జాదవ్‌ యూనివర్సిటీలో ఆధిపత్య రాజకీయాల కుంపట్లు

ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ

ఆధిపత్యం నిలుపుకునేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల పోరు

ఎన్నికలు జరపాలంటూ విద్యాశాఖ మంత్రిపై దాడి

ర్యాంగింగ్‌, రాజకీయం, హింసలతో కునారిల్లుతున్న యూనివర్సిటీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్లో కోత

విద్యార్థుల విపరీత పోకడలే కారణం

నిధులు తగ్గడంలో కుంటుపడుతున్న యూనివర్సిటీ పాలన

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒకప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, విద్యాసంస్థలుగా పేరుపడ్డ చాలా సంస్థలు నే డు విద్యార్థి రాజకీయాల పేరుతో వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు హింసాత్మక సంఘటనలకు దారితీసి మొత్తంమీద విద్యార్థులకు విద్యతో పాటు రాజకీయ పరిజ్ఞానం కలిగించాలన్న అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బతింటోంది.యూనివర్సిటీలు భ్రష్టుపట్టి పోవడానికి ప్రధాన కారణం ఈ విద్యార్థి రాజకీయాలు ముదిరిపోరు హింసకు దారితీయడమే. ఎంతోకష్టపడి తమ పిల్లల్ని ఉన్నతవిద్యకోసం పంపితే రాజకీయాల పేరుతో తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవడం ఆయా తల్లిదండ్రుల హృదయాలు ఎంతటి తీవ్ర మనోవేదనకు గురవుతాయో అర్థంచేసుకోవచ్చు. దేశంలో ప్రైవేటు విద్యకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విద్య అన్నిరకాలుగా భ్రష్టుపట్టిపోవడమే. హింస, ఘర్షణలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా యూనివర్సిటీలకు కేటాయించే నిధుల్లో కోత విధిస్తుండటంతో అక్కడి విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు దారుణంగా పడిపోతున్నదన్నసత్యం వర్తమాన చరిత్ర స్పష్టం చేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ కోల్‌కతాలోని జాదవ్‌ యూనివర్సిటీ. ఇది ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుండేది. కానీ ప్రస్తుతం భయంకరమైన రీతిలో ర్యాగింగ్‌, హాస్టళ్లలో బెదిరింపులు వంటివి సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను చాలా హేయనీయమైన రీతిలో భౌతిక, మానసిక హింసకు పాల్పడుతూ ర్యాగింగ్‌లు నిర్వహిస్తారన్న ఆరోపణలున్నాయి. ఈ యూనివర్సిటీలోవామపక్ష విద్యార్థి సంఘాలదే ఆధిపత్యం. ఇటీవల ఈ యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సం ఘాల నాయకులు, పశ్చిమబెంగాల్‌ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో మళ్లీ ఈ యూనివర్సిటీ పతాకశీర్షికలకెక్కింది. విద్యాపరంగా ఒకప్పుడు అత్యున్నత ప్రమాణాలను పాటించే సంస్థగా పేరుపడ్డ ఈ యూనివర్సిటీ ప్రస్తుతం సీపీఎం, తృణమూల్‌ మరియు బీజేపీల మధ్య ఆధిపత్యపోరుకు ప్రధాన కేంద్రంగా మారడం విషాదం. 

మార్చి1వ తేదీన యూనివర్సిటీలో తృణమూల్‌ అనుబంధ సంస్థ అయిన ‘వెస్ట్‌ బెంగాల్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యుబీసీయుపీఏ)’ ఏర్పాటు చేసిన ఒక సదస్సుకు అధ్యక్షత వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు యూనివర్సిటీకి విచ్చేశారు. సరిగ్గా ఇదే సమయంలో యూనివర్సిటీకి చెందిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆయనతో గొడవకు దిగారు. 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికలను మళ్లీ ఎప్పుడు ప్రకటిస్తారనేది ప్రధానంగా వారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఇదే అంశంపై స్పష్ట మైన సమాధానం ఇవ్వాలని వారు విద్యాశాఖ మంత్రిని డిమాండ్‌ చేయడంతో గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చి, సదస్సు ప్రదేశం, అక్కడి ఫర్నీచర్‌ విద్యార్థుల చేతుల్లో ధ్వంసమయ్యాయి. ఇదేసమయంలో ఓంప్రకాశ్‌ మిశ్రా అనే ఒక ప్రొఫెసర్‌పై దాడిచేశారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన గూండాలు తమపై దాడిచేయడం, మంత్రి కారును వేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో తమ సహచరులు గాయపడటం వల్లనే తాము ఎదురుదాడికి దిగామని లెఫ్ట్‌ రివల్యూషనరీ ఫ్రంట్‌ మరియు ఎస్‌ఎఫ్‌ఐ (సీపీఎం అనుబంధ సంస్థ) విద్యార్థి నాయకులు వెల్లడిరచారు. తర్వాత పోలీసులు దాడికి బాధ్యులైన విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మార్చి 6వ తేదీన కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేర నిర్లక్ష్యంగా కారును నడిపినందుకు కారుడ్రైవర్‌ మరియు మంత్రిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే సమస్య అంతటితో సమసి పోలేదు. వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులను కొనసాగిస్తూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 17వ తేదీన వారు తాత్కాలిక యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ భాస్కర్‌ గుప్తా ఎన్నికలు ఎప్పుడు జరిపేదీ నిర్ణయించేందుకు తమతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేయడంతో మళ్లీ యూనివర్సిటీలో హింసాత్మక వాతావరణం నెలకొంది. 

2019లో కూడా సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. 2019లో కేంద్రంలో మంత్రిగా వున్న బాబుల్‌ సుప్రియో (2021లో ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు) అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గనడానికి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగావామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాలు రాజకీయంగా ప్రత్యర్థులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ప్రస్తుతం తృణమూల్‌ మంత్రిపై జరిగిన దాడి నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు వామపక్ష విద్యార్థి సంఘాల కువ్యతిరేకంగా తమ గళం విప్పడం విచిత్ర పరిణామం. ఇదే సమయంలో ఒకప్పుడు మితవాద వామపక్ష మరియు అతివాద వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య కూడా తీవ్ర విభేదాలుండేవి. తాజాపరిణామాల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు ఏకం కావడం మరో విచిత్ర పరిణామం. 

నిజానికి జాదవ్‌ యూనివర్సిటీకి గతంలో హింసాత్మక సంఘటనల చరిత్ర వుంది. నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా వున్న 1970ల్లో అప్పటి యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ గోపాల్‌ చంద్రసేన్‌ క్యాంపస్‌లోనే దారుణహత్యకు గురయ్యారు. ఇంతటి దారుణ సంఘటనలు జరిగినప్పటికీ యూనివర్సిటీలో రీసెర్చ్‌ మరియు ఇతర అకాడమిక్‌ కార్యకలాపాలు దెబ్బతిన్న చరిత్ర లేదు. తాజా పరిణా మాల నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం విద్యార్థి సంఘాల ఎన్నికలు ఆలస్యమైనంత మాత్రాన ఇంతటి దారుణమైన దాడులకు హింసాత్మక చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏ మొచ్చిందని యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే గత ఐదేళ్లుగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపకపోవడం వల్ల పరిపాలన మొత్తం నిరంకుశంగా మారిందని, ప్రజాస్వామ్యం కనిపించడంలేదని వామపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో 2017నుంచి కేంద్రం యూనివర్సిటీకి నిధులను నిలిపివేయగా, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తన వాటా నిధులను గణనీయంగా తగ్గించింది. దీంతో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల నిర్వహణ కష్టతరంగా మారింది. నిధుల కేటాయిం పు విషయంలో ఎవరి వాదనలు వారివే. తమ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా, అసలు క్యాంపస్‌లో అరాచకానికి ప్రధాన కారణం ఈ సంఘాలేనని తృణమూల్‌, బీజేపీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా కేంద్రం జాదవ్‌ యూనివర్సిటీకి ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ గుర్తింపును రద్దుచేసింది. ఈ స్థాయి గుర్తింపునకు అవసరమైన ప్రమాణాలను పాటించక పోవడంవల్లనే ఈ చర్య తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత ముజందార్‌వెల్లడిరచడం గమనార్హం. 

యూనివర్సిటీల్లో రాజకీయ ఆధిపత్యం పేరుతో పెరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, వెస్ట్‌బెంగాల్‌ యూనివర్సిటీస్‌ అండ్‌ కాలేజెస్‌ (కంపోజిషన్‌, ఫంక్షన్‌, ప్రొసీజర్‌ ఫర్‌ ఎలక్షన్స్‌ టు స్టూడెంట్స్‌ కౌన్సిల్స్‌)2017 పేరుతో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యాసంస్థల్లో రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా చేయడమే దీని ముఖ్యోద్దేశం. నిజానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మంచి పని ఇది! ఈ చట్టం ప్రకారం విద్యాసంస్థ ల్లో రాజకీయ పార్టీల ప్రమేయం వుండకూడదు. ఎన్నికల్లో విద్యార్థి కేవలం తన పేరు మీద మా త్రమే పోటీచేయాలి. ఎన్నికల్లో పోటీచేసే విద్యార్థి సంఘాలు ఏ రాజకీయ పార్టీ బ్యానర్‌ లేదా చిహ్నాలను ప్రదర్శించడానికి వీల్లేదు. విద్యార్థి సంఘాలకు ప్రతి రెండేళ్లకోమారు ఎన్నికలు జరపాలి. అంతకుముందు ఏటా నిర్వహించేవారు. అంతేకాదు స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరు స్థానంలో స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ అని ప్రభుత్వం ఈ చట్టంలో పేర్కొంది. ఇక కళాశాలల్లో అయితే ప్రెసిడెం ట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు విద్యార్థులను ప్రిన్సిపాల్‌/వైస్‌ ప్రిన్సిపాల్‌/ఇన్‌చార్జ్‌ టీచర్‌ నామినే ట్‌ చేయాలని చట్టం నిర్దేశించింది. ఇక ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్‌ సెక్రటరీలను విద్యార్థి ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను ఆయా తరగతులకు చెందిన విద్యార్థులు ఎన్నుకో వాల్సి వుంటుంది. అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులు రెండు నుంచి ఐదువరకు వుండవచ్చు. 

ఇక విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌ పోస్టులకు విద్యార్థులను వైస్‌ చాన్స్‌లర్‌ నామినేట్‌ చేయాలి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులకు,వివిధ తరగతులకు చెందిన ప్రతినిధులు ఎన్నుకుంటారు. యూనివర్సిటీ స్థాయిలో పది అసిస్టెం ట్‌ సెక్రటరీ పోస్టులు వుండవచ్చు. ఈవిధంగా విద్యార్థి నేతలు నామినేట్‌ కావడంవల్ల వీరికి ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నించడానికి ఎటువంటి హక్కులుండవు. ఈవిధంగా విద్యార్థులు యూనియన్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. జాదవ్‌ యూనివర్సిటీలో ప్రస్తుతం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న గొడవలకు ఈ ఎన్నికలను గత ఐదేళ్ల కాలంగా నిర్వహించకపోవడమే ప్రధాన కారణం.

భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…

*భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…

*సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి.వెంకటరత్నం..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 24:

 

బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధనకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల రాజీలేని పోరాటం యువతకు స్ఫూర్తి దాయకమని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం అన్నారు. సోమవారం తిరుపతి నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా పి.వెంకటరత్నం మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ దేవ్ పోరాటాలు చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వ మారణకాండను వ్యతిరేకిస్తూ వారు చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయక మన్నారు. స్వాతంత్రం ద్వారా దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగిందే తప్ప భగత్ సింగ్ ఆశయం మేరకు దోపిడీ లేని సమాజం అవతరించలేదన్నారు. నేటి మతోన్మాద దుశ్చర్యల పాలన అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పిడిఎస్యు జిల్లా కార్యదర్శి హెచ్. లోకేష్ మాట్లాడుతూ నేటి యువతరం 23 ఏళ్లకే పక్కసారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేయడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. భగత్ సింగ్ మీరోచిత జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భగత్ సింగ్ ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ స్వాతంత్రం నేటికీ అందలేదన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం పిడిఎస్యు రాజీలేని పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కన్వీనర్ పి.లోకేశ్వర్,
పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ, ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు ఆర్.సుజాత అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు.

28వ వార్డులో .రోడ్డు కోసం త్రవ్వారు. రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు

 

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి లో
ఆరు నెలల క్రితం రోడ్డు మంజూరు అయిందని చెప్పి 28వ శ్రీవాణి కాలేజీ వెనకాల చాణిక్య స్కూల్ వైపు, యాదవ సంఘం భవనం పక్కన రోడ్డు కోసం మట్టిని త్రవ్వారు . దానిపై అక్కడక్కడ డస్ట్ వేశారు ప్రజల ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాధుడు లేడు ఆరు నెలలుగా ఎం ఈ దగ్గరికి వెళ్లినా వారు సమయానికి ఆఫీస్ లో ఉండరని ఫోన్ చేస్తే ఎత్తరు, కాంట్రాక్టర్ ఎవరో తెలియదు,డీ ఈ ని అడుగుతే నాకు తెలియదు నా వర్క్ కాదు అంటూ తప్పించుకున్నారని పబ్లిక్ హెల్త్ డి. ఈ కిందికి వస్తుంది మున్సిపాలిటీ ఏ ఈ ప్రశాంత్ కు సంబంధం అని తెలిపాడు. పబ్లిక్ హెల్త్ డీఈకి ఫోన్ చేసి వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఆరు నెలలుగా 28 వ వార్డు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ద్విచక్ర వాహనాలు కిందపడి కాలు విరగొట్టుకున్నారని జిల్లా అఖిలపక్షఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. వెంటనే ఆ పనులు చేపట్టకుంటే వెంగళరావు కాలనీ మాజీ కౌన్సిలర్ గా ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి జిల్లా కలెక్టర్కు అధికారులకు ఫిర్యాదు చేస్తామని సతీష్ యాదవ్ తెలిపారు.

రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు.

రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

సీతారాముల తలంబ్రాల కోసం రూ.151 తో బుక్ చేసుకుంటే, ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తులకు ఇంటివద్దకే సీతారాముల తలంబ్రాలు చేర్చుతామని, జహీరాబాద్ ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు కోహీర్, సహా వివిధ గ్రామాల్లో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఆసక్తి కలిగిన వారికి బుక్ చేశారు. భక్తులు సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్న వారికి రశీదు అందజేస్తున్న కండక్టర్ బి. నరేష్. సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ కోరారు.

టి బి వ్యాధి పై అవగాహనా..

టి బి వ్యాధి పై అవగాహనా కల్పించిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకొని,మండల వైద్యాధికారి రాయిని అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ముత్తారంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా ప్రజలకి క్షయ వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ క్షయ వ్యాధి అనగా ఏమిటి, అది ఎలా సోకుతుంది, ఎవరికి సోకే అవకాశం ఉంది , క్షయ(టీబీ) సోకిన వారికి ఎటువంటి చికిత్స అందించబడుతుంది సమాజంలో టీబీ వ్యాధి యొక్క తీవ్రత మరియు దాని నివారణ మార్గాలు, మరియు ప్రపంచ టీబీ డే యొక్క ప్రధాన ఉద్దేశం, గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించినారు . దీనిలో భాగంగా రెండు వారాలకు మించి దగ్గు ఉన్నను ప్రతిరోజు సాయంత్రము జ్వరం వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సంప్రదించాలని మరియు టీబీ వ్యాధి పైన ప్రజలతో ఒక ప్రతిజ్ఞ చేయించారు టి బి సోకిన వారు భయపడవద్దని ప్రజలు టి బి వ్యాధి పై పూర్తి అవగాహనగా కలిగి ఉండి వారి యొక్క కుటుంబంలో తద్వారా సమాజంలో టీబీ వ్యాధి బారిన పడకుండా ఉండాలని ,తద్వారా ప్రతి గ్రామము టీబీ రహిత గ్రామంగా ఏర్పడాలని తెలియచేశారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఖమ్మంపల్లి మచ్చుపేట సెంటర్స్ లో లావణ్య ఎం ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి ఎం ఎల్ ఎచ్ పి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పై అవగాహనా కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ గ్రేసీ మనీ . సూపర్వైజర్ రమాదేవి ఏ నేమ్స్ స్రవంతి రమాదేవి సునీత ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ సుస్మిత ఏఎన్ఎం లో శృతి పుష్పలత మరియు ఆశ కార్యకర్తలు శశికళ లత రజిత కల్పన విజయలక్ష్మి జయ అల్లం స్రవంతి ప్రజలు పాల్గొన్నారు

పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.

పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.

అబ్రస్తాన్ మినార్ లను ధ్వంసం చేసిన దుండగులు.

మత సామ్రస్యానికి ప్రతీకంగా ఉన్న మహాదేవపూర్ లో దారుణం.

మీనార్ ల ధ్వంసం ముస్లిం సమాజాన్ని గాయపరిచింది.

ఖబ్రస్తాన్ మీనార్ లపై దుండగల దుశ్చర్య, పోలీస్ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలి.ముస్లింలు.

మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే చర్యలు తప్పవు, ముస్లింలకు పోలీస్ భరోసా,

Ramadan

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

మతసామ్రస్యానికి మారుపేరు మహాదేవపూర్, దశాబ్ది కాలం నుండి కులాలు మతాలు అనే వ్యత్యాసం లేకుండా మానవత్వమే తమ కులం గా భావిస్తూ కలిసికట్టుగా జీవిస్తున్న మహా మండల కేంద్రానికి, ఏమైందో తెలవదు కానీ, ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఖబ్రిస్తాన్ గేట్ వద్ద ఉన్న రెండు మీనార్ లను ధ్వంసం చేయడంతో, తెల్లవారుజామున చుట్టుపక్కల ఉన్నవారు గమనించి మైనారిటీలకు సమాచారం ఇవ్వడం జరిగింది. ముస్లింలు పవిత్రంగా భావించే ఖబరస్తాన్ ప్రధాన గేటు వద్ద ఉన్న మినార్లు గత 15 రోజుల క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. మీనార్ల ను ధ్వంసం చేసిన సమాచారం తెలవగానే పెద్ద మొత్తంలో మైనార్టీలు కబ్రిస్తాన్ వద్దకు చేరి చూడగా ప్రధాన గేటు వద్ద అమర్చిన రెండు మీనార్లను 50% వరకు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఉండడంతో ముస్లిం మైనార్టీలు మనస్థాపానికి గురికావడం జరిగింది. తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.

పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.

Ramadan

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాదేవపూర్ మండలం అనేక సంవత్సరాలుగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ మతాల మధ్య ద్వేషాలు చిచ్చు లాంటి సంఘటనలు మండలంలో ఎన్నడు చోటు చేసుకోలేదు, అన్న విషయం, ప్రజలతో పాటు పోలీస్ రికార్డులో కూడా మహాదేవపూర్ మండల ప్రజల మధ్య ఉన్న ఐక్యత సూత్రాలుగా చెప్పుకోవచ్చు.

అలాంటి మండలంలో పవిత్ర రంజాన్ మాసం లో సోదర భావంగా మెలిగే ప్రజల మధ్య అబ్రస్తాన్ మీనార్ల ధ్వంసం లాంటి దారుణ వ్యవహారం తెరపైకి రావడం ముస్లిం సమాజంలో కాస్త నిరాశను కల్పించింది.

స్థానిక ముస్లిం గ్రామ పెద్దలు గుర్తు తెలియని వ్యక్తుల విశ్చర్యపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముస్లిం గ్రామ పెద్దలు మండల కేంద్రానికి సంబంధించిన ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను వాస్తవాలను పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది.

మండలంలో ఇలాంటి దారుణాన్ని కూడగట్టడం ముస్లింలను ఆవేదనకు గురి చేసిందని గ్రామ పెద్దలు పోలీసులకు వివరించారు.

కుల మత తేడా లేకుండా మానవత్వమే తమ మతంగా దశాబ్దాలుగా ముందుకు వెళుతున్న మండల కేంద్రంలో ఇలాంటి దారుణాన్ని పురుడు పోసిన వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం మత పెద్దలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు.

Ramadan

మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే చర్యలు తప్పవు, ముస్లింలకు పోలీస్ భరోసా.

 

కబ్రిస్తాన్ మీనార్ లా ధ్వంసం విషయంపై స్థానిక ముస్లిం గ్రామ పెద్దలు పోలీసులు ఆచరించడంతో, స్థానిక పోలీసులు అలాగే మహదేవపూర్ డిఎస్పి ముస్లింలకు భరోసా కల్పిస్తూ, మనోభావాలకు దెబ్బతీసే విధంగా దుశ్చర్యలకు పాల్పడితే ఎవరైనా సహించేది లేదని,ఖబ్రస్తాన్ మీనార్ల ను ధ్వంసం చేసిన వారిని సాధ్యమైనంత త్వరలో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్లిం మైనారిటీలు పోలీసులపై నమ్మకంతో ఉండాలని, మీ యొక్క మనోభావాలు కించపరచడం జరిగిన విషయం వాస్తవమే కానీ, ముస్లిం యువకులు గ్రామస్తులు సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని, దుశ్చర్యలకు పాల్పడిన వారిని శిక్షించక తప్పదని మైనారిటీలకు పోలీస్ శాఖ భరోసా కల్పించడం జరిగింది.

డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు..

సిరిసిల్ల పట్టణ ప్రజా వైద్యశాల డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ (ప్రజా వైద్యశాల) ఈరోజు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన సుదీర్గ కాలంగా సిరిసిల్ల ప్రజానీకానికి (ప్రజా వైద్యశాల నెలకొలిపి) వైద్య సేవలు అందించారు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు

సీఎం నోట శుభవార్త విన్నాము

తిరుపతిని మధ్య రహిత క్షేత్రంగా సాధిద్దాం

తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 24:

శ్రీనివాస సదానంద స్వామి స్వాముల ఆధ్వర్యంలో చేపట్టిన తిరుమల పవిత్రతను కాపాడుకుందాం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ను నిలిపివేయాలని నిరసనలు నిరాహార దీక్షలు పాదయాత్రలో చేపట్టిన కార్యక్రమాలను మీడియా మిత్రులు ప్రత్యేకంగా పలుమార్లు ప్రచురించి నందుకు మీడియా మిత్రులకు స్వామివారి భక్తులైన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ నాయకులు శ్రీవారు భక్తుల జగన్నాథం మరియు అభయ హస్త గోవింద సేవ మండలి అధ్యక్షులు చంద్రమౌళి లు అన్నారు,సీఎం తిరుమలకు వస్తున్నారు. సీఎం నోటి శుభవార్త విందురని టిటిడి పాలకమండలి చైర్మన్ స్వాములకు ఫోన్ చేసి స్వయంగా తెలిపారని హిందూ పరిషత్ ఓంకార్ తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళన ముంతాజ్ హోటల్ తోనే మొదలెట్టారని ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,
అలాగే సైనికులకు హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నీ మధ్య రహిత క్షేత్రంగా కలిసి పోరాడుదాం అని పలు పుణ్యక్షేత్రాలలో మధ్యరహిత పుణ్యక్షేత్రాలు గా ఎలాగైతే చేశారో అలాగే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా మధ్యాహ్నం క్షేత్రంగా చేసేంతవరకు హిందువులందరు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభయాస్త గోవింద మండలి సేవా సభ్యులు సురేష్ , రోహిత్ బాబు తదితరులు పాల్గొన్నారు..

సిరిసిల్ల జిల్లా కోర్ట్ జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పి..

సిరిసిల్ల జిల్లా కోర్ట్ జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రేమలత ని సోమవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కని అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులను పరిష్కరించి నేరస్థులకు శిక్షలు పడే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.

BC సంఘాలచే ఎల్. భాస్కర్ కు సన్మానం.

బి సి సంఘాలచే ఎల్. భాస్కర్ కు సన్మానం.

 

పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 23:

 

పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఏక గ్రీవంగా ఎన్నికైన న్యాయవాది ఎల్. భాస్కర్ కు ఆదివారం అయన కార్యాలయం లో బి.సి.సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కృష్ణమూర్తి, వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు, బహు జన హక్కుల సాధాన సమితి రాష్ట్ర అధ్యక్షులు గంపల గంగరాజు,వి. ఆర్.ఎస్.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల విజయ్ మోహన్, వాల్మీకి సంఘ నాయకులు బి. లక్ష్మన్న, టి. మంజు నాథ్, కొటికి శేఖర్, ఎం. నరసింహులు, బాలాజి లు కలిసి ఘనంగా సన్మానించారు. బడుగు,బలహీన వర్గాల వారికి న్యాయం చేయడంలో ముందుండే వ్యక్తి గా ఎల్. భాస్కర్ కు గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన(MLA).

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే

పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 23:

 

పలమనేరు బారసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్. భాస్కర్ ను పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్నాథ్ రెడ్డి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎల్.భాస్కర్ కు శాలువా కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్,గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మీపతి,కార్యదర్శి బర్కత్, ఉపాధ్యక్షులు షేక్ షరిఫ్, చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి. ఆర్. రవి,
సీనియర్ న్యాయవాదులు భగీరథ కుప్పరాజు, ఎస్. రెడ్డెప్పశెట్టి, రాజా రెడ్డి, కె.జగదీశ్, ఎస్.లక్ష్మణ్ రెడ్డి,ఇ.కృష్ణ, ఎన్. నారాయణ రెడ్డి,పి.ఆర్.లోకేష్,
బి.గిరీష్,రాజు,రాజీవ్ గాంధీ, రాజశేఖర్,సుబ్బారామయ్య,సంధ్య, పుష్పాంజలి,చాందిని పలువురు న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..

బెట్టింగ్ యాప్ లకు యువకులు మోగ్గు చూపకండి..

బెట్టింగ్ యాప్ లకు యువకులు మోగ్గు చూపకండి

కరకగూడెం ఎస్సై రాజేందర్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

యువత ఈజీ డబ్బులకు అలవాటు పడి బెట్టింగ్ లకు మొగ్గచూపకుడదని,బెట్టింగ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతను,ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపియల్ క్రికెట్ వెల విపరీతంగా డబ్బులు చేతులు మారుతున్నాయి ఎవ్వరూ ఒక్కరు బెట్టింగ్ లో డబ్బులు గెలుచుకున్నారు అనే వెర్రితనంతో మీరు అ వలలో చిక్కుకోకండి అని అయన తెలిపారు. అలాగె బెట్టింగ్ యాప్స్,ఆన్లైన్ బెట్టింగ్ అడి ఎంతోమంది యువత ప్రణాలు పోగోట్టుకోవడం మనం చూస్తునే ఉన్నాం ఇటువంటి సంఘటనలు మన మండల పరిధిలో జరగకుండా చూడవలసిన భాద్యత మన అందిరిపై ఉందని ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పై ఎక్కువగా ఉందని పిల్లల అవసరాలకు మించి డబ్బులు ఇవ్వకుడాదని అయన తెలిపారు.ఈ బెట్టింగ్ మహమ్మారి వలలో చిక్కుకోని ఎన్నో కుటుంబాలు రొడ్డున్న పడ్డాయని అయన గుర్తుచేశారు.

NHRC జిల్లా సోషల్ మీడియా కన్వీనర్.

ఎన్ హెచ్ఆర్సి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా అయిలోని అభిషేక్.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

మానవ హక్కుల సంఘం సోషల్ మీడియా వరంగల్ జిల్లా కన్వీనర్ గా గీసుగోoడ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అయిలోని అభిషేక్ ను నియమిస్తూ స్టేట్ చైర్మన్ బద్దిపడిగా శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.తనపై నమ్మకంతో బాధ్యతను అప్పజెప్పిన నేషనల్ చెర్మెన్,డాక్టర్ మహమ్మద్ యాసీన్, వరంగల్ జిల్లా అద్యక్షులు గంగుల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి సంస్థలో తన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నెరవేస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ రాష్ట్ర అధ్యక్షులు వారికి జిల్లా తోటి సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తానని అన్నారు. పేద ప్రజల తరఫున చట్టపరమైన దిశలో మానవ హక్కుల చర్యలో తోడ్పాటును నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఆపదలో ఉండే ఈ వ్యక్తికైనా ఎన్ హెచ్ ఆర్ సి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సర్వీస్ అవార్డు అందుకున్న.

కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సర్వీస్ అవార్డు అందుకున్న రాసమళ్ళ కృష్ణ

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లాలోని కేఎంసి మరియు టిబి ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసినందుకుగాను పరకాల మండలంలోని మళ్ళక్కపేట గ్రామానికి చెందిన రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణకి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అభినందిస్తూ ఉత్తమ సర్వీస్ అవార్డు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య,లలిత దేవి తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత శిఖరాలకు ఎదగాలి.

ఉన్నత శిఖరాలకు ఎదగాలి.

ఆకాశానికి నిచ్చెన వేద్దాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి ఆకాశానికి నిచ్చెన వేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను దేశ్ పాండే ఫౌండేషన్ బృందంతో కలిసి ఆయన సందర్శించారు.

MLA

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ఆశయం అన్నారు. చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న 500 విద్యార్థులకు మందికి దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీజనింగ్, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ లలో శిక్షణ ఇస్తారని, వారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదేని సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ్ పాండే ఫౌండేషన్ వారి శిక్షణ మీకు ఉపయోగపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, దేశ్ పాండే ఫౌండేషన్ బృందం ప్రవీణ్ ముత్యాల, శేఖర్, విశ్రాంత ప్రిన్సిపాల్ మురళీమోహన్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ వి.రాజేంద్రప్రసాద్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం.

ఆనందోత్సాహాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం

నేటి ధాత్రి కథలాపూర్

 

ఆనందోత్సవాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. ముఖ్యఅతిథిగా కోట్ల సిఐ సురేష్ బాబు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు కూడా కష్టపడి విద్యార్థులకు మంచి బోధన అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తహసిల్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, డైరెక్టర్ గడ్డం దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

జడ్చర్ల : పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

 

జడ్చర్ల /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం డీసీసీ కార్యాలయంలో జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య మినహా .. మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్, ఉర్కొండ, జడ్చర్ల, నవాబుపేట మండలాల అధ్యక్షులు హాజరు కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కావడం వ్యక్తిగత కారణమా.. పార్టీపై అలక? అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం

 

నేటిధాత్రి:హన్మకొండ

 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్

భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో
గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు

బిఆర్ఎస్ నాయకుల అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం.

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version