రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo .!

పిజేటిఏయూ వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలo దేశరాజుపల్లి గ్రామంలోని రైతువేదిక నందు నిర్వహించడం జరిగినది. వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త మరియు అధిపతి డా.ఉషారాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు ముఖ్యమైన అంశాలైన తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రశీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్ట పరిహారాన్ని పొందండి అని తెలిపారు. ఈకార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎంసి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల మరియు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ రైతులందరూ యూరియ వాడకాన్ని తగ్గించి, చెట్లని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా . ఏ.విజయభాస్కర్ సాగు నీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనే విషయాలు రైతులకు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రావు రైతులను ఉద్దేశిస్తూ మామిడి, కూరగాయ, ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలిపారు. అనంతరం టిఎస్ఎస్డిసి రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు నాణ్యమైన విత్తన లభ్యత మరియు ధరల వివరాలను వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సహ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, సీడ్ ఆఫీసర్ మౌనిక , ఉద్యాన శాఖ ఆఫీసర్ రోహిత్, విఏఎస్ మనోహర్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, సంపత్, గోవర్ధన్ సుమారు నూటా యాభై ఏడు మంది రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version