ఆలయంలో దోపిడీ, హత్య..
విరుదునగర్ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు.
చెన్నై: విరుదునగర్(Virudunagar) జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం అర్చకులు వచ్చి ఆలయాన్ని తెరవగా ఆ ఇరువురూ రక్తపుమడుగులో శవాలుగా పడివున్నారు.
