుతోంది. పాదయాత్ర సమయంలోనే పార్టీలో నేతల చేరికల పైన భట్టి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి వంటి నేతలు భట్టిని కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ హాజరు కానున్నారు. ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు స్పూర్తిగా మారుతోంది.
*రేవంత్ వెనుకబడ్డావ్.. సమన్వయం ఏదీ..రాహుల్ క్లాస్*
Rahul Gandhi’s take class to Revanth :
టీపీసీసీ చీఫ్ రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నా రు.
పార్టీని నడిపించాల్సి న వాడిని నీవే వెనకబడుతున్నా వు అంటూ సూచనలతో
పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ
చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొ న్నట్లు
సమాచారం . పార్టీ పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా
రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కా జ్ గిరి పార్లమెంట్తో పాటుగా సొంత
అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లోనూ వెనుకబడి ఉన్నా రని రాహుల్ తేల్చి
చెప్పా రు. పార్టీ అధ్య క్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని.. సీనియర్లకు
ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వా ల్సిందేనని స్పష్టం చేసారు. ఉత్తమ్ చేసిన ఫిర్యా దు
పైన వివరణ కోరారు.
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యా రు. కర్ణాటక గెలుపును
తెలంగాణలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నా రు. కర్ణాటకలో కాం గ్రెస్
నేతలం తా కలిసి కట్టుగా పని చేయటం ద్వా రా అధికారంలోకి వచ్చిన అం శాన
రాహుల్ గెలుపు వ్యూ హం లో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పు డు తెలంగాణ
పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్ప ష్టం చేసారు. పార్టీకోసం అందరూ
కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పా రు. ఎవరూ వ్యక్తిగత
అభిప్రాయాలు.. ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పి నట్లు
విశ్వ సనీయ సమాచారం . తెలంగాణలో గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు
ఉండాలని స్పష్టంచేసారని పార్టీలో చర్చ జరుగుతోంది.
రేవం త్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాం ధీకి
ఫిర్యా దు చేసారు. తన పైన రేవం త్ టీం సోషల్ మీడియాలో దుష్ప్ర చారం
చేస్తున్నా రని ఆధారాలు సమర్పిం చారు. తనను పార్టీలో నుం చి బయటకు పం పే
విధం గా పొమ్మ నకుం డా పొగ పెడుతున్నా రని నేరుగా సోనియాకు
వివరిం చారు. ఈ అం శం పైన రాహుల్ నేరుగా రేవం త్ ను నిలదీసినట్లు
సమాచారం . ఇదే సమయం లో రేవం త్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ
తగ్గటం పైనా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం . మల్కా జ్ గిరి పార్లమెం ట్
పరిధిలోని అసెంబ్లీ స్థానాల పై రాహుల్ గాం ధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగిం ది.
మినీ ఇం డియాగా భావిం చే మల్కా జ్ గిరి పార్లమెం ట్ పరిధిలోని అసెంబ్లీ
స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్న ట్లు సర్వే నివేదికలు అందాయని..పూర్తి
సమాచారం తోనే రేవంత్ ను రాహుల్ ప్రశ్నలు సంధించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపగల నేత పార్టీకి దూరం
అయ్యా రని..అందరినీ కలుపుకు వెళ్లాలని రేవం త్ కు రాహుల్ ఒకిం త గట్టిగానే
సూచన చేసారని పార్టీలో చర్చ జరుగుతోం ది. పార్టీకి వ్యూ హకర్తగా పని చేస్తున్న
సునీల్ టీం కొడం గల్ నియోజకవర్గం లో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారం గా
రాహుల్ ప్రశ్నిం చినట్లు సమాచారం . పార్టీని పటిష్టం చేయాలనే గుర్నా థ్ రెడ్డి ని
పార్టీ లోకి ఆహ్వా నిం చినట్లు రాహుల్ కి రేవం త్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో
పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉం దని చెప్పి న రాహుల్ గాం ధ నేతల్లో సమస్య లు ఉం టే
చర్చలతో పరిష్క రిం చుకోవాలని సూచిం చారు. పార్టీలో సమస్య లు సృ ష్టిస్తే
ఎవరినీ ఉపేక్షిం చేది లేదని రాహుల్ గట్టిగానే చెప్పి నట్లు తెలుస్తోం ది. అం దరూ
సమన్వ యం తో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్ని కల్లో అధికారం దక్కే లా పని
చేయాలని సూచించారు. కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అనే నినాదం తో
పార్టీ నేతలంతా పని చేయాలని స్ప ష్టం చేసారు. తెలం గాణలోని ప్రతీ
నియోజకవర్గం పైన రాహుల్ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు గుర్తించిన నేతలు
అప్రమత్తం అయ్యారు.
ఫ్రస్ట్రేషన్ పీక్..బీజేపీ బెదిరింపుల రాజకీయం
BJP Politics :
బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో వారు షాక్ అయ్యారు. పార్టీ వీడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది.
తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ మొదలైంది. ఇప్పుడు అది ఢిల్లీ వరకు చేరింది. బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంచనాలు వేసినా సఫలం కాలేదు. బండి సంజయ్ నాయకత్వం పైన ఒక విధంగా పార్టీలో నేతలు తిరుగుబాటు చేసారు. పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేసారు బండిని మార్చాలంటూ డిమాండ్ చేసారు. పార్టీలో పరిణామాల పైన రిపోర్టులు ఇచ్చారు. బీజేపీ అధినాయకత్వం లైట్ తీసుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని స్థాయిలోనూ నేతలు కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ..బీజేపీ నాయకత్వాల తెర వెనుక రాజకీయం తమ మనుగడకే ముప్పు తెస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతలను కాంగ్రెస్ లో చేరాలంటూ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఒక హైకమాండ్ తో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని తాజాగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పార్టీలో పరిస్థితి వివరించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్చాలని కోరారు. తమను ఢిల్లీకి పిలిచి అటు కేటీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వటం పైన సందేహాలు ఉన్నాయని స్పష్టం చేసారు. కవిత అరెస్ట్ కాకపోవటంతో అనుమానాలు బల పడుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ ను దెబ్బ తీసే నిర్ణయాలు తీసుకోకుంటే తాము పార్టీలో కొనసాగే అవకాశాలు లేవని.. నియోజకవర్గాల్లో తమ పైన ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేసారు.
వీరి వాదన విన్న తరువాత పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సమాధానంతో ఈ ఇద్దరు నేతలు షాక్ కు గురయ్యారు. కేటీఆర్ తో అమిత్ షా సమావేశం అయితే చివరి నిమిషంలో రద్దు అయింది. కానీ పార్టీ మారేలా తమ పైన ఒత్తిడి ఉంది..కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందంటూ సొంత పార్టీ నేతలు చెప్పిన సమాచారం మాత్రం బీజేపీ నాయకత్వం జీర్ణించుకోలేక పోయింది. పార్టీ వీడే ఆలోచన చేస్తే సహించేది లేదని పార్టీ అధినాయకత్వం హెచ్చరించినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. సహజంగా బీజేపీ నాయకత్వం విచారణ సంస్థలతో వేధించే విధానం తెలిసిన ఆ ఇద్దరు నేతలకు ఏం చెబుతున్నారో క్లారిటీ వచ్చేసింది. అప్పటికప్పుడు ఏం చెప్పలేక బయటకు వచ్చేసారు. కానీ, నడ్డా తెలంగాణకు వచ్చినా ఆ ఇద్దరూ ఢిల్లీలోనే ఉండిపోయారు. మరోసారి ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భవిష్యత్ నిర్ణయాల పైన మల్ల గుల్లాలు పడుతున్నారు.
పార్టీని బతికించమని అడిగితే హెచ్చరికలు చేయటం వారికి అంతు చిక్కటం లేదు. అటు వ్యాపారాలు..ఇటు రాజకీయాలు దేనిని పణంగా పెట్టలేక సతమతం అవుతున్నారు. ఇటు ఇదే రోజున ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నారు. పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దమైంది. ఇటు కాంగ్రెస్ లో పెరుగుతున్న జోరు.. నాయకత్వం నుంచి హెచ్చరికలతో ఈటెల, కోమటిరెడ్డితో సహా పలువురు నేతలు బేజారు అవుతున్నారు. మరి కొద్ది రోజులు వేచి చూసే నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో వైరల్ అవుతోంది.
మహేందర్ రెడ్డి డబుల్ గేమ్.. బూమ్ రాంగ్
Mahender Reddy :
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, వారికి కంటి మీద కునుకు దూరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేసారు. హమీ పొందరు. ఇంతలో ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. హామీలు గుప్పించారు. అక్కడ జీ హుజూర్ అన్నారు. తన స్వలాభం కోసం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు అనుచర వర్గానికి ఇది రుచించటం లేదు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. అనుచరుల తాజా వ్యూహాల్లో మహేందర్ రెడ్డి గేమ్ బూమ్ రాంగ్ అయింది.
బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాండూర్ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు పట్నం రూట్ క్లియర్ చేసుకున్నారు.
తనతో పాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. అదే సమయంలో కొందరి సీట్ల ఖరరు అంటూ ఒక జాబితా బయట పెట్టారు. అందులో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు జహీరాబాద్, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్ రత్నం కు చేవెళ్ళ, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని..మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ వ్యూహాత్మక లీకులు వచ్చాయి. స్పష్టమైన హామీ తీసుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ ప్రగతి భవన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఫోన్ రావటంతో పరుగున వెళ్లిన మహేందర్ రెడ్డికి ఆయన పాత చిట్టా బయట పెట్టారు. పార్టీ వీడితే జరిగేది ఏంటో సున్నిత హెచ్చరికలతో స్పష్టత ఇచ్చారు. అంతే..మహేందర్ రెడ్డి జీ హుజూర్ అంటూ గులాబీ తోట లోనే పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదు. తాండూరు ఈ సారి పైలెట్ కు ఖాయం చేస్తూనే మహేందర్ రెడ్డికి ఆశ పెంచారు. అనుచరులు, సన్నిహిత నేతలకు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పి..ఇప్పుడు నో అంటూ వారందరికీ మహేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ, వారంతా బీఆర్ఎస్ నాయకత్వాన్ని, మహేందర్ రెడ్డి మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. ఎవరికి వారు కంగ్రెస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మహేందర్ రెడ్డిని బేఖాతర్ అంటున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఊహించని మహేందర్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన ప్లాన్స్ అన్నీ బూమ్ రాంగ్ అయ్యాయి. ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ ఇచ్చిన హామీ అమలు అవుతుందా లేదా అనేది సందేహమే!
కాంగ్రెస్ లోకి పొంగులేటి..లెక్క పక్కా..బీఆర్ఎస్ కు ఆ వర్గం ఇక దూరమేనా…
Ponguleti Srinivas Reddy :
తెలంగాణలో చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి ఎంట్రీ తో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఆషామాషీగా జరగలేదు. సుదీర్ఘ కసరత్తు..పక్కా వ్యూహం..బీఆర్ఎస్ లక్ష్యంగా నిర్ణయం తో పక్కాగా డిసైడ్ అయింది. పొంగులేటి తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత. పొంగులేటి చేరిక పార్టీకి ఖచ్చితంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వలన తమకు జరిగే నష్టం పై బీఆర్ఎస్ లోనూ చర్చకు దారి తీస్తోంది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణతో పాటుగా ఢిల్లీ స్థాయిలోనూ మంచి పలుకుబడి ఉన్న నేత. 2014 లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ పొంగులేటికి అనుచర వర్గం ఉంది. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తరువాత టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ కోసం పని చేసారు. 2018 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించినా ముఖ్యమంత్రి హామీతో సీటు దక్కక పోయినా పార్టీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారు. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ..వ్యయ ప్రయాసలను తట్టుకొని నిలబడ్డారు. యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేసే బీఆర్ఎస్ నేతల వైఖరితో మనస్థాపానికి గురైన పొంగులేటి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేసారు.
పొంగులేటిని చేర్చుకోవటానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. కోరిన సీట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో పదవుల పై హామీలు గుప్పించారు. కానీ, క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో ఉన్న మూడ్ గుర్తించిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ను మట్టు బెట్టాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని తేల్చారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఖమ్మం జిల్లాలో సీట్ల గురించి మద్దతు దారుల నుంచి హామీ పొందాలనే ఒత్తిడి ఉన్నా..అవసరమైతే నాలుగు అడుగులు వెనక్కు తగ్గుదామని పొంగులేటి చెబుతున్నారు. అందరి లక్ష్యం బీఆర్ఎస్ ను ఓడించటమేనని తేల్చి చెప్పారు. ఆ దిశగా కాంగ్రెస్ లో ఏ బాధ్యతలు అప్పగించినా…పని చేసేందుకు సిద్ధమని పొంగులేటి స్పష్టం చేసారు.
తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టిని పొంగులేటి కలిసారు. మండుటెండల్లో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండ వంద రోజుల పాదయాత్ర చేయటం పైన అభినందించారు. పార్టీలో చేరిక అంశంతో పాటుగా ఖమ్మం జిల్లాలో రాహుల్ సభ పైన చర్చించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల కలయిక తో వచ్చే ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లు క్లీన్ స్వీప్ చేయటం ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు.
ఇక పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక ద్వారా తమ పైన పడే ప్రభావం పైన బీఆర్ఎస్ ఆరా తీస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పోలరైజ్ అయ్యే అవకాశం ఉందనే నివేదిక లు ఇప్పుడు బీఆర్ఎస్ కు గుబులు పెంచుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంది. ఆ జిల్లాల్లోని ఆ వర్గానికి చెందిన నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్దికంగానూ.. రాజకీయ వ్యూహాల్లోనూ పొంగులేటికి పట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించటం..తనను అవమానించిన వారిని రాజకీయంగా కనుమరుగు అయ్యేలా చేయటం తన లక్ష్యమని ప్రకటించిన పొంగులేటి రాక ఇప్పుడు కాంగ్రెస్ కు అదనపు బలంగా మారనుంది.
ట్రెండ్ క్రియేటర్ గా భట్టి విక్రమార్క..
Bhatti Vikramarka as trend creator :
సీఎల్పీ భట్టి నేత పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ ఈ రోజుతో వందో రోజుకు చేరింది. ఈ మార్చ్…బీఆర్ఎస్ ను గద్దె దింపే మార్చ్ గా మారింది. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ సెలబ్రేషన్ గా మారింది. మండుటెండల్లో పేదల మధ్యే భట్టి గ్రామా గ్రామన తన యాత్ర సాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అండ..ఆశీస్సులతో ఒక్కో అడుగుతో బీఆర్ఎస్ లో టెన్షన్ పెంచారు. పార్టీ నేతలను ఏకం చేసారు. ఇతర పార్టీల నేతలు కదలి కాంగ్రెస్ లో కలిసేలా చేసారు.
ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో నయా ట్రెండ్ సెట్టెర్ గా భట్టిని నిలిపింది. కర్ణాటక తరువాత తెలంగాణ పైన ఆశలు పెట్టుకున్న వేళ పార్టీలో జోష్ పెంచింది. వంద రోజులు ప్రతీ రోజు ప్రజల మధ్యనే ఉంటూ సాగిన భట్టిపై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురుస్తున్నాయి. భట్టికి అనుకూల స్లోగన్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. కాంగ్రెస్ లో భట్టి పేరుతో సాగుతున్న సెలబ్రేషన్స్ బీఆర్ఎస్, బీజేపీల్లో వైబ్రేషన్స్ కు కారణమయ్యాయి. తెలంగాణ గడ్డలో ప్రతీ ప్రాంతం నుంచి భట్టికి మద్దతుగా నిలుస్తున్నారు.
భట్టి వంద రోజుల యాత్ర..బీఆర్ఎస్ పాలనకు ముగింపు యాత్రగా క్యాంపెయిన్ సాగుతోంది. భట్టి అన్నా ఇదే ఊపుతో ముందుకు దూసుకుపో.. కేసీఆర్ దుకాణం సర్దుకు పో అంటూ తెలంగాణలోని సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటం..రాహుల్ ప్రధాని కావటంతోనే తన యాత్ర లక్ష్యం పూర్తయినట్లు భట్టి విక్రమార్క్ తన యాత్ర వందో రోజు చేరిన సమయంలో స్పష్టం చేస్తున్నారు. భట్టికి పార్టీ అగ్రనాయకత్వం వంద రోజుల యాత్ర పూర్తయిన వేళ అభినందనలు తెలిపింది.
Bhatti Vikramarka : పీపుల్స్ లీడర్ … భట్టి విక్రమార్క @ 100 డేస్
Bhatti Vikramarka Completed his 100 Days of Padayatra :
మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. ప్రజలతో మమేకం అవుతూ.. వారికలో ఒకరిగా నిలుస్తూ..సమస్యల పరిష్కారానికి స్వాంతన కల్పిస్తూ యాత్ర సాగింది. భట్టికి పార్టీ హైకమాండ్ యాత్ర వేళ ఇచ్చిన మద్దతు బరింత బలాన్నిచ్చింది. కొత్త నేతల చేరికకు ఈ యాత్ర ప్రేరణగా నిలిచింది. ప్రజలతో కలిసి పీపుల్స్ లీడర్ గా చేసిన మార్చ్..వందో రోజుకు చేరింది.
కాంగ్రెస్ కుటుంబానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు అదే పార్టీలో కీలకంగా మారారు. భట్టి సోదరుడు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు. భట్టి వైఎస్సార్ హాయంలో చీఫ్ విప్ గా.. తరువాత డిప్యూటీ స్పీకర్ గా..తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ప్రస్తుతం నరనరాకన జీర్ణించుకున్న కాంగ్రస్ భావాలతో ఆ పార్టీని తెలంగాణలో అధికారం..తమ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయటం లక్ష్యంగా భారత్ జోడో యాత్ర స్పూర్తితో పీపుల్ మార్చ్ ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిరాటంకంగా ముందుకు సాగుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తోంది.
గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలతో భట్టి మమేకమయ్యారు. వారి నుంచి విక్రమార్క యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ స్పందనే అధికార బీఆర్ఎస్ లో గుబులు పెంచింది. తొలి నుంచి కాంగ్రెస్ నే నమ్ముకున్న ఈ వర్గాలు తిరిగి ఇప్పుడు భట్టి యాత్ర ద్వారా పార్టీకి దగ్గరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ ఆప్తుడుగా ఉన్న భట్టి పాదయాత్ర నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. అందరినీ కలిపింది. పార్టీ కోసం పని చేయాలనే లక్ష్యాన్ని నూరిపోసింది. పట్టుదల పెంచింది. ఫలితంగా ఈ యాత్ర ద్వారా వస్తున్న స్పందన..పార్టీలో మార్పు హైకమాండ్ ను ఆకర్షించింది. పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే తో సహా పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. సభల్లో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై ఆరా తీసారు. భట్టి పాదయాత్రతో వస్తున్న స్పందన పార్టీలో చేరికలను పెంచింది. పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు భట్టి చొరవ తీసుకున్నారు. మంతనాలు చేసారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటానికి కలిసి వచ్చేలా ఒప్పించారు. ఖమ్మం వేదికగా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. భట్టి సొంత జిల్లాలో జరిగే సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ ,ప్రియాంక తరలి వస్తున్నారు. మండుటెండలో అస్వస్థతకు గురైనా స్వల్ప విరామం మినహా.. వెనుకడుగు వేయకుండా భట్టి యాత్ర కొనసాగింది. ఈ యాత్ర వంద రోజుల కాలంలో ఇంటి వైపు తిరిగి చూడలేదు. పండుగలు..జన్మదినాలు..సందర్భాలు ఏవైనా అన్నీ ప్రజల మధ్యనే నిర్వహించారు.
పీపుల్స్ మార్చ్ తో పార్టీలో..ప్రజల్లో భట్టి స్థానం మరో స్థాయికి చేరింది. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వంద రోజుల్లో 1150 కిలోమీటర్లు పాదయాత్ర నేడు వందో రోజుకు చేరింది. వందో రోజు పాదయాత్ర నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. కాంగ్రెస్ లో చేరనున్న నేతలు భట్టిని పరామర్శించారు. భట్టి పట్టుదలన ప్రశంసించారు. మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ టు ఢిల్లీ భట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వంద రోజుల యాత్ర ముగించిన భట్టికి పార్టీ శ్రేణులు..అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కేసీఆర్ కు దిమ్మతిరిగేలా..కాంగ్రెస్ వైపు బీసీ ఓట్ బ్యాంక్
KCR VS CONGRESS :
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పునాదులపై దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూత్ లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకొనేందుకు ప్రకటించిన డిక్లరేషన్ పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే బీసీ వర్గం కష్టాల పైన ఫోకస్ చేస్తూ..వారికి అండగా నిలుస్తూ..వారి మద్దతు కూడగట్టేందుకు సిద్దం వుతోంది. బీసీ డిక్లేరేషన్ లో అనూహ్య నిర్ణయాలతో ముందకు వస్తోంది.
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని యోచిస్తోంది. త్వరలో సూర్యాపేటలో బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. సిద్దరామయ్య చేత బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేలా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ గా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. యూత్ డిక్లరేషన్ ప్రియాక ప్రకటించటంతో యువతలో నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే తరహాలో బీసీ డిక్లరేషన్ కు ప్లాన్ చేస్తోంది. తాము ప్రకటించిన తరువాత బీఆర్ఎస్, బీజేపీ ఏం చేసినా బీసీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏదైనా చెప్పినా తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేయని పార్టీగా ఇప్పటికే ముద్ర పడిందని..ఇక నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హామీ ఇస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల న్యాయమైన డిమాండ్లను కూడా చేర్చుతామని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామని ప్రకటకు సిద్దం అవుతున్నారు. బీసీ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో బీసీ సంఘాల ముఖ్యుల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా వారికి భాగస్వామ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు లక్ష సాయం ప్రకటన కూడా మోసపూరితంగా మారుతోంది. కేవలం14 బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామంటోందని, బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికల్లో గెలవాలంటే బీసీ వర్గాలదే డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో, గతం కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించే ఆలోచన కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఒకటి , రెండు వర్గాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది. అదే సమయంలో బీజేపీలోనూ అదే తరహాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒక్కో వర్గం సమస్యల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బీసీలకు 50 శాతం టికెట్లు దిశగా ఆలోచన జరుగుతోంది. బీసీ గణన పైన పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని పార్టీ భావిస్తోంది. బీసీ డిక్లరేషన్ పూర్తయిన తరువాత మహిళలు..రైతుల అంశాల పైన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని భావిస్తోంది.
కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తో యువతకు భవిత..బీఆర్ఎస్ లో టెన్షన్
తెలంగాణ అధికార బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఫోబియా మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నీళ్లు..నిధులు..నియామకాల నినాదం తో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఒక్క విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతలో ఆశలు నింపిన నేతలు నేడు వారి వైపు కనీసం చూడటం లేదు. ఉద్యోగాల విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగుల ఊసే లేదు.ఈ సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ యువతలో ఆశా కిరణంగా మరింది. యవత భవితకు కాంగ్రెస్ నిర్ణయాలు భరోసాగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. కనీసం పోటీ పరీక్షలు సక్రమంగా నిర్వహించ లేని దుస్థితి. పోటీ పరీక్షలకు కేంద్రంగా ఉండే టీఎస్పీఎస్సీలోనే అక్రమాలు. దళారులు తిష్ఠ వేసారు. నిర్వహించిన పరీక్షలు రద్దు చేసారు. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని దీన స్థితి. నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారి పైన కేసులు. వయసు దాటి పోతున్నా..ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఆత్మహత్యలు. కుటుంబాల్లో కన్నీరు. ఈ సమయంలో యువత కోసం కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ పైన ఆసక్తి పెరిగింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో టెన్షన్ పెంచుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు యువ సంఘర్షణ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రియాంక గాంధీ. తాము మాట తప్పితే తమను గద్దె దించాలని సూచించారు. యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. తను సోనియాగాంధీ కుమార్తెనని నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా..తెలంగాణ తొలి,మలి విడత ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పాటుగా తల్లి, తండ్రి లేదా భార్యకు రూ 25 వేల అమర వీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.
ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయటంతో పాటుగా జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందిస్తామని యూత్ డిక్లరేషన్ లో వెల్లడించారు. దీంతో పాటుగా పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి..సెప్టెంబర్ 17 లోగా నియామకాల పూర్తి చేస్తామని స్పష్టంగా పార్టీ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ..ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ 4 వేల చొప్పున నిరుద్యోగ భ్రుతి చెల్లింపు పైన హామీ ఇచ్చారు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్పీ తరహాలో పునరుద్దరిస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు పలు నిర్ణయాలు ప్రకటించారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిన పైన హామీ ఇచ్చారు. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఈడబ్ల్యుఎస్ వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ తోపాటు పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేసి 6 నుంచి పట్టభద్రులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 18 సంవత్సాలు పైబడిన చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందచేస్తామని ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ లో స్పష్టం చేసారు.