3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి…

3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ 16వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల మంజుల ని గెలిపించాలంటు ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 10 ఏళ్లుగా నిజాయితీతో, నిబద్ధతతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేశాం.
రాబోయే సంవత్సరాల్లో కూడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని మాట ఇస్తున్నాం.అందుకే మీ అందరి ఆశీర్వాదం అవసరం. భూమి పట్టాల విషయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పా, ప్రైవేట్ పట్టా భూముల విషయంలో, పట్టాదారులను ఒప్పించి ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ ఇచ్చి, ఎమ్మార్వో ద్వారా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం జరిగింది ఆ దిశగా పనిచేసినం,త్వరలోనే వాళ్ళని ఒప్పించి మీకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
3వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేస్తున్న పిల్లలమర్రి శారద నారాయణ ని 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న జ్యోతుల మంజుల ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు…

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కిలి దేవికుంట (1వ వార్డు) బిఆర్ఎస్ అభ్యర్థి కోనాపురం ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. “అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి” నినాదంతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బుధవారం జరిగిన ప్రచారంలో మహిళలు, వార్డు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గతంలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి ‘కారు’ గుర్తుపై భారీ మెజార్టీతో గెలుస్తామని, ఎక్కిలి దేవి కుంటను నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కోహిర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: తలారి సతీష్

కోహిర్ పట్టణంలోని 2వ వార్డు భీమ్ నగర్ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సతీష్, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన ఆయన, కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తూ పథకాలు అందరికీ అందుతున్నాయని, వార్డు ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని పేర్కొన్నారు. గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలను కోరారు.

అంచున పొంచి ఉన్న ప్రమాదం…

అంచున పొంచి ఉన్న ప్రమాదం

ఆదమరిస్తే అనంత లోకాలకి

ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
గుండాల,భద్రాద్రికొత్తగూడెం

జిల్లా,నేటిధాత్రి :

 

గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి మృత్యు మార్గంగా మారింది, ఆ రహదారి నుంచి వెళ్లే ప్రయాణికులు ఆదమరిస్తే అనంత లోకాలకు పోవడం ఖాయమని ఆదివాసీ నాయకులు సాయనపల్లి గ్రామానికి చెందిన వాగబోయిన చంద్రయ్య దొర అన్నారు. అయన మాట్లాడుతూ గత వర్షాకాలం సీజన్లో వరద ప్రవాహానికి కలవాటు కోతకు గురై ప్రమాదకరంగా మారింది స్థానిక పంచాయతీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ప్రమాదకర మలుపుగా మారింది ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పలుమార్లు స్థానిక అధికార్ల కు చెప్పితే ఆర్ అండ్ బి అధికారలుకు తెలియజేసిన రెండు మూడు రోజులలో సరిచేస్తాం అని చెబుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే ప్రమాదకరమైన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.

కల్తీ కల్లు బలి: చేవెళ్లలో ఒకరి మృతి

ప్రాణం తీసిన కల్తీ కల్లు

• చేవెళ్ల మండలంలో కల్తీ కల్లు అరాచకం
• కల్తీ కల్లుకు ఒకరు బలి
• అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కల్తీ కల్లు
• అడ్డదారిలో వసూళ్ల ఆరోపణలలో ఎక్సైజ్ సీఐ
• గల్లీకో బెల్ట్ షాప్ గ్రామానికో కల్తీ కల్లుదుకాణం
• చేవెళ్ల ఎక్సైజ్ సీఐ కనుసన్నలోనే కల్తీకల్లు ఆరోపణలు
• మామూళ్లమత్తులో జోగుతున్న చేవెళ్ల ఆబ్కారీ
• కల్తీకల్లుపై కనిపించని అధికారుల నిఘా
• సీహెచ్‌, ఆల్ఫాజోలం కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

చేవెళ్ల మండలంలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది.
మంగళవారం చేవెళ్ల మున్సిపల్ పట్టణణానికి చెందిన దామరగిద్ద నర్సిములు వయస్సు( 64 )ధర్మసాగర్ కల్లు తాగి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో చేవెళ్ల పట్టణకేంద్రంలో హాఠత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం నర్సిములు మంగళవారం ఉదయం 7 గంటలకు కళ్లుతాగడానికి వెల్లాడని నర్సిములు కూతురు సంతోష తెలిపింది. కాని ఉదయం 11 గంటల సమయంలో కల్లు తాగి, వెంట కల్లు ప్యాకెట్లు తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కుప్పకూలి మృతిచేందడని తెలి.

ధనార్జనే ద్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేడ్‌(సీహెచ్‌), ఆల్ఫాజోలం, డైజోఫామ్‌ వంటి మత్తు పదార్థాలతో ధర్మసాగర్ లో కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు. మామూళ్ళకు అలవాటు పడిన కొందరు ఆబ్కారీ అధికారులు ఈ నిర్వాహకులతో అంటకాగుతూ మొక్కుబడి దాడులతో ప్రజల ప్రాణాలు తీయడంలో పరోక్ష పాత్ర పోషిస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చేవెళ్ల మండలంలో పరిధిలోని ధర్మసాగర్ కల్లు

 

లిక్కర్ తో పోటీపడి అంతకు మించిన కిక్కు కోసం ప్రాణాలు తీస్తున్నారు కల్తీ కల్లు నిర్వాహకులు. ఇప్పటికే ఈ కల్లుతాగి ఎంతోమంది అమాయకులు వేరు వేరు సంఘటనలో ( రోడ్డు ప్రమాదం,కుప్పకూలి , హటాత్తు మరణాలు) ధర్మసాగర్, కందవాడ, పలు కల్లు కంపౌండ్‌లలో విచ్చల విడిగా నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే కల్తీ కల్లు తాగి మృత్యువాత పడుతునట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

• చేవెళ్ల అబ్కారి సీఐ కనుసన్నలోనే కల్తీకల్లు

చేవెళ్ల ఎక్సైజ్ సీఐ శ్రీలత ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి
కల్లు మాఫియా రెచ్చిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల మండలంలో పలు కల్తీ కల్లు కంపౌండ్‌ల వెనక అబ్కారి సీఐ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మృతిచెందిన కల్తీ కల్లు నిర్వాహకులు యతేచ్చగా కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో గత కొంత కాలంగా ధర్మసాగర్, కందవాడ కల్లు కంపౌండ్‌లలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నో కల్తీ కల్లు ఘటనలు చోటుచేసుకున్నా చేవెళ్ల ఎక్సైజ్ శాఖ అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. కల్తీ కల్లు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి,చేవెళ్ల ఎక్సైజ్ సీఐ శ్రీలతపై ఉన్నతధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్ చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version