నేతాజీ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ మరియు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బోనాల రోజా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులను ఉత్సాహపరిచారు.

 

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం లో రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా సంప్రదాయ విలువలను చాటే అందమైన ముగ్గులు వేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రశంసించారు.

ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికి తీస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

బోనాల రోజా మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయకరమైన పండుగలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. ముగ్గులతో తమ యొక్క కలలను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి తమ జీవితాలలో ఉన్నతంగా స్థిరపడాలని ఆశిస్తున్నాను అన్నారు. అదేవిధంగా ఉమన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేతాజీ డిగ్రీ కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు, కరస్పాండెంట్ నాయిని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్, అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణధానంతో సమానం…

రక్తదానం ప్రాణధానంతో సమానం

– అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసి, రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్చందంగా యువత ,ప్రజలు,ఆటో డ్రైవర్లు,పోలీస్ అధికారులు, నేతాజీ డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది సుమారు 460 మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని, విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో,ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, నటేష్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు, డాక్టర్ సంధ్యారాణి,కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్లరవి,పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు ,కరీంనగర్,సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని, టైపింగ్ లో మంచి నైపుణ్యం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా 25 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని తెలిపారు. విద్యార్థులను టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందనీ తెలిపారు. జీతం నెలకు 20000 నుండి 25000 వరకు ఇవ్వబడుననీ తెలిపారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు తేదీ: 06/06/2025 అనగా శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు హజారు కాగలరు. వచ్చేటప్పుడు 2 బయోడేటా ఫామ్ లు తీసుకొని నేతాజీ డిగ్రీ కళాశాల, ఆటోనగర్ సిరిసిల్ల లో సంప్రందించగలరని కళాశాల యాజమాన్యం తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version