ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడానికి కారణం అదే.

ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడానికి కారణం అదే.

మంచి కథలు అనేకం ఉన్నాయి. మంచి రచయితలు అనేకమంది ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కథా గమనంలో సాంకేతికతను చొప్పించటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటానికి ఇదొక మార్గం అని భావిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఓటీటీలో నేరుగా విడుదలయ్యే సినిమాలు… వెబ్‌సీరిస్‌ల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న హీరో.. నవీన్‌ చంద్ర (Naveen Chandra). తాజాగా ఆయన నటించిన ‘షోటైమ్‌’ థియేటర్లలో విడుదలయింది. ఓటీటీ సిరీస్‌ల గురించి… ప్రేక్షకుల అభిమానం గురించి ఆయన ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

మీ దృష్టి కథలపైనా? ఖరీదైన ప్రొడక్షన్‌పైనా?

నేను మంచి కథలను ఎంచుకోవటానికి ప్రయత్నిస్తున్నా. ప్రొడక్షన్‌ విలువలు.. బడ్జెట్‌లు ఈ విషయాలపై కాకుండా నా నటనపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నా. దీనివల్ల కొంత సంతృప్తి కలుగుతోంది. అంతే కాదు… ఈమధ్య కాలంలో నా దగ్గరకు మంచి కథలు వస్తున్నాయి. మంచి డైరక్టర్లు కూడా వస్తున్నారు.

కొన్ని చిన్న సినిమాలు ఓటీటీల్లో (Ott Movies)సూపర్‌హిట్‌ అవుతున్నాయి. అవే సినిమాలను చూడటానికి ప్రేక్షకులు థియేటర్‌కు ఎందుకు రావటం లేదు?

మా ప్రమోషన్‌ సరిపోవటంలేదా… అనే అనుమానం వస్తోంది. చిన్న సినిమాలకు సోషల్‌ మీడియాలో ఎక్కువగానే ప్రమోషన్స్‌ చేస్తున్నాం. ప్రేక్షకుల కామెంట్స్‌ కూడా పాజిటివ్‌గా వస్తున్నాయి. కానీ ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమాలను ఎక్కువగా ఎందుకు చూడటం లేదనే విషయం తెలియటంలేదు. ఒకప్పుడు మొదటి రోజు ‘సినిమా బాగుంది’ అనే టాక్‌ వస్తే ప్రేక్షకులు తప్పనిసరిగా థియేటర్‌కు వస్తారనే నమ్మకం ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రకాలుగా బాగుందని నిర్ణయించుకుంటేనే థియేటర్‌కు వస్తున్నారు. మేము కూడా చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మీకు ఏ తరహా పాత్రలంటే ఎక్కువ ఇష్టం?

ఒక నటుడిగా రకరకాల పాత్రల్లో నటించటానికి తగిన శిక్షణ తీసుకొని సిద్ధంగా ఉన్నా. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా… ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు, వెబ్‌సిరీ్‌సలలో మంచి పాత్రలే లభించాయి. ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. ఈ మధ్య విడుదలైన ‘షోటైమ్‌’ చిన్న సినిమా. కామెడీ థ్రిల్లర్‌. చాలా సహజంగా ఉంటుంది. మన జీవితంలోని సంఘటనలే దీనిలో కనిపిస్తాయి. నేను జిమ్‌ కోచ్‌గా నటించాను. కొన్ని ప్రీమియర్‌ షోలు వేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో ఎక్కడా వయలెన్స్‌ ఉండదు. పెద్ద పెద్ద ట్విస్ట్‌లు ఉండవు. రాజా రవీంద్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇక నేను చేసిన మిగిలిన పాత్రల విషయానికి వస్తే… ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నాకు డూప్‌ దొరకలేదు. దాంతో ఆ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లన్నీ నేనే చేశా. ఇదే విధంగా ‘పరంపర’ సీరియల్‌ ఒక ఫ్యామిలీ డ్రామా. దీనిలో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషించా. రాబోయే ఒక సినిమాలో పరిస్థితులకు తగినట్లుగా హ్యూమర్‌ ఉంటుంది. ఈ పాత్ర చాలా బాగా వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందనుకుంటున్నా.

మంచి కథలు అనేకం ఉన్నాయి. మంచి రచయితలు అనేకమంది ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కథా గమనంలో సాంకేతికతను చొప్పించటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటానికి ఇదొక మార్గం అని భావిస్తున్నారు. అయితే కథకు అవసరమైన మేరకే సాంకేతికతను జొప్పించాలి. లేకపోతే మొత్తానికే మోసం వస్తుంది.

టెలివిజన్‌ స్థానాన్ని ఓటీటీ ఆక్రమించిందని అనుకుంటున్నారా?

కొంతవరకు ఆక్రమించింది. ఒకప్పుడు టెలివిజన్‌ను రోజంతా చూసేవారు. ఇప్పుడు యాప్స్‌ వచ్చేశాయి. దీనిలో సీరియల్స్‌, సినిమాలు ఏవైనా చూసుకోవచ్చు. టెలివిజన్‌లో చూడటానికి ఎన్ని ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఉంటాయో.. అవన్నీ ఓటీటీలోనూ లభిస్తున్నాయి. దీనివల్ల ఇంట్లో కూర్చొని చూసే ప్రేక్షకులకు ఓటీటీ ఒక వరం. దీంతో ఎక్కువమంది అటు టెలివిజన్‌.. ఇటు ఓటీటీ రెండూ చూస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే… ఒక వారం బాగా ఆడాలి. ఏదైనా పెద్ద సినిమాను తీసుకుందాం. విడుదలైన తర్వాత రెండు రోజులు హీరో అభిమానులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ రావాలి. కానీ ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకుల్లో ఎక్కువమంది ఇల్లు కదిలి థియేటర్‌కు రావటానికి ఇష్టపడటం లేదు. దీని ప్రభావం సినిమాలపై పడుతోంది.

ఓటీటీలలో మీ సక్సెస్‌ రేట్‌ చాలా ఎక్కువనుకుంటా?

నేను చేసిన సిరీ్‌సలు, సినిమాలు అన్నీ ఓటీటీల్లో సూపర్‌హిట్‌ అయ్యాయి. కొందరైతే నన్ను ‘ఓటీటీ కింగ్‌’ అంటున్నారు. మా చెల్లి హైదరాబాద్‌లో పని చేస్తోంది. తను ‘షోటైమ్‌’ చూసింది. మొన్న వచ్చి… ‘నవీన్‌ అన్నా… షోటైమ్‌ చూశా. చాలా బాగుంది. ఓటీటీలో వస్తే పెద్ద హిట్‌ అవుతుంది. నీకు ఓటీటీలో ఎక్కువ ఫ్యాన్స్‌ ఉన్నారు’ అంది. నాకు ఎలా రియాక్ట్‌ కావాలో అర్ధంకాలేదు. నేను ఇప్పటిదాకా నాలుగు వెబ్‌ సిరీ్‌సలు, నాలుగు వెబ్‌ ఫిల్మ్స్‌ చేశాను. ఇవన్నీ బాగా హిట్‌ అయ్యాయి. దీనికి ఒక కారణం ఉంది. ఓటీటీ ప్రారంభ దశలో నాకు హీరో వేషాలు రాలేదు. పెద్ద పెద్ద నటులున్న సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ వచ్చాయి. ఓటీటీలో ఇన్‌స్పెక్టర్‌ ‘రుషి, అమ్ము, భానుమతి రామకృష్ణ, బ్రో’ లాంటివన్నీ బాగా హిట్‌ అయ్యాయి. ‘లెవెన్‌’ సినిమాను రెండు వారాల్లో 25 కోట్ల మంది చూశారు. చాలామంది వీటిని ఓటీటీ వచ్చిన వెంటనే చూసేస్తారు. ఇదే విధంగా థియేటర్లలో నా సినిమాలు చూడాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటా!

మొసలిని పెళ్లాడిన మేయర్.. కారణం ఏంటంటే..

మొసలిని పెళ్లాడిన మేయర్.. కారణం ఏంటంటే..

 

 

 

హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఓ ఆడ మొసలిని పెళ్లాడారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి పెళ్లి డ్రెస్ కూడా వేశారు.

మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకోవటం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. జాతకంలో దోషాలు ఉన్నపుడు.. అది కూడా పెళ్లి సమయంలో దోష నివారణ కోసం ఇలా మనుషులు.. జంతువుల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ, మెక్సికో దేశంలో ఓ వింత ఆచారం ఉంది. మనుషులు మొసళ్లను పెళ్లి చేసుకోవటం తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఇది పెళ్లి విషయంలో దోష నివారణం కోసం అయితే కాదు.

మెక్సికో, శాన్‌పెడ్రోలోని హ్యూమలూలాలో 230 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం ఉంది. అక్కడి మగవారు మొసళ్లను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అలా చేయటం వల్ల వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని, మత్స్య సంపద బాగుంటుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రతీ ఏటా మనుషులు మొసళ్లను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.

తాజాగా, హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఓ ఆడ మొసలిని పెళ్లాడారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి పెళ్లి డ్రెస్ కూడా వేశారు. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత మేయర్.. తన భార్య మొసలిని ముద్దులతో, హగ్గులతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

జడ్చర్ల : పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

 

జడ్చర్ల /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం డీసీసీ కార్యాలయంలో జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య మినహా .. మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్, ఉర్కొండ, జడ్చర్ల, నవాబుపేట మండలాల అధ్యక్షులు హాజరు కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కావడం వ్యక్తిగత కారణమా.. పార్టీపై అలక? అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version