ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124134.174.wav?_=1

 

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నేరేడుపల్లి గ్రామంలో గత రబీ సీజన్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు విచారణలో తేల్చారు నేపథ్యంలో అధికా రుల ఫిర్యాదు మేరకు శాయం పేట పోలీస్ స్టేషన్ లో 21 మందిపై కేసు నమోదు కాగా ఇటీవల ఇద్దరినీ అరెస్ట్ చేశారు ఈ అక్రమాలకు ప్రధాన సూత్ర దారులైన ఒకటైన బండ లలిత ప్రధాన సూతదారి బెజ్జంకి శ్రీనివాస్ బంధువు వడ్లూరి రాజేందర్ బుధవారం పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్ తర లించారు మిగతావారు పరారీ లో ఉన్నారని మిగతా వారిని గాలిస్తున్నామని సీఐ రంజిత్ రావుఎస్సై పరమేష్ తెలిపారు.

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T110750.919.wav?_=2

 

 

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన చందాసంధ్య మరియు చంద ప్రశాంత్ గత నాలుగు సంవత్స రాల నుండి ఇంటి స్థలం విష యంలో గొడవలు జరుగు తున్నాయి ఈ విషయంలో పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసుకొని వారు చెప్పిన విధంగా విన్న కూడా వారు మాపై తరచూ గొడవలు పడుతూ మమ్మల్ని ఎప్పటి కైనా చంపేస్తామని బెదిరిస్తు న్నారు.ఇదే క్రమంలో నా భర్త సుధాకర్ ను మరియు నన్ను చంపాలని ఉద్దేశంతో వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చందా ప్రశాంత్ అతని తల్లి చంద విజయ అతని అక్క ఆకుతోట జ్యోతి అతని భావ ఆకుతోట పూర్ణచందర్ అతని మేనమామ చింతపట్ల రాజు కిట్టు మా ఇంటికి వచ్చి గొడ్డలి, రాడు, కర్రలు పట్టుకొని వచ్చి నా భర్త మా ఇంటి ముందు ఉండగా చంపుతా అంటూ ఒక్కసారిగా నా భర్త పై దాడి చేశారు. వెంటనే నా భర్త అరువగా బయటకు వచ్చి నేను చూసేసరికి చందా ప్రశాం త్ గొడ్డలితో నా భర్త తలపై గొడ్డలి కాటు, ఆకుతోట జ్యోతి ఇనుపరాడుతో మిగతావారు కర్రలతో కొట్టడం జరిగింది వెంటనే నేను నా భర్తను కొట్ట వద్దని అడ్డు వెళ్లాగా వారు నన్ను చేతులతో కొట్టారు.ఇట్టి గొడవను చూసిన నేను చుట్టు పక్కల వారైనా నరసయ్య, కోటయ్య, సత్యనారాయణ వచ్చి కొట్ట వద్దని ఆపబోతే వారిని అడ్డువస్తే చంపుతా మంటూ బెదిరించి వెళ్లిపో యారు వాళ్లు గాయపరచగా నా భర్తకు తలకు నాలుగు ఐదు చోట్ల రక్త గాయాలైనాయి మరియు కుడికాలు బలంగా గాయంతో అయినవి చుట్టుప క్కల వారి సహాయంతో నేను 108 లో చికిత్స కోసం వరంగ ల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి నాని అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం శ్రీనివా స్ ఆసుపత్రి తీసుకుని వెళ్లాను ప్రస్తుతం నా భర్త చికిత్స పొందుతూ ప్రాణాపాయస్థితి లో ఉన్నందున చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు

 అక్కా, పిన్ని అంటూ.. రూ.కోట్లతో జంప్.. ఖి’లేడి’ బాగోతాలు…

 అక్కా, పిన్ని అంటూ.. రూ.కోట్లతో జంప్.. ఖి’లేడి’ బాగోతాలు

 

కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 తెలుగు రాష్ట్రాల్లో మోసాలు మరీ పెరిగిపోతున్నాయి. రొటీన్‌గా చోరీ చేయడం కంటే స్కెచ్ వేసీ మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, స్కాములు ఇవి మాత్రమే కాకుండా ఎలా వీలైతే అలా మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడవాళ్లు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది.
బాగా డబ్బులు ఉన్న ఇళ్ల పక్కనే రెంట్‌కి ఉండటం, తియ్యగా మాటలు కలుపుతూ బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, అక్కా, పిన్నీ అంటూ డబ్బున్న వారికి దగ్గర అవుతూ ఈ లేడీ మోసం చేస్తుంది. వారికి అవసరం ఉన్నా లేకున్నా సాయం చేస్తూ వాళ్లకు తనపై నమ్మకం కలిగేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ తాను మంచిదని నమ్మిస్తుంది. డబ్బున్న మహిళలకు ఎర వేస్తూ వాళ్ళతో కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటుంది. వడ్డీకి ఇస్తానని, మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తానని, తాను బిజినెస్ చేస్తే లక్షకు రెండు లక్షలు వస్తాయని నమ్మించి డబ్బున్న వాళ్ళ దగ్గరనుంచి రూ.లక్షలు కాదు కాదు ఏకంగా రూ. కోట్లే కాజేసింది. ఈ వింత బాగోతం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఒక్కొక్కరి దగ్గర పట్టుమని 10 నెలల కాలం కూడా ఉండకుండా జాగ్రత్తగా డబ్బులతో ఎస్కెప్ అవుతుంది. మొదట ఆంధ్ర‌ప్రదేశ్‌లోని తిరుపతిలో విద్య అనే మహిళ మోసాలకు పాల్పడుతూ వచ్చింది. ఆనోటా ఈ నోటా పాకి ఈమె గురించి అక్కడ అందరికి తెలియడంతో.. ఏకంగా హైదరాబాద్‌కు మకాం మార్చింది.
ఇక్కడ డబ్బున్న వాళ్ళు బాగా ఉంటారని, డబ్బున్న మహిళలకు గాలం వేసి రూ.కోట్లు కొల్లగొట్టాలని భావించి తన మోతపూరిత వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. తిరుపతికి చెందిన మహిళ విద్యకు మాటల గారెడీతో మహిళలను బుట్టలో వేయడం వెన్నెతో పెట్టిన విద్య. తమకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పి తాను వ్యాపారాలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేసి మెల్లగా జారుకుంటుంది. బాధితులు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రశ్నించగా.. రౌడీలతో కొట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని, పోలీసులు ఈ ఖిలాడీ లేడి అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్….

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

 

స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢికొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను వారి కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అలాగే కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రత వాహనదారులు సహకరించాలని కోరారు.

భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త …

భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త

చేవెళ్ల, నేటిధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall


కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధం గ్రామమైన వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య

నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Husband strangles wife to death…

ఇతనికి ఇద్దరు భార్యలు. రెండో భార్య అయిన రజితను అతికిరాతకంగా హత్య చేశాడు. వెంకన్నగూడ‌ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య రజిత(30)తో గత రెండేళ్లుగా మనస్పర్దాలున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన మంగళవారం జంగయ్య రజిత హత్యకు పథకం వేశాడు. సోమవారం సాయంత్రం భార్య రజిత, జంగయ్య ఇద్దరు గ్రామ సమీపంలో మద్యం త్రాగారు. అనంతరం రజితను చున్నీతో మెడకు బిగించి ఉరివేశాడు. అప్పటికి చావలేదనుకుని సిమెంట్ కడ్డీతో మోది అతికిరాతకంగా హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం ఫోటోలు, వీడియోలు తీసి మొదటి భార్యకు పంపించాడు. అదేరోజు రాత్రి నిందితుడు చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

జహీరాబాద్లోని అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన మారాటి బాలాజీ (40)ని కారు ఢీకొట్టింది. ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలాజీ, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పూట మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ గౌతమ్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడి తరఫున ఫిర్యాదు అందింది. జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..
• రెస్క్యూ టీం గాలింపులో శవం లభ్యం.

నిజాంపేట: నేటి ధాత్రి

పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. నార్లపూర్ గ్రామానికి చెందిన బదన కంటి మహేష్ (25) అను వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుండి కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

Man dies after going to graze cattle

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ గ్రామంలో గల హైదర్ చెరువులో రిస్క్యూమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో శనివారం సుమారు 12 గంటలకు మహేష్ శవం లభ్యమయింది. పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదర్శనగర్లో భారీ దొంగతనం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T140702.731.wav?_=3

 

ఆదర్శనగర్లో భారీ దొంగతనం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో భారీ
చోరీ జరిగింది. ఆదర్శనగర్కు చెందిన శోభారాణి ఇంట్లో చొరబడ్డ దొంగలు బీరువా పగులగొట్టి రూ.2.50లక్షల విలువైన నగ నట్ర దొంగిలించారు. బైపాస్ సమీపంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని పసిగట్టిన దొంగలు ఇంటి తాళం, బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 2 తులాల బంగారం, 4 తులాల వెండి, రూ.10 వేల నగదు చోరీ దొంగిలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం అధికారులు ఫింగరింగ్ ప్రింట్స్ సేకరించగా జహీరాబాద్ పట్టణ ఎస్ఐ. వినయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు..

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు

 

 

తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.

ధర్మవరం(అనంతపురం): తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయ(Dhananjaya)ను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు శివయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ హేమంత్‌కుమార్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.

 

 

కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2లో పాళ్యం శివయ్య, ఎల్‌-3లో అతని పిన్ని కుమారుడు పాళ్యం ధనుంజయ నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. శివయ్య భార్యతో ధనుంజయ చెడుగా ప్రవర్తించేవాడు. దీంతో శివయ్య(Shivayya) మందలించాడు. అయినా అతనిలో మార్పురాలేదు.

దీంతో శివయ్య కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 21వతేదీ అర్ధరాత్రి ఎల్‌పీ సర్కిల్‌లో బ్రిడ్జి కింద ధనుంజయను సిమెంట్‌ ఇటుకతో బాది చంపేశాడు. నిందితుడిని సీఐ నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ కేతన్న, హెడ్‌ కానిస్టేబుళ్లు అప్పస్వామి, శివశంకర్‌, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్‌, బయన్న, సుధీర్‌కుమార్‌, రాజన్న శనివారం అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు.

మియాపూర్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T114021.473-1.wav?_=4

 

మియాపూర్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి….

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

 

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్త మహబూబ్‌పేట్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురువారం ఉదయం తెలుగులోకి వచ్చింది.
మృతులను ఉప్పరి లక్ష్మయ్య (60), ఆయన భార్య ఉప్పరి వెంకటమ్మ (55), కూతురు కవిత (24), అల్లుడు అనిల్ (32), రెండేళ్ల మనుమడు అప్పుగా గుర్తించారు. వీరంతా ఒకే ఇంట్లో మృతిచెంది ఉండటంతో ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులను, బంధువులను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ నేపథ్యం, వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన రఘు (42) వ్యవసాయ బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాసురామ్ అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో వరుస దుర్ఘటన

హైదరాబాద్‌లో వరుస దుర్ఘటన
`వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌
`హైటెన్షన్‌ వైర్‌ తగలడంతో ఇద్దరు యువకుల దుర్మరణం
హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి స్థానిక వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడి పోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్‌ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్‌ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.

‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T131456.880-1.wav?_=5

అయ్యో దేవుడా
‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’
వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు యువకులు దుర్మరణం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:

 

 

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version