మూలరాంపూర్ గ్రామ శివారులోని సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒక వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ గ్రామానికి చెందిన పల్లికొండ సిద్ధార్థ తండ్రి గంగన్న(18) సంవత్సరాలు అను వ్యక్తి గురువారం రోజున మధ్యాహ్నం సమయంలో చేపలు పట్టడానికి మూలరాంపూర్ గ్రామ శివారులోని సదర్ మట్ ప్రాజెక్టు గేట్ నెంబర్ 52 వద్ద వల తో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు ముందుకు పడి తలకి బలమైన గాయమై అట్టి నీటిలో మునిగి చనిగపోయినాడు అని మృతుడి తండ్రి అయిన పల్లికొండ గంగన్న తండ్రి లింగన్న, (46 ) సంవత్సరాలు అనునతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
