కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

చిట్యాల నేటి ధాత్రి

 

కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు గా మురహరి తిరుపతి (ట్రిమ్స్) ను నియమించినట్టు కెటిఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ప్రకటించారు.. వారికి నియమకపత్రాన్ని చిట్యాల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారితో కలిసి చిట్యాల మండల కేంద్రంలో అందించారు..ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మాజీ జడ్పీటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏరుకొండ రాజేందర్, పెరుమాండ్ల రవీందర్, దూదిపాల తిరుపతి రెడ్డి, ఆరె పల్లి సమ్మయ్య, యూత్ నాయకులు గుండు నగేష్ తదితరులు. పాల్గొన్నారు…

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు.

మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని సదాశివుడు, కార్యనిర్వాహకులు బాసని నాగభూషణం, సోషల్ మీడియా ఇంచార్జిలు బడుగు అశోక్, దాసి శ్రావణ్ కుమార్, ముఖ్య సలహాదారులు పల్నాటి జలేందర్, బాసని లక్ష్మీ నారాయణ, బూర ఈశ్వరయ్య, సామల మల్లయ్య, బాసని కుమార స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రాష్ట్రనాయకుడు బాసని చంద్ర ప్రకాష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ పాటు పలువురు నూతన కార్యవ ర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామాలలో సంఘసభ్యత్వా లు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు. పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

అంబేద్కర్ యువజన సంఘం మండల.

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులుగా యుగేందర్ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏవైఎస్ మండల నూతన కమిటీ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడుగా జన్నె యుగేందర్,ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ లను ఎన్నుకోవడం జరిగింది,ఉపాధ్యక్షులుగా కనకం తిరుపతి,గుర్రం అశోక్,సహాయ కార్యదర్శిలుగా దాసరపు నరేష్,బోనగిరి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా కట్కూరి రాజు, కోశాధికారి కట్కూరి రాజేందర్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు యుగేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు , ఈ కార్యక్రమంలో ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య, చిట్యాల మండల గౌరవ అధ్యక్షుడు గుర్రపు రాజేందర్,ఏవైఎస్ సభ్యులు సరిగోమ్ముల రాజేందర్, కట్కూరి రమేష్, గుర్రం రాజమౌళి, గుర్రం తిరుపతి, శీలపాక ప్రణీత్ కుమార్, మైదం మహేష్, పాముకుంట్ల చందర్,ముత్యాల సాంబయ్య, కట్కూరి శ్రీనివాస్, బొడ్డు ప్రభాకర్, అంబాల సాంబయ్య (అచ్చి) తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు.!

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు

గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం
కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు.
దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు.
సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు.
అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన సోషల్ మండల కోఆర్డినేటర్.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించిన సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా కొత్తగూడ మండల నికి అదనంగా యూనిట్లు కేటాయించాలని కోరడం జరిగింది.. అందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని  తెలిపారు…

వాహనాల తనిఖీ…

వాహనాల తనిఖీ

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండలం కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎడ్ కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు తప్పకుండా సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు మద్యం తాగి వాహనం నడిపినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సోహెల్, రజక్ పాల్గొన్నారు.

BJP కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక.

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక

చందుర్తి, నేటిధాత్రి:

ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ నియామకం చేయడం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శి గా ముడపెల్లి ముకేష్ (మల్యాల ), ఉపాధ్యక్షులు గా బోరగాయ తిరుపతి (జోగాపూర్ ) బంబోతుల ప్రశాంత్
(మర్రిగడ్డ) లను, కార్యదర్శులు గా నీరటి శేఖర్ (నర్సింగపూర్), పగిడే మల్లేశం (ఎన్గల్ ), లంబ రాకేష్ (మూడపెల్లి ), తోట శంకర్(మూడపెల్లి) లను,
కార్యవర్గ సభ్యులు గా ఈగ శ్రీధర్ (లింగంపేట), అట్టేపెళ్లి సాయి (తిమపూర్) లను నియమించారు.

ఈ నియామకలు తక్షణమే అమలోకి వస్తాయి అని తెలియజేరశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు మొఖిల విజేందర్, మండల ప్రధాన కార్యదర్శిలు పెరుక గంగరాజు,మర్రి మల్లేశం బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెట్టి రాకేష్, బిజెపి నాయకులు చింతకుంట గంగాధర్, చినుముల హనుమయ్య చారి, లింగాల రాజయ్య, మట్కా మల్లేశం, పాటి సుధాకర్, చిర్రం తిరుపతి, పెరుక రంజిత్,బద్దం తిరుమల్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మోతుకుపెల్లి రాజశేఖర్,మెంగాని శ్రీనివాస్, మర్రి రాజు, కుసుంబ లింగ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు.

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల జాగృతి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మాట్లాడుతూ మండలంలో పట్టణంలో తెలంగాణ జాగృతి కమిటీ లను వేశామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అభినందిస్తూ అలాగే రాబోయే ఎన్నికల్లో బీసీలకు అన్ని సంక్షేమ పథకాల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి గాని ఎంపిటిసి గాని సర్పంచ్ గాని ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలని ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ అమలు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవితక్క గారు బీసీల గురించి మండల సభల్లో ఎన్నోసార్లు బీసీల గురించి స్థానికంగా ప్రసంగించారని తెలంగాణ జాగృతి ని రాష్ట్రంలో అన్ని వర్గాలకు అనుకూలంగా ప్రయోజనం పొందేలా ఎమ్మెల్సీ కవితక్క ఎప్పటినుండో పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ముందు రోజుల్లో అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే తెలంగాణ జాగృతి తంగళ్ళపల్లి మండలం యువజన కార్యదర్శిగా అనిల్ గౌడ్ ను తంగళ్ళపల్లి తెలంగాణ జాగృతి పట్టణ అధ్యక్షులుగా విబి రంగమును ఉపాధ్యక్షులుగా భానుమూర్తిని నియమించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగత్.వెంగళ రమేష్ పసుల దుర్గయ్య మనోహర్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు.

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నెక్కొండ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి అశోక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి బర్త్డే కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ అశోక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి సుబ్బారెడ్డి, కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, రామారావు శిరీష -రాము, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ నాయక్, ఆవుల శ్రీనివాస్, మహమ్మద్ షబ్బీర్, దూదిమెట్ల రాజు, పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం.

ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం
సమన్వయ కమిటీ ఇంచార్జిగా బరిగెల ఏలీయా నియామకం

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

అయినవోలు మండల్ ఎంఆర్పిఎస్. ఎంఎస్పి అనుబంధ సంగాల అధ్యక్షులు చింత అశోక్ మాదిగ, ఇసురం బాబు అధ్యక్షతన మంగళవారం మండల కార్యవర్గం సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొక్కల నారాయణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారంగా వర్గీకరణలో కమిషనర్ ఇచ్చిన రిపోర్టును సరిదిద్దుకొని ఏబిసిడిలుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు మరియు ఉపకులాలకు రావలసిన వాటా జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసి అధికారికంగా వర్గీకరణ ప్రకటించాలని కోరారు. అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ను నిలిపివేసి వర్గీకరణ అయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. ఐనవోలు మండల సమన్వయ కమిటీ ఇన్చార్జి గా నందనం గ్రామానికి చెందిన బరిగల ఏలియాను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. రేపటినుండి జరిగే కార్యక్రమాలను మరియ ఉద్యమ నిర్మాణాలను విజయవంతం చేయుటకు ఈ కమిటీ పనిచేస్తుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల సీనియర్ నాయకులు బర్ల బాబు,కట్కూరి రమేష,సింగారపు చంద్రమౌళి,మరుపట్ల దేవదాస్, బరిగేల ఆరోగ్యం,ఆరూరి కుమారస్వామి, బొక్కల అనిల్ మాదిగ. మాదాసి కరుణాకర్ ఆకులపల్లి సాగర్, జలగం ఎల్ల కుమార్, ఆకులపల్లి రాజు,కట్కూరి అరుణ్ మాదిగలు పాల్గొన్నారు.

గంగవరం మండలంలో రెచ్చిపోతున్న.!

*గంగవరం మండలంలో రెచ్చిపోతున్న
ఇసుక అక్రమ రవాణా దారులు..

*చోద్యం చూస్తున్న అధికారులు..

గంగవరం(నేటి ధాత్రి) మార్చి 06:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గంగవరం పంచాయతీ
చిన్నూరు గ్రామానికి చెందిన అధికార
పార్టీ నాయకుడు నడుం
పల్లి సమీపంలోని అప్పిరెడ్డి
చెరువులో స్మశాన వాటికను సైతం ఆక్రమించి జెసిబిలతో ఇసుకను తోడేస్తూ ట్రాక్టర్ల ద్వారా నింపి సొమ్ము చేసుకుంటున్నారు.సమీపంలోని మట్టిని సైతం ఫిల్టర్ చేసి ఇసుకను తయారుచేసి నిల్వ ఉంచి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుకను టిప్పర్ల ద్వారా ఆ అక్రమ రవాణా దారుడు15 కిలోమీటర్లు
సమీపంలో ఉన్న కర్ణాటకకు రాత్రికి
రాత్రే అధికారుల కన్ను సన్నుల్లో
ఈ అక్రమ రవాణా జరుగుతుందని
పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా గాని
భూగర్భ గనుల శాఖ,ఇరిగేషన్ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ సంపదను ప్రక్క దారి పట్టిస్తున్నా,
లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుడికి అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..
రానున్న రోజుల్లో నడుంపల్లి గ్రామంలో ఎవరైనా మరణిస్తే మా శవాలను
ఎక్కడ వేయాలని ఆ గ్రామస్తులు సైతం
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతనిపై ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఇందులో వారి చేతివాటం ఎంతో ఉందో అర్థం అవుతుంది. దాదాపుగా చెరువు నుండి నిత్యం 200 లోడ్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఇతను పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

చొరవాణి అందజేత

చొరవాణి అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి :

మండలంలోని వేముల కుర్తి లోని పౌల్ట్రీ ఫారం నందు పనిచేసే మహమ్మద్ అత్తర్, R/o సిద్దిపేట కి చెందిన అతను 19.02.2025 రోజున తన యొక్క ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 21.02.2025 రోజున అతడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే (CEIR Portal )లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్న తన ఫోనును ఈరోజు ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను (CEIR Portal )లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ ఫోన్లు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని A.అనిల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం గారు తెలిపినారు.

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన.

ఝరాసంగం: ఆయిల్ పామ్తో అధిక ఆదాయం

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహిళా రైతు చంద్రమ్మ 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను సాగు చేశారు. కేవలం 15 నెలల్లోనే మొక్కలు పుష్పించాయి. మంచి వృద్ధిని చూపుతున్నాయి. తోటల అభివృద్ధి శాఖ రాయితీపై మొక్కలను అందించగా, ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు సంవత్సరాలపాటు రూ.4,200 మంజూరు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర రూ. 20,871 ప్రకటించడంతో ఈ పంట రైతులకు లాభదాయకంగా మారుతోంది.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు
చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ముల్క కొమురయ్య భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతా తెలియజేస్తూ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముల్క కొమురయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ పొంచేట్టి రాకేష్,మండల ప్రధాన కార్యదర్శి గంగరాజు, పత్తిపాక శ్రీనివాస్, కొక్కుల నరేష్, తోట శంకర్,అయోధ్య పర్శరాములు, మట్కామ్ మల్లేశం,లింగాల రాజయ్య, సిరికొండ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పే ల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు పోకల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్ గోనపల్లి శ్రీనివాస్ ఇటుకల మహేందర్ కిషన్ మోర్చా మండల అధ్యక్షులు ఆసాని ప్రభాకర్ రెడ్డి ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్.బక్క శెట్టి రాజశేఖర్ గౌడ్ కటకం మధుసూదన్ మేకల సురేష్ గోగు పరిచయ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం.!

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం.

కల్వకుర్తి /నేటి ధాత్రి.

Inter Student

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన… ఓమేష్ కల్వకుర్తి మండలం జయ ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్నాడు. వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు పాఠశాల అనుమతి లేకుండా.. ఐదు మంది విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అందులో మున్ననూరు గ్రామానికి చెందిన ఓమేష్ స్నానం చేస్తుండగా ఈత రాకపోవడంతో.. కోనేరులో పడి గల్లంతయ్యాడు. బుధ, గురు వారాల్లో శ్రమించిన ఓమేష్ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడి ఆచూకీ కనుగొని భారీ క్రేన్ సహాయంతో బయటకి తీశారు. ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచనలు ఇచ్చారు. బాలుడి మృతదేహం లభ్యం కావడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు నిరంతరాయంగా బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..!

జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..

ఏ ఎస్ పి, శ్రీ శివ ఉపాధ్యాయ
ఐ పి యస్…

నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి )
ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం లో

గురువారం నాడు జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఏటూరు నాగారం ఏ ఎస్ పి శ్రీ శివ ఉపాధ్యాయ ఐ పి యస్,వెంకటాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని మరియు వాజేడు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంకటాపురం మండల సిబ్బందికి. వాజేడు మండల సిబ్బందికి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించలని ఉపాధ్యాయులంతా క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని పాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం వాజేడు,సిఐ శ్రీ బండారి కుమార్, వాజేడు మండల ఎస్సైరాజ్ కుమార్,,వెంకటాపురం మండల ఎస్సై కే.తిరుపతిరావు సిబ్బంది పాల్గొన్నారు.

మొగుడంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఎరువుల దుకాణాల్లో తనిఖీ..

ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసిన
మండల వ్యవసాయ అధికారి అనూష

ముత్తారం :- నేటి ధాత్రి

మండలం లోని ముత్తారం మచ్చుపేట అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో గల ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి అనూష తనిఖీలు నిర్వహించారు ఈ సందర్బంగా అధిక ధరలకు ఎరువులు విక్రాయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది బిల్లు బుక్కులను ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు రైతులకు ఎరువులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలని సూచించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version