భారత సంస్కృతికి సంక్రాంతి ప్రతీక: చిత్తూరు ఎంపీ

*సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భారత దేశం…

*ప్రకృతిని ఆరాధించే పండుగే సంక్రాంతి…

*ఆచార వ్యవహారాలను ఆరాధించే గొప్ప సియం చంద్రబాబు నాయుడు…

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…

*తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

చిత్తూరు (నేటిధాత్రి:

 

 

సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం ప్రతీక అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనమన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకుంటూ.. “సంక్రాంతి” పండుగ వైశిష్ట్యాన్ని భావితరాలకు తెలియజేస్తున్న
స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఏ.పి. సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు,
తెలుగు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ మూడు రోజుల సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సంక్రాంతి అందరిలోనూ నూతన వెలుగులు తీసుకొస్తుందనీ ఆయన కాంక్షించారు.
మానవునిలో నూతన ఉత్తేజాన్ని నింపేవి పండుగలన్నారు.ఆధ్యాత్మికంగాను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని ఈ పండులు ప్రతిబింబిస్తాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.

విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..

విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..

 

ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్‌లో సంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

మారిషస్‌లో తెలుగు సాహిత్యం, భాషను ప్రోత్సహించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ (Mauritius President Dharam Bir Gokul) వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారిషస్ వచ్చినపుడు దేశంలో విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తోన్న సీఎం చంద్రబాబుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు ధరమ్ బీర్ గోకుల్.

తెలుగుపై ప్రభావం..

ఇంగ్లీష్ భాష ఎక్కువగా వినియోగించడంతో తెలుగు వంటి ప్రాచీన భాషపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో సగానికి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పూర్వికుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధిగా తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మక, విశిష్టమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు జిల్లాలో జరపడం అభినందనీయమని తెలిపారు. ఈ మహాసభల్లో తనకు ప్రసంగించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా కొనసాగుతోన్నాయి. ఇవాళ(ఆదివారం) ఈ సభలో పాల్గొని ప్రసంగించారు ధరమ్ బీర్ గోకుల్.

దప్పళం’ భోజనానంద రాగం.. ఆ ఆరు రుచులూ ఉన్న వంటకాన్ని..

దప్పళం’ భోజనానంద రాగం.. ఆ ఆరు రుచులూ ఉన్న వంటకాన్ని..

 

ఒక ద్రవ్యంలోని విటమిన్లు మినరల్స్‌, ఇతర రసాయనాలే దానికి వగరూ, తీపీ లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుకుర్బి టాసిన్‌ గ్లైకోసైడ్స్‌ చేదు రుచిని ఇచ్చి, స్థూల కాయాన్ని, షుగర్ని తగ్గించి పోషణనిస్తుంది. కాకరకాయ బిట్టర్‌ టానిక్‌ అందుకే! పసుపులో ఉండే కర్కుమిన్‌ దానికి వగరు రుచినిస్తోంది.

తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ ఉన్న వంటకాన్ని షడ్రసో పేతమైనదిగా భావిస్తాం. ఆరోగ్యంగా జీవించటానికి ఆహారపదార్థాలు ఈ ఆరు రుచులతో కూడుకున్నవిగా ఉండాలనేదే ఆయుర్వేద సూత్రం!ఒక ద్రవ్యంలోని విటమిన్లు మినరల్స్‌, ఇతర రసాయనాలే దానికి వగరూ, తీపీ లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుకుర్బి టాసిన్‌ గ్లైకోసైడ్స్‌ చేదు రుచిని ఇచ్చి, స్థూల కాయాన్ని, షుగర్ని తగ్గించి పోషణనిస్తుంది. కాకరకాయ బిట్టర్‌ టానిక్‌ అందుకే! పసుపులో ఉండే కర్కుమిన్‌ దానికి వగరు రుచినిస్తోంది. వగరు వలన కలిగే ఉపయోగాలన్నీ పసుపుకి ఉన్నాయి. ఇలా ఆరు రుచులకు సంబంధించిన ద్రవ్యాల్ని కలిపి షడ్రసోపేతమైన వంటకాలకు మనం ప్రాధాన్యతనిస్తే అది సమతుల్య ఆహారమవుతుంది. దప్పళంలో మనకు ఆరురుచులూ కలిసి ఉంటాయి. అందుకే అది గొప్ప పోషకం, ఎక్కువ కాయ గూరలు కలిసిన పప్పు పులుసు దప్పళం! ఆరు రుచుల్లాగానే నవరసాలూ కలిసి ఉంటాయి కాబట్టి, జీవితమే ఓ దప్పళం! తెలుగువాళ్లకి దప్పళం శుభప్రదమైంది. పండగలకీ, పబ్బాలకీ పులుసూ, చారూ ఉన్నా సరే, ‘దప్పళం’ అదనంగా కావాలి! దప్పళం పాడు ఊరు పేరు, దప్పళం ఇంటిపేరు కూడా ఉన్నాయి.
ద్రావిడభాషా పదం ‘దప్ప’ తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో ‘దట్టమైన’, ‘చిక్కనైన’ అనే అర్థాల్లో ఉంది. నిండా కాయగూర ముక్కలు పోసి దట్టంగా వండుతారు కాబట్టి, అది దప్పళం అయ్యింది. ఇది అత్యంత ప్రాచీన ద్రావిడ వంటకం! అది సంస్కృతపదం అనుకుని ‘ధప్పళం’ అని వత్తి పలుకుతారు కొందరుఒక్క తెలుగువాళ్లే అచ్చతెలుగులో దీన్ని దప్పళం అంటున్నారు. కన్నడిగులు, తమిళులు ‘కదంబం’ అంటారు. కదంబం లేదా కదంబకం అంటే సంస్కృతంలో మిశ్రమం అని! మిక్సెడ్‌ వెజిటబుల్‌ సూప్‌ అని వాళ్లంటే ‘థిక్‌ సూప్‌’- దప్పళం అని తెలుగులో అంటున్నాంచింతకాయ బొంతకాయ చిగురు భూమిడ కాయ/ కొల్లేటివంకాయ కొమ్మనిమ్మా పండు/ ఈరుగురు గుంటలో బాలుగులు మెయ్యగా/ ఒకటే కాయగా ఒంటి పువురాలగా/ తాటాకు దప్పళం, కోట వెలుగో!’’ అనే జానపద గీతంలో వామన చింత కాయలు, (కూర అరటి కాయ, లేత నేలములక కాయ, కొల్లేటి వంకాయ, కొమ్మనిమ్మపండు ఇవన్నీ కలిసి కాచిన దప్పళం ఆకాశంలో వెన్నెల్లా ఉందట. ఒకటే కాయతో వండితే ఒంటిపువ్వు రాలినట్టు అది తాటాకు దప్పళం అవుతుందట. మరి కోటకి (శరీరానికి) వెలుగు మాటేమిటీ? అని అడుగుతోంది ఈ జానపద గీతంపపప్ప పసన ధప్పళం అన్నం నెయ్యి – వేడి వేడి అన్నంమీద కమ్మని పప్పు, కాచిన నెయ్యా పప్పు దప్పళం- కలిసి కొట్టడం’’అంటూ ఆరుద్ర ఓ సినిమాకి రాశాడు. ‘కన్యాశుల్కం’లో గిరీశం వెంకటేశానికి రెలిజియన్‌ రిఫార్మ్స్‌ గురించి లెక్చరిస్తూ, ‘‘తెల్లవాడు యేవని ధ్యానం చేస్తాడోయి రోజూనూ? ‘‘ఫాదర్‌గివ్‌అస్‌ అవర్‌ డెయిలీ, బ్రెడ్‌’’ అనగా ‘‘నన్ను కన్న తండ్రీ! రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని! ఇక, మనవేవనాలి? ‘‘తండ్రీ! రోజూ కంది పప్పు, దప్పళం ఇయ్యవయ్యా’’ అనిధ్యానించాలి. మన చమకంలో యేవన్నాడూ?శ్యామాకాశ్చమే.. చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుడా!’’ అన్నాడు. ఆ చమకంలో యవడికి యిష్టవైన వస్తువులు వాడు కలపవచ్చును ‘‘కంది గుండాచమే, యింగువ నూనాచమే’’ దీనినే రెలిజియన్‌ రిఫార్ము అంటారంటాడు గిరీశం! పప్పు, దప్పళం ధర్మపిండం దొరికితే చాలు ఎలాగైనా బతికేయొచ్చని అనుకునే గిరీశాలున్నారు.ఒక్కదప్పళం చాలు వంద వంటకాల పెట్టు కదా! కూర, పప్పు, పచ్చడి, దప్పళం, పెరుగు ఇంతమాత్రం ఉంటే దాన్ని ‘ఎగ్జిక్యూటివ్‌ లంచ్‌’ అంటారు. రోజువారీ భోజనం అని! దప్పళంలో పప్పు, కూరగాయలతో పాటు వేపపూలు, కరి వేపాకులు, కాకరముక్కలు కూడా ఉంటాయి. చాలినంత డయటరీ ఫైబర్‌, ప్రొటీన్లతో పాటు వగరూ చేదుతో కూడిన ఆరు రుచులూ ఉండటంతో ఆరోగ్యకరం అవుతుందిభోజనం చేయటాన్ని శ్రీనాథుడు ‘భుజిక్రియ’ అన్నాడు. అలాగని భోజనం కేవలం తినే పనే కాదు, అది మన జీవనరాగం! దప్పళం దానికి తోడైన ‘ఆది’తాళం!

అవార్డు అందుకోబోతున్న డాక్టర్ ప్రవీణ్..

*అవార్డు అందుకోబోతున్న డాక్టర్ ప్రవీణ్..

*అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 25 వ వార్షికోత్సవ మహోత్సవం..

తిరుపతి(నేటిధాత్రి)

 

అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 25 వ వార్షికోత్సవ మహోత్సవం లో
సకలకళా వల్లభ అవార్డును డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ అందుకోబోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.విజయవాడ నగరంలోని గాంధీనగర్ నందు గల శ్రీ వెలిదండ్ల హనుమంతురాయ గ్రంథాలయం నందు ఈనెల 18 వ తేదీన మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అవార్డు అందుకోబోతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని స్థానిక వాస్తవ్యులు ఎలమంచిలి ప్రవీణ్ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నా, 17 సంవత్సరాలకే తండ్రిని కోల్పోయినా సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరియర్ ప్రారంభించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ తనకు వచ్చే ఆదాయంలోనే కొంత భాగం సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తూ ప్రతి రంగంలోనూ తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నారు. ఎవరన్నా ఒక రంగంలో నిష్ణాతులై వారి ముద్రని వేసుకుంటారు కానీ ఎలమంచిలి ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారుపట్టుదలతో మరియు ఆకంటిత దీక్షతో గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాలలో దాదాపు1000 సామాజిక కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా దాదాపు 500 కార్యక్రమాలకు పైగా అతిథులుగా విచ్చేసి ఎన్నో, మరెన్నో అవార్డులు ప్రభుత్వ పురస్కారాలతో పాటు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 (అర్థ సెంచరీ)పురస్కారాలను అందుకొని
1.విద్య రంగం, 2.క్రీడారంగం, 3.సినిమా రంగం,4.కళా రంగం,5.సాంస్కృతిక రంగం,6.సాంఘిక రంగం, 7.సేవా రంగం, 8.వైద్య రంగం , 9.వ్యవసాయ రంగం,
10.ఆధ్యాత్మిక రంగం,11.వ్యాపార రంగం
వంటి తదితర రంగాలలో విశిష్ట సేవలు పురస్కరించుకొని సకల కళా వల్లభ అవార్డును అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వారు బహూకరించ నున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయమూర్తి దేవు. నరసింహారావు చేతులు మీదుగా ఈ పురస్కారాన్ని ఎలమంచిలి ప్రవీణ్ అందుకోనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version