అందాల పోటీలను రద్దుకు కోసం అడిగితే అరెస్టులా.

అందాల పోటీలను రద్దుకు కోసం అడిగితే అరెస్టులా..

ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత

హైదారాబాద్ నేటిధాత్రి:

ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకుల హౌస్ అరెస్టులతో నిర్బంధించడం అప్రజాస్వామికమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పేర్కొన్నారు.మహిళా నేతల హౌస్ అరెస్టుల పట్ల వై గీత ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగంగా ప్రదర్శన ప్రపంచస్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని కోరారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికంగా దివాల తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికే ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని ఆరోపించారు. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్యతోపాటు ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి,ఇతర జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడం అప్రాజస్వామిక చర్యగా భావిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గీత ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version