ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న యువనాయకుడు తెలుగుపాండు ముదిరాజ్.
జహీరాబాద్. నేటి. ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝరాసంగం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. అనంతరం తెలుగు పాండు ముదిరాజ్ మాట్లాడుతూ.. “ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం” అని తెలిపారు. విద్యార్థులు రవి మహేష్ రెడ్డి,కుమార్,చంద్రశేఖర్ శ్రీశైలం యాదయ్య శ్యామ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నరు.
సమ్మర్ వచ్చిందంటే మామిడి, పుచ్చకాయతో పాటు దొరికే మరో పండు తాటి ముంజలు. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు డీహైడ్రేషన్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి పైన గోధుమ రంగులో, లోపల తెల్లగా ఉండి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్‌గా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండునే ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి అదే విధంగా అందానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పోషకాలు పుష్కలం:
ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్, ఫాస్పరస్ అధికంగా లభిస్తాయి. ఎండాకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు చేస్తుంది. మరి దీని ప్రయోజనాలు చూస్తే..
క్యాన్సర్ల నుంచి రక్షణ:
తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. అందువల్ల ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 2018లో “పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్” జర్నల్ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తాటి ముంజలు తినే వ్యక్తులు కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. ముఖ్యంగా, తాటి ముంజలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని కనుగొన్నారు. తాటి ముంజలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.
బరువు తగ్గొచ్చు:
తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. అంజలీదేవీ తెలిపారు.
కాలేయ సమస్యలు:
తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుందని డా. అంజలీదేవీ తెలిపారు .
డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం:
ఎన్ని నీళ్లు తాగినాఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోవడం సర్వసాధారణం. అయితే ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చని డా. అంజలీదేవీ అంటున్నారు. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయని.. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరమని ఆమె తెలిపారు.
గర్భిణులకూ మంచిదే:
ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఏ ఆహారం తిన్నా జీర్ణం కాకపోవడం వంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తింటే ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా ఈ పండ్లు దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
అలసట దూరం:
వేసవిలో కొద్దిసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం. అంతేకాదు.. విపరీతమైన చెమట కూడా పట్టేస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజల్ని తినడం ఒక సులువైన మార్గం అంటున్నారు నిపుణులు.
పొట్టు తీయకుండా తినాలి:
ఇకచాలామంది ముంజలను పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
అందానికి కూడా:
కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.
తాటి ముంజలు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖం మెరిసేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.
తాటి పండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. నిర్జీవమైన జుట్టుని రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి.
మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.
క్యాన్సర్ నుంచి డీహైడ్రేషన్ వరకు – తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్!
జహీరాబాద్. నేటి ధాత్రి:
సమ్మర్ వచ్చిందంటే మామిడి, పుచ్చకాయతో పాటు దొరికే మరో పండు తాటి ముంజలు. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు డీహైడ్రేషన్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి పైన గోధుమ రంగులో, లోపల తెల్లగా ఉండి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్‌గా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండునే ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి అదే విధంగా అందానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
PALM
పోషకాలు పుష్కలం:
ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్, ఫాస్పరస్ అధికంగా లభిస్తాయి. ఎండాకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు చేస్తుంది. మరి దీని ప్రయోజనాలు చూస్తే..
క్యాన్సర్ల నుంచి రక్షణ:
తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. అందువల్ల ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 2018లో “పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్” జర్నల్ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తాటి ముంజలు తినే వ్యక్తులు కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. ముఖ్యంగా, తాటి ముంజలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని కనుగొన్నారు. తాటి ముంజలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.
బరువు తగ్గొచ్చు:
తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. అంజలీదేవీ తెలిపారు.
కాలేయ సమస్యలు:
తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుందని డా. అంజలీదేవీ తెలిపారు .
డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం:
ఎన్ని నీళ్లు తాగినాఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోవడం సర్వసాధారణం. అయితే ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చని డా. అంజలీదేవీ అంటున్నారు. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయని.. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరమని ఆమె తెలిపారు.
గర్భిణులకూ మంచిదే:
ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఏ ఆహారం తిన్నా జీర్ణం కాకపోవడం వంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తింటే ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా ఈ పండ్లు దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
అలసట దూరం:
వేసవిలో కొద్దిసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం. అంతేకాదు.. విపరీతమైన చెమట కూడా పట్టేస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజల్ని తినడం ఒక సులువైన మార్గం అంటున్నారు నిపుణులు.
పొట్టు తీయకుండా తినాలి:
ఇకచాలామంది ముంజలను పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
అందానికి కూడా:
కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.
తాటి ముంజలు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖం మెరిసేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.
తాటి పండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. నిర్జీవమైన జుట్టుని రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి
శంభో శివ శంభో… శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో, పరమ శివునికి అభిషేకాలు అర్చ నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో మచ్చగిరిస్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ,చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకున్నారు లయకారునిగా, అర్ధనారీశ్వ రునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా ఉంటుంది.జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆయువు ఆరోగ్యాలతో ప్రసాదించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి -రాజమణి, బాసని మల్లికార్జున్-రాణి, మామిడి మారుతి దంపతులు,కొండ బత్తుల ప్రకాష్ దంపతులు, లోకలబోయిన కుమారస్వామి కొత్తపెల్లి రవీందర్, ప్రజలు పాల్గొన్నారు.
ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం మెట్ పల్లి ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఉదయసాహితి తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాల సమూహం లో నిర్వహింపబడుతున్న నేటికవిత ఆత్మీయసమ్మేళనం ఫిబ్రవరి23న ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది., రెండు తెలుగు రాష్ట్రాల లోని నేటికవిత సభ్యులు ఈ సమ్మేళనం లో పాల్గొని సమ్మేళనానికి నిండు శోభను కూర్చారు. ఆత్మీయ పలకరింపుతో, సాహిత్య సంబంధ ఊసులను పంచుకోవడానికి ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం వేదికైంది. ఉదయసాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద వరి శ్రీవారు భోగోజు ఉపేందర్ రావు సమ్మేళనానికి హాజరైన ప్రతినిధుల కు ఆతిథ్యాన్నిచ్చి,అందరినీ సాదరంగా ఆహ్వానించారు. నేటికవిత అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య, నేటి కవిత సలహాదారు దాస్యం సేనాధిపతి పర్యవేక్షణలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహింపబడినాయి. ఉదయం పదిగంటలకు జరిగిన ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా భోగోజు ఉపేందర్ రావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఉదయసాహితి రాష్ట్ర బాధ్యులు శ్రీదాస్యం లక్ష్మయ్య, దాస్యం సేనాధిపతి, వురిమళ్ల సునంద తో పాటు ఖమ్మం అక్షరాల త్రోవ మిత్రులు రాచమల్ల ఉపేందర్, దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం వేదికను అలంకరించారు. సమావేశంలో దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం, శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి , తదితరులు అతిథి సందేశాలను అందించారు. అనంతరం స్వీయ పరిచయాలను మూడు ఆవృతాలలో నిర్వహించారు. కవయిత్రి బత్తిన గీతాకుమారి స్వాగతం పలికారు. పుస్తకావిష్కరణలు ఈ ప్రారంభ సమావేశంలోకరీంనగర్ కు చెందిన కవి నగునూరి రాజన్న రచించిన హైకూల సంకలనం వెలుగు పూలు ను దాస్యం సేనాధిపతి ఆవిష్కరించగా , మంగా నెల్లూరు కు చెందిన కవి యర్రాబత్తిన మునీంద్ర రచించిన కలల కావడి సంకలనాన్ని శ్రీదాస్యం లక్ష్మయ్య ఆవిష్కరించారు. స్వీయ పరిచయ వేదికలు ఆత్మీయసమ్మేళనానికి హాజరైన కవులు కవయిత్రులు స్వీయపరిచయవేదిక ద్వారా తమను గురించి తాము పరిచయించుకున్నారు. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు అధ్యక్షత న జరిగిన మొదటి ఆవృతంలో దాస్యం సేనాధిపతి, శ్రీదాస్యం లక్ష్మయ్య, వురిమళ్ల సునంద, కె.మంజుల, కందుకూరి మనోహర్, ఏడెల్లి రాములు, గుడ్లదొన సాయి చంద్రశేఖర్, కె.వి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మేరుగు అనురాధ, నగునూరి రాజన్న, తుంబూరు జగన్మోహన్ తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు. రెండవ ఆవృతంలో రమాదేవి కులకర్ణి అధ్యక్షతన జరిగిన రెండవ ఆవృతంలో బత్తిన గీతాకుమారి, యర్రాబత్తిన మునీంద్ర, లింబగిరి స్వామి, ముద్దు వెంకటలక్ష్మి, చిందం సునీత, చింతల కమల, శింగరాజు శ్రీనివాస్ కుమార్, రమాదేవి బుక్కపట్నం, ఉదయశ్రీ ప్రభాకర్, యనమండ్ర వరలక్ష్మి, వేముల వరలక్ష్మి , పరిమి వెంకట సత్యమూర్తి, తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు. మూడవ ఆవృతంలో డా.చీదెళ్ల సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన మూడవ ఆవృతంలో లింగుట్ల వెంకటేశ్వర్లు, సయ్యద్ జహీర్ అహ్మద్, డా. ఆడేరు చెంచయ్య, కటుకం కవిత, కొలచన విజయభారతి, బిరుదురాజు ప్రమీలారాణి, మూర్తి శ్రీదేవి, తులసి వెంకట రమణాచార్యులు, అరుణ కీర్తి పతాక, అక్కి నర్సింలు గౌడ్, తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు. అనంతరం ఉదయసాహితి సర్వసభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగింది. భోజనానంతరం నేటికవిత సమూహం లో అర్హత సాధించిన 10 మంది కవులకు కవయిత్రులకు కవితాభూషణ 08 మంది కవులకు కవయిత్రులకు కవితావిభూషణ ఐదుగురికి సహస్ర కవితా స్ఫూర్తి అవ్వార్థులను బహుకరించారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వారందరికీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో అతిథులు, నిర్వాహకులచే ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మూర్తి శ్రీదేవి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ఉదయసాహితి తెలంగాణ రాష్ట్ర సర్వ సభ్య సమావేశం – తీర్మానాలు ఫిబ్రవరి 23 న ఖమ్మం లోని బోడెపూడి విజ్ఞాన కేంద్రం లో ఉదయ సాహితి తెలంగాణ సర్వ సభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగింది…ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద ల తో పాటు…రాష్ట్ర,జిల్లా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు. తొలుత శ్రీమతి మూర్తి శ్రీదేవి స్వాగతం పలికారు. సభాధ్యక్షులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ సాహితీ వికాసం లో..సాహితీ సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉదయసాహితికి సహకరిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు..శ్రీదాస్యం లక్ష్మయ్య ఆధ్వర్యం లో ఉదయ సాహితి ద్వారానిర్వహింపబడుతున్న నేటి కవిత అంతర్జాల సమూహం లో వైవిద్యమైన కార్యక్రమాలను చేపట్టడం పట్ల తమ సంతోషాన్ని ప్రకటించారు.. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద సభలు ఖమ్మం లో నిర్వహించినందులకు వారికి, వారి శ్రీవారు భోగోజు ఉపేందర్ రావ్ కి కృతఙ్ఞతలు తెలిపారు..అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరిమళ్ల సునంద తాము సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరిస్తూ వార్షిక నివేదికను సమర్పించారు. అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య కోశాధికారి పక్షాన ఆర్ధిక నివేదికను సమర్పించారు. అనంతరం సభ్యులంతా చర్చించి దిగువ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానాలు ఇప్పుడున్న ఉదయసాహితి జిల్లా కమిటీలను రద్దు చేసి, రాష్ట్రస్థాయిలో ఒకే కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షులకు అధికారం ఇవ్వనైనది ఉదయ సాహితి తెలంగాణ ఇంతకాలం ప్రతి నెలా మొదటి ,మూడవ ఆదివారాల్లో గూగుల్ మీట్ ద్వారా నిర్వహిస్తున్న సాహిత్య సమాలోచన కార్యక్రమాన్ని ఇకముందు ప్రతి నెల రెండవ ఆదివారం మాత్రమే నిర్వహించాలని నిర్ణయించనైనది .మార్చ్ 2025 మాసం నుండి నేటికవిత సమూహం లో ప్రతి శుక్ర వారం బాల సాహిత్య సృజనకు చోటు కల్పించాలని తీర్మానించనైనది. ఉదయ సాహితి రాష్ట్రం లో విస్తరణ కోసం రాష్ట్ర కమిటీ నందుఅన్ని ఉమ్మడి జిల్లాల నుండి సభ్యులను చేర్చుకునే అధికారం అధ్యక్షులకు ఇవ్వనైనది. .రాష్ట్ర స్థాయిలో తమ తల్లిదండ్రుల స్మారకర్థం సాహితీ పురస్కారాలను ఉదయ సాహితీ ఆధ్వర్యం లో అందజేయడానికి ముందుకు వచ్చిన దాస్యం సేనాధిపతి, లక్ష్మయ్య కు సభ తమ ఆమోదం తెలిపింది ఉదయ సాహితీ సభ్యులందరూ నేటికవిత సమూహం లో చేర్చు కోవాలని నిర్ణయించనైనది ఆంధ్రప్రదేశ్ లో ఉదయసాహితీ కమిటీ ఏర్పాటు మరియు విస్తరణ కోసం లింగుట్ల వెంకటేశ్వర్లు (తిరుపతి )ని కన్వీనర్ గా, సింగరాజు శ్రీనివాస్ కుమార్ (నెల్లూరు) ని కో కన్వీనర్ గా నియమించనైనది. మూర్తి శ్రీదేవి వందన సమర్పణతో ఉదయసాహితి సర్వ సభ్య సమావేశం ముగిసింది. ఉదయసాహితి తెలంగాణ (రాష్ట్ర నూతన కార్యవర్గం ) తేది 23 ఫిబ్రవరి రోజున ఖమ్మం లో జరిగిన ఉదయసాహితి తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య ప్రకటించారు గౌరవాధ్యక్షులు* : శ్రీ దాస్యం సేనాధిపతి (కరీంనగర్ ) అధ్యక్షులు* శ్రీదాస్యం లక్ష్మయ్య (పెద్దపల్లి ) ఉపాధ్యక్షులు ఎన్. వి. రఘువీర్ ప్రతాప్ (నల్గొండ ) డా. పోరెడ్డి రంగయ్య (ఆలేరు ) డా. పల్లేరు వీరాస్వామి (వరంగల్ ) ఎర్రం రాజా రెడ్డి (కరీంనగర్ ) శ్రీపెరంబుదూరి లింబగిరి స్వామి (మెట్ పల్లి ) మహిళా ఉపాధ్యక్షులు* డా. చీదేళ్ల సీతాలక్ష్మి (హైదరాబాద్ ) రమాదేవి కులకర్ణి (హైదరాబాద్ ) మద్దెల సరోజన (జగిత్యాల ) చిందం సునీత (కరీంనగర్ ) కటుకం కవిత (కోరుట్ల ) ప్రధాన కార్యదర్శి : వురిమళ్ల సునంద (ఖమ్మం ) సహాయ కార్యదర్శులు*: ఏడెల్లి రాములు (పెద్దపల్లి ) గుడ్లదొన సాయి చంద్రశేఖర్ (హైదరాబాద్ ) మేరుగు అనురాధ (వరంగల్ ) నగునూరి రాజన్న (కరీంనగర్ ) కోశాధికారి : శ్రీ తులసి వెంకట రమణాచార్యులు హైదరాబాద్ ) మహిళా కార్యదర్శి మూర్తి శ్రీదేవి (హైదరాబాద్ ) ప్రచార కార్యదర్శి*లక్ష్మీ పద్మజ దుగ్గరాజు (హైదరాబాద్ ) కార్యవర్గ సభ్యులు*: నామా పురుషోత్తం (ఖమ్మం ) అల్లాడి శ్రీనివాస్ (మంచిర్యాల ) మేజర్ రేళ్ళ సంజీవ్ (కరీంనగర్ ) రమాదేవి బుక్కపట్నం (హైదరాబాద్ )వకుళ వాసు (వరంగల్ ) తాళ్లూరి లక్ష్మి (ఖమ్మం ) తుంబూరు జగన్మోహన్ (నిజామాబాదు ) పరిమి సత్య మూర్తి .(హైదరాబాద్ ) పులి జమున (మహబూబ్ నగర్ ) డా. బి. సుధాకర్ ( సిద్దిపేట ) ఉషశ్రీ వెగ్గలం (కరీంనగర్ ) గుర్రాల మాధవ్ (మెట్టుపల్లి ) విజయలక్ష్మి నాగరాజు (కరీంనగర్ ) బత్తిన గీతాకుమారి (ఖమ్మం ) ప్రత్యేక ఆహ్వానితులు* లింగుట్ల వెంకటేశ్వర్లు శింగరాజు శ్రీనివాస్ కుమార్ సావిత్రి రంజోల్కర్, డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి ముద్దు వెంకటలక్ష్మి పత్తిపాటి రూపలత తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహిరాబాద్ పట్టణం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ గారు పట్టణంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందించి సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో , ఉపవాస దీక్షలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ మహా శివుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నర్సింహులు, ఎయంసి డైరెక్టర్ శేఖర్, రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓఎస్ డి కిషన్ , డి.ఎస్.పి సంపత్ రావు సీఐ నరేష్ కుమార్ గణపురం ఎస్ఐ అశోక్
గణపురం:నేటి ధాత్రి
lord shiva
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున గణపతి పూజ, అఖండ దీపారాధన తోరణ బంధనం కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, నాగరాజు, శంకర్ లు నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఓఎస్ డి బోనాల కిషన్ దంపతులు , డి.ఎస్.పి సంపత్ రావు దంపతులు భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ దంపతులు అభిషేకంలో పాల్గొన్నారు. శివరాత్రి జాగరణ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ మాజి చైర్మన్ నర్సింహ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,నాయకులు ప్రభు పటేల్ ,ప్రవీణ్ పాటిల్ ,విజయ్ రాథోడ్ శివశంకర్ ,తదితరులు పాల్గొన్నారు .
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) సభ్యత్వ నమోదును పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ సభ్యత్వం స్వీకరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వల్లాల జగన్ హాజరై సభ్యత్వాలను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న సంఘం టిడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు మార్చి 25 తేదీలోపు సభ్యత్వాలను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి,జిల్లా కార్యదర్శి సుంక మహేష్, రవి, సాగర్,సాబీర్ పాషా, శోభన్,ప్రభాకర్ స్వామి లతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.
వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భార్య శోభన గర్భిణి కావడంతో తల్లి లక్ష్మితో కలిసి రవి అనే వ్యక్తి బైకుపై ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి కుటుంబం కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.
బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా… – శ్రీపాద ట్రస్టు ద్వారా ఒక్కరికైనా సాయం చేసిండ్లా – చిన్నసారు పుట్టిన రోజున బీద బిడ్డ గుర్తుకు రాలేదా – 40 ఏండ్ల అధికారానికి కాటారమే కేంద్ర బిందువు – అబద్దాలతో సాయం చేసే స్థితిలో లేకుండా చేసిండ్లు – కులాలను వాడుకోవడం తప్పా పైసా సాయం చేయరు – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని :- నేటి ధాత్రి
తన ఉన్నత విద్యకు ఆర్థిక స్థోమత అడ్డుగా ఉందని, మెడికల్ సీటు వచ్చినా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న ఓ బీదబిడ్డకు సాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న అనే బీద బిడ్డకు మెడికల్ సీటు వచ్చిందని, అయితే ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నానని, తన తండ్రి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడని సాయం చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలు చక్కర్లు కొట్టాయని ఆయన తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీపాద ట్రస్టు చైర్మన్ పుట్టిన రోజు సందర్బంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారని, ఈ వేడుకలు నిర్వహించిన వారిలో ఎక్కువగా బీసీ, ఎస్సీ బిడ్డలే ఉన్నారన్నారు. అయితే వేడుకలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీద బిడ్డ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. శ్రీపాద ట్రస్టు చైర్మన్ పుట్టినరోజు సందర్బంగా ఆ బీద బిడ్డకు సాయం చేస్తారని అనుకున్నానని, కానీ అలాంటి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.స్వాతంత్రం వచ్చిన 78ఏండ్ల చరిత్రలో ఏనాడైనా శ్రీపాద ట్రస్టుద్వారా ఒక్క పేదవాడికి సాయం చేశారా అని ప్రశ్నించారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింహబాగంలో కాటారం మండలం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తుందని, అలాంటి మెజార్టీ ఇచ్చే కాటారం మండలంలోని ఏ ఒక్కరికైనా సాయం చేశారో చెప్పాలన్నారు. కేవలం మూడు ఓట్లు ఉన్న ఆ కుటుంబానికి 40ఏండ్లు అధికారం ఇవ్వడంలో కాటారమే కీలక పాత్ర పోషించిందన్నారు. అలాంటి కాటారం మండల కేంద్రానికి చెందిన ఓ బీద బిడ్డ తనకు సాయం చేయాలని కోరితే సాయం చేయకపోవడం విడ్డూరమన్నారు. తాను పదేళ్ల కాలంలో మెడికల్ సీట్లు వచ్చిన కనీసం ఐదుగురికి ఫీజు కట్టానని, మరికొంత మంది బీద బిడ్డలకు అమెరికా వెళ్లేందుకు సాయం చేశానన్నారు.కానీ తనపై అబద్దాలు, అబండాలు వేసి సమాజానికి దూరం చేశారని, కనీసం సాయం చేయలేని స్థితికి తీసుకువచ్చారని అన్నారు. బీదబిడ్డ జ్యోత్స్న మెడికల్ సీటు కోసం తాను సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ కుటుంబం తనను క్షమించాలన్నారు. ఓట్లు వస్తెనే నోట్ల కట్టలతో వచ్చే నాయకులు కలెక్షన్ కోసం కార్యాలయాలు సైతం ఏర్పాటుచేశారని ఆయన ఆరోపించారు. అనేక ఏండ్లుగా అమెరికాలోనే ఉంటున్న దుద్దిళ్ల కుటుంబం తమ ఏ సంస్థ ద్వార నైనా బీద బిడ్డకు సాయం చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయలేదని, ఈ మట్టిలో పుట్టిన వాళ్లు ప్రజాప్రతినిధులైతే ఏ విధమైన పాలన ఉంటుందో, మట్టితో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులకు అధికారం ఇస్తే ఎలా ఉంటారో ప్రజలు గమనించాలన్నారు. మన ఆకలి, కష్టాలుతెలియని వాళ్లు నోట్లతోనే అధికారం వస్తుందనే ఆలోచనలో ఉన్నారని, కులాలను వాడుకుంటారే తప్ప పైసా సాయం చేయరన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్శంగా కోరారు.
ముత్తారం మండలం రామకృష్ణపూర్ గ్రామంలో బుర్ర పోచ గౌడ్ ఇటీవల మరణించగ వారి కుటుంబంమును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు వారి వెంట మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు కుటుంబాన్ని పరామర్శించినారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.
మంథని :- నేటి ధాత్రి
మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి అనూష
ముత్తారం :- నేటి ధాత్రి
మండలం లోని ముత్తారం మచ్చుపేట అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో గల ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి అనూష తనిఖీలు నిర్వహించారు ఈ సందర్బంగా అధిక ధరలకు ఎరువులు విక్రాయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది బిల్లు బుక్కులను ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు రైతులకు ఎరువులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలని సూచించారు
రెండోతరం నాయకులను తయారుచేస్తున్న సీనియర్ నాయకత్వం
నాయకత్వ కొరత లేకుండా వ్యూహాత్మక అడుగులు
ఛరిష్మా నాయకులున్నా పార్టీకే ప్రాధాన్యం
గట్టి సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ
రెండో తరం నాయకులను ఎదగనీయని కాంగ్రెస్
నాయకుల ఛరిష్మాపై ప్రాంతీయ పార్టీల మనుగడ
సంస్థాగత బలహీనతలతో కునారిల్లుతున్న విపక్షాలు
ప్రాంతీయ పార్టీల కోటలు కూల్చే వ్యూహాలతో బీజేపీ ముందడుగు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఢల్లీికి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్, మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య మంత్రులను చేయడం ద్వారా, ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలను సుదీర్ఘకాలం కొనసాగించేం దుకు చక్కగా అడుగులు ముందుకేస్తున్నదన్న సత్యం బోధపడుతోంది. అంతేకాదు కేంద్రంలో సీనియర్ నాయకత్వం బలంగా వున్నప్పుడే ఈవిధంగా సెకండ్ లైన్ నాయకులకు కీలకస్థానాలు అప్పగించి, ఏవైనా సమస్యలు వస్తే తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఆయా నాయకత్వాలను బలోపేతం చేయడం ద్వారా పార్టీలో నాయకత్వ కొరత లేకుండా చేయడంలో భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మక ఆచరణశైలి అద్భుతమనే చెప్పాలి. ఇది దేశంలోని మిగిలిన రాజకీయ పార్టీల్లో కని పించడం లేదు.
బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా నాయకులను ఎంపిక చేసిన తర్వాత వారికి పూర్తి అండగా నిలుస్తోంది. ఎవరైనా నాయకుల్లో అసంతృప్తి వున్నా, ముఖ్యమంత్రికి వ్య తిరేకత వ్యక్తమవుతున్న సందర్భాల్లో ఎప్పటికప్పుడు కేంద్రం కలుగజేసుకొని సర్దుబాటు చేయడ మే కాదు, పార్టీ దిగువస్థాయి నాయకత్వంతో పాటు, కార్యకర్తలు కూడా ఆయా ముఖ్యమంత్రులనాయకత్వంలో పనిచేసేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ఆవిధంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో బల మైన నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం వల్ల, దేశం మరియు రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేయగలదు.
అదే కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు రెండోతరం నాయకులను ఎదగనిచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ అన్ని ప్రతికూలతలను తట్టుకొని ఎదగాలని యత్నించినా యధాశక్తి వాళ్లను బలహీనపరచేవరకు కేంద్ర నాయకత్వం నిద్రపోదు. రాహుల్ గాంధీ, ఆయన సలహాదార్లు కూడా గత పదేళ్లుగా ఇదే వ్యవహారశైలి అనుసరిస్తున్నారు. సచిన్ పైలెట్, మనీష్ తివారీ, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ గెహ్లాట్, భూపేంద్రసింగ్ హూడా వంటి నాయకుల వ్యవహారశైలివల్ల పార్టీ ఎప్పటికప్పుడు బల హీనపడటం తప్ప మరో ప్రయోజనం ఏమీ వుండటంలేదు.
గత లోక్‌సభ మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే నరేంద్రమోదీ, అమిత్ షాల వ్యూహం ఎంతచక్కగా పనిచేస్తున్నదీ అర్థమవుతుంది. అటల్`అద్వానీ కాలంలో మాదిరిగా రెండోతరం నాయకులు పార్టీలో ఎదగడంలేదని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి యుగంలో అద్వానీ, మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్‌లకు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ల భించింది. అదేవిధంగా ప్రస్తుత నరేంద్రమోదీ హయాంలో అమిత్ షా, జె.పి.నడ్డా, యోగి ఆది త్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ కట్టర్, రమణ్‌సింగ్, దేవేంద్ర ఫడ్నవిస్, మో హన్ యాదవ్, భజన్‌లాల్ శర్మ, విష్ణుదేవ్ సాయి, నాయబ్ సింగ్ సైనీ వంటి నాయకులకు అ త్యంత ప్రాధాన్యతనిస్తూ పార్టీ బలోపేతానికి అవసరమైన భూమికను రూపొందిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో మోహన్ యాదవ్ పనితీరు ఆధారంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో స్థానం కల్పించడమే కాకుండా సంస్థాగతంగా కూడా సముచిత స్థాయిలో నిలిపారు. ఇప్పుడు మోహన్ యాదవ్ వంటి నాయకులు క్షేత్రస్థాయి నుంచి సమర్థవంతమైన నాయకులుగా రూపొందడమే కాదు, పరిపాలన పై గట్టి పట్టు సాధిస్తున్నారు. అంతేకాదు వీరు ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సంస్థాగత నాయకుడి స్థాయిని దాటి ఎదిగిపోయారు. ప్రస్తు తం ముఖ్యమంత్రిగా పాలన, శాంతిభద్రతలపై గట్టి నియంత్రణ సాధించారు. మతపరమైన అంశాలపై ఒక మహంత్‌గా తన స్పష్టమైన ముద్రను సమాజం పై వేయగలిగారు. అయోధ్య, కాశి, మధుర, వంటి అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కుంభ్‌మేళాను సమర్థవం తంగా నిర్వహిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత రెండుదశాబ్దాలో దాని నాయకత్వ వైఖరిలో మార్పు లేశమాత్రం కూడా కనిపించడంలేదు. పార్టీ యావత్తు గాంధీ కుటుంబంపైనే ఆధారపడివుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. కానీ మాస్ లీడర్‌గా లేదా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నాయకుడిగా గుర్తింపు లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత రాజ్యసభ ద్వారా ఆయన్ను పార్టీ ప్రధానిని చేసింది. అసలాయనకు కాంగ్రెస్ సంస్థపైనే పెద్దగా ఆసక్తి లేదు.
గాంధీ కుటుంబం చేసిందేమంటే సొంతపార్టీలోనే ప్రత్యర్థి రాజకీయాలను ఎగదోయడం. అర్జున్‌సింగ్, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, మాథవరావు సింథియా, జ్యోతిరాదిత్య, అశోక్ గెహ్లాట్, రాజేష్ పైలెట్, భూపేంద్రసింగ్ హూడా, వీరేంద్రసింగ్, కుమారి షెల్జా మొదలైన నాయకుల పక్క లో అసంతృప్తులను ఎగదోసి వారిని సుస్థిరపాలన చేయనీయలేదు. ఫలితంగా ఇటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో ఏనాడు బలోపేతం కాలేకపోయారు. పార్టీలో వృద్ధ నిజాయతీ నాయకుడు ఎ. కె. అంటోనీ పార్టీ వరుస ఓటమికి కారణాలపై ఇచ్చిన నివేదిక నాయకత్వాన్ని నైరాశ్యంలో ముంచింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌లు ఎంత విరోధులుగా వుంటే పార్టీ అధిష్టానానికి అంత లాభం. మల్లికార్జున ఖర్గే పేరుకే పార్టీ అధ్యక్షులు. నిర్ణయాలన్నీరాహుల్ గాంధీ, వేణుగోపాల్, జయరామ్ రమేష్‌లవే. ఇప్పుడు ప్రియాంకా గాంధీ వాద్రా తన టీమ్‌కు ప్రాధాన్యతనిస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, శిబు హేమంత్ సొరేన్‌తో సఖ్యత ద్వారా ఈ టీమ్ కొంత ప్రయోజనం పొందవచ్చు. రాహుల్ గాంధీ సమకాలీన నాయకులైన మిళింద్ దియోరా, జ్యోతిరాదిత్య, ఆర్.పి.ఎన్. సింగ్ వంటివారు తమను పార్టీలో పక్కన పెట్టడంతో మన స్తాపం చెంది భాజపాలో చేరిపోయారు. శశి థరూర్, మనీష్ తివారి, సచిన్ పైలెట్‌లను ఒక పరిమితికి మించి అధిష్టానం ఎదగనివ్వడంలేదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధినేతదే పూర్తి ఆధిపత్యం. ప శ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీపైనే తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా ఆధారపడిరది. బిహార్‌లో రా ష్ట్రీయ జనతాదళ్‌పై ఏకఛత్రాధిపత్యం లాలూప్రసాద్ యాదవ్, తేజస్వినీ యాదవ్‌లదే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌పై, లోక్‌దళ్ జయంత్ చౌదరి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ మయావతి, తమిళనాడలో డీఎంకే స్టాలిన్‌పై, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చంద్ర బాబు నాయుడిపై, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కె.సి.ఆర్. కుటుంబంపై, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ హెచ్.డి. దేవగౌడ`కుమారస్వామి కుటుంబంపై, హర్యానాలో లోక్‌దళ్ చౌతా లా కుటుంబంపై, పంజాబ్‌లో అకాలీదళ్ బాదల్ కుటుంబంపై ఆధారపడి వున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీల నాయకుల ఛరిష్మాపై నెట్టుకొస్తున్నాయి తప్ప సంస్థాగత నిర్మాణం, రెం డో స్థాయి నాయకత్వ వృద్ది అనేవి ఇక్కడ సాధ్యంకాదు. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రంలో కాం గ్రెస్, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం ముసుగులో ‘రాచరికాన్ని’ అనుసరిస్తున్నాయని చెప్పాలి.
ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. దేశవ్యాప్తంగా పూర్తిగా పట్టుకోల్పోయి అంపశయ్యపై కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో గట్టి ప్రతిపక్షం ఏర్పడే అవకాశాలు కనిపించడంలేదు.
ప్రస్తుతం భారతీయ ఎన్డీఏ కూటమి దేశంలోని మొత్తం 28రాష్ట్రాలో పంధొమ్మిదింటిలో అధికా రంలో వుంది. ఇక బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. అదేవిధంగా మూడు కేంద్ర పాలితప్రాంతాల్లో రెండిరటిని ఎన్డీఏ కూటమే పాలి స్తోంది. ఒకప్పుడు బీజేపీ రaార్ఖండ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం రaార్ఖండ్ ముక్తిమో ర్చా రాష్ట్ర పగ్గాలను చేపట్టింది. ఇక జమ్ము`కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో గతంలో భాజపా ఇతర పార్టీలతో కూటమి కట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే బీజేపీ ఇప్పటివరకు అధికా రంలోకి రాని రాష్ట్రాలు మూడున్నాయి. అవి వరుసగా తమిళనాడు, తెలంగాణ, కేరళ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. బీజేపీ కమలం గుర్తుపై పోటీచేసే పార్టీలు కూడా వున్నాయి. ఈ పార్టీలన్నీ తమిళనాడుకు చెందినవే కావడం విశేషం. అవి వరుసగా ఇండియా జననాయగ కచ్చి, పుతియా నీధి కచ్చి, తమిరaగ మక్కల్ మున్నేట్ర కజగం, ఇంధియా మక్కల్ కల్వి మున్నేట్ర కజగం. సంస్థాగతంగా, వ్యూహాత్మకంగా ముందుకు కదలడంలో భాజపా దరిదాపుల్లో ఏ పార్టీ లేదన్నది అక్షరసత్యం.
`పాకిస్తాన్ నుంచి విచ్చలవిడిగా నకిలీ నోట్లు వస్తున్నాయని నోట్లు రద్దు చేశారు.
`ఇక కొత్త నోట్ల ప్రవేశంతో నకిలీ తయారీ అసాధ్యమన్నారు.
`నకిలీ నోట్ల చెలామణి వ్యవస్థకు పాతరే అన్నారు.
`అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసేశారు.
`డిజిటల్ లావాదేవీలు అమలు చేశారు.
`నోట్ల రద్దు కాగానే వెంటనే 2000 నోట్లు తెచ్చారు.
`విపరీతంగా విమర్శలు రావడంతో క్రమంగా దానిని కనుమరుగు చేశారు.
`తర్వాత 200 నోట్లు తెచ్చారు.
`దేశంలో పెద్ద ఎత్తున 500 నోట్లు నకిలీ చెలమణి జరుగుతుందంటున్నారు.
`ఇలా ఉపసంహరణలు చేసుకుంటూ పోతే జనం సహనాన్ని కూడా మర్చిపోతారు
హైదరాబాద్,నేటిధాత్రి:
మార్కెట్‌లో త్వరంలో రూ.500 నోటు ఉప సంహరణ జరగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పెద్దనోట్ల వల్ల నల్ల దనం ఆగడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అసలు నల్లదనమే లేదని నోట్ల రద్దు మూలంగా తేలిపోయింది. మళ్లీ నలధనం వార్తలు ఎందుకు సృష్టించబడుతున్నాయి. అంటే సమాదానం చెప్పేవారు లేరు. దేశమంతా ఒకే పన్ను విధానం వుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ధరల వ్యత్యాసం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిఎస్టీ తెచ్చారు. దానిని అమలు చేసిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లైందన్నారు. అందుకే జీఎస్టీ అమలు అర్ధరాత్రి చేపట్టారు. అర్ధరాత్రి ఆర్ధిక స్వాతంత్య్రం అన్నారు. ఏమైంది? దేశ ఖజానాను పన్నుల వరద పారింది. సగటు వ్యక్తి జీవితం తలకిందులైంది. అంతకు ముందు నోట్ల రద్దు చేశారు. యాభై రోజులు సమయం ఇవ్వండి. నోట్ల రద్దు వల్ల దేశానికి మేలు జరక్కపోతే అడగండి అన్నారు. కాని ప్రజలు బాదపడుతుతంటే చూశారు. జనం విలవిలలాడుతుంటే చూస్తూ మౌన వ్రతం చేశారు. నోట్ల రుద్ద చేపట్టి, పెద్ద నోట్లను ముందు తెచ్చారు. అన్ని నోట్లు రద్దుచేసి, కొత్తగా రెండువేల నోటు తెచ్చారు. డిజిటల్ మనీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. నోట్లు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టించారు. ఇది కొంత మేలు జరిగిందనుకున్నా నోట్లు పూర్తిగా లేకపోతే కూడా ఇబ్బందులే అన్నది తెలుసుకున్నారు. కాకపోతే రెండు వేల నోట్లు తెచ్చారు. దాని వల్ల పేదలకు ఏమైనా మేలు జరిగిందా? అంటే అదీ లేదు. ఆ నోటును కూడా కొంతకాలం తర్వాత ఉపసంహంరించుకున్నారు. అప్పుడు పేదలు పెద్దగా స్పందించలేదు. కారణం వారి ఆర్ధిక సానుకూలతకు ఆ నోటుకు పెద్దగా సంబంధం లేదు. కాని ఇప్పుడు మళ్లీ ఐదు వందలరూపాయల నోటును కూడా ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు. అనే వార్త సగటువ్యక్తికి పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఎంత డిజిటల్ పేమెంట్లు పెరిగినా చాలా సంస్ధలు నగదు లావాదేవీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య , దేవాదాయ రంగాలలో డిజిటల్‌మనీ లావాదేవీలు జరగడం లేదు. ఈ విషయం పాలకులకు తెలియదా? పెద్ద పెద్ద ఆసుపత్రులలో నగదు ఇస్తే తప్ప వైద్యం చేయడంలేదు. నగదు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్ధల్లో కూడా నగదు లావాదేవీలకు ఆస్కారం లేదు. అంటే అవి జీఎస్టీ ఎగ్గొడుతుంటే మాత్రం పాలుకలు చేష్టలుడిగి చూస్తుంటారు. సామాన్యుల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలుచేస్తారు. అంతెందుకు నూటానలభైకోట్ల మన దేశ జనాభాలో నూటా ఇరవై కోట్ల మంది హిందువులే. హిందువులు ఏ గుడికి వెళ్లినా నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో కూడా నిర్వహించే హోటళ్లు, దర్శనం ప్రసాదాలు ఇలా అనేక రకాల సేవలు నగదు వుంటేనే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్ చెల్లింపుల వల్ల లాభం ఏం జరుగుతోంది? ఇక ఐదువందలనోట్ల ఉప సంహకరణకు ఇప్పుడు మరో కారణం చెబుతున్నారు. దేశంలో నకిలీ ఐదు వందలనోట్లు చెలామణిలోవున్నాయంటున్నారు. మరి నోట్ల రద్దు సమయంలో తెచ్చిన కొత్త నోట్లను తయారు చేయడం ఎవరి వల్ల కాదన్నారు? ఆ నోట్లలో వుండే చిప్‌లు కూడా వుంటాయన్నారు. వాటిని తయారు చేయడం అంత సులువైన పని కాదన్నారు. ఇప్పుడు ఆ నోట్లను ఎలా తయారు చేస్తున్నారు. నోట్లను రద్దు చేసి ప్రభుత్వం సాదించిన విజయమేమింటంటే ఏం సమాదానం చెబుతారు? ఐదు వందల నోటుతోపాటు, రెండు వందల నోటు కూడా ఉపసంహరించుకుంటారన్న వర్తాలు కూడా చెక్కర్లు కొడుతున్నాయి. వాటి స్ధానంలో మూడువందల రూపాలయ నోటు వస్తుందంటున్నారు. అసలు ఈ నోట్ల ఉప సంహకరణ వల్ల కొత్తగా నోట్ల ప్రింటింగ్ ఎంత భారమౌతుందో తెలిసి కూడా పదే పదే ప్రయోగాలు చేస్తూ, జనం నెత్తిన పన్నుల భారం రుద్దడం తప్ప మరేం లాభం లేదు. ఎందుకంటే సంచి నోట్లు తీసుకుపోతే ఒక మూలన సరిపడే సరుకులు రాకపోవడమే ద్రవ్యోల్భనం. ఈ లాజిక్‌ను మర్చిపోయి పదే పదే నోట్ల రద్దు వల్ల జనాన్ని విసిగించడం, వారి వద్దనున్న సొమ్మును పన్నుల రూపాలంలో లేకుండా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. పేదలు మరింత పేదలుగా మారడం తప్ప, ధనవంతులు కావడం దుర్లభం. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వర్గాలుగా మారుతున్నారు. అయినా పాలకులు మారడం లేదు. పేదలకు న్యాయం జరగడం లేదు. ధనం మూలం ఇదమ్ జగత్ అన్నారు. ప్రతి వ్యక్తి తనచేతిలో చిల్లి గవ్వైనా వుండాలనుకుంటాడు. కానీ గవ్వలేకుండా పాలకులు చేస్తున్నారు. నోటు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని పూర్తిగా నోట్లు లేకుండా చేయడం సాద్యం కాదు. పదే పదే నోట్లను అందుబాటులోలేకుండా చేస్తే మాత్రం ఆర్దిక వ్యవస్ధ కుదేలు. ఇదంతా పాలకులు అర్దం చేసుకోరు. వారికి అర్దం కాదు. అవును దేశంలో నోట్ల రద్దు మూలంగా జరిగిన ఇబ్బందులు జనానికి తెలుసు. కాని పాలకులకు వాటి కష్టం తెలిస్తే బాగుండు. సామాన్యుడు నోట్ల రద్దు మూలంగా పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడంకోసం, నకిలీ నోట్ల చెలామణి ఆపడం కోసం ఐదేళ్లకో, ఆరెళ్లకో నోట్లలో మార్పులు తీసుకురావడం సహజమే. కాని ఎవరైనా ఒక్కొ మెట్టు ఎక్కి పైకి వెళ్లాలలనుకుంటారు. కాని పై నుంచి కిందికి రావడమే పురోగమనం అని ఎవరూ అనుకోరు. నోట్ల రద్దు మూలంగా జరిగిందదే…నోట్ల రద్దుకు ముందు వున్న ఆర్ధిక వ్యవస్ధకు, ఇప్పటికీ తేడా చాలా వుంది. ఆర్దిక వ్యవస్ధ పనతనమైంది. కాని పాలకులు మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. ట్రిలియన్ డాలర్లు అంటూ పెద్ద పెద్ద లెక్కలు చెబుతారు. వారికి కూడా వాటి సంగతి తెలియదు. వాటి విలువ అసలే తెలియదు. కాని ఆర్దిక వేత్తలు చెప్పమంటే చెబుతారు. కాని పేదల జీవితాలు చూడాల్సిన పాలకులు, పెద్దల మాటలు వింటే ప్రగతి కారకులు కాదు. ప్రగతి నిరోధకులౌతారు. పది మంది దగ్గర ఆర్దిక వ్యవస్ధ బందీ అయితే, మిగతా వర్గాలకు కుదేలౌతాయి. వంద మందిలో తలో రూపాయి వుంటే అందరికీ ఉయోపగడుతుంది. కాని పది మంది దగ్గ పదిరూపాయలు వుంటే ఆ పది మందికే ఉపయోగపడుతుంది. ఇంత చిన్న లాజిక్‌ను పాలకులు మిస్ అతుంటారు. జనాన్ని ఇబ్బందులు పెడుతుంటారు. గతంలో మురార్జీ దేశాయి అదికారంలోకి వచ్చినప్పుడు ఇదే జరిగింది. ఎంత సేపు పక్కన దేశాల మూలంగా మనం నష్టపోతున్నామంటూ లెక్కలు చెప్పి నోట్లు అప్పడూ రద్దు చేశారు. ఇప్పుడూ ఆ కారణం ఒకటిగాచేసి నోట్లు రద్దు చేశారు. ఏమైంది. ఆర్ధిక వ్యవస్ధ కోలుకోనేంత దూరం వెళ్లిపోయింది. దేశంలో నల్లధనం పెరిగిపోయింది. దాంతో దేశ ఆర్ధిక వ్యవస్ధ ఆగమౌతుందన్నారు. నల్ల దనం మొత్తం తీస్తే దేశానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఏమైంది? ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెండ్ డెడ్ అని వార్త వినాల్సి వచ్చింది. నోట్ల రద్దు వల్ల ఏర్పడినసమస్యల వల్ల కూడా జనం దేశంలో అనేక మంది చనిపోయారు. కాని లాభమేమైనా జరిగిందా? అంటే శూన్యం. ఒక వేళ నిజంగానే నోట్ల రద్దు వల్ల మన దేశానికి మేలు జరిగితే బిజేపి పార్టీ ఈ పాటికి చేసే ప్రచారం మామూలుగా వుండేది కాదు. కాని నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్ గిలగిలాడిపోతోంది..ఆ దేశ ఆర్ధిక వ్యవస్ద కుప్పకూలింది. తినడానికి తిండి లేకుండా జనం మలమల మాడిపోతున్నారు. అని వాట్సాప్ యూనివర్సిటీ చేసే అబద్దపు ప్రచారాలను నమ్మే వాళ్లు కూడా మనదేశంలో కోట్ల మంది వున్నారు. అందుకే నోట్ల రద్దు ప్రభావం బిజేపి మీద పడకుండాపోయింది. లేకుంటే ఈ పాటికి ప్రజలు బిజేపిని సర్ధేశేవారు. కాని ఎంత సేపు పక్క దేశాల రాజకీయాలను గురించి ప్రజల్లో ఏవగింపు నింపాలి. మన దేశ ఆర్ధిక విధనాల వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఆకలి రాజ్యమేలుతుందని చెప్పాలి. మనదేశంలో ముస్లింల సంఖ్య పెరగుతుందని చెప్పాలి. మేకిన్ ఇండియా అని నినాదాలు చేయాలి. చైనా వస్తువులు వాడకూడదు అని పదే పదే బిజేపి నాయకులు ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటీకీ ప్రపంచంలో ఇతర దేశాలకన్నా ఎక్కువ వాణిజ్యం చైనాతోనే ముడిపడి వుందన్న సంగతిని చెప్పదు. అసలు మనం చైనా వస్తువులు కొనకపోవడం వల్ల అక్కడి ప్రజలు పనులు లేక, ఉపాదిలేక విలవిలలాడుతున్నారని అంటారు. ఇదా రాజకీయం. ఇదేనా దేశాన్ని ఆర్దికంగా గాడిలో పెట్టడం. ఏది మేకిన్ ఇండియా? పతంగుల దారం నుంచి మొదలు, మనదేశ జాతీయ జెండాలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇంక్కెక్కడి మేకిన్ ఇండియా? పన్నుల వాయింపుల తప్పడం లేదు. విదేశీ వస్తువులు కొనుగోలు ఆగడం లేదు. మనదేశంలో పారిశ్రామిక ప్రగతి కనిపించింది లేదు. పెద్ద నోట్లు పోయి చిన్న నోట్లు వస్తే జేబులు నిండినట్లు కనిపించొచ్చేమో గాని, వాటి విలువ పెరగదన్నది తెలిస్తే పాలకులు పదే పదే ఇలాంటి ప్రయోగాలు చేయరు. లెస్ లగేజ్ మోర్ కంఫర్టు అని పెద్దలన్నారు. గాని మోర్ లగేజ్ మోర్ కంపర్టు అని అనలేదు. ఈ లాజిక్ పాలకులు ఎప్పుడో మిస్ అయ్యారు. మిస్ ఫైర్ అయిన లెక్కలతోటి పన్నులు వాయిస్తున్నారు. నోట్ల ఉపసంహరణ సర్వరోగ నివారిణి అనుకుంటున్నారు. మొదటికే మోసం వస్తున్నా అదే పని కరక్టు అనుకుంటున్నారు. మన ప్రజాస్వామ్యంలో యధా ప్రజా ..తదారాజ అన్నది కనిపించాలి. కాని యధా రాజా..తధా ప్రజా రాజ్యమేలుతోంది. సామ్యవాదం మరుగునపడిపోయింది. మళ్లీ ప్యూడల్ వ్యవస్ధ ముసుగులో పెట్టుబడి దారి వ్యవస్ధ కాటేస్తోంది. జనాన్ని పీల్చుకుతింటోంది. ఒక రకంగా చెప్పాలంటే కాల్చుకుతింటోంది.
ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్ ఫు @కరాటే వారియర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన టోర్నమెంట్ లో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కుంగ్ ఫు విద్యార్థులు తమ ప్రదర్శనను కనబరిచారు అలాగే ఈ పోటీల్లో 6 బంగారు పతకాలు, 8వెండి పతకాలు,3 బ్రౌన్ పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ స్వామి, శ్రీనివాస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.