గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష
జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అలాగే ఎంపీడబ్ల్యూ వర్కర్లను వార్డుల వారిగా విభజించి చెత్త సేకరించాలని తెలిపారు.ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో విధిగా పనులను నిర్వహించాలని,ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలని,సేగ్రిగేషన్ షెడ్ లలో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేపించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఇంటి పన్ను వాసులలో ఇప్పటివరకు 29% మాత్రమే చేశారని,నవంబర్ 25వ తేదీలోపు 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లేనియెడల తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాపూరావు,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,ఆర్.శ్రావణి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
