వీరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం
మహబూబాద్ జిల్లా సీనియర్ నాయకులు వంటి కొమ్ము యుగేందర్ రెడ్డి.
మరిపెడ నేటిధాత్రి.
మరిపెడ మండలంలోని ఉమ్మడి వీరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం చే ప్రతి రైతు కుటుంబానికి మద్దతు లభిస్తోంది అని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు న్యాయమైన మద్దతు ధర (MSP) అందుతుంది. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ధైర్యంగా ముందుకు సాగాలి, రైతు కష్టానికి విలువ ఇవ్వడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం, అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి బంగారు యుగం మొదలైంది. రైతుల శ్రమ ఫలించే రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం, అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వీరారం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు,జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,డైరెక్టర్లు, వ్యవసాయ,రెవెన్యూ అధికారులు,గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
