కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని టిటు క్వార్టర్స్ కారల్ మార్క్స్ కాలనీ 26 వార్డు అభ్యర్థి దుర్గం రాదా ఐలయ్య 7వార్డు అభ్యర్థి నూకల భూలక్ష్మి చంద్రమౌళి గెలుపుకై సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ…రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు
