దత్త గిరి ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు…
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాడు దత్తగిరి మహారాజ్ 46వ అమర స్థితి పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ సలహాదైనా కేశవరావు ఆలయానికి రాగానే ఆలయ పూజారులు ఆలయ పీఠాధిపతి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం కేశవరావు యజ్ఞ పూర్ణహౌతులో పాల్గొని పూర్ణాహుతి చేశారు. ఆలయ పీఠాధిపతి ఒక్క వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ సిద్దేశ్వర స్వామీజీలు ఆయనను సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దత్తమేర మహారాజ్ ఆశ్రమ అధ్యక్షులు అల్లాడి వీరేశం గుప్తా విశ్వ మానవ ధర్మ ప్రచార అధ్యక్షులు శేరి నర్సింగ్ రావు రాజు పటేల్ జిల్లా శివశక్తి అధ్యక్షుడు శ్యామ్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.