కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…..
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలం, పిడిసిల్ల గ్రామ వాస్తవ్యులు నైనకంటి రంగారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరియు గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు…
ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, గ్రామీణ క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులలో నైపుణ్యం పెంచడానికి, ఇటువంటి పోటీలల్లో గెలుపోటములు జీవితంలో వచ్చే అటుపోటులను ఎదుర్కోవడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్లపల్లి సర్పంచ్ జోరక సదయ్య మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు
