మరో ఘోర రోడ్డు ప్రమాదం..
తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణించాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలులో రోడ్డు ప్రమాదం మరువకముందే చేవెళ్లలో మరో ఘోరం జరిగింది. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే, తాజాగా, కర్ణాటకలోని బీదర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో-కారు ఢీ కొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మృతులు నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (26)గా గురించారు. గణగాపూర్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు.
