స్మశాన వాటిక భూమి ఏంత.!

స్మశాన వాటిక భూమి ఏంత?

పన్నెండు గుంటలా?

ఇరవై ఐదు గుంటలా?

ముప్పై గుంటల పైగానా?

అయోమయంలో గోపాలరావుపేట గ్రామ ప్రజలు?

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*కమిషనర్ ను కోరిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 20:

నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు. న్యూ బాలాజి కాలనీలోని సీకాం కళాశాల వద్ద ఉన్న స్మశానంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేయడం,గోడ పడగొట్టి పార్కింగ్ గా వాడుకుంటున్నారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మించి, శుభ్రంగా ఉంచాలని కోరారు. కార్పొరేషన్ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్ ను మూలన పదేశారని, దీంతో ప్రజల సొమ్ము వృదా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బస్ ను ప్రజల సౌకర్యార్థం నడపాలని, లేకుంటే టిటిడి కి విరాళంగా ఇచ్చేయాలని కోరారు.రంజాన్ వేడుకలకు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులతో కలసి కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపడతామని, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డబుల్ డెక్కర్ బస్ విషయం ఒక సారి చర్చించి ప్రజల సొమ్ము వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ను కలసిన వారిలో తిరుత్తణి వేణుగోపాల్, ఈద్గా కమిటి సభ్యలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version