ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T161425.322.wav?_=1

 

వెంకట్రావు పెళ్లి & ల్యాబర్తి గ్రామాలలో ఇందిరమ్మ చీరలను పంపిణీచేసిన…ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య

ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు సైతం కొలువుదీరుతారంట.

కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం

అన్ని శక్తులలో బలియామైన శక్తి మహిళా శక్తి
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలనే ఉద్దేశముతో సీఎం.రేవంత్ రెడ్డి గారీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆదేశాల మేరకు ఈ రోజు వర్ధన్నపేట మండలంలోని, వెంకట్రావు పెళ్లి & ల్యాబర్తి,గ్రామలలో వర్ధన్నపేట ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం & జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ మాట్లాడుతూ…
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు.
మహిళా ఉన్నతే-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో రాష్ట్రంలోని మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఇంతకుముందు ప్రభుత్వములో మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఎలా ఉందో మార్పును గమనించాలని కోరారు. గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.

మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వారు తీసుకున్న రుణాన్ని తిరిగి వసూలు చేసే వారని, కానీ ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో మహిళ ప్రమాద వశాత్తూ చనిపోతే తీసుకున్న రుణము మాఫీ చేయడంతో పాటుగా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
పావలా వడ్డీ రుణాలు,మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులను చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పన ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పెట్రోల్ పంపులు, వడ్డీ లేని రుణాలు, అద్దె ఆర్టీసీ బస్సుల నిర్వహన, మహిళా శక్తి క్యాంటీన్ లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు తెల్ల రేషన్ కార్డులు , సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మహిళలకే ఇస్తున్నట్లు చెప్పారు.
18 సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం,మండల సమైక్య అధ్యక్షురాలు తక్కలపెల్లి ప్రమీల దేవి,గ్రామ మహిళా అధ్యక్షురాలు బొల్లం మణెమ్మ,చిదుముల్ల భాస్కర్ ,ఎండి వలి పాషా,సంకినేని దేవేందర్ రావు, మడత ప్రశాంత్ గౌడ్,మాజీ టెంపుల్ డైరెక్టర్ బండ సరిత,ఎర్రం లక్ష్మీనారాయణ,అడ్డగట్ట రాములు,ఎస్సీ సెల్ గ్రామాషాక సంకినేని గంగరాజు,గొట్టం భాగ్యమ్మ, మడి ద బిక్షపతి, అడ్డగట్ట సోమన్న,రావుల రవి,మిట్టపల్లి రమేష్,రావుల గంగయ్య,జడ రాజు,బొల్లం కుమార్,గొలుసుల మహేందర్,ఆకులపెల్లి డీలర్ వెంకటయ్య, ఆకుల పెళ్లి చేరాలు,కొయ్యేటి కుమార్,మాజీ ఎంపీటీసీ సూరారపు నిరంజన్, కాకర్ల ఎల్లయ్య,ఏనుగుల సోమయ్య,ఖమ్మంపాటి సంపత్,చిదుముల్ల నాగరాజు, బత్తినీ సంతోష్,సంకినేని జీవన్,రాయపురం శ్రీకాంత్,పత్తి పవన్,ఆకులపెల్లి శ్రీకాంత్,ముండ్లపెల్లి బన్నీ,చిదుముల్ల రాహుల్, మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్..

 పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

 

బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో పలువురు బూత్ లెవల్ అధికారుల (BLOs) మరణాలకు బీజేపీని కాంగ్రెస్ తప్పుపట్టింది. పని ఒత్తిళ్ల కారణంగా బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. హడావిడిగా ఎస్ఐఆర్ అమలు చేయాలనుకోవడం గతంలో పెద్దనోట్ల రద్దు, కోవిడ్ 19 లాక్‌డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తోందని విమర్శించింది.
బీజేపీ ‘ఓట్ చోరీ’ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. తీవ్రమైన పని ఒత్తిళ్లతోనే బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

‘ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. క్షేత్ర స్థాయిలో అందుతున్న సమాచారం బట్టి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది చాలా బాధాకరం. ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు?’ అని ఖర్గే ప్రశ్నించారు. అధికారాన్ని తస్కరించిన ఆనందంలో బీజేపీ ఉంటే, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా చూస్తోందని ఆయన ఆరోపించారు. హడావిడిగా, ఏమాత్రం ప్రణాళిక లేకుండా బలవంతంగా ఎస్ఐఆర్ అమలు చేస్తుండటం పెద్ద నోట్ల రద్దు, కోవిడ్-19 లాక్‌డౌన్ నాటి పరిస్థితిని తలపిస్తోందని విమర్శించారు. ‘జరిగిందేదో జరిగింది. ఇక చాలు. ఇప్పటికైనా మనం మేలుకోని ప్రజాస్వామ్య మూలస్తంభాలను కాపాడుకోకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. అమాయక బీఎల్‌ఓల మరణాలకు ఎస్ఐఆర్‌, ఓట్ చోరీపై మౌనం వహిస్తున్న వారే బాధ్యులు. మీ గళం వినిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ఖర్గే కోరారు.

పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో బీఎల్ఓగా పనిచేస్తున్న ఒక మహిళ శనివారంనాడు తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. ఎస్ఐఆర్‌ పని ఒత్తిళ్ల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని అన్నారు. బీఎల్ఓ సూసైడ్ నోట్‌ను కూడా ముఖ్యమంత్రి షేర్ చేశారు. అయితే ఈ సూసైడ్ నోట్ అబద్ధమని బీజేపీ నేత రాహుల్ సిన్హా కొట్టివేశారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని రైసేన్, దమోహ్ జిల్లాల్లోనూ బీఎల్ఏ పనుల్లో ఉన్న ఇద్దరు టీచర్లు అస్వస్థత కారణంగా గత శుక్రవారం మరణించడం మరింత ఆందోళనకరంగా మారింది.

జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ…

జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ లక్ష్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోమహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని భూపాలప ల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. మం డల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీకార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు హాజరై ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహి ళల అభ్యున్నతికి సీఎం రేవం త్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎన లేని ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదా లు, లోటుపాట్లకు తావులే కుండా ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆడబిడ్డలకు చీర,సారె పెట్టడం

 

 

 

మనసంప్రదాయమని అన్నా రు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు వారిని యజమానులను చేశామని అన్నారు. స్కూల్స్ యూనిఫాం లు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిం చామని అన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌ తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ అభ్యున్నతిలో మహి ళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని ఎమ్మె ల్యే హితువు పలికారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్య క్రమం అనంతరం మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారు లకు రూ.5,23,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వలిమా వేడుకల పాల్గొన్న మాజీ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T160813.730.wav?_=2

 

 

వలిమా వేడుకల పాల్గొన్న మాజీ చైర్మన్

◆:- తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో జమిల్ ఖురేషి గారి అన్న కుమారుని వలిమ వేడుక లో పాల్గొని నూతన వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితో పాటు మాజీ కౌన్సిలర్లు జాంగిర్ మోతిరం రాములు నేత యూనుస్ రంగ అరుణ్ కుమార్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి బాసిత్ అక్రమ్ సందీప్ బాల్ రెడ్డి నవీద్ తదితరులు పాల్గొన్నారు,

వీరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T160026.861.wav?_=3

 

 

వీరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం

మహబూబాద్ జిల్లా సీనియర్ నాయకులు వంటి కొమ్ము యుగేందర్ రెడ్డి.

మరిపెడ నేటిధాత్రి.

 

మరిపెడ మండలంలోని ఉమ్మడి వీరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం చే ప్రతి రైతు కుటుంబానికి మద్దతు లభిస్తోంది అని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు న్యాయమైన మద్దతు ధర (MSP) అందుతుంది. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ధైర్యంగా ముందుకు సాగాలి, రైతు కష్టానికి విలువ ఇవ్వడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం, అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి బంగారు యుగం మొదలైంది. రైతుల శ్రమ ఫలించే రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం, అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వీరారం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు,జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,డైరెక్టర్లు, వ్యవసాయ,రెవెన్యూ అధికారులు,గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డ్రామారావు అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ప్రతినిధి బర్ల సహదేవ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T134240.451.wav?_=4

 

 

డ్రామారావు అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ప్రతినిధి బర్ల సహదేవ్
*మీ 10 ఏండ్ల పాలనపై, కాంగ్రెస్ పార్టీ 2 ఏండ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్న

వర్దన్నపేట (నేటిధాత్రి ):

 

జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి, ఈ -కార్ రేస్ అవినీతి పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చేసరికి చిన్న మెదడు చితికి, మతి బ్రమించి సీఎం రేవంత్ రెడ్డి గారి పై అసత్య ఆరోపణలు చేస్తున్న డ్రామారావు అలియాస్ టిల్లు వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్న వర్దన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బర్ల సహాదేవ్ (అడ్వకేట్ )
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో బిఆర్ఎస్ కు పట్టపగలే చుక్కలు కనిపించాయి.కుంభ కోణలు చేసేది మీరు. మీ 10 ఏండ్ల పరిపాలన కాలంలో అన్ని కుంబకోణలే అందువల్లే మీ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడగొట్టారు.
హిల్టప్ (హైదరాబాద్ పారిశ్రమిక భూముల బదిలీ విధానం) పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.
పెట్టుబడులు తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచలనే తమ ఉద్దేశలను వక్రీకరిస్తూ KTR పచ్చి అబద్దాలు చెప్పడం సరికాదు.తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈ-కార్ రేస్ అవినీతి పై గవర్నర్ గారు విచారణకు అనుమతి ఇచ్చేసరికి ప్రజల దృష్టిని మల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజా క్షేత్రంలోకి రా చూసుకుందాం అంతే తప్ప ఇలాంటి అబద్ధ ఆరోపణలు చేయడం మానుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మిమ్మల్ని మీ పార్టీని చీత్తు చిత్తు గా ఓడగొట్టి మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది.

నిరుపేద కుటుంబం నుండి ప్రభుత్వ ఉద్యోగం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T124642.824.wav?_=5

 

 

నిరుపేద కుటుంబం నుండి ప్రభుత్వ ఉద్యోగం

◆:- ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ గా వసంత్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండల బిలాల్పూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం చేసుకునే, కొండాపూర్ మండల్ సైదాపూర్ తాండ గ్రామానికి చెందిన సీట్యా ధర్మీబాయి, దంపతుల కుమారుడు వసంత్ రావు ప్రభుత్వ ఉద్యోగం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం సాధించడు.తన అమ్మ నాన్నల కష్టం చూసి బాగా చదివి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నట్లు శిరీష పేర్కొన్నారు. తండ్రి ల్యాబ్ అసిస్టెంట్ ఓడిఎఫ్ లో పని చేస్తూ తల్లి తెల్లవారుజామున ఆరోగ్యం బాగా లేకపోయినా కష్టపడి చదివించాలని వారి కష్టాన్ని వృధా చెయ్యకూడదని పట్టుదలతో చదివి ఉద్యోగాలకు ఎంపీక అయ్యానని, మొదట ల్యాబ్ టెక్నీషియన్ గా సాధించగా, ఉద్యోగాలు సాధించడం పట్ల సీట్యా ధర్మీబాయి భార్య కవిత, తమ్ముడు వినోద్, మరదల్ శాలిని తల్లి దండ్రుల తోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ల కు ఉద్యోగం సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష…

గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అలాగే ఎంపీడబ్ల్యూ వర్కర్లను వార్డుల వారిగా విభజించి చెత్త సేకరించాలని తెలిపారు.ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో విధిగా పనులను నిర్వహించాలని,ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలని,సేగ్రిగేషన్ షెడ్ లలో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేపించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఇంటి పన్ను వాసులలో ఇప్పటివరకు 29% మాత్రమే చేశారని,నవంబర్ 25వ తేదీలోపు 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లేనియెడల తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాపూరావు,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,ఆర్.శ్రావణి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ…

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం

హైదారాబాద్/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని గుర్తు చేశారు.ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు సచివాలయం నుండి సీఎం తో కలిసి వీ.సీలో భాగస్వాములవగా, వరంగల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని,నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగాలని, మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,
గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాటికి మహిళలను యజమానులను చేశామని, స్కూల్ యూనిఫారంలు కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రామిరెడ్డి , మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు, డిపిఎం, ఏపీఎం లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఉప్పరపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T134033.941.wav?_=6

 

ఉప్పరపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…,ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య&

▪️రైతును రాజుగా చూడడం-వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

▪️సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా రైతుల పక్షపాతి

▪️రైతులెవ్వరు అధైర్య పడవద్దు రైతు పండించిన ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది

▪️రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

రైతులెవ్వరు దళారుల చేతిలో మోసపోవద్దు- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

▪️రాష్ట్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరతో పాటు 500/- బోనస్ ఇస్తుంది.

వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ఏఎంసీ చైర్మన్ నరుకుడు, వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్.ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన కాంటాలు అయ్యేలా చూస్తాం.వరంగల్ జిల్లా,వర్ధన్నపేట మండలం లో ను,ఉప్పరపెల్లి గ్రామంలో పి. ఎ. సి.ఎస్ వడ్లు కేంద్రం ను,ప్రారంభించిన వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ,,ఈ కార్యక్రమములో డైరెక్టర్ మహేందర్ రావు, ఓ బి సి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దామెర ప్రశాంత్, పోతాం మధుకర్,రాచమల్ల రాంమూర్తి,సినపెల్లి ఎల్లయ్య,షాగంటి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు…

పాలనపై పట్టు..ఎన్నికలలో హిట్టు!

`జూబ్లీ గెలుపుతో ‘‘రేవంత్‌’’ గ్రాఫ్‌ ఎవరెస్టు

`‘‘సీఎం. రేవంత్‌’’ ప్రచారం జూబ్లీ విజయం

`‘‘రేవంత్‌’’ పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది

`‘‘రేవంత్‌’’ పాలనే బాగుందనుకున్నారు

-‘‘బీఆర్‌ఎస్‌’’ కన్నా మెరుగే అని విశ్వసించినట్లున్నారు

-జూబ్లీ ఎన్నికల ముందున్న ఆలోచనలన్నీ పటా పంచెలు

REVANTH REDDY VICTORY IN JUBLIEE HILLS BY-ELECTION

-ఇక ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’కి తిరుగులేదు

-పార్టీలోనూ ఎదురులేకుండా చూసుకున్నారు

-వరుస విజయాలతో దూసుకుపోతున్నారు

-సాధారణ ఎన్నికలు ఒంటి చేత్తో గెలిపించారు

-ఉప ఎన్నికలన్నీ గెలుస్తూ వస్తున్నారు

-పార్లమెంటు ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలు సాధించిపెట్టారు

-ఈ విజయాల పరంపర కొనసాగిస్తే ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి ఎదురుండదు

అంచనాలకు అందని నాయకుడు ‘‘సిఎం. రేవంత్‌ రెడ్డి’’. రాజకీయంగా స్వయం కృషితో బాటలు వేసుకొని విజయాలు సొంతం చేసుకోవడం ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి కొత్త కాదు. అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీ హిల్స్‌ CONGRESS‌ కైవసం ఒక చరిత్ర. జూబ్లీ హిల్స్‌ ఎలక్షన్‌లో వార్‌ వన్‌ సైడ్‌ చేసి అఖండ మెజారిటీతో అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ను గెలిపించారు. దటీజ్‌ ‘‘రేవంత్‌ రెడ్డి’’ అని నిరూపించారు. బిఆర్‌ఎస్‌ ఆశలను పటాపంచెలు చేసి కాంగ్రెస్‌ కు విజయాన్ని అందించారు. అటు పాలనలో దూసుకుపోతున్నారు. ఇటు పార్టీకి ఎన్నికల వరుస విజయాలు అందిస్తున్న ‘‘రేవంత్‌ రెడ్డి’’ వ్యూహాలను చేధించడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించారు. గెలుపంటే ఇదీ అని రాజకీయాలకే ఒక పాఠం నేర్పి, పార్టీకి మరింత బలాన్ని ‘‘రేవంత్‌ రెడ్డి (REVANTH REDDY) ’’ పెంచారు. అంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ‘‘రోహిన్‌ రెడ్డి’’(ROHIN REDDY), నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కాని ప్రతి ఎన్నికను గెలిపించుకోవాల్సిన అవసరం వుంటుంది. అలా ప్రతి ఎన్నికను గెలిపించుకునే నాయకులు చిరిత్ర సృష్టిస్తారు. అందులో సిఎం. రేవంత్‌ రెడ్డి వుంటారు. ఇది అతిశయోక్తి అసలే కాదు. ఎందుకంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఒంటి చేత్తో అందించిన విజయాలు రాష్ట్రంలో అనేకం వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నమ్మకం కల్గించడంలో రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో వుంది. అనేక అపజయాలు చవి చూడాల్సి వచ్చింది. అది ఏ ఒక్కరి లోపం కాదు. కాని గెలవలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. అయితే ప్రజల్లో నమ్మకం నింపే నాయకుడు పార్టీలకు కావాలి. పాలకులుగా వుండాలి. ముందు ఏ నాయకుడైనా పార్టీకి ధైర్యం కావాలి. నాయకులకు భరోసా కల్పించే స్దితిలో వుండాలి. ప్రజలకు నమ్మకం కల్గించాలి. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం నింపాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో వున్నా గెలుపు తీరాలకు చేర్చే పూర్తి భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడుగా కాంగ్రెస్‌ అధిష్టానానికి రేవంత్‌ రెడ్డి కల్పించారు. అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. పార్టీ పెద్దలకు నమ్మకం కల్పించాల్సి వుంటుంది. ఏ రకమైన సవాలునైనా స్వీకరించే స్ధితిలో నాయకుడు వుండాలి. అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తివంతుడై వుండాలి. అవన్నీ సిఎం. రేవంత్‌ రెడ్డిలో వున్నాయి. అందుకే కాంగ్రెస్‌లో చేరిన అనతి కాలంలోనే ఆయన పార్టీకి పిసిసి. అధ్యక్షుడు కాగలిగారు. పార్టీని గాడిలో పెట్టగలిగారు. ఆనాడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కుటుంబ పెద్దకు ఇంటి సమస్యలుంటాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడు కుటుంబమైనా, రాజకీయ పార్టీ అయినా దారిలో పడుతుంది. అందుకు ఆ పెద్దకు ఎంతో ఓపిక కావాలి. ఒక కుటుంబంలోనే నలుగురు నాలుగు రకాలై ఆలోచనలతో వుంటారు. రాజకీయ పార్టీలో కొన్న లక్షల మంది వుంటారు. అందర్నీ సంతృప్తి పర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే పార్టీ నిలబడుతుంది. అని బలంగా నమ్మిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరి అంచనాలకు అందని నాయకుడు. ఆయన వేసే అడుగులు ఎంత బలంగా వుంటాయో…ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతు చిక్క కుండా వుంటాయి. అందుకే తాజాగా గెలిచిన జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు పరిస్దితి ఎలా వుందో అందిరికీ తెలుసు. కాకపోతే అవన్నీ బిఆర్‌ఎస్‌ ఊహలు మాత్రమే. ప్రభుత్వం మీద ఎంతో ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు సోషల్‌మీడియా ద్వారా విసృతంగా ప్రచారం చేశారు. నిండు కుండ తొనకదు అన్నట్లు రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంత ప్రచారం చేసుకుంటుందో చేసుకోని అని చూశారు. బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని సిఎం. రేవంత్‌ రెడ్డికి తెలుసు. బిఆర్‌ఎస్‌ చేస్తున్న అబద్దపు ప్రచారంలో అర్ధం లేదు. నిజం అంతకన్నా లేదని ప్రజలకు తెలుసు. సిఎం.రేవంత్‌ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన గుంభనంగా వున్నారు. కాని బిఆర్‌ఎస్‌ ఎగిరెగిరి పడిరది. ఆఖరుకు ఏమైంది. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగారు. వార్‌ వన్‌సైడ్‌ చేశారు. అదీ నాయకుడి గొప్పదనం. బిఆర్‌ఎస్‌ అనేది ఉద్యమ కాలంలో ఒక రకమైన సెంటిమెంటు, అధికారంలో వున్నప్పుడు అబద్దాలు విసృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు జనాలకు బిఆర్‌ఎస్‌ అంటే ఏమిటో పూర్తిగా తెలిసిపోయింది. ఆ పార్టీ అంతా పైన పటారం, లోన లొటారం అనేది తెలిసింది. అందుకే జూబ్లీలో ప్రజలు మరోసారి బిఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టారు. అందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనే నిదర్శనం. కాంగ్రెస్‌ ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ కన్నా ఎంతో బాగుంది. రేవంత్‌ రెడ్డి పాలన ఎంతో మెరుగ్గా వుంది. అందుకే బిఆర్‌ఎస్‌కు వీలుకాని ఏ ఉప ఎన్నికలో వీలుకాని మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ను గెల్చుకున్నది. సిఎం. రేవంత్‌ రెడ్డి స్వయం ప్రకాశవంతమైన నాయకుడు. స్వయంకృషితో ఎదిగిన నాయకుడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు. పేద ప్రజలు కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఆశలు తెలుసు. వారి ఆలోచనలు కూడా రేవంత్‌ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రజలు కూడా మా నాయకుడు. పేదల నాయకుడు అని గుండెల్లో పెట్టుకున్నారు. సమయం వచ్చింది. జూబ్లీ ఉప పోరులో సిఎం. రేవంత్‌ రెడ్డిపై వున్న మమకారం మరోసారి చూపించారు. రేవంత్‌ రెడ్డి అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి ఒక చరిత్ర. జూబ్లీ ఉప ఎన్నికను వార్‌ వన్‌ సైడ్‌ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ అఖండ మెజార్టీతో గెవడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర రాజకీయ పండితులే అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక నాడే గెలుపును కాంగ్రెస్‌ వైపు తిప్పిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. అంత దూరదృష్టితో ఎన్నికలను ఎదుర్కొవడం ఒక్క రేవంత్‌ రెడ్డికే సాద్యమైంది. ఆరు నెలలుగా బిఆర్‌ఎస్‌ పెంచుకున్న ఆశలను వారం రోజుల్లో పటాపంచెలు చేసి, కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అటు పాలనలో సిఎం. రేవంత్‌ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇటు ఎదురయ్యే ఎన్నికలను గెలిపించుకుంటూ పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి రచించే వ్యూహాలు చేదించడం బిఆర్‌ఎస్‌ వల్ల కాదని మరోసారి నిరూపించారు. తన రాజకీయం ముందు బిఆర్‌ఎస్‌ రాజకీయాన్ని తుత్తునీయం చేశారు. గెలుపుంటే ఇదీ అని మరోసారి బిఆర్‌ఎస్‌ గుండెలు అదిరేలా కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన రాజకీయాలకే పాఠం నేర్పిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఇక జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్ర స్ధాయిలోనే కాదు, జాతీయ స్దాయిలో కూడా సిఎం. రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా తెలంగాణ వైపు చూసేలా చేశాయి. రేవంత్‌ రెడ్డి నాయకత్వ పటిమ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. జూబ్లీహిల్స్‌ ప్రజుల సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనకు డిస్టింక్షన్‌ మార్కులేశారు. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కన్నా సిఎం. రేవంత్‌రెడ్డి పాలన ఎంతో బెటర్‌ అని నిరూపించారు. సాదారణ ఎన్నికలను ఒంటి చేత్తో సిఎం. రేవంత్‌ రెడ్డి గెలిపించారు. తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు కాంగ్రెస్‌కు సాదించిపెట్టారు. 8 మంది పార్లమెంటు సీట్లను గెలిపించారు. బిఆర్‌ఎస్‌కు రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ సున్నా చుట్టేలా చేశారు. తర్వాత వచ్చిన వరుస ఉప ఎన్నికలు గెలిపిస్తూ వస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిపించారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు. పార్టీకి కొండంత బలాన్ని అందిస్తున్నారు. వరుస గెలుపులను పార్టీకి అందిస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ఉత్తమైన పాలన అందిస్తున్నారు. ఏ ానాయకుడైనా తన పాలన చరిత్రలో నిలిచిపోవాలనే కోరుకుంటారు. అలాగే తనదైన పాలన సాగించేందుకు, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు

నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T120933.523.wav?_=7

 

 

నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం

ప్రజలు మద్దతు ప్రజా ప్రభుత్వం వైపే

సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్

పరకాల,నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు,సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరో అద్భుత విజయాన్ని అందుకుందని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేక పోయారని అన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం,సమాగ్ర హక్కులు సాధించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నవీన్ యాదవ్ గెలుపు ప్రజల విజయమని అన్నారు.

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు…

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు

అభివృద్ధికి డోకా లేదు

ఇక నుంచి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్కడి ప్రజలు నిరూపించారనీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సింపతి ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రికార్డని రాజేందర్రావు అన్నారు. నవీన్ యాదవ్ అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారని రాజేందర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్రంలో తిరుగులేదని రాజేందర్రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు…

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం పైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులుమంత్రులు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సానుభూతిపరులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనకు పట్టం కట్టి వారికి మరింత బలం చేకూర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పరకాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభం…

పరకాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం శీతకాల సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి

ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ

పరకాల,నేటిధాత్రి

 

బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని పట్టణంలోని బస్టాండ్ కూడలివద్ద బిసి.జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు.ఈ దీక్ష శిబిరాన్ని ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా కుల గణన చేసి బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం నిమిత్తమై గవర్నర్ కు పంపగా గవర్నర్ ఆబిల్లును పెండింగ్ పెట్టి కాలయాపన చేసిన కూడా మరి ఒక ఛాలెంజిగా తీసుకొని జీవో విడుదల చేయడం జరిగిందని రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావలసిన హక్కు మరి రిజర్వేషన్లకు ఆ చట్టాన్ని ఉక్కు కవచం మాదిరి చేయాలంటే పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు కేటాయించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఆముదాలపేల్లి మల్లేష్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పద్మశాలి సంఘం నాయకులు పోరండ్ల సంతోష్,సమన్వయ కమిటీ సభ్యులు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,సీతారాంపూర్ మున్నూరు కాపు సంఘం నాయకులు నల్లెల్ల అనిల్ కుమార్,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోడెల శ్రీనివాస్,గౌడ సంఘం అధ్యక్షులు బండి సదానందం గౌడ్,కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మార్కర్ రఘుపతి గౌడ్,రజక సంఘం అధ్యక్షుడు మాదాసి రామ్మూర్తి,వడ్ల సంఘం నాయకులు బాలాజీ స్వామి,కామరెడ్డిపల్లె బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోడెల సతీష్,ముదిరాజ్ సంఘం నాయకులు దామ అనిల్,బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొమ్మాటి సతీష్,రాయపర్తి శ్రీధర్,బిసి జాయింట్ రియాక్షన్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పాపాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మఇండ్లుప్రారంభోత్సవం..

పాపాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మఇండ్లుప్రారంభోత్సవం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లిగ్రామంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణంలో భాగంగా నేడు పాపాయిపల్లి గ్రామంలో లబ్ధిదారులు అంబటి రామవ్వకుచెందిన. ఇల్లును ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూప.తిరుపతిరెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగంప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ప్రజా ప్రభుత్వం లో. పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయని. అర్హులై ఉండి ఇల్లు రాని వారికి కూడా రెండో పేజ్ లో తప్పకుండా మంజూరు అవుతాయని తెలియజేస్తూ ఇప్పటివరకు ఇల్లు మొదలు పెట్టనివారు త్వరగా మొదలు పెట్టాలని మండలంలోని. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినవాళ్లు త్వరగా మొదలు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నరసింహం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. హౌసింగ్ ఏఈ. హమీద్. గ్రామ సెక్రెటరీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు.పొన్నాల పరశురాములు. కల్లె పల్లి తిరుపతిరెడ్డి. ఆరేపల్లి .బాలు. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. చిన్న లింగాపూర్. మాజీ ఎంపిటిసి.బై రీ నేని రాము. శ్రీకాంత్ గౌడ్. బాలసాని శ్రీనివాస్. మునిగల. రాజు. వేల్పుల సాయి ప్రసాద్. నరసయ్య గౌడ్. గుగ్గిల భరత్ గౌడ్. ఎడ్ల తిరుపతి. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ లాంఛనాలతో కవి అందెశ్రీ అంత్యక్రియలు…

ప్రభుత్వ లాంఛనాలతో కవి అందెశ్రీ అంత్యక్రియలు

 

 

సాహితీ లోకానికి గర్వకారణమైన అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.

గల్లీ గల్లీకి మంత్రులు గల్లి గల్లి లో నాయకులు…!

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-06T114450.368.wav?_=8

 

గల్లీ గల్లీకి మంత్రులు గల్లి గల్లి లో నాయకులు…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో అధికారకాంగ్రెస్పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గం లోని డివిజన్ల వారీగా మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రుల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ను ఇన్చార్జిలుగా నియమించిన కాంగ్రెస్ మిగతా మంత్రులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక నియోజకవర్గంలో నేతలు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తు న్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదప్పైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజలకు వివరిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరణ ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రచారంలో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రతి డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మందికి ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. మంత్రితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఒక బృందంగా ప్రచార బాధ్యతలు చేపట్టారు. కాగా, ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సమావేశమయ్యారు.జూబ్లీహిల్స్ఎన్నిక ప్రచార తీరు, వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.

గల్లీ గల్లీకి మంత్రులు

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్? ను గెలిపించాలని కోరుతూ మంత్రి సీతక్క శనివారం బోరబండలో దోశలు వేసి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. యూసుఫ్గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడిపి ఓట్లు అభ్యర్థించారు. షేక్?పేట డివిజన్ లో మంత్రి వివేక్? ఇంటింటి ప్రచారం చేశారు. అలాగే ఎర్రగడ్డ రైతు బజార్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో సమష్టిగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.

ప్రజల్లో ఉండే నేత నవీన్ యాదవ్…

ప్రజల్లో ఉండే నేత నవీన్ యాదవ్

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విద్యావంతుడు స్థానికుడు నిత్యం ప్రజల్లో ఉండే నేతగా పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారని పేద ప్రజలకు చిన్న శ్రీశైలం యాదవ్ సాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు. తండ్రి బాటలో నడుస్తున్న నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్ద ఎత్తున చేపడుతున్నారని రాజేందరావు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన ఇంటలెక్చువల్ విద్యావంతులు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వారితోను రాజేందర్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి.

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా లేఖను రాసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యార్థుల చదువులను రోడ్డున పడేసిందని, ప్రజాపాలన అంటే విద్యార్థులు ఇంటి వద్ద, కళాశాలలకు తాళాలు ఉండడమా అని? కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలపై నిర్లక్ష్యం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై ఇచ్చిన మాట తప్పారని, రాష్ట్రంలో అందాల పోటీలకు ఉన్న నిధులు ఫీజు బకాయిలకు ఎందుకు లేవని? సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల కోసం కళాశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందని రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ లోని పోస్టు ఆఫీస్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్టు ద్వారా లేఖను పంపడం జరిగింది. ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విద్యార్థులు ఉండాల్సిన కళాశాలలు మూసిఉన్నాయి, తరగతుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని, రేవంత్
రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు గడుస్త ఉన్న ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని, గతంలో కళాశాలల వారు బంద్ చేస్తే దసరా దీపావళి లోపు పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు విడుదల చేశారని, నేటి నుండి కళాశాలలు బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించి పది రోజులు గడుస్తున్న ప్రభుత్వం వారితో చర్చించకుండా వారికి బకాయిలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని, ప్రైవేట్ యాజమాన్యాలకు  ఇవ్వాల్సిన బాకాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా పెండింగ్ బకాయిలు ఇవ్వమన్నందుకు విజిలెన్స్ తనిఖీల పేరిట ప్రభుత్వం బెదిరింపులు చేయడం సిగ్గుచేటని, ఫీజు బకాయిలని విడుదల చేసిన తర్వాతనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిల విడుదల లేక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు, మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి, పక్క రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి ఉన్న నిధులు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నేడు కళాశాలలు బంద్ చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని, కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని, కనీసం ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఫీజు బకాయిల విడుదలలో నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజు బకాయిల విడుదల లేక కళాశాలల నిర్వహణ చేయలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయించడంలో వైఫల్యం చెందడానీ, విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం వెంటనే  కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి బంద్ విరమింపజేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల బంద్ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు బకాయిలు విడుదల చేయాలని లేనిపక్షంలో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నగర అధ్యక్షులు కేషబోయిన రాము యాదవ్, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, శివ, రాజు, మల్లికార్జున్, మని, వరుణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version