దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి…

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి.!

 

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. కానీ, అవసరానికి మించి నీరు తాగడం కూడా శరీరానికి మంచిది కాదని మీకు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం, ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో, శరీరంలోని ప్రతి కణం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిర్జలీకరణం మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. కాబట్టి, దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే, అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం శరీరానికి హానికరం. కొన్నిసార్లు శరీరంలో నీటి శాతం తగ్గకూడదని మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతాము. ఈ అలవాటు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? దాహం లేకపోయినా నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దాహం వేయకపోయినా నీళ్లు తాగవచ్చా?

దాహం లేకపోయినా నీరు తాగడం వల్ల శరీరానికి హాని ఉండదు, పైగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే, అతిగా నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందికి తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.దాహం శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని సూచించిస్తుంది, ఈ సంకేతం కనిపించే ముందు నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. వేడి వాతావరణంలో లేదా ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ నీరు తాగడం మంచిది. శరీరం హైడ్రేట్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి, మీ మూత్రం రంగును చూడండి. అది లేత రంగులో ఉంటే, మీరు బాగా హైడ్రేట్ అయ్యారని అర్థం.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?

రోజుకు ఎంత నీరు తాగాలి అనేది వ్యక్తుల లింగం, వయస్సు, బరువు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీకు ఎక్కువగా చెమట పడుతుంటే, దీని కంటే కొంచెం ఎక్కువ నీరు తాగడం మీకు మంచిది.

బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి..

బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: నవమాసాలు మోసి, ప్రేమగా
పెంచుకున్న బిడ్డ మరణాన్ని తట్టుకోలేక, “బిడ్డా నువ్వు లేని ఈ జీవితాన్ని నేను భరించలేను జీవించలేను..” అంటూ విలపిస్తూ తీవ్ర మనోవేదనకు గురైన తల్లి, చివరికి ఆ వేదనను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్లోయ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బోయిని వెంకట్-లావణ్యలకు వైష్ణవి (6) అనే ఒకే పాప ఉంది. అయితే ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుండగా మొదట జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు నిమోనియా నిర్ధారించారు. ఇక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు మృతిని భరించలేక తల్లి లావణ్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చివరకు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఒకేరోజు తల్లి-బిడ్డ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వర్ణించలేని రీతిలో విలపిస్తున్నారు. కాగా గత రాత్రి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఝరాసంగం ఎస్సె క్రాంతి కుమార్ తెలిపారు.

మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య.

— మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

ఆర్థిక భారం తో మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘన నిజాంపేట మండలం చల్మెడ లో చోటుచేసుకుంది. పోలీస్ ల వివరాలు.. గ్రామానికి చెందిన కంపే పరుశురాములు (34) అను వ్యక్తి ట్రాక్టర్ కొని దానికి కిస్తీలు బాకీ పడి మనస్తాపంతో ఇంట్లోనే దులానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట ఇంచార్జ్ ఎస్సై సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్ లో చదివించాలని భార్య పట్టుబట్టింది. భర్త రవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ లో ఉంటూ చదివించుకుంటున్నది. రవి వరంగల్ కు వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ మన స్థాపానికి గురిచెందాడు.ఈ నెల 4 న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన గ్రామస్తుల కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందగా తల్లి కొమరమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version