ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని వద్ద యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సిహెచ్.భీమ్రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగే స్వామి జెండాను ఆవిష్కరించి,కేకును కట్ చేశారు.అనంతరం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.1947 మే 3న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య బేబీ కృపాలాని ఐఎన్టీయూసీ ని స్థాపించారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు,సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిపెట్టిన ఘన చరిత్ర ఐఎన్టియుసి యూనియన్ ది అని కొనియాడారు.30 మిలియన్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక కార్మిక సంఘం అని అన్నారు. జాతీయస్థాయిలో ఇన్ని సభ్యత్వాలు కలిగి ఉండడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ లు కార్మికుల హక్కులను సాధించడమే ధ్యేయంగా నేటి వరకు కృషి చేయడమే అన్నారు.రానున్న రోజులలో యూనియన్ను మరింత బలమైన కార్మిక సంఘంగా నిర్మించడం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు పేరం రమేష్,ల్యాగల శ్రీనివాస్,ఫిట్ కార్యదర్శి నంబయ్య,జిల్లా కార్యదర్శి బీమ్ రవి, ఉపాధ్యక్షులు జే.నర్సింగ్,ఫిట్ అసిస్టెంట్ కార్యదర్శిలు మహేష్ రెడ్డి,శ్రీను,రవి, కార్యదర్శులు చందు పటేల్,బి.అశోక్,చిన్నయ్య, మహేందర్ రెడ్డి,రాజు,మల్లేష్ పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ .

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( ఐ ఎన్ టి సి 327) ఘనంగా మేడే వేడుకలు

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి

 

 

 

ఈరోజు తొర్రూరు డివిజన్లో ఐ ఎన్
టి సి 327
సంఘం ఆధ్వర్యంలో మే డేను ఘనంగా నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు కే భోజలు జెండా ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.
ఇకార్యక్రమంలో మహబూబాబాద్ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ పాషా, మరియు జిల్లా నాయకులు పసుపులేటి మధు తొర్రూరు డివిజన్ కార్యదర్శి డి సికిందర్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగరాజు, డీసెంట్ ట్రెజరర్ కే రవికుమార్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పి రాజశేఖర్, డివిజన్ ఆఫీస్ సెక్రటరీ పి సునీల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చించు సంతోష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి గారు మరియు తొర్రూర్ డివిజన్ కార్మికులు డోలు వెంకటస్వామి, సైదులు, యాకుబ్ రెడ్డి, లింగారెడ్డి, సతీష్ ,హరిప్రసాద్, ఖాజాబీ, సంధ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం.

ఆనందోత్సాహాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం

నేటి ధాత్రి కథలాపూర్

 

ఆనందోత్సవాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. ముఖ్యఅతిథిగా కోట్ల సిఐ సురేష్ బాబు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు కూడా కష్టపడి విద్యార్థులకు మంచి బోధన అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తహసిల్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, డైరెక్టర్ గడ్డం దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version