పిప్పడ్ పల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పిప్పడుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం శంషుద్దీనపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించిన రాజు (36) ఇతర స్వాములతో కలిసి ఓ ఫామ్ హౌస్లో అయ్యప్ప సన్నిదానం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోమవారం తెల్లవారుజుమున నిద్రలేచి, కాలకృత్యాలకి వెళ్లి చాలా సేపటి వరకు రాకపోవడంతో తాము వెళ్లి చూసేసరికి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తోటి స్వాములు చెప్పారు.
మాలో ఒక్కడిగా అందరితో కలుపుగోలుగా ఉండే రాజు మరణాన్ని నమ్మలేకపోతున్నామని వారంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే మృతిడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం విచారణ చెపట్టారు. రాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజు మరణవార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. మృతుడికి భార్య శ్వేత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
