జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం…

జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నాయకులు, మద్దతుదారులు సంతోష్ను అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సంతోష్ తెలిపారు.

జహీరాబాద్ 23వ వార్డ్ బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం

జహీరాబాద్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, మద్దతుదారులు అభ్యర్థిని అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని భావన గౌడ్ తెలిపారు. ఈ విజయం స్థానిక రాజకీయాల్లో బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చింది.

జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం…

జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే ఎంఐఎం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈ ఎన్నికలు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగాయి.

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్…

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 37 వార్డుల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 9 గంటల వరకు 16.63 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తం 78,819 మంది ఓటర్లలో 13,112 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూల్లో నిలబడి ఓటు వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 29వ వార్డు లో ఓటు వేసిన బిఆర్ఎస్, సీనియర్ నాయకులు షేక్ ఫరిద్ తమ నాయకులు కార్యకర్తలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు,

పోలింగ్ బూత్లను పరిశీలించిన మాజీ మంత్రి..

పోలింగ్ బూత్లను పరిశీలించిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ బుధవారం ఉదయం 19వ వార్డులోని 60, 61 పోలింగ్ బూత్లను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి, ఓటర్లు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా కొనసాగాలని సూచించారు.

కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మాల్లోసారి మోసపోవద్దు.. గోసపడొద్దు..

కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మాల్లోసారి మోసపోవద్దు.. గోసపడొద్దు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ గారు* పాల్గొని 15వవార్డ్ బసవేశ్వర్ స్ట్రీట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మజ గారిని 28 వ వార్డ్ అర్యనగర్ మడపతి శివ కుమార్ స్వామి గారిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గత ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు .ప్రజలారా ఆలోచించండి కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి మల్లోసారి మోసపోయి గోసపడొద్దు.బిఆర్ఎస్ పాలనలో ఎట్లుండే..ఇప్పుడెట్లున్నది ఆలోచించండి.పరకాల పట్టణ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఒక్కపైస పనిచేయలేదు.బిఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులేసి మేమే చేసినామని గప్పాలు గొడుతున్నారు.వాళ్లేని మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు.ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు.ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపుతామని ప్రజలు వేచి చూస్తున్నారన్నారు ప్రజల ఆశీస్సులతో జహీరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version