యువతకు ఉపాధి లక్ష్యంగా ఆకాశ

 

యువతకు ఉపాధి లక్ష్యంగా ఆకాశ ఎంటర్ప్రైజెస్.

సీఎం డి సంజయ్ భరత్ రెడ్డి

చిట్యాల,నేటిధాత్రి :

యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలను అందించడమే లక్ష్యంగా ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ముందుకు సాగుతున్నదని ఆ సంస్థ సిఎండి సంజయ్ భరత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగం లేదని ఉపాధి అందడంలేదని యువకులు ప్రభుత్వం పనిలేదని అన్నారు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు పలు రకాల అవకాశాలు కల్పించే విధంగా ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ప్రయత్నం చేస్తుందన్నారు పలు రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాలు ఉపాధ్యాయ అవకాశాలను సృష్టించి నిరుద్యోగులను ఆదుకోవడం జరుగుతుందని సంస్థ సీఎంటి సంజయ్ భరత్ రెడ్డి తెలిపారు. మొదటగా ప్రజలకు అత్యంత అవసరం ఉన్న 55 65 ఇంచుల టీవీలను తక్కువ ధరకు అందించడమే కాకుండా యువకులను అన్ని రకాలుగా అభివృద్ధి చెందే మార్గదర్శకాలను వారికి బోధించడం జరుగుతుందన్నారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే లక్షలాది రూపాయలు సంపాదించి మార్గాలను తెలియజేయడంతో పాటు తమ ఆకాశ సంస్థలో పూర్తిస్థాయి భాగస్వామ్యాన్ని కల్పించడం

 

 

 

 

జరుగుతుందనిఅన్నారు. 55 ఇంచ్ల టీవీని 60 వేలకు మాత్రమే అందిస్తూ మరో 10 వేల విలువ చేసే హోం థియేటర్ ను సైతం అందించడం జరుగుతుందని 24 వేల రూపాయలు చెల్లించి టీవీ మరియు హోమ్ థియేటర్ను తీసుకొని వెళ్లవచ్చునని అన్నారు. లేదంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలను చెల్లించి తమ పేరును బుక్ చేసుకొన్న అనంతరం మరొక పదిమంది తమ స్నేహితులను సంస్థ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసి టీవీ హోమ్ థియేటర్ ను తీసుకొని వెళ్ళిపోవచ్చని అనంతరం ఈఎంఐలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు తీసుకున్న టీవీ సంవత్సరంలోపు పాడైతే తిరిగి కొత్త టీవీని అందించడం జరుగుతుందని లేదంటే రెండు సంవత్సరాల వారంటీ రూపకంగా ఎలాంటి సమస్య తలెత్తిన రెండు సంవత్సరాల వరకు దానిని బాగు చేసి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కంపెనీలలో టీవీ తీసుకున్న ప్రతి వారు షేర్ హోల్డర్ గా

 

 

 

పరిగణించబడుతారాన్నారు. కంపెనీ కోసం ఎలాంటి పని చేయకపోయినా ఎంటర్ప్రైజెస్ ద్వారా వచ్చే లాభాల్లో పర్సంటేజ్ ని ప్రతి యేటా పంచుడం జరుగుతుందని భరత్ రెడ్డి తెలిపారు. జిల్లా మొత్తంలో కేవలం 150 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఉత్సాహవంతులైన వారు ఎవరైనా కంపెనీకి షేర్ హోల్డర్లుగా చేరవచ్చును అన్నారు ఎలాంటి రుసుము అవసరం లేదని ఒక్క రూపాయి కూడా కంపెనీ కోసం పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. కావలసిన పెట్టుబడి మొత్తంగా ఆకాష్ ఎంటర్ ప్రైజెస్ నుంచే అందుతుందన్నారు మరిన్ని వివరాల కోసం సెల్ నెంబరు 9398903016 నందు సంప్రదించవచ్చు అన్నారు.

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాది మార్గాలు.

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాది మార్గాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాధి మార్గాలు ఏర్పరుస్తాయని నర్సంపేట టౌన్ ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు.శనివారం ఎఫ్ఎంఎం,వరంగల్ సాంఘిక సేవా సంస్థ వారి సహకారంతో నర్సంపేట ప్రతిభా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం సంస్థ సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యంగా గృహింస, బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా నిర్మూలించడానికి వారికి ఉపాధి మార్గాలు అనేవి చాలా ముఖ్యమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మరో అతిథి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రమేష్ కోరే మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రగతి ఎంత ముఖ్యమో వ్యక్తిగత భద్రత అంతే ముఖ్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి బ్యాంకుల ద్వారా అమలుపరుస్తున్న స్కీములను సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్, సహాయ సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ,ఎర్ర శ్రీకాంత్ ,ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్,సంస్థ యూత్ అంబాసిడర్స్ దోమ మధుమతి, భౌగోచి దేవిక బొడ్డు అమర్నాథ్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సేవా సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్, ట్రేైనర్లు శ్వేతా, సంధ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా పనులు ముందే ముగించాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి నవీద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ కూలీలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version