మొక్కజొన్న కుప్ప దగ్ధం
కంకులకుప్పను పరిశీలిం చిన ఏవో గంగాజమున
శాయంపేట నేటిధాత్రి:
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే కాలి పోతు న్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు వివరాల్లో కెళితే శాయంపేటమండలం పత్తిపాక గ్రామానికి చెందిన అన్న బోయిన రఘుపతి అనే రైతు మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగు చేశారు పంట చేతికి అంద డంతో మొక్కజొన్న కోసి వాటిని పొలంలో కుప్పగా పోసి మార్కెట్ చేసేందుకు నిలువ ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించ డంతో పొలంలోని మూడున్నర.
ఎకరాలలో మొక్కజొన్న పంట సుమారు ఖాళీ బూడిదయింది పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపో యింది అప్పటికే మొక్కజొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి దృశ్యాన్ని చూసి రైతు లబోది బో అంటూ గుండె బాదుకు న్నాడు. రైతు స్థానిక వ్యవసా య అధికారికి ఫిర్యాదు మేర కు ఏవో గంగా జమున కాలిపో యిన కంకులు పరిశీలించగా 60% కాలి పోయినట్లు గుర్తిం చారు. రైతుకు పంట నష్టం జరిగినట్లు నిర్ధారించడం జరిగింది.