జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం…

జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నాయకులు, మద్దతుదారులు సంతోష్ను అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సంతోష్ తెలిపారు.

జహీరాబాద్ 23వ వార్డ్ బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం

జహీరాబాద్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, మద్దతుదారులు అభ్యర్థిని అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని భావన గౌడ్ తెలిపారు. ఈ విజయం స్థానిక రాజకీయాల్లో బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చింది.

జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం…

జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే ఎంఐఎం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈ ఎన్నికలు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగాయి.

28 వ వార్డులో రజిని భారతి గెలుపు ఖాయమే..

28 వ వార్డులో రజిని భారతి గెలుపు ఖాయమే..

ప్రజాసేవే ద్యేయంగా గతంలో నర్సంపేట సర్పంచ్ గా సేవలు

స్వయంకృషి పట్టుదలతో అనేక సంక్షేమ,మహిళా సాధికారిత కార్యక్రమాలు

28 వ వార్డును కౌన్సిలర్ గా ఆశీర్వదించండి..మోడల్ వార్డుగా అభివృద్ధి చేస్తా..

నర్సంపేట 28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు రజిని భారతి రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలలో 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చిలువేరు రజినీ భారతి రమేష్ గెలుపు ఖాయమే అయ్యింది. ప్రజాసేవే ద్యేయంగా గత 30 సంవత్సరాలుగా రజని భారతి రమేష్ కుటుంబం నర్సంపేట పట్టణంలో సుపరిచితులే. గతంలో నర్సంపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా రజినీ భారతి ప్రజలకు అనేక విధాలుగా సేవలు అందించారు. తన భర్త వ్యాపారవేత్త చిలువేరు రమేష్ సహకారంతో స్వయంకృషి పట్టుదలతో ప్రజలకు సేవలు చేస్తూ… అనేక మహిళ సమన్వయ సమితి, సంక్షేమ,మహిళా సాధికారిత కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ మహిళగా రజనీభారతి ప్రశంసలు పొందారు. చిలువేరు రజినీ భారతి రమేష్ కుటుంబం నిత్యం ప్రజల వెంట ఉంటూ వారికి చేదోడువాదోడుగా సహకారాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా 28వ వార్డులో బరిలోకి దిగిన రజనీభారతి గత వారం రోజులుగా గడపగడపన ప్రచారం చేపట్టగా ఆ వార్డు ప్రజలు ఆమెకు స్వాగతాలు పలుకుతూ రజనీ భారతి గెలుపుకు మద్దతుపలికారు. 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీతో కలిపి ప్రముఖ పోటీ ఉన్నప్పటికీ రజిని భారతి వైపే ప్రజలు మొగ్గుచూపుతూ ఆమె గెలుపు ఖాయమే అని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.

28వ వార్డు ప్రజల అభివృద్ధే నా లక్ష్యం..

నా వార్డు ప్రజల అభివృద్ధే లక్ష్యమని 28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు రజిని భారతి రమేష్ తెలిపారు. గతంలో నర్సంపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ప్రజలు అవకాశం ఇస్తే.. వారి అభివృద్ధే లక్ష్యంగా ఎనలేని సేవలు అందించానని అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటికే రూ.80 కోట్ల నిధులతో ప్రధాన అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే పట్టణంలోని అన్ని వార్డులలో..

28వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.ప్రజల నుండి ఏలాంటివి ఆశించకుండా వార్డు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో అందిస్తానని,చెయ్యి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు రజిని భారతి రమేష్ ప్రజలను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version