చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్
తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పెద్దింటి ప్రభాకర్(64)అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వారు సేకరించిన వివరణ ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడానికి అలవాటు పడడంతో కుటుంబ సభ్యులు అతన్ని మందలించారని తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి భార్య రాజేశ్వర్ తో పాటు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
