*రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం*
*సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)*
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు గాంధీనగర్ హనుమాన్ మందిర్లో డాక్టర్ జనపాల శంకరయ్య, అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య స్వాగత ఉపన్యాసంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత వినే ఉంటారు. కాబట్టి పెండతో చాన్పు వేయడం, పసుపుతో కడప పూజించడం ఆరోగ్యానికి సంరక్షణకు మూలం ఎందుకంటే పసుపు పెండ రోగ నిరోధక శక్తికి సంబంధించింది. ఆ నాటి హరిదాసులు గంగిరెద్దులు కనుమరుగవుతున్నాయి. వాటిని మీ కవితల్లో ఒకసారి గుర్తు చేయాలని, కవిత్వంలో సంప్రదాయం కనిపించాలని సెలవిచ్చారు, సమాజ హితమే మా కవిత్వ పట్టమని ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సంక్రాంత్రి ఆనాటి సంబంధము కనుమరుగవుతున్న వేళ వైజ్ఞానిక పరమైన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కవులందరికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక కవిత్వంలో మన ప్రాంతపు మేటి సినారే లాగా అత్యధిక శక్తివంతమైన పదజాలాన్ని వాడుతూ కవిత్వాన్ని రాయడానికి ప్రయత్నించాలని మన ప్రాంత ప్రతిభను చాటాలన్నారు. వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరిషరాములు కవితా గానం చేశారు. ఈ మధ్యనే వీరికి వివేకానంద స్ఫూర్తి అవార్డు అందుకున్న నేపథ్యంలో వాసర వేణి పరిషరాములను ఘనంగా సత్కరించారు. పల్లెటూరి అమ్మాయి గురించి పాట పాడారు. కోడం నారాయణ సహాధ్యక్షులు కవితా గానం చేశారు. పండగ విశేషాలు నాటి అనుభూతుల్ని నేటి అజాగ్రత్త ను ఎత్తి చూపించారు. ఏనుగుల ఎల్లయ్య ఆత్మీయ అతిథులుగా పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అంటూనే సమాజ హితం కోసం మీ కవితలు ముందుకు రావాలన్నారు. మరొక ఆత్మీయ అతిథి గడ్డం పరశురామ శాస్త్రి చక్కని తన గలంతో కవిత ను ఆలాపించారు. గుండెల్ని వంశీకృష్ణ తన కవిత ఆలాపించారు. ఇలాగే కవులందరూ తమ కవిత్వాన్ని వినిపించారు.
