వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు

39 వ్యవసాయ మోటార్స్ మరియు 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం.

వీటి విలువ మొత్తం కలిపి 10,67,500/- రూపాయలు

 

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

వ్యవసాయ మోటార్ల దొంగలను పోత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈరోజు పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు నిందితులు గత రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ లను నిందితులు దొంగలించారు. ఈ దొంగతనాలకు సంబంధించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు ఈ రోజు పోత్కపల్లి మండల పరిధిలో శానగొండ గ్రామ శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్సై ఉదయం10:00 గంటల ప్రాంతం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ లో ఇద్దరు వ్యక్తులు సిరిగిరి ప్రసాద్ మరియు అంగిడి సాయికుమార్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరినీ పోలీసులు అదుపులకి తీసుకోని ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా అనుమనస్పదంగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వీరి దగ్గర నుంచి 39 మోటార్స్,750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే….

 

Police

 

సిరిగిరి ప్రసాద్, తారకరామ కాలనీ, ఓదెల, పాత ఇనుపసామను వ్యాపారం చేస్తూ జీవిస్తాడు. సరియైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ, అతిగా మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుద్దేశ్యం తో ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక లో డబ్బులు పెట్టి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపదిన్చాలనే చెడు ఉద్దేశ్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, గత 2 నెలల నుంచి ఓదెల గ్రామస్థుడు ఐన అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య తో పరిచయం ఏర్పడి, ఇద్దరం కలిసి మధ్యం సేవిస్తూ రాత్రి సమయలలలో ఇద్దరం కలిసి చిన్న చిన్న పాత ఇనుప సామాను దొంగాలించి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొనేవారు. వీరి జల్సాలకు డబ్బులు సరిపోక, చుట్టుపక్కల రైతుల కరెంటు మోటర్లు దొంగతనం చేసి అమ్ముకొని నిర్ణయించుకొన్నాని పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 39 వ్యవసాయ కరెంట్ మోటార్ లు, 750 మీటర్స్ కరెంట్ సర్వీస్ వైర్ ( కాచాపూర్ శివార్ లోని 6 మోటార్లు, కొనరాపేట్ శివారు లోని 1 మోటార్, మల్యాల శివారు లోని 100 మీటర్ల వైరు, మడిపల్లి కెనాల్ దగ్గర 01 మోటార్, శివపల్లి శివారు లోని బావి వద్ద 1 మోటార్, కొమిరె SRSP కెనాల్ దగ్గర్ 6 మోటార్ లు, కొలనూర్ శివారులోని 5 మోటర్లు మరియు పోత్కాపల్లి, శానగొండ శివారులోని 4 మోటర్లు, 17 బావుల వైర్లు 170 మీటర్లు, రూప్ నారాయణ పేట మానేరు లోని 23 బోరు మోటార్ ల వైర్లు 270 మీటర్లు, ఓదెల శివారులోని 6 మోటార్లు మరియు రూపనారాయణపేట శివారులోని 200 మీటర్ల వైరు ) ఆటో ట్రాలీలో తిరుగుతూ మోటార్లను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. బోర్ ల మోటార్ లు, సర్వీస్ వైర్ లు దొంగలించి రైతులకు తీవ్ర నష్టం చేసి రైతులను భయాందోళనలకు గురి చేసారు.
ఈ దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు 13 మంది సిబ్బందిని అభినందించి డీసీపీ రివార్డులు అందజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version