అనుమానాస్పదంగా వ్యక్తి మృతి…గంగాపూర్ గ్రామ వాసిగా గుర్తింపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, గంగాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్ (30), నభీ పటేల్ అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందారు. పోలీసులు తెలి పిన వివరాలు ప్రకారం పస్తాపూర్ గ్రామ శివారులోని శ్మశానవాటిక దగ్గర ఉన్న పొలంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చనిపోయి కనిపించాడు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిం చగా, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వినయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు హత్య ఆత్మ హత్యనా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
