ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు.

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

మున్సిపాలిటీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ టాక్స్ , కుళాయి బిల్లుల వసూల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, బిల్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నెలాఖరులోగా 100 శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం కొంతమంది మున్సిపల్ బిల్ కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మేనేజర్లకు సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, జహీరాబాద్ మున్సిపాలిటీ లో కమిషనర్ ఉమామహేశ్వరరావు, మేనేజర్ ఉమేశ్వర్ లాల్, బిల్ కలెక్టర్లు 8 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.సంగారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఎస్సీ వీకే ఛావన్ , మేనేజర్ సూర్య ప్రకాష్ ,బిల్ కలెక్టర్లు 27 మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. సదాశివపేట మున్సిపాలిటీలో కమిషనర్ శ్రీమతి జే ఉమా, మేనేజర్ ఉమర్ సింగ్, 14 మంది బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంటి పన్నులు, కుళాయి బిల్లును, ప్రాపర్టీ టాక్స్ 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేకుంటే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

తంగళ్ళపల్లి,నేటిధాత్రి:

మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు, అలాగే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు మండలంలో నువ్వా నేనా అన్న చందంగా తయారైందని చర్చలు జరుగుతున్నాయి.అధికారంలో ఎవరున్నా మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్పా వ్యక్తిగత దూషణలతో
మాట్లాడుకోవడం సరైంది కాదని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఎకరిపై ఒకరు దుషించుకోకుండా సమన్వయంతో ఉంటూ మండల అభివృద్ధికి దోహద పడాలని పలువురు మండల మేధావులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.

ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు.

దత్త గిరి ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాడు దత్తగిరి మహారాజ్ 46వ అమర స్థితి పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ సలహాదైనా కేశవరావు ఆలయానికి రాగానే ఆలయ పూజారులు ఆలయ పీఠాధిపతి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం కేశవరావు యజ్ఞ పూర్ణహౌతులో పాల్గొని పూర్ణాహుతి చేశారు. ఆలయ పీఠాధిపతి ఒక్క వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ సిద్దేశ్వర స్వామీజీలు ఆయనను సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దత్తమేర మహారాజ్ ఆశ్రమ అధ్యక్షులు అల్లాడి వీరేశం గుప్తా విశ్వ మానవ ధర్మ ప్రచార అధ్యక్షులు శేరి నర్సింగ్ రావు రాజు పటేల్ జిల్లా శివశక్తి అధ్యక్షుడు శ్యామ్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు.!

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రా చన్న పటేల్ మృతి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

Ra Channa Patel

ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ గ్రామ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాచన్న పటేల్ కప్పా డ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. సాయకాలం వాకింగ్ కోసం వెళ్లి వస్తుండగా ఈ సంఘంటానా జరిగింది అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకోన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ లు ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు. అయన మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
◆డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
◆ మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో మొగడం పల్లీ మండల మాజీ కోప్షన్ మెంబర్ హర్షద్ పటేల్ ఏర్పాటు చేసిన ఇప్తార్ వేడుకల్లో యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్ హాజరయ్యారు. ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు మైనార్టీ సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన.

పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గ్రామాలభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది

ప్రగతిసింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కండువా కప్పి ఆహ్వానిం చిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో వివిధ గ్రామాలలో భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు పర్యటిం చారు. ఆయా గ్రామాలల్లో సుమారు రూ.7.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముం దుగా కొత్తగట్టుసింగారం గ్రామంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాందా రిపేట లో సీసీరోడ్లు, శాయం పేట మహాత్మాగాంధీ జ్యోతిభా పూలే పాఠశాలలో సీసీ రోడ్డు, శాయంపేట నాగసముద్రం నుండి పత్తిపాక వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పత్తిపాక, నేరేడుపల్లి, కాట్రపల్లి, గంగిరేణిగూడెం, వసంతా పూర్, కొప్పుల, జోగంపల్లి, పెద్దకోడెపాక, మైలారం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. అదేవిధంగా, వసంతాపూర్ నుండి కొత్త పల్లిగోరి మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు రెన్యువల్, పెద్దకోడెపాక డంపింగ్ యార్డు నుండి మూడువాగుల కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతీ అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నా మని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తా నని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతి నిధి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలి పారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక వినూ త్న కార్యక్రమాలు చేప‌డుతోం దన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్ర‌జా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత‌ బస్సు ప్ర‌యాణాన్ని క‌ల్పించిందని తెలిపారు. ఉచిత ప్ర‌యాణ‌మే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన విజ‌య మని అన్నారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్ర‌తి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచా లనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సదరు గుత్తేదా రులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు.

Foundation stone

రూ.5,96,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే..

శాయంపేట మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదా రులకు అందజేశారు. మొత్తం 20 మంది సీఎం రిలీఫ్ లబ్దిదారులకు రూ.5,96, 000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రగతి సింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మండలంలోని ప్రగతిసింగారం గ్రామం నుండి 20 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు గ్రామ కూడలిలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు వీరే పిట్టల రఘుపతి, బళ్ల సంతోష్, చిలుకల తిరుపతి, చిలుకల సతీష్, చిలుకల రవి, దైనంపల్లి ప్రకాష్ లతో పాటు మరో ఇరవై మంది ఉన్నారు.

ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..

ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..

: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (జాతర) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం విమాన రథోత్సవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు. అనంతరం రరమలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి. వేదమంత్రాల మధ్య స్వామివారి రథాన్ని లాగారు.

ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామలింగేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాంతం అంతా పచ్చని పంటలతో, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకొండానని అన్నారు. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రుడనై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి రమ్య, రామలింగారెడ్డి, ఆలయ కార్య నిర్వాణ అధికారి నాగిరెడ్డి, కోడి శ్రీనివాసులు, దోటి టి వెంకటేశ్ యాదవ్, నల్లగంటి మల్లేష్ ఆలయ సభ్యులు, వంశపార్యపర్య అర్చకులు, స్థానిక నాయకులు, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హద్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో.!

హద్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణం బండార్ నగర్ లో హధ్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పాల్గొన్నారని కోచింగ్ సెంటర్ .నిర్వహికులు హేమెందర్ ఒకప్రకటనలో తెలిపారు ఈసందర్భంగా రూరల్ ఎస్సై జలందర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు అంటే భయపడకుండా చదువు అంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఎదగాలని సూచించారు విద్యార్థులకు దిశ నిర్దేశిస్తూ, ప్రత్యక్షంగా తను అనుసరించిన విధి విధానాలను వారి పూర్తి అనుభవాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరిస్తూ ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని కోరారు ప్రత్యేకంగా వనపర్తి చుట్టుపక్కల చిన్నచిన్న గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు కూడా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను బోధన కల్పిస్తున్నందుకు ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హేమెందర్ ను రూరల్ ఎస్సై అభినందించారు. అనంతరం ఎస్సై ని యాజమాన్యం శాలువ తో ఘనంగా సన్మానించారు..

Anniversary

వార్షికోత్సవాలకు హాజరై మరియు వారి విలువైన సూచనలను అందించినందుకు విద్యార్థులు ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలిపారు.

ముదురు పాకాన పడిన తమిళ భాషా వివాదం

ముదురు పాకాన పడిన తమిళ భాషా వివాదం

రాష్ట్ర బడ్జెట్‌ లోగోలో హిందీ ‘రు’ గుర్తును తొలగించిన డి.ఎం.కె. ప్రభుత్వం

తమిళ ‘రూబాయి’లోని తొలి అక్షరాన్ని లోగో కింద వుంచిన వైనం

ఎన్‌ఈపీా2020పై వ్యతిరేకతను భాషా వివాదంగా మలచిన డి.ఎం.కె

డీలిమిటేషన్‌ సమస్యను కూడా ముందుకు తెస్తున్న పార్టీ

హద్దులు లేకుండా మాట్లాడటం, కేంద్రాన్ని నిందించడం

ఇదీ ద్రవిడ పార్టీ వైఖరి

ఓట్లకోసమే భావోద్వేగాలను రెచ్చగొడుతున్న డి.ఎం.కె.

అనుసంధాన భాషపై అనవసర వివాదం

కేవలం తమిళం మాత్రమే నేర్చుకుంటే నష్టపోయేది ప్రజలే

రాజకీయ లబ్దికోసం భాషా అస్త్రాన్ని వాడుతున్న డీఎంకే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తమిళనాడులో భాషా వివాదం ముదిరి పాకానపడిరది. జాతీయ విద్యావిధానం`2020లో పేర్కొన్న త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న డి.ఎం.కె. ప్రభుత్వం దీన్ని పెద్ద వివాదంగా మలచి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఉద్దేశంతో ముందుకెళుతోందని, అది తీసుకుంటున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో భాజపా ‘సనాతన ధర్మం’ అస్త్రం తో తనను ఎదుర్కొంటుండటంతో ద్రవిడవాద డి.ఎం.కె. దిగ్గజం ఇందుకు ప్రతిగా తన సత్తా ఏంటో చూపాలన్న దృష్టితో భాషావివాదాన్ని రెచ్చగొడుతోంది. ఈ ‘భాషా దురభిమానం పిచ్చి’ ఎంతగా ముదిరిపోయిందంటే, ఏకంగా రూపాయి నోటుపై హిందీ అక్షరం ‘ఆర్‌’ను తొలగించి దాని స్థానంలో తమిళ ‘ఆర్‌’ అక్షరం పెట్టేవరకు వెళ్లింది. దీంతో తమిళ రాజకీయాలు మళ్లీ వేడె క్కాయి. రాష్ట్ర ఆర్థికమంత్రి తంగం తిన్నెరసు 2025`26 బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వుంది. ఈ బడ్జెట్‌కు సంబంధించిన లోగోలో మొట్టమొదటి అక్షరంగా తమిళ భాషకు చెందిన ‘రూబాయి’లోని మొదటి అక్షరం ‘రు’ను వుంచడం ఇప్పుడు దుమారం రేపింది. ఈ లోగోపై ‘అందరికీ అన్నీ’ అనే శీర్షికను వుంచారు. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లే డి.ఎం.కె విధానాన్ని ఇది తెలియజేస్తుంది.
దీంతో రాష్ట్ర బీజేపీ ఒక్కసారిగా డి.ఎం.కె. చర్యపై మండిపడిరది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నా మలై తీవ్రంగా స్పందిస్తూ ‘‘ ఒక తమిళుడు రూపొందించిన హిందీ అక్షరం ‘రు’ డిజైన్‌ను తొల గించడం దారుణం. దేశం మొత్తం ఆమోదించి అనువర్తింపజేసుకున్న డిజైన్‌ ఇది. అంతేకాదు మన కరెన్సీకి గుర్తుగా ఈ డిజైన్‌ను ఉపయోగిస్తున్న సంగతిని తెలుసుకోవాలి’’ అంటూ ఎక్స్‌ కాతాలో పోస్ట్‌ చేశారు. ‘తిరు ఉదయ్‌కుమార్‌ ఈ డిజైన్‌ను రూపొందించారు. ఈయన మాజీ డి. ఎం.కె. ఎమ్మెల్యే కుమారుడు. ఇటువంటి చిహ్నాని తొలగించి మూర్ఖంగా వ్యవహరించారు తిరు స్టాలిన్‌’ అంటూ ఆయన తన పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో 2024`25 తమిళనా డు బడ్జెట్‌ లోగోగా హిందీ ‘రు’ డిజైన్‌ను ఉపయోగించిన ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు.
దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఇంకా స్పందించలేదు కానీ భాజపా మాత్రం స్టాలిన్‌ ప్రభుత్వ చ ర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసలు తమిళపార్టీ దేశం కంటే తాను భిన్నమన్న రీతిలో వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
జాతీయ విద్యావిధానం`2020 కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్ర భుత్వం ముందుకు రాకపోవడంతో, ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ కింద రాష్ట్రానికి కేటాయించిన రూ.573కోట్ల ను తొక్కిపట్టింది. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం రాజుకుంది. ఈ విద్యా విధానం కింద రాష్ట్రాలు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నిధులు పొందాలంటే జాతీయ విద్యావిధానంలో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించడం తప్పనిసరి. ఎస్‌ఎస్‌ఏ కింద కేం ద్రం తమిళనాడు వంటి రాష్ట్రాలకు 60శాతం నిధులు సమకూరిస్తే మిగిలిన 40శాతం రాష్ట్రం భరించాల్సివుంటుంది. ‘ప్రధానమంత్రి శ్రీ పథకం’ కింద సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేయాల్సి వుంటుంది. అప్పుడు మాత్రమే కేంద్రం ఎన్‌ఈపీ`2020 కింద నిధులు విడుదల చేస్తుంది.
ఈ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడమే కాకుండా అందుకు నాయకత్వం వహించారు కూడా. నూతన జాతీయ విద్యా విధానం కేవలం ‘కాషాయ విధానం’ మాత్రమేనని విమర్శించారు. హిందీని రుద్దడంపై వున్న శ్రద్ధ దేశాభివృద్ధిపై లేదన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ‘కత్తి’ దక్షిణాది రా ష్ట్రాల నెత్తిన వేలాడుతున్నదంటూ గుర్తుచేశారు. ‘మేం జాతీయ విద్యావిధానాన్ని పూర్తిగా వ్యతిరే కిస్తున్నాం. ఇది సామాజిక న్యాయం కింద రిజర్వేషన్లను ఆమోదించదు. షెడ్యూల్డు కులాలు/తెగ లు, వెనుకబడిన వర్గాల వారికి విద్యకోసం తగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఇది దోహదం చేయదని ఒక బహిరంగ ర్యాలీలో ఆరోపించారు. జాతీయ విద్యావిధానంలోని త్రిభా షా సూత్రం కేవలం హిందీని బలవంతంగా రుద్దడానికి ఉద్దేశించేందనన్నారు. ఎన్‌ఈపీ వంటి కొన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించబోమని కేంద్రం చెప్పడం కంటే అరాచకం మరో టి వుండదన్నారు. తమిళనాడు త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కేవలం ద్విభాషా సూత్రాన్ని మాత్రమే అమలుచేస్తుందని కుండబద్దలు కొట్టారు.
‘ప్రధానమంత్రి మోదీగారూ! మాదో విన్నపం. హిందీకంటే దేశాభివృద్ధిపై దృష్టిపెట్టండి. ఎవ్వరూ మాట్లాడని సంస్కృత భాషాభివృద్ధికోసం కోట్ల రూపాయలు కుమ్మరించిన ఫలితముండదు. దేశ విదేశాల్లో తమిళ భాషను మాట్లాడుతున్న ప్రజలను మోసం చేయకండి’ అన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ ఇటీవల మాట్లాడుతూ ‘డి.ఎం.కె. రాబోయే ఎన్నికల్లో ఏదోవిధంగా అధికారంలోకి రావడానికి మాత్రమే ఎన్‌ఈపీని వివాదం చేస్తోంది. తమిళభాష విషయంలో వారు ప్రదర్శిస్తు న్న అత్యుత్సాహం కేవలం కపటనాటకం మాత్రమే’ అని వ్యాఖ్యానించడం డీఎంకే అధినేత స్టాలిన్‌ ఇంతటి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడానికి కారణం. తమిళ ప్రజలకు ప్రజాస్వామ్య మంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం కేంద్రమంత్రికి లేదని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజనపై కూడా స్టాలిన్‌ మండిపడ్డారు. ఉత్తరాదిలో బలీయంగా వు న్న కాషాయపార్టీ, ఈ పునర్విభజన కారణంగా ఆ ప్రాంతంలో పెరిగే సీట్ల ద్వారా రాజకీయంగా లబ్దిపొందడమే కాదు, కేవలం ఉత్తరభారతదేశ ఓట్లతోనే అధికారంలో కొనసాగాలని భావిస్తోంది. ఇది చాలా ఘోరం. పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం ప్రయత్నిస్తే డీఎంకే తప్పకుండా దాన్ని అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోని 29 పార్టీలకు లేఖలు రాశానన్నారు. ఈ పార్టీలన్నీ ఈనెల 22న చెన్నైలో పునర్విభజనపై చర్చలు జరుపను న్నాయి. రాష్ట్రంలో విద్యావిధానం పూర్తిగా విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే డి.ఎం.కె. ప్రభుత్వం ఈ భాషా వివాదాన్ని ముందుకు తెచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ఆరోపించారు. వినాశకర విధానాలను అనుసరిస్తూ, విద్యావిధానాన్ని డి.ఎం.కె. ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు.
జాతీయ విద్యావిధానంతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన అంశం కొద్దివారాలుగా కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య సంఘర్షణాత్మకతను పెంచుతోంది తప్ప నివారించడంలేదు. బీజేపీ దేశవ్యాప్తంగా తన జాతీయవాద నినాదంతో ముందుకెళుతూ, ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ అభివృద్ధికి అవసరమని ప్రచారం చేస్తుండటాన్ని, ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఆమోదించడంలేదు. ఎందుకంటే ఏదోవిధమైన భావోద్వేగ అంశాలను ముందుకు తెచ్చి ఇవి తమ అధికారాలను కాపాడుకుంటుండటమే అందుకు కారణం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు కావాలనే కోరతాయి. ఇది దేశ ఐక్యతకు చాలా ముఖ్యం. దీనికితోడు త్రిభాషా విధానంపై డి.ఎం.కె. ఎంపీలు పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ఎంతమాత్రం బాగాలేదు. సభా మర్యాదను కూడా పట్టించుకోని రీతిలో వారు తమ వ్యతిరేకతను వెల్లడిరచారు. విచిత్రమేమంటే స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగార్థులు దేశంలోని ఎక్కడి కైనా వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి! ఈ నేపథ్యంలో హిందీ రావడం తప్పనిసరి! ఇంగ్లీషు భాష ఉత్తర భారతదేశంలో సామాన్యులకు రాదు కదా! నిజంగా దేశాన్ని ఐక్యంగా వుంచాలన్నా, అభివృద్ధిలో ప్రతి రాష్ట్రం భాగస్వామ్యం కావాలన్నా దేశవ్యాప్తంగా ఒక అనుసంధాన భాష తప్పనిసరి! ఇది డి.ఎం.కె.కు తెలియంది కాదు. అదీకాకుండా మనదేశ భాష కాని ఇంగ్లీషును ఒకపక్క ఆమోదిస్తూ, హిందీని వ్యతిరేకించడం…ఇదెక్కడి భాషాభిమానం? దేశీయ భాషను వ్యతిరేకించి, విదేశీ భాషను ఆమోదించడం…ఇదెక్కడి వింత? ఇది అవకాశవాద రాజకీయం తప్ప మరోటికాదు. కానీ భావోద్వేగాలను ఎంతగా రెచ్చగొడితే అంతగా ఓట్లు రాలతాయి. ఇదీ డీఎంకే నేతల ఓవర్‌ యాక్షన్‌ వెనుక వున్న ఆంతర్యం. సమాఖ్య వ్యవస్థను భ్రష్టుపట్టించేది వీరే…కేంద్రాన్ని ఆడిపోసుకునేదీ వీరే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, తమ స్వలాభంకోసం ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కూడా వెనుకాడని ఇటువంటి ప్రాంతీయ పార్టీలు దేశాభివృద్ధి గురించి మాట్లాడటం వింతల్లోకెల్లా వింత. అయినకాడికి ఉచితాల పేరుతో రాష్ట్రాల ఖజానాను ఖాళీచేస్తూ, ప్రజలను బద్ధకస్తులుగా మార్చడమే కాదు, అభివృద్ధికి దోహదం చేయని ఈ పార్టీలు దేశాభివృద్ధి గురించి మాట్లాడటం విచిత్రం! దేశాభివృద్ధి లక్ష్యంతో పనిచేసే పార్టీలు ఇటువంటి సంకుచిత ధోరణులను ప్రదర్శించవు. ఈ సత్యాన్ని విజ్ఞులైన ప్రజలు తప్పక గుర్తిస్తారు.

అబద్దాలకు హద్దు లేదు?..మాటలకు పొంతన లేదు!?

`అసలు జనసేన ఎందుకు పుట్టింది?

`ఎవరి కోసం పుట్టింది!

`ఎలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటోంది!

`అసలు సిద్దాంతం ఏమిటి?

`చేయాల్సిన రాద్దాంతం ఏమిటి?

`ఆవిర్భావ సభ ఎవరికి భరోసా కల్పించింది?

`కొత్త తరం నాయకత్వానికి ఏమి హామీ ఇచ్చింది?

`గంటకు పైగా సాగిన ఉపన్యాసంలో చెప్పిందేమిటి?

`గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన వుందా?

`కనీసం అప్పటి మాటలకు, ఇప్పటి మాటలు కొంచైనా సింక్‌ అవుతున్నాయా?

`దేవుని హారతితో తన తండ్రి సిగరెట్‌ వెలిగించుకునే వారు అని చెప్పిందే పవన్‌!

`మా ఇంట్లో ఎప్పుడూ రామ నామ జపం వినిపిస్తూనే వుండేది అంటున్నది పవనే!

`తొలిప్రేమ సినిమా తర్వాత కంప్యూటర్‌ కోర్స్‌ చెన్నై లో నేర్చుకున్నాన్నది పవనే!

`పరీక్ష రాసి రావడం వల్ల లేటైతే ఇంట్లో కంగారు పడ్డారని చెప్పింది ఆయనే.

`పదకొండేళ్ల ప్రస్థానం గురించి పక్కన పెట్టి తన బాల్య స్మృతులు చెప్పడమేమిటి?

`అసలు జన సేన లక్ష్యాలేమిటి?

`జనసేన అధికారంలోకి ఎప్పుడు వస్తుంది?

`జనసేన వల్ల ఏపికి ఏం లాభం చేకూరింది?

`పార్టీ కోసం కష్టపడుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?

`అవన్నీ వదిలేసి చెప్పిన మాటలేమిటి?

`జనసేన సభలో పవన్‌ చెప్పాల్సిన మాటలేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నోరు తెరిస్తే అబద్దమే..మాట మాట్లాడితే అబద్దమే..చెప్పిందంతా అబద్దమే..చెబుతున్నదంతా అబద్దమే..చెప్పేదేమున్నా అదీ అబద్దమే…ఈ మాటలు ఎవరి గురించో అనుకుంటున్నారా? జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ గురించి ఏపిలోని వివిధ రాజకీయా పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఆది నుంచి ఆయన చెబుతున్న గతం తాలూకు మాటలకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనలేదంటున్నారు. పైగా నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించిన ఘనత జనసేనదే అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు కొంత పొగరాజేశారు. పిఠాపురంలో పవన్‌ గెలుపుకు తామే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు తోడు పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వాతావణంలో వేడిని పెంచాయి. తెలుగుదేశం శ్రేణుల నుంచి జనసేన మీద తీవ్ర నిరసనలు వెలువడ్డాయి. ఇదిలా వుంటే ప్రతి సారి పవన్‌ తన వ్యక్తిగత జీవితంలోని అంశాలు ఉటంకించడం పరిపాటిగా మారింది. అయితే ఒకటే విషయాన్ని పదే పదే చెబితే బాగుండదనుకుంటారో..లేక గతంలో చెప్పిన అంశాన్ని మర్చిపోతుంటారో గాని ఎప్పుడూ ఏదో ఒక కొత్త లెక్క చెబుతుంటారు. కాని గతంలోనే చెప్పిన విషయాన్నే మరోలా చెబుతుంటారు. ఇక్కడే అందరూ పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా తాను చెన్నైలో వివక్షను ఎదుర్కొన్నానంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం నెలకొన్నది. చిరంజీవి సినీ స్టార్‌గా ఎదిగింది చెన్నైలోనే. ఆయన తన జీవితంలో ఎక్కువ సినీ కాలం గడిపింది చెన్నైలోనే..అన్నతోనే వుంటూ పవన్‌ కూడా చెన్నైలోనే వున్నారు. కాని ఇప్పుడు చెన్నైలో తాను వివక్షను ఎదుర్కొన్నారని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీ వార్షికోత్సవ సభలో సుమారు 90 నిమిషాల పాటు ప్రసంగించిన పవన్‌ కళ్యాణ్‌ తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. గతంలో ఆయన నెల్లూరుతోపాటు, అనేక పట్టణాల్లో తన చదవు సాగిందంటూ చెప్పేవారు. చెన్నైలోనూ చదువుకున్నాననేవారు. ఏది నమ్మాలో ఇప్పటికీ ఎవరికీ అర్దం కాకుండాపోయింది. పైగా ఓసారి తెలుగు అంటారు. మరో సారి ఇంగ్లీష్‌ అంటారు. బోటనీ అంటారు..ఇలా ఆయనకు అప్పటికప్పుడు ఏది గుర్తుకు వస్తే అదే చదివినట్లు లెక్క అన్న ధోరణిలో చెబుతుంటారు. పదే పదే ఇలాంటి అంశాలలో చెప్పిన ప్రతీసారి కొత్తదనం కోసం కథలు చెప్పినట్లు తన బాల్యం గురించి చెబుతారు. ఇక తాను చెన్నైలో కంప్యూటర్‌ కోర్సు చదవిన సమయంలో అంటూ పిఠాపురంలో కొత్త కథ చెప్పారు. అప్పటికే తాను నాలుగు సినిమాలు చేసిన హీరోనైనా సరే తాను బైటకు వెళ్తే ఇంటికి వచ్చేవరకు భయపడేవారంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు చెన్నైలో వుండగా జరిగిందని ఒక సంఘటన చెప్పిన మరుక్షణమే సికింద్రాబాద్‌లోని సంగీత్‌ ధియేటర్‌ సంగతి చెప్పారు. జనం ఏది నమ్మాలో..ఏది నమ్మకూడదో కూడా అర్దం కాకుండా రాసుకొచ్చుకొని మరీ చెబుతుంటారు. పవన్‌ కల్యాన్‌ తన తండ్రి గురించి గతంలో చెబుతూ ఆయన కమ్యూనిస్టు వాది ఆయన నాస్తికుడు అని చెప్పారు. వాళ్ల నానమ్మ దేవుడికి హారతి ఇస్తే దానితో సిగరెట్‌ వెలిగించుకునేవారు అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణే చెప్పారు. ఇప్పుడు మళ్లీ మా కుటుంబంలో నా చిన్న నాటినుంచి ఇంట్లో రామనామం వినిపిస్తూనేవుండేదంటారు. తన తండ్రి రామభక్తుడని పిఠాపురం సాక్షిగా చెప్పుకొచ్చారు. తాను నాస్తికవాదినంటూ పవన్‌ కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. పైగా తాను బాప్టిజం తీసుకున్నానని కూడా ఆయనే చెప్పారు. తన పిల్లలకు కూడా బాప్టిజం తీసుకున్నానని గతంలో చెప్పారు. పిఠాపురం సాక్షిగా తాను 14వ ఏటనే పూజలు చేసేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి తాను కృషిని మాత్రమే నమ్ముతానని ఏ దేవుడిని నమ్మనంటూ వ్యాఖ్యానించారు. మరో సోదరుడు నాగబాబు తాను ఏ దేవుడిని నమ్మనంటూ కూడా ఆయన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. మరి పవన్‌ మాత్రం మా ఇంట్లో సనాతనధర్మానికి ఎంతో విలువిస్తామంటూ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మమే లేకుంటే మన వ్యవస్ధ చిన్నాభిన్నమయ్యేదంటూ కొత్త కొత్త భాష్యాలు చెప్పారు. ఇవన్నీ విన్న జనసైనికులకు కూడా అసలు సభ ముఖ్య ఉద్దేశ్యమేమిటి? పవన్‌ కళ్యాన్‌ మాట్లాడుతున్నదేమిటని ముక్కున వేలేసుకున్నారు. ఇలా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కూడా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశ్యమేమిటి? దాని విధానాలేమిటి? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పటి వరకు సాధించిందేమిటి? ఇంకా సాధించాల్సిందేమిటి? జనసేన ఎలా ముందుకు సాగాలి? ఎప్పుడు అధికారంలోకి రావాలి? పార్టీ నిర్మాణం ఎలా సాగాలి? ఎంత మంది సభ్యులున్న పార్టీగా చరిత్ర సృష్టించాలి. ప్రాంతీయ పార్టీగా వుండాలా? జాతీయ పార్టీగా ఎదగాలా? అందుకు నాయకులు ఏంచేయాలి? కార్యకర్తలు ఏం చేయాలి? పార్టీ నిర్మాణంలో ఎవరెవరు? ఎలాంటి పాత్ర పోషించాలి. కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకోసం కేటాయిస్తే వారి భవిష్యతేమిటి? రాజకీయంగా వారికి ఎలాంటి పదవులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? కూటమిలో చేరి ప్రజలకు ఇచ్చిన హమీల సంగతి ఏమిటి? వాటి అమలు తీరేమిటి? ఆరు గ్యారెంటీల ప్రస్తావనేది? వాటి అమలులో అవరోదాలు ఎందుకు ఎదురౌతున్నాయి? ఎప్పటి వరకు వాటిని పూర్తి చేసే అవకాశం వుంది? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు జనసేను సంబంధం వుందా? లేదా? ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వంలో వుండి ప్రశ్నిస్తారా? లేక అమలు కాకుండా ఎదిరిస్తారా? వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా? లేదా మరో 15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు అని చెప్పిన మాటలకు కట్టుబడి వుంటారా? 2014 ఎన్నికల ముందు కలిసి సాగిన కూటమిలో లుకలుకలు వచ్చినట్లు వస్తాయా? రాకుండా చూసుకుంటానని హమీ ఇస్తారా? ఇలాంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాని నలభై ఏళ్లు తెలుగుదేశం పార్టీని గెలిపించామని చెప్పి తన వల్లే కూటమి విజయం సాధించిందని పరోక్షంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూటమి మధ్యలో చిచ్చు రాజేసేందుకు కారణమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. అయినా 2019 ఎన్నికల్లో 175 సీట్లకు జన సేనపోటీ చేస్తే గెలిచింది ఒక్కటి. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత జనసేనలో లేడు. పవన్‌ కళ్యాన్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎవరు గెలవాలో..ఏ పార్టీని ఓడిరచాలో నిర్ణయం చేసేది ప్రజలు. కాని నాయకులు కలలు కంటుంటారు. ఎల్లకాలం మేమే వుంటామన్న భ్రమల్లో బతుకుతుంటారు. కాని ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాక్టికల్‌గా వుంటారు. గెలుపోటములు దైవాదీనాలంటూ చెబుతారు. కాని పవన్‌ కల్యాన్‌ అందుకు భిన్నంగా చెబుతుండడంతో జనం నవ్వుకుంటున్నారు. అసలు జనసేన పోటీ చేసిందే 21. కాకపోతే మొత్తం సీట్లు గెలిచారు. 150 సీట్లలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ విజయం సామాన్యమైంది కాదు. 135 సీట్లు గెల్చుకున్నది. ఆ గెలుపు కింద జనసేన గెలుపు అన్నది చాలా చిన్న విషయం. ఇకపోతే పిఠాపురంలో తన గెలుపుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మతోపాటు ఆయన కుమారుడు వర్మ పాత్ర వుందని కొనియాడారు. వర్మ చేత ఆశీస్సులు తీసుకున్నారు. కాని ఇప్పుడు పరోక్షంగా వర్మ లాంటి వాళ్లు అలా అనుకుంటే తమ ఖర్మ అన్నట్లు నాగబాబు అన్నారు. ఇదిలా వుంటే జాతీయ మీడియా పవన్‌ పై రాసిన ఆర్టికల్స్‌పై వివరణ ఇచ్చుకునే క్రమంలో తాను ఏం చెబుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైట్‌ నుంచి లెఫ్ట్‌కు, లెఫ్ట్‌ నుంచి సెంటర్‌కు అంటూ ఓ దినపత్రికలోవచ్చిన కధనంపై రకరకాల బాష్యాలు చెప్పారు. అలా మారాల్సిన పరిస్దితులు వచ్చాయని చెప్పుకున్నారు. చెగువేరా ఒక డాక్టర్‌గా మాత్రమే తెలుసని, ఆయన చేసిన సేవలు మాత్రమే తనకు తెలుసంటూ కొత్త లెక్కలు చెప్పడంతో అందరూ నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది జనసేన అనే వ్యాఖ్యలతో టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయితీ ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ఎంపీ మల్లు రవికి సన్మానం..

ఎంపీ మల్లు రవికి సన్మానం..

కల్వకుర్తి /నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కల్వకుర్తి పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనీల సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ పండిత్ రావు ఎంపీ మల్లు రవిని సన్మానించారు. అనంతరం మార్కెట్ ను సందర్శించి మార్కెట్ లో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలభిషేకం.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

సిరిసిల్ల టౌన్  ( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని నిన్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఐటి మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలభిషేకం చేసిన కాంగ్రెస్ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు . కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పశువులకు ఇచ్చే వ్యాక్సినేషన్ సకాలంలో ఇప్పించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా చింత వైద్య శిబిరంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

అన్నదాతల అభివృద్ధి కాంగ్రెస్ పాలన..

అన్నదాతల అభివృద్ధి కాంగ్రెస్ పాలన లక్ష్యంకాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

తంగళ్ళపల్లిమండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ ఎల్ ఎం.4. ఏ ఎల్ ఎం.5. కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యమని తెలియజేస్తూ జిల్లెల్ల గ్రామ చెరువులోకి వచ్చే సాగునీటి కాలువలను మరియు దాచారం మీదిగా చిన్న లింగాపూర్ పరిసర గ్రామాలకు వచ్చే కాలువలను రైతులతో కలిసి సందర్శించి రైతులకు సాగునీరు రావడానికి కృషిచేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ప్రభుత్వ విప్ విఫ్ వేములవాడ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పెల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు.11/6. ఏ ఎల్ ఎం కాల్వ ద్వారా శాశ్వత పరిష్కారం ద్వారా లక్ష్మీపురం గ్రామ0 వరకు నిర్మాణం పూర్తి చేసి అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు కృషి చేస్తున్నారని కాల్వ నిర్మాణం కోసం ల్యాండ్ ఆక్వా జేషన్ లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కేకే మహేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని తమ గ్రామాలకు సాగునీరు రావాలని రాత్రింబవళ్లు.కష్టపడి కేసుల పాలైన వివిధ గ్రామాల రైతులకు అండగా ఉంటామని ప్రజాపాలనలో అన్నదాతలు బాధపడితే చూస్తూ ఊరుకోం అని వారికి అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ అధ్యక్షులు డైరెక్టర్లు మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు తో పాటు జిల్లా చిన్న లింగాపురం రైతులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు….

తంగళ్ళపల్లి నీటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావానపల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాన్య వార్ కాన్సిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వై తాళికుడు కాన్సిరాం భారత దేశ రాజకీయాల్లో బహుజన రాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేశారని బీసీలకు మండల కమిషన్ అమలు చేయుటకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద దీక్ష ఫలితమే ఈనాటి బీసీల రిజర్వేషన్ ఆయన ఆశయం అని మాకు బహుజన రాజ్యాంగ వ్యవస్థాపనకు ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అహర్నశలు పోరాడుతుందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మల్యాల లక్ష్మణ్ చదల రాజేష్ మునిగే శంకర్ సగు పట్ల నరేష్ అక్కెనపల్లి కృష్ణ భగవాన్ ఎడ్ల రవి కొల్లాపురం సురేష్ మల్లారపు నరేష్ ఎడ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు

కృత్రిమ మేధస్సు పై ప్రత్యేక తరగతులు.!

కృత్రిమ మేధస్సు పై ప్రత్యేక తరగతులు

భవిష్యత్తు కృత్రిమ మేధస్సు పై ఆధారపడి ఉంటుంది…. ఎం ఈ ఓ

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కృత్రిమ మేధస్సు( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఏ ఐ పైలెట్ ప్రాజెక్టు కింద కే సముద్రం మండలంలోని ఇంటికన్నె ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. కృత్రిమ మేధస్సుపై పాఠాలు బోధించే ల్యాబ్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ 3 వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులు పాఠ్య- సహా పాఠ్య అంశాలతో పాటు కృత్రిమ మేధస్సు పై పరిజ్ఞానం ఉండుటకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ సూచించారు. రానున్న కాలంలో భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సు పై ఆధారపడి ఉంటుందని అన్నారు. రోబోలు వార్తలు చదవడం ఇంటి పనులు చక్కదిద్దడం లాంటి కీలకమైన పనులన్నీ కూడా మనుషులతో సంబంధం లేకుండా యంత్రాలతోటే నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎడ్ల సంపత్ రెడ్డి, ఇంటికన్నె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి, శారదాబాయి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి, హోమ్ జి, ఇంటికన్నె గ్రామ కార్యదర్శి సరితా రెడ్డి, మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే యువజనులు పాల్గొన్నారు.

ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు.

ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని ఇందారం 1ఎ గని లో ఏఐటియుసి కార్మిక నేతలు సందర్శించారు.శనివారం గనిలోని అన్ని విభాగాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలను పరిష్కరించాలని గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు.వారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కంది కట్ల వీరభద్రయ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో రక్షణ పరికరాలు,పనిముట్లు అందుబాటులో ఉంచాలని,వేసవికాలం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని,ఓసి లోని పలు సమస్యలు పరిష్కరించాలని వివిధ అంశాలపై మేనేజర్ తో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాబా సైదా,సహాయ కార్యదర్శి మోత్కూర్ కొమరయ్య,ఫిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు.!

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్

హన్మకొండ, నేటిధాత్రి:

సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు
నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు…
కాకతీయ యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదు తెలంగాణ ముందంజ.

సభ్యత్వ నమోదు తెలంగాణ ముందంజ

రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ సుగుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో పార్టీ ఆఫీస్ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు శనివారం రోజున సమావేశం నిర్వహించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి సుగుణ , గోవిందమ్మ, సుమలత హాజరయ్యారన్నారు. గత సెప్టెంబర్ 15 నుండి మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు నుండి సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. సభ్యత్వం నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మహిళ కాంగ్రెస్ లో జిల్లా విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరు సభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. అనంతరం ఇంచార్జి సుగుణ గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెయ్యడానికి సెప్టెంబర్ 15 న మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మహిళా నాయకురాలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం నమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం రాష్ట్రం లో ముందు నిలిపేలా ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేయని మహిళా కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలలో అవకాశం వస్తే ప్రతి మహిళా పోరాడాలని, విజయం సాధించాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ గారికి సహకరిస్తు, సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అర్థం అయ్యేలా వివరించాలని కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల టౌన్ ఏఎంసీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప , కాంగ్రెస్ యూనియన్ నాయకురాలు మడుపు శ్రీదేవి, బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరా బేగం, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా జనరల్ సెక్రెటరీ కోడం అరుణ, సుధా రోజా ,లత ,హారిక రెడ్డి, వనిత, సానియా, లత, అన్ని మండలాల అధ్యక్షురాలు, గ్రామ శాఖ అధ్యక్షురాలు టౌన్ అధ్యక్షురాలు వార్డు అధ్యక్షురాలు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగినది.

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు.

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నెక్కొండ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి అశోక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి బర్త్డే కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ అశోక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి సుబ్బారెడ్డి, కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, రామారావు శిరీష -రాము, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ నాయక్, ఆవుల శ్రీనివాస్, మహమ్మద్ షబ్బీర్, దూదిమెట్ల రాజు, పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version