కరీంనగర్లో బిజెపి నాయకులు కాంగ్రెస్ చేరిక; విజయంపై రాజేందర్ రావు ఆశాభావం

కాంగ్రెస్ లోకి బిజెపి నాయకుల చేరిక

కరీంనగర్లో కాంగ్రెస్ ఇక తిరుగులేదు

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే విజయం-వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఇకపై కరీంనగర్లో బిజెపి బీఆర్ఎస్ ఆటలు సాగవనీ, ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్లో బుధవారం 39 వ డివిజన్ కు చెందిన బిజెపి నాయకులు తంగెళ్ల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో పలువురు బిజెపి నాయకులు రాజేందర్ రావ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజేందర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్లో కాంగ్రెస్ కు ఇక తిరుగు లేదని ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని తెలిపారు. ప్రస్తుతం బిజెపి బీఆర్ఎస్ పార్టీని కరీంనగర్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు. బిజెపి నేతలు వి.ప్రసాద్, ఎం.ప్రవీణ్, గణేష్, ఎస్. అనిల్, ఎస్.అశోక్, ఎస్.మార్కండేయులు, సంపత్, క్రాంతి, సిలగాని రవి, వడ్నాల రాజమౌళి, ఎస్.ప్రవీణ్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్, తదితరులు ఉన్నారు.

వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు బుధవారం ఏకాదశి పురస్కరించుకొని కరీంనగర్ మార్కెట్ రోడ్ లో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రాజేందర్ రావు పేరిట అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version