వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

నర్సంపేట నేటిధాత్రి:

గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ అధికారి సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం వడ్డెర కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ బారుల వసతి గృహంలో చదువుతున్న గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొన్నది పేర్కొన్నారు.గిరిజన విద్యార్థులకు అనుగుణంగా అధికారులు స్పందించి గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమం పాఠశాలగా అప్ గ్రేడ్ చేసి మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాములు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు.

దత్త గిరి ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాడు దత్తగిరి మహారాజ్ 46వ అమర స్థితి పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ సలహాదైనా కేశవరావు ఆలయానికి రాగానే ఆలయ పూజారులు ఆలయ పీఠాధిపతి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం కేశవరావు యజ్ఞ పూర్ణహౌతులో పాల్గొని పూర్ణాహుతి చేశారు. ఆలయ పీఠాధిపతి ఒక్క వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ సిద్దేశ్వర స్వామీజీలు ఆయనను సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దత్తమేర మహారాజ్ ఆశ్రమ అధ్యక్షులు అల్లాడి వీరేశం గుప్తా విశ్వ మానవ ధర్మ ప్రచార అధ్యక్షులు శేరి నర్సింగ్ రావు రాజు పటేల్ జిల్లా శివశక్తి అధ్యక్షుడు శ్యామ్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణోత్సవ మంగళ ఆహ్వానము

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో భగవాన్ శ్రీ సత్య నంద మహర్షి ఆశ్రమ వేడుకలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం
ఈ కార్యక్రమం మూడు రోజులు ఫిబ్రవరి 7 8 9 రోజులలో నిర్వహించబడును ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం స్వామీజీల ప్రవచనాలు ఆలగే నిత్య అన్నదానం తీర్థ ప్రసాద వితరణ ప్రతిరోజు సాయంత్రం భగవత్ సంకీర్తన అలాగే రామాయణ ఇతిహాసాల మీద ప్రవచన కార్యక్రమం ఉండును
కావున కథలాపూర్ మండల ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా సత్యానంద మహర్షి బృందంవారు ఈ సందర్భంగా తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version