నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం..

నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ఝరాసంగం మండల కొల్లూరులో ప్రభుత్వ పాటశాలకు నూతన పెయింటింగ్ వేయించడం జరిగింది,ఎన్నో రోజులుగా పాటశాలకు పెయింటింగ్ లేక బోషి పోయిన పాటశాలకు నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టినవేంటనే గ్రామ పంచాయతీ కార్యాలయానికి మరియు పాటశాలకు ప్రభుత్వా కార్యాలయాలకు నూతన వరువడి సృష్టించాలనే మంచి ఉద్ధ్యేశంతో పెయింటింగ్ వేయించడం జరిగింది.బడిని దేవాలయం గా బావించే మనము మన పిల్లలకు చక్కని వాతవరణంలో విద్యను అందజేయాలనే మంచి సంకల్పంతో పాటశాలకు పెయింటింగ్ వేసి ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ప్రభుత్వా పాతశాలను రూపుదిద్దడం జరిగింధని నూతన పాలకవర్గం అభిప్రాయపడింది,అలాగే గ్రామంలో గల విద్యార్థుల తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేసారు…ఈ కార్యక్రమము గ్రామ పెద్దలు మరియు గ్రామ నూతన పాలకవర్గం అధ్వర్యంలో నిర్వహించారు..

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం….

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్

 

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు చేశాడు (Akhtar on Pakistan loss).
‘మేము మ్యాచ్‌లో ఏ దశలోనూ పోటీలో లేము. షాహీన్ 125 కి.మీ./గం. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంత వేగం ఆధునిక క్రికెట్‌కు అవసరం లేదు. వీరు ఒత్తిడిని తట్టుకునే ప్రతిభావంతులు కాదు. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఏ దశలోనూ భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేము. గత 15-20 సంవత్సరాలుగా క్రికెట్‌పై మేం నిజాయితీగా పెట్టుబడి పెట్టలేదు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించలేదు’ అని అక్తర్ పేర్కొన్నాడు 

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

◆-: ఆల్ఫాబెట్స్ ఆధారంగా కౌన్సిల్ సభ్యులకు బల్లాల ఏర్పాటు

◆-: చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, డీఎస్పీ సైదా నాయక్ లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కౌన్సిల్ సభ్యులందరికీ ప్రమాణం చేయించిన అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక కేంద్రం పరిసరాల్లో అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్సై వినయ్ కుమార్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. ఉద్రిక్తం…

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. ఉద్రిక్తం

 

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి.

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నికకు మేజిక్ ఫిగర్ 10 ఓట్లు అవసరం. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 9 వార్డులు, కాంగ్రెస్‌కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జనసమీకరణ వ్యూహం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

పొత్తు ధర్మాన్ని వీడని ఎర్ర సూరీలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి గడ్డం వివేక్ ఇలాఖలో చక్రం తిప్పి మునిసిపాలిటీ గద్దెపై గులాబీ జెండా ఎగిరేలా ఎర్ర సూరీల తో వ్యూహాలు రచించి విజయం సాధించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ఎర్ర సూరీలు గులాబీ జెండా కు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి , మంత్రి ఇలాకాలో గులాబీ జెండా ఎగరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్న సిపిఐ పార్టీ నాయకులు క్యాతనపల్లిలో అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడంతో అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులను తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీతో జతకట్టినట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి ఒకవేళ ప్రస్తుత సందర్భాలలో కాంగ్రెస్ తో జతకడితే క్యాతనపల్లి మునిసిపాలిటీలో సిపిఐ పార్టీకి మునగడ కరవయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎర్ర సూరీలకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మునిసిపాలిటీలో గులాబీ జెండా ఎర్ర సూరీలతో కలిసి ఎగురుతోందని ప్రజలంతా భావిస్తున్నారు. అలానే జరగాలని ప్రజలంతా ఓటర్లంతా కోరుకుంటున్నారు. ఎర్ర సూరీలు సైతం పొత్తు ధర్మాన్ని విస్మరించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

నేను రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు వక్రీకరించారు: సీఎం రేవంత్

నేను రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు వక్రీకరించారు: సీఎం రేవంత్

గిరిజనుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని అన్ని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రహదార్లు లేకుండా ఏ తండా ఉండకూడదన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో సంత్‌ శ్రీ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో లంబాడా యువకులది ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 4 నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.

సంత్ సేవాలాల్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

సంత్ సేవాలాల్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

 

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

అమరావతి: గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..
ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అహింస, మానవత్వం, సమానత్వానికి సేవాలాల్ మార్గదర్శనం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సేవాలాల్‌ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు చూపిన శాంతి మార్గాన్ని, ఆయన బోధించిన జీవన విలువలను మనసారా స్మరించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

కాగా, ఉండవల్లిలోని తన కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 287 జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’రూ.50లక్షలు కేటాయించి సేవాలాల్‌ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తాం. ఆయన మన రాష్ట్రంలో జన్మించడం మనందరి అదృష్ట

సేవాలాల్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శమే. సేవాలాల్‌ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. నీట్‌, ఐఐటీ సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తాం. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేస్తున్నాం. 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించాం’ అని చెప్పారు.

మధుమేహ ఔషధం..

మధుమేహ ఔషధం

 

 

 

అమెరికా ఈ ప్రపంచానికి ఇచ్చిన ద్రవ్యాల్లో మొక్కజొన్న, మిరపకారం, బొప్పాయి, జామ వంటి పండ్లతో పాటు టమాటా, పొటాటో వంటి శాకాలున్నాయి.

న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

అమెరికాలో ఉల్లిపాయ రంగులో ఉండే ‘సస్టాబెక్రీ జామ’ను 17వ శతాబ్దంలో మెక్సికో నుంచి డచ్‌ వాళ్లు మొదట మలేసియాకి తెచ్చి సాగు చేయిస్తే, అది లేత పసుపు రంగులో పండింది. మలయాభాషలో దాన్ని ‘జంబూ బటూ’ అన్నారు. ఆ తరువాత వాళ్లు పాలకొల్లు వంటి తెలుగు ప్రాంతాల్లో రైతుల ద్వారా సాగుచేయించారు. ‘జంబూ బటూ’ కాలక్రమంలో తెలుగులో ‘జామ’య్యింది.

నిమ్మ, నారింజలాంటి పుల్లని పండ్లలోనే సాధారణంగా ‘సి’ విటమిన్‌ ఎక్కువగా ఉంటుందని, పుల్లగా ఉంటేనే ‘సి’ విటమిన్‌ ఉన్నట్టనీ అనుకుంటాం. కానీ, 100 గ్రాముల జామపండులో సుమారు 80 మి.గ్రా. విటమిన్‌ ‘సి’ ఉంటుంది. ఇది నిమ్మకంటే ఎక్కువ. ఎర్రని గుజ్జు ఉండే జామపండులో ‘ఏ’ విటమిన్‌ అధికం. సూక్ష్మజీవుల్ని నాశనం చేసే ఫ్లేవ నాయిడ్స్‌ కూడా జామలో అధికం. పొటాషియం, రాగి, మ్యాంగనీస్‌ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు కలిగిన జామ, మధుమేహం కలవారు, స్థూలకాయులు తప్పక తినదగినది. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల విషదోషాలు హరించడంలో సాయపడుతుంది.

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

 

 

పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(World Cup 2026)లో ఇప్పటికే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్, అమెరికా, స్కాట్లాండ్, జింబాబ్వే వంటి పలు జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అంతేకాక ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించినంత పని చేశాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్టును ఓడించి.. ఈ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఇలా సాగుతున్న పొట్టి ప్రపంచ కప్2026లో క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడు అభిమానులను భయపెడుతున్నాడు.

గిన్నిస్‌’ పంతులమ్మ…

గిన్నిస్‌’ పంతులమ్మ

 

సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుని, శేష జీవితం హాయిగా విశ్రాంతి తీసుకుందామను కుంటారు చాలామంది. అయితే తొమ్మిది పదుల వయసులోనూ అలుపెరగకుండా పాఠాలు బోధిస్తూ అదరగొడుతోంది అమెరికాకు చెందిన బెవర్లీ హానెట్‌ ప్రైస్‌ అనే బామ్మ

సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుని, శేష జీవితం హాయిగా విశ్రాంతి తీసుకుందామను కుంటారు చాలామంది. అయితే తొమ్మిది పదుల వయసులోనూ అలుపెరగకుండా పాఠాలు బోధిస్తూ అదరగొడుతోంది అమెరికాకు చెందిన బెవర్లీ హానెట్‌ ప్రైస్‌ అనే బామ్మ. ఏకధాటిగా 67 ఏళ్ల నుంచి ఉపాధ్యాయురాలిగా సేవలు అందిస్తున్నందుకుగాను ‘ప్రపంచంలో సుదీర్ఘకాలం సేవలందించిన భాషా ఉపాధ్యాయురాలిగా’ గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.

బెవర్లీకి చిన్నతనం నుంచి చదువంటే మహా ఇష్టం. అందుకే గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక, 1958లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ మొదలెట్టింది. పాఠాల్ని ఆర్ట్స్‌-క్రాఫ్ట్స్‌, నృత్య సంగీత రూపంలో, సైన్స్‌-సాంకేతికతను జోడిస్తూ… విభిన్నపద్ధతుల్లో ఆమె చేసే బోధన పిల్లల్ని తెగ ఆకట్టుకునేది. ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు, జీవితానుభవాలను బోధిస్తూ వారిలో స్ఫూర్తి కలిగిస్తుంటుంది.దివంగత నటుడు రాబిన్‌ విలియమ్స్‌, మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్‌ బాల్మర్‌… ఈ టీచరమ్మ శిష్యులేనట. ‘ఉపాధ్యాయ వృత్తికోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తిగా’ బెవర్లీని గిన్నిస్‌ బుక్‌లో ప్రశంసించి రికార్డు సర్టిఫికేట్‌ అందజేసింది. ‘చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు.. అది మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం’ అంటోన్న ఈ టీచరమ్మ ఎంతైనా ఆదర్శనీయురాలే కదా.

మింగింది కక్కాలే..నూక లేని బియ్యం పెట్టాలే!?

`కాపాడిన “సీఎం రేవంత్ రెడ్డి”ముందు మోకరిల్లాలే!

`”మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి” నీ అబాసపాలు చేయాలని చూశారు!

”నేటిధాత్రి” దెబ్బకు మిల్లర్లు విలవిల!

”నేటిధాత్రి” కథనానికి ఢిల్లీలో “సీఎం రేవంత్, మంత్రి ఉత్తం” కేంద్ర సివిల్ సప్లై శాఖ మంత్రి “ప్రహల్లాద జోషి”తో మంతనాలు.

`మిల్లర్ల తరపున సీఎం రేవంత్ రెడ్డి “కేంద్రమంత్రి” కిమాట ఇచ్చారు?

`”ఢిల్లీ”లో రాష్ట్రం పరువు తీయాలని చూసిన మిల్లర్లు.

`”ఎఫ్ సిఐ” మేనేజర్ తో అడ్డదారి తొక్కుదాం అనుకున్నారు.

`అడ్డంగా ఇరికిన మిల్లర్లు.. మూసుకుపోయిన దొడ్డి దార్లు?

`బియ్యం లేని మిల్లర్లకు చుక్కలు!

`మిల్లర్ల దిమ్మ తిరిగి భైర్లు కమ్మిన కళ్ళు!

`తప్పు చేశామని ఒప్పుకోవాలె!

`కాపాడిన సీఎం రేవంత్ రెడ్డి ముందు మోకరిల్లాలే!

`రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మోసం చేశామని ఒప్పుకోవాలె?

`ఢిల్లీలో రాష్టం పరువు తీయాలని చూశారు?

`మంత్రి ఉత్తమ్ కుమార్ ను అబసుపాలు చేయాలని చూశారు!

`”ఎఫ్ సిఐ జిఎం” తో మేనేజ్ చేయాలనుకున్నారు.

`ప్లాన్ ల మీద ప్లాన్ లు వేశారు!

`కోట్లలో బేరాలు చేసుకున్నారు!

`ప్రభుత్వం పరువు తీయాలని చూశారు.

`బకాయిలు ఎగొట్టి కోట్లు ఎగనామం పెడదామనుకున్నారు.

`పోయి పోయి “నేటిధాత్రి” కంట పడ్డారు!

`అడ్డంగా దొరికిపోయారు!

`పెడతామన్నా బియ్యం ఇప్పుడు పెట్టండి?

`5శాతం కన్నా ఎక్కువ నూక లేకుండా బియ్యం రెడీ చేసుకోండి!

`ముందు నుయ్యి వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

`మిల్లర్ల తరుపున సిఎం. రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు!

`నిలుపుకోవాలంటే కోట్లు కావాలి.. లేదంటే ఊచలు లెక్కించాలి?

`మిల్లులు మూసుకోవాలి.. ఆస్తుల జప్తుకు తలొగ్గాలి!

హైదరాబాద్, నేటిధాత్రి:                        అత్యాశ కొంపకు చేటు అని పెద్దలు ఎప్ప్పుడో చెప్పారు. కాని రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ మిల్లర్లు పట్టించుకోలేదు. అందినంత దండుకుందామనుకున్నారు. దోచుకుందామనుకున్నారు. దాచుకుందామనుకున్నారు. కోట్లు కూడబెట్టుకుందామనుకున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నామన్న భయం కూడా లేకుండా బియ్యం బుక్కేశారు. అధికారుల అండతో, కావాల్సినన్ని వడ్లు పెట్టుకున్నారు. బియ్యం చేసి అమ్ముకున్నారు. కాని కేంద్రం ఏం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆదేశాలిస్తోందన్నది అసలే పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న సివిల్ సప్లయ్ అదికారుల్లో కొంత మంది అవినీతి పరుల మూలంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చేలా చేశారు. కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేలా వ్యవహరించారు. దాంతో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంజాయిషీ చెప్ప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇది దురదష్టకరం. బాయిల్డ్ రైస్ మిల్లరు చేసిన తప్ప్పుకు ప్రభుత్వం సమాదానం చెప్ప్పుకోవాల్సి రావడం విచార కరం. ఒక రకంగా చెప్పాలంటే సిఎం. రేవంత్ రెడ్డి స్ధానంలో మరే ఎవరున్నా మిల్లర్ల తాట తీసేవారు. వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేవారు. వారి ఆస్ధులు జప్తు చేయించేవారు. మిల్లులు మూసేయించేవారు. కాని మానవత్వం ప్రదర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాయిల్డ్ రైస్ మిల్లర్లు క్షమాపణలు చెప్ప్పుకోవాలి. భవిష్యత్తులో అలాంటి తప్ప్పులు చేయమని వేడుకోవాలి. కొంత మంది అక్రమ బాయిల్డ్ మిల్లర్లు చేసిన పొరపాటుకు సిఎం. రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కేంద్రాన్ని ఒప్పించేందుకు నానా తంటాలు పడాల్సివచ్చింది. అయినా కేంద్రం ఇంకా ఒప్ప్పుకుంటున్నందన్న నమ్మకం కూడా లేకుండా వుందని తెలుస్తోంది. అయినా కేంద్రం గత కొన్ని సంవత్సరాలుగా బాయిల్డ్ రైస్ తీసుకోమని ఖచ్చితంగా చెబుతూనే వస్తోంది. అయినా రాష్ట్రంలోని సివిల్ సప్లయ్ అదికారులు బాయిల్డ్ రైస్ మిల్లర్లకు వడ్లు ఎలా కేటాయిస్తున్నారు? ఎందుకు కేటాయిస్తున్నారు? పైగా పరిమితికి మించి ఎందుకు వారికి వడ్లు దారాదత్తం చేస్తున్నారు. ఆఖరుకు ఏమైంది. సివిల్ సప్లైశాఖ కొంత మంది మిల్లర్లకు కేటాయించిన 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. వడ్లను బియ్యం చేసి అమ్ముకున్నారు. ఎప్పటిలాగానే మొత్తం బియ్యం మాయం చేశారు. ప్రభుత్వానికి తీరిక లేదనుకుంటున్నారు. ప్రజా సమస్యల ముందు తమ విషయాలు ప్రస్తానవకు రావనుకున్నారు. బియ్యం అమ్ముకొని తిన్నా పట్టించుకోరనుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే వుంది. కాని ఇప్ప్పుడు మెడమీదకు వస్తుంతదని ఊహించలేదు. దాని నుంచి తప్పించుకునేందుకు ఓ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వం కళ్లు కప్పి వారి బండారం బైట పడకుండా చూసుకుందామనుకున్నారు. కాని కదరలేదు. ఆ విషయం నేటి ధాత్రి దష్టికి వచ్చింది. బాయిల్డ్ రైస్ మిల్లర్ల వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా మాయా మశ్చీంద్ర నాటకాలాడదామనుకున్నారు. ఎఫ్‌సిఐ మేనేజర్ తో చేతులు కలిపారు. ఓ 20 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. అందులో ఒక కోటి రూపాయలు అడ్వాన్సు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయం నేటిధాత్రి బైట పెట్టింది. అక్రమ డీల్ ను వెలుగులోకి తెచ్చింది. దాంతో ఆ వ్యూహం బెడిసికొట్టింది. అప్ప్పుడైనా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చి మంత్రి ఉత్తమ్‌కు చెప్ప్పుకున్నా సరిపోయేది. కాని మంత్రికి తెలియకుండానే వ్యవహారం నడిపిద్దామనుకున్నారు. ప్రభుత్వం కళ్లు గప్పి బియ్యం అమ్ముకున్న సంగతి వెలుగులోకి రాకుండానే అంతా చూసుకుందామనుకున్నారు. కాని విషయం నేటిదాత్రికి చేరింది. దాంతో నేటిధాత్రి కధనం రాసింది. ప్లాన్ వన్ ఫెయిల్ కావడంతో ప్లాన్ బి వేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏకంగా ఇరికించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని uద్నాం చేయాలని చూశారు. గతంలో ఎప్ప్పుడో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన ఉత్తరంతో కథ కానిచ్చేద్దామనుకున్నారు. ఎఫ్‌సిఐ మేనేజర్ అందుకు సిద్దమయ్యారు. కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషిని ఒప్పించే బాధ్యత నాది అని ఎఫ్‌సిఐ మేనేజర్ మిల్లర్లను నమ్మించారు. మిల్లర్లు నమ్మారు. రాయబారాలు నడుతున్నారు. అందుకు అవసరమైన బేరాలు మేనేజర్‌తోబాయిల్డ్ రైస్ మిల్లరు నడుపుకున్నారు. ఆ సంగతి కూడా వెంటనే నేటిదాత్రి వెలుగులోకి తెచ్చింది. ఇక బాయిల్డ్ రైస్ మిల్లర్లకు అన్ని దారులు మూసుకుపోయాయి. నేటిధాత్రిలో వచ్చిన వార్త డిల్లీలో సంచనలం సష్టించింది. కేంద్ర మంత్రికి దష్టికి ఈ విషయం వెళ్లింది. జరిగిన సంగతి మొత్తం ఆరా తీశారు. మిల్లర్ల మీద కేంద్ర మంత్రి కోపంతో ఊగిపోయారు? కేంద్రాన్ని, రాష్ట్రాన్ని మోసం చేయాలని చూశారన్న కోపం మంత్రి మిల్లర్ల మీద ప్రదర్శించారు. ఎట్టిపరిస్ధితుల్లో బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు? మిల్లర్లు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. అదే సమయంలో సిఎం. రేవంత్‌రెడ్డి డిల్లీలో వుండడం మంచిందైంది. ఈ విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు సిఎం. రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో కేంద్ర మంత్రి నేటిధాత్రి కధనాన్ని సిఎం. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల ముందు వుంచినట్లు తెలుస్తోంది. అప్ప్పుడు సిఎం. రేవంత్ రెడ్డి ఈ ఒక్కసారి బాయిల్డ్ రైస్‌ను తీసుకునేందుకు ఒప్పించేందుకు ఎంతో శ్రమ పడ్డారని తెలుస్తోంది. సుమారు అరగంట పాటు సిఎం. రేవంత్ రెడ్డి ఈ ఒక్కసారి వున్న బాయిల్డ్ రైస్‌ను తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక్క కండీషన్‌కు ఒప్ప్పుకున్నట్లు కూడా తెలిసింది. సహజంగా బియ్యంలో 16శాతం వరకు నూక వుంటుంది. కాని ఎక్స్‌పోర్టు క్వాలిటీ బియ్యంలో కేవలం 5శాతానికి మించి నూక వుండకూడదు. ఆ రకంగా 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగిస్తే తీసుకునే ఆలోచన చేస్తామని చెప్పినట్లు సమచారం. అయితే ఇది పూర్తి స్ధాయి అదికారిక ఒప్పందం కాలేదు. మంత్రి పూర్తి స్దాయి హమీ ఇవ్వలేదు. ఎందుకంటే బియ్యం నాణ్యత, 5శాతం నూక విషయంలో ఖచ్చితమైన నిబంధన పాటిస్తేనే తీసుకునేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దాంతో మిల్లర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌ను అసలే అంగీకరించడం లేదని తెలిసినా, కమీషన్లకు కక్కుర్తి పడి సివిల్ సప్లై అధికారులు బాయిల్డ్ మిల్లులకు కేటాయించడమే తప్ప్పు. ఆ కేటాయించిన వడ్లను ఆడించి, బియ్యం చేసి అమ్ముకోవడం మిల్లర్లు చేసిన మోసం. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చే సరికి మరో మోసానికి దారి వెతుక్కున్నారు. అందుకే ఒక తప్ప్పు వంద తప్ప్పులు చేయిస్తుందని పెద్దలు చెప్పారు. ఓ వైపు సిఎం. రేవంత్ రెడ్డి ఎలాగో కేంద్రాన్ని ఒప్పించి వచ్చినట్లున్నారు. ఇప్ప్పుడు ఒక వేళ ప్రభుత్వం కేంద్రానికి బియ్యం సమకూర్చమని మిల్లర్లను ఆదేశాలు జారీ చేస్తే ఒక్క బియ్యపు గింజ లేదు. కనీసం వడ్లు వున్నాయా? అదీ లేదు. అటు వడ్లు లేక, ఇటు బియ్యం లేక మిల్లర్లు ప్రభుత్వం ఏ క్షణమైనా ఆదేశాలు జారీ చేస్తే ఏం చేయాలన్నదానిపై తలలు పట్టుకుంటున్నారు. నిన్నటిదాకా ప్రభుత్వాన్ని ఆడించే స్దాయిలో వున్నామన్న ధీమాతో వున్న మిల్లర్లు ఇప్ప్పుడు కుడితో పడిన ఎలుకల్లా తయారయ్యారు. ప్రభుత్వానికి మిల్లర్లు మాట ఇచ్చినా రాబోయే పంట వరకు ఆగాలి. అంత వరకు ఆగే అవకాశం లేదంటే మిల్లర్లు పొరుగు రాష్ట్రాలనుంచి తక్షణం వడ్లు కొనుగోలు చేయాలి. తెచ్చి వాటిని బియ్యంగా మార్చాలి. అందులో ఇష్టాను సారం నూక వుంటే ఒప్ప్పుకోరు. ఎగుమతులను దష్టిలో వుంచుకొని 5శాతానికి మించి నూక వుండకూడదు. అలా బాయిల్డ్ బియ్యం సరఫరా చేయాలంటే మిల్లర్ల ప్రాణం తల నుంచి తోకకు వచ్చే పరిస్దితి కనిపిస్తోంది. ఇప్పటికిప్ప్పుడు వడ్లుకొని, బియ్యం చేసి, నూక 5శాతంతో ఎఫ్‌సిఐకి ఇవ్వాలంటే ఖర్చు తడిసి మోపెడౌతుంది. ఇంత కాలం తిన్నదంతా కక్కినట్లౌవుతుంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇంత కాలం మిల్లర్ల ఆటలు సాగాయి. కాని ఇకపై సాగేలా లేవు. వారు చేసే పొరపాట్లు వారి చేతనే చెప్పించుకున్నారు. వారి గోతులు వాళ్లే తవ్వుకున్నారు. బియ్యం పెట్టాలంటే నుయ్యి, పెట్టకపోతే వెనుక గొయ్యి లా తయారైంది మిల్లర్ల స్దితి..పరిస్ధితి.

పరువు నిలుపుకున్న కాంగ్రెస్… పదిలంగానే పట్టణాలలో బీఆరఎస్!

`ఏకపక్షంగా సాగని మున్సిపల్ ఎన్నికలు.

`కాంగ్రెస్ కు కొంత మోదం.. కొంత ఖేదం.

`కాంగ్రెస్ మీద ఇంకా ఎంతో కొంత నమ్మకం చూపిన ప్రజలు.

`సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ మీద ఆశలు.

`ఇంకా కాంగ్రెస్ మీద ప్రజలకు సన్నగిళ్ళని నమ్మకాలు.

`ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించలేదు.

`ఆరు గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ కు తిరుగు లేదు.

`జనం మళ్ళీ పట్టం కట్టొచ్చు..కాంగ్రెస్ గెలవచ్చు.

`మున్సిపల్ ఎన్నికల గెలుపు గొప్పగా ఊహించుకోవద్దు.

`ప్రజలు మా వెనుకే వున్నరన్న భ్రమలు ఎక్కువగా వద్దు.

`సమిష్టి నాయకత్వం మాత్రమే విజయానికి దారి మర్చిపోవద్దు.

`బీఆరఎస్ బలంగా కాంగ్రెస్ ను డీకొట్టింది.

`బీఆరఎస్ నాయకులకు మనో దైర్యం మిగిలింది.

`పార్టీ బలపడుతుందనే విశ్వాసం మరింత పెరిగింది.

`కష్టపడితే ఎంపీటీసీ, జడ్‌పిటిసి ఎన్నికల వరకు మరింత పుంజుకోవచ్చు.

`ప్రభుత్వం మీద పోరాటం చేయకపోతే ఇబ్బందులు రావొచ్చు.

`ప్రజా వ్యతిరేకతను పెంచకపోతే మరింత వెనుకబడి పోవొచ్చు.

`కేటీఆర్, హరీష్ ల నాయకత్వ పటిమ మరింత పెరగాలి.

`పూర్తిగా కేసీఆర్ చరిష్మా తగ్గలేదు.

`కేసీఆర్ పదేళ్ల పాలనా కాలం ప్రజలు మర్చిపోలేదు.

`ప్రజలు బీఆరఎస్ వెనుక బాగానే వున్నారు.

`బీజేపీ ని కూడా తక్కువగా అంచనా వేయొద్దు.

`బీజేపీ పెరుగుతోందని పాలక, ప్రతిపక్షాలు మర్చిపోవద్దు.

హైదరాబాద్, నేటిధాత్రి:                                            

 ఈసారి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బిఆరఎస్‌ను ఆదరించారు. బిజేపిని కూడా చూసుకున్నారు. గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి తీర్పురాలేదు. ప్రభుత్వానికి అండగా నిలిచారు. ప్రశ్నించమని బిఆరఎస్‌కు కూడా బాగానే మద్దతిచ్చారు. ఇలాంటి విచిత్రమైన తీర్పు వస్తుందని ఎవరూ అనుకోలేదు. ప్రభుత్వానికి పూర్తి స్దాయి మద్దతు లభిస్తుందని అదికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. ప్రజా వ్యతిరేకతగా బాగా వుందని ప్రచారం చేసిను బిఆరఎస్ మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తామని కలలుగన్నారు. అయినా అన్ని పార్టీల మాటలు విన్నారు. ఎవరిని గెలిపించాలో వారినే గెలిపించారు. అయితే ఇక్కడ స్ధానిక నాయకత్వాన్ని కూడా చూసినట్లు వున్నారు. తమ వార్డు ప్రజల పట్ల సన్నిహితంగా వున్న నాయకుల వైపు కూడా జనం నిలిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పార్టీలను చూసి మాత్రమే జనం ఓట్లు వేయలేదని, పార్టీలకు పట్టం కట్టలేదని అర్దం చేసుకోవచ్చు. అదే జరిగితే ఏ రకంగా చూసినా వార్ వన్ సైడ్ కావాలి. కాని అలా జరగలేదు. ఆ తీర్పును ప్రజలు ఎక్కడా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం బలంగానే చెప్ప్పుకోవచ్చు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మాత్రం లేదని రుజువైంది. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వుంటే ఖమ్మం జిల్లాలో కూడా అది కనిపించాలి. అక్కడ ఎక్కడా వ్యతిరేకత కనిపించిన దాఖలాలు లేవు. అలాగే నల్లగొండ జిల్లా, మహాబూబ్ నగర్ జిల్లాలోనూ ప్రభుత్వానికి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక రకంగా కాంగ్రెస్ స్వీప్ చేసినట్టే అని చెప్ప్పుకోవాలి. ఇలా మూడు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఈ మూడు జిల్లాల్లో జనం ఎందుకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారన్నదానిపై కూడా అద్యయనం చేయాల్సి వుంటుంది. మిగతా జిల్లాల కన్నా, ఈ మూడు జిల్లాలకు ప్రభుత్వ నిదుల వరద పారిస్తోందా? అభివద్ది మీద ఎక్కువ దష్టిపెడుతుందా? అనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ నియోజకవర్గాలకేనా నిదులు అంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చేది. అలాగే ఇక్కడ కూడా బలమైన మంత్రులున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. అందులో ఒÅ£రు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వున్నారు. తెలంగాణలో పవర్ ఫుల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నారు. రాజకీయంగా, పాలనా పరంగా అనుభవం వున్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. ఈ ముగ్గురి రాజకీయం ముందు బిఆరఎస్ మరోసారి చతికిలపడింది. కోలుకోలేని దెబ్బ తిన్నది. ఇక నల్లగొండ విషయానికి వస్తే ఇక్కడ బలమైన నాయÅ£త్వం పనిచేసిందనే చెప్పాలి. రాజకీయంగా, పాలనాపరంగా అపరామైన అనుభవం వున్న సీనియర్ నాయకుడు జానారెడ్డితోపాటు, ఆయన వారసులు, ఇద్దరూ ప్రజా ప్రతినిదులుగా వున్నారు. వారికి తోడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వున్నారు. సీనియర్ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వున్నారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు అన్ని నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగిరింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ సర్పంచ్‌లు గెలిచింది. ఆ పరంపర మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇక్కడ వార్ వన్ సైడ్ జరిగింది. ఇక సిఎం. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు మరో సారి కాంగ్రెస్ జయకేతనం ఎగురువేసింది. పాలమూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించినట్లైంది. సిఎం. రేవంత్‌రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్‌లో బిఆరఎస్‌కు చోటు లేకుండాపోయింది. మొత్తం సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి సిఎం.తో పాటు మరో ఇద్దరు మంత్రులున్నారు. వారు కూడా తమ సత్తాను చాటుకున్నారు. సీనియర్ మంత్రి జూపల్లి కష్ణారావు, మరో మంత్రి వాకిటి శ్రీహరిలు కూడా బాగా కష్టపడ్డారనేది విషయం తేట తెల్లమైంది. మహాబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అయితే ఈ విజయాన్ని సిఎం. రేవంత్‌రెడ్డి పాలనకు అంకితమివ్వొచ్చని చెప్పొచ్చు. ఆయన అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలే కదా? అని ఊరుకోలేదు. ఏది ఏమైనా గెలుపు ముఖ్యం. గెలిచి తీరుడు చాలా ముఖ్యం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. ప్రజలను ఒప్పించారు. తనపై నమ్మకం వుంచాలని కోరారు. ప్రజలు కూడా అలాగే తీర్పునిచ్చారు. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లలేదని కాంగ్రెస్‌ను గెలిపించారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు మరింత ఊపునిచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. అదే సమయంలో కాంగ్రెస్‌ను బిఆరఎస్ కూడా బలంగానే డీ కొట్టిందనే చెప్పాలి. బిఆరఎస్‌కు ఊహించని సీట్లే వచ్చాయి. నిజానికి ఓ ఐదారు మున్సిపల్ చైర్మన్లు వస్తాయని మాత్రమే అనుకున్నారు. కాంగ్రెస్‌కు 80శాతానికి పైగా కౌన్సిలర్లు , కార్పోరేటర్లు గెలుస్తారని అంచానా వేశారు. కాని బిఆరఎస్ బలంగానే కాంగ్రెస్‌తో కొట్లాడిందనే చెప్పాలి. అయినా ఇంకా ఎక్కడో బిఆరఎస్ వెనుకబడింది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్దగా ప్రచారం కూడా సాగించినట్లు లేదు. ఎంత సేపు హరీష్‌రావు సిద్దిపేట, మెదక్ జిల్లాల మీదనే దష్టిపెట్టారు. మిగతా జిల్లాల్లో ఇంత విరివిగా ప్రచారం సాగించలేదు. బిఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కూడా అన్ని జిల్లాలను చుట్టి వచ్చినా, ఆయన ప్రభావం పూర్తిగా కనిపించలేదు. బిఆరఎస్ బలంగా వుండే ఉత్తర తెలంగాణలో బిఆరఎస్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లాలో బిఆరఎస్‌కు మంచి పట్టు వుంది. కరీంనగర్ కార్పోరేష్‌న్‌ను నిలబెట్టుకోవాల్సిన చోట చతికిలపడింది. గతంలో వార్ వన్ సైడ్ అనేలా విజయాలు అందుకున్న బిఆరఎస్‌కు వరస ఓటములు వెంటాడుతున్నా, పార్లమెంటు ఎన్నికల తర్వాత కొంత కోలుకున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్దానానికి పడిపోయిన, బిఆరఎస్ గత సర్పంచ్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్ధానానికి చేరుకోవడం ఒక రకంగా ఊరటనిచ్చే అంశమే. అయినా ఈ బలం చాలదు. వచ్చే ఎన్నికలకు ఈ మాత్రం బలం అసలే సరిపోదు. కాకపోతే బిఆరఎస్ నాయకులకు, కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికలు కొంత మనో ధైర్యాన్నే కల్పించాయని చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల తర్వాత చతికిలపడిపోయిన బిఆరఎస్‌కు సర్పంచ్ ఎన్నిÅ£లు, మున్సిపల్ ఎన్నికలు ఆక్సీజన్‌ను అందించాయి. పార్టీ నాయకుల్లో వచ్చే ఎన్నికల వరకు మరింత బలపడుతుందనే విశ్వాసం పెరిగిందని అనుకోవచ్చు. అయితే బిఆరఎస్ ఎవరిని నిలబెడితే వారిని గెలిపించాలన్న ప్రకటనలు మాత్రం తప్ప్పు. పార్టీకోసం పనిచేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించాలి. ప్రజల్లో ఆదరణ వున్న నాయకులను ప్రజాక్షేత్రంలోకి దింపాలి. ఎన్నికల బరిలో నిలపాలి. పార్టీ పేరు చెప్ప్పుకొని అరాచకాలు గతంలో చేసిన వారు చాలా మంది వున్నారు. వారికి ప్రజల్లో బలం లేదు. సానుభూతి లేదు. వారికి గౌరవం అసలే లేదు. అలాంటి వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించాలంటే ప్రజలు ఒప్ప్పుకోరు. జనం మెచ్చిన నేతలకు టిక్కెట్లు ఇ స్తేనే గెలిపిస్తారు. మున్సిపల్ పరిధిలో స్దానికంగా బిఆరఎస్‌లో బలమైన నాయకుడు, ప్రజలకు చేరువలో వుండే నాయకుడికి కాకుండా పార్టీ పేరు చెప్ప్పుకునే నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. సీనియర్ నాయకులకు ఎక్కడో అక్కడ టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే. కాని ఆ వార్డలకు సంబంధం లేని నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం అనేది కూడా సరైంది కాదు. గెలుస్తామన్న దీమాలో కూడా నిజాలు వెతుక్కోవాలి. స్దానిక నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలి. అంతే కాని ఎక్కడో నివాసం వుండే నాయకుడిని, సంబంధం లేని వార్డులలో టిక్కెట్టు ఇవ్వడం వల్ల ఆ నాయకుడు అందుబాటులో వుండలేరు. ప్రజలకు ఆ నాయకుడి దగ్గరకు వెళ్లలేరు. ప్రజలకు నిత్యం స్ధానికంగా అందుబాటులో వుండే నాయకులను కాదని, బిఆరఎస్ నేల విడిచి సాము చేసింది ఓటమిని కొని తెచ్చుకున్నది. అతి విశ్వాసం మరోసారి బిఆరఎస్ కొంప ముంచింది.

జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం…

జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నాయకులు, మద్దతుదారులు సంతోష్ను అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సంతోష్ తెలిపారు.

జహీరాబాద్ 23వ వార్డ్ బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం

జహీరాబాద్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, మద్దతుదారులు అభ్యర్థిని అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని భావన గౌడ్ తెలిపారు. ఈ విజయం స్థానిక రాజకీయాల్లో బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చింది.

3 వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ విజయం…

3 వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల్ 3 వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 85 ఓట్ల మెజార్టీతో జాజుల శ్రీకాంత్ ఎరుకల విజయం సాధించడం జరిగింది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఎరుకల కులానికి చెందిన,ఎరుకల ముద్దు బిడ్డ కోహిర్ మండలo లోని 16 కౌన్సిలర్ల లో అతి చిన్న వయస్సు అయిన జాజుల శ్రీకాంత్ ఒక కౌన్సిలర్ గా విజయం సాధించడం ఎంతో గర్వకారణం. ఇంక భవిష్యత్ లో ఎన్నో విజయాలు, పదవులు సాధించాలని కోరుకుంటూ.
కౌన్సిలర్ గా విజయం సాధించిన శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు

సీఎం కప్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు…

సీఎం కప్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు

పోటీలకు ఎంపికైన నారాయణ స్కూల్ విద్యార్థిని హ్రీధ్య

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హ్రీధ్య రాష్ట్రస్థాయి సీఎం కప్ తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించినటువంటి సీఎం కప్ జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో మా పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హ్రీధ్య సబ్ జూనియర్ -33 కేజీ బాలికల విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించి ఫిబ్రవరి 18 19 వ తేదీలలో హైదరాబాదులో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రస్థాయి సీఎం కప్ తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకటస్వామి.ఏజీఎం ఎనాలోసిస్ట్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు…

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

అక్రమంగా నాటు సారును తయారు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నందిగామ, రేలకుంట గ్రామాలలో జిల్లా, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దాడులలో 800 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం చేసి 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భవిష్యత్తులో నాటు సారును తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడులలో జిల్లా టాస్క్ ఫోర్స్ రమేష్ చందర్, స్టేట్ టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు, ట్రైనీ ఎస్ఐ నరేష్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకలు…

మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకలు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాకతీయుల నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈనెల 15 ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పునరస్కరించుకొని రామాలయంలో కొలువుతీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ఉదయం ఐదు గంటల నుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించబోతున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ ఉయ్యాల బిక్షపతి దైవాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటుపోతుల రాజన్న గౌడ్ తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ…

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎ.సి.పి. రవికుమార్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ లతో కలిసి సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో ఒక ఇబ్బందిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఓట్ల లెక్కింపు కొరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొరకు అదనపు సిబ్బందితో కలిపి 66 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,132  మంది కౌంటింగ్ సహాయకులు, బెల్లంపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 19 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,37  మంది కౌంటింగ్ సహాయకులు, చెన్నూరు మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 10 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,20  మంది కౌంటింగ్ సహాయకులు, క్యాతనపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 24 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు,48  మంది కౌంటింగ్ సహాయకులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 9 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులను రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు.ఓట్ల లెక్కింపు  ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

33 వ వార్డు ప్రజలకు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన మాధవి రమేష్ కృతజ్ఞతలు..

33 వ వార్డు ప్రజలకు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన మాధవి రమేష్ కృతజ్ఞతలు
వనపర్తి నేటిదాత్రి,
వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి ఏరియా మున్సిపల్ కౌన్సిలర్ గా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ సతీమణి మాధవి విజయం సాధించారు ఈ మేరకు 33 వార్డు ప్రజలకు ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గా నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మున్సిపల్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైనందుకు 33 వ వార్డు ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు

error: Content is protected !!
Exit mobile version