తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య…

తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

మండలంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన బాల వేణి రాధా చంద్రమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం ఉండగా కూతురు వివాహం చేసి బాల వేణి రాధా తన భర్త చంద్రమౌళి, ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాదులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వగ్రామం మేదరమట్లకు వచ్చి బుధవారం భోగి రోజున వారి ఇంటిలో పట్నాలు వేసిన అనంతరం మృతుడు అంజి (21) కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అంజిని వెతుకుతున్న క్రమంలో మృతుడు తన పెదనాన్న బాలవేణి వెంకన్న గృహంలో రాత్రి 7:30 గంటల సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుని కొన ఊపిరితో వేలాడుతు కనిపించడంతో. కొడుకును చూసి తల్లి బాలవేణి రాధా కేకలు వేయగా. గ్రామానికి చెందిన బాలవేణి వీరస్వామి, బాలవేణి శ్రీనివాసులు, ఇద్దరు కొనఊపిరితో ఉన్న అంజిని హుటాహుటిన చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని. తన కుమారుడి ఆత్మహత్యకు ఎవరిమీద ఎలాంటి అనుమానం లేదని ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి బాలవేణి రాధా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొరగల అశోక్ తెలిపారు.

ఏసీబీ కి దొరికిన అవినీతి ఏఈఓ.

ఏసీబీ కి దొరికిన అవినీతి ఏఈఓ.

రైతు భీమా కోసం 20 వేలు డిమాండ్.

మరిపెడ నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఏసీబీ అధికారులకు దొరికిన అవినీతి ఏఈఓ, ఆనేపురం గ్రామపంచాయతీలోని చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు.వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనే పురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14 వ తేదీన మరణించాడు. దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధ్రువీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్న గాడిపెళ్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద రూ. 20 వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్లు తెలిపారు.అధికారికి డబ్బులు ఇచ్చే స్తోమత లేక సదర్ దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్‌లోని ఏసీబీ అధికారులను సంప్రదించి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడం జరిగింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తుదారుల నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరస్తుడిని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఆయనతో పాటుగా ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, శేఖర్, ఏసీబీసీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మరిపెడలోని నేరస్తుడి బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి…

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి

మహాదేవపూర్ నవంబర్2నేటి ధాత్రి *

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలొని అంబటిపల్లి గ్రామ అమరేశ్వర ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న గోడపర్తి నాగరాజు శర్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవన్ నుండి అంబర్ పెళ్లికి వెళుతుండగా సూరారం రైతు వేదిక ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలుపుతూ అతని వెంట ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version