జాతీయసేవారత్న అవార్డు అందుకున్న న్యాయవాది రమేష్ నాయక్…

జాతీయసేవారత్న అవార్డు అందుకున్న న్యాయవాది రమేష్ నాయక్

భూపాలపల్లి నేటిధాత్రి

బహుజన సాహిత్య అకాడమీ 2026 అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది భూక్య రమేష్ నాయక్ జాతీయ సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈమేరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో న్యాయవాది రమేష్ నాయక్కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు, నేషనల్ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మెన్ వల్ల నాధాకృష్ణ చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు రాధకృష్ణ్ను మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థి దశలో విద్యార్థుల హక్కులకై, టీఎస్ జెన్కోలో హెన్ఆర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ కార్మిక నేతగా ఎదిగి కార్మికుల హక్కులను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. అంతేకాకుండా జెన్కోలో నిరుద్యోగులకు ఉద్యోగాలశాలు కల్పించాలని అనేకపోరాటాలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాడన్నారు. 2019 నుండి న్యాయవాద వృత్తిని చేపట్టి రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో న్యాయం వైపు వాదిస్తూ అనేకమంది బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు న్యాయ సేవలను అందించినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ న్యాయవాది రమేష్నాయక్కు జాతీయ సేవారత్న అవార్డు అందజేశామన్నారు. రమేష్ నాయక్ మున్ముందు రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు తనవృత్తి పరమైన, ఇతరత్రమైనా మరిన్ని సేవకార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. జాతీయస్థాయిలో సేవారత్న అవార్డు అందుకున్న న్యాయవాది రమేష్ నాయక్ను జిల్లా కేంద్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు, న్యాయవాదులు, విద్యావంతులు అభినందించారు.

అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు సన్మానం

బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు ఘనoగా సన్మానం
వనపర్తి నేటిదాత్రి :

 

 పట్టవనపర్తిణంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది డి కిరణ్ కుమార్ నివాసంలో శాలువతో ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్రమంలో కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి చిదేర వెంకటేశ్వర్లు గంధం రాజు వెంకటేష్ పరమేష్ సురేష్ బాబు బాస్కర్ సంబు వెంకట్ రమణ విజయ సన్మానము చేసిన వారిలో ఉన్నారు

బిఆర్ఎస్ నాయకుల అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం.

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version