ఇది నిజంగా వింతే తనను తానే డెలివరీ చేసుకున్న టెస్లా కార్.

 ఇది నిజంగా వింతే తనను తానే డెలివరీ చేసుకున్న టెస్లా కార్…

 

తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ మానవులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అమెరికా ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ అయిన టెస్లా మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఓ కొత్త టెస్లా కారు తనను తాను స్వయంగా డెలివరీ చేసుకుంది.టెక్నాలజీ (Technology) రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ సహాయంతో ఎన్నో పనులు సునాయాసంగా అయిపోతున్నాయి. షాపింగ్ కోసం వెళ్లే పని లేకుండా ఏ వస్తువు కావాలంటే అది మన ఇంటి గుమ్మం ముందుకే వచ్చేస్తోంది. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ మానవులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అమెరికా ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ అయిన టెస్లా (Tesla) మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది (Tesla car Makes Driverless Delivery).తాజాగా ఓ కొత్త టెస్లా కారు తనను తాను స్వయంగా డెలివరీ చేసుకుంది. కార్ల ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గరిష్టంగా 115 కిలో మీటర్ల వేగంతో నేరుగా తన యజమాని ఇంటికి వెళ్లిపోయింది. టెస్లా సంస్థకు చెందిన ‘మోడల్ వై’ కారు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓనర్ ఇంటికి భద్రంగా చేరుకుంది. మార్గమధ్యంలో సిగ్నళ్లు, హైవేలు, ఫ్లై ఓవర్లను కూడా సునాయాసంగా దాటేసింది. ఈ ప్రయాణం మొత్తాన్ని ఆ కారులోని డ్యాష్ కామ్ రికార్డు చేసింది.కాగా, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టింది. అలాగే తాజాగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా, రిమోట్ ఆపరేటింగ్ కూడా లేకుండా పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి అటానమస్ కారు కూడా టెస్లా సంస్థకు చెందినదే. ఆ కారు జర్నీ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన మస్క్ సంస్థ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

చీకటి ని అంతం చేయాలి.

చీకటి ని అంతం చేయాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గల మేరీ మాత చర్చి ఎదురుగా ఓపెన్ గ్రౌండ్లో మూడు రోజులకు గాను ఏర్పాటు చేసిన ప్రార్థన కూడికలు బుధవారం మూడవ రోజు విశ్వాసులు భారీగా తరలివచ్చి ప్రార్థన కూడికలో పాల్గొని ఆరాధించారు. ఈ ప్రార్థన కూడికలు ఘనంగా జరిగాయి.మనోహరమైన పునరుత్థాన పండుగలలో ముఖ్య వర్తమానికులు రెవరెండ్ చార్లెస్ పి.జాకబ్ ఫిలదె ల్ఫియాఎజిచర్చ్ విజయవాడ పాస్టర్ దైవ సందేశాన్నఅందించారు. చీకటి ని ప్రతి ఒక్కరు అంతం చేయాలని తన ఇంటికి చీకటి ని పంపియాలి అని చక్కటి ప్రసంగాని వినిపించడం జరిగింది. ఎప్పుడు జరుగాని కానివిని ఎరుగని రీతిలో ఈ పండుగలు జరిగాయి.

రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు.

రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

సీతారాముల తలంబ్రాల కోసం రూ.151 తో బుక్ చేసుకుంటే, ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తులకు ఇంటివద్దకే సీతారాముల తలంబ్రాలు చేర్చుతామని, జహీరాబాద్ ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు కోహీర్, సహా వివిధ గ్రామాల్లో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఆసక్తి కలిగిన వారికి బుక్ చేశారు. భక్తులు సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్న వారికి రశీదు అందజేస్తున్న కండక్టర్ బి. నరేష్. సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version