`కాపాడిన “సీఎం రేవంత్ రెడ్డి”ముందు మోకరిల్లాలే!
`”మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి” నీ అబాసపాలు చేయాలని చూశారు!

”నేటిధాత్రి” దెబ్బకు మిల్లర్లు విలవిల!
”నేటిధాత్రి” కథనానికి ఢిల్లీలో “సీఎం రేవంత్, మంత్రి ఉత్తం” కేంద్ర సివిల్ సప్లై శాఖ మంత్రి “ప్రహల్లాద జోషి”తో మంతనాలు.
`మిల్లర్ల తరపున సీఎం రేవంత్ రెడ్డి “కేంద్రమంత్రి” కిమాట ఇచ్చారు?
`”ఢిల్లీ”లో రాష్ట్రం పరువు తీయాలని చూసిన మిల్లర్లు.
`”ఎఫ్ సిఐ” మేనేజర్ తో అడ్డదారి తొక్కుదాం అనుకున్నారు.
`అడ్డంగా ఇరికిన మిల్లర్లు.. మూసుకుపోయిన దొడ్డి దార్లు?
`బియ్యం లేని మిల్లర్లకు చుక్కలు!
`మిల్లర్ల దిమ్మ తిరిగి భైర్లు కమ్మిన కళ్ళు!
`తప్పు చేశామని ఒప్పుకోవాలె!
`కాపాడిన సీఎం రేవంత్ రెడ్డి ముందు మోకరిల్లాలే!
`రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మోసం చేశామని ఒప్పుకోవాలె?
`ఢిల్లీలో రాష్టం పరువు తీయాలని చూశారు?
`మంత్రి ఉత్తమ్ కుమార్ ను అబసుపాలు చేయాలని చూశారు!
`”ఎఫ్ సిఐ జిఎం” తో మేనేజ్ చేయాలనుకున్నారు.
`ప్లాన్ ల మీద ప్లాన్ లు వేశారు!
`కోట్లలో బేరాలు చేసుకున్నారు!
`ప్రభుత్వం పరువు తీయాలని చూశారు.
`బకాయిలు ఎగొట్టి కోట్లు ఎగనామం పెడదామనుకున్నారు.
`పోయి పోయి “నేటిధాత్రి” కంట పడ్డారు!
`అడ్డంగా దొరికిపోయారు!
`పెడతామన్నా బియ్యం ఇప్పుడు పెట్టండి?
`5శాతం కన్నా ఎక్కువ నూక లేకుండా బియ్యం రెడీ చేసుకోండి!
`ముందు నుయ్యి వెనుక గొయ్యి తవ్వుకున్నారు!
`మిల్లర్ల తరుపున సిఎం. రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు!
`నిలుపుకోవాలంటే కోట్లు కావాలి.. లేదంటే ఊచలు లెక్కించాలి?
`మిల్లులు మూసుకోవాలి.. ఆస్తుల జప్తుకు తలొగ్గాలి!
హైదరాబాద్, నేటిధాత్రి: అత్యాశ కొంపకు చేటు అని పెద్దలు ఎప్ప్పుడో చెప్పారు. కాని రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ మిల్లర్లు పట్టించుకోలేదు. అందినంత దండుకుందామనుకున్నారు. దోచుకుందామనుకున్నారు. దాచుకుందామనుకున్నారు. కోట్లు కూడబెట్టుకుందామనుకున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నామన్న భయం కూడా లేకుండా బియ్యం బుక్కేశారు. అధికారుల అండతో, కావాల్సినన్ని వడ్లు పెట్టుకున్నారు. బియ్యం చేసి అమ్ముకున్నారు. కాని కేంద్రం ఏం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆదేశాలిస్తోందన్నది అసలే పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న సివిల్ సప్లయ్ అదికారుల్లో కొంత మంది అవినీతి పరుల మూలంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చేలా చేశారు. కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేలా వ్యవహరించారు. దాంతో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంజాయిషీ చెప్ప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇది దురదష్టకరం. బాయిల్డ్ రైస్ మిల్లరు చేసిన తప్ప్పుకు ప్రభుత్వం సమాదానం చెప్ప్పుకోవాల్సి రావడం విచార కరం. ఒక రకంగా చెప్పాలంటే సిఎం. రేవంత్ రెడ్డి స్ధానంలో మరే ఎవరున్నా మిల్లర్ల తాట తీసేవారు. వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేవారు. వారి ఆస్ధులు జప్తు చేయించేవారు. మిల్లులు మూసేయించేవారు. కాని మానవత్వం ప్రదర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాయిల్డ్ రైస్ మిల్లర్లు క్షమాపణలు చెప్ప్పుకోవాలి. భవిష్యత్తులో అలాంటి తప్ప్పులు చేయమని వేడుకోవాలి. కొంత మంది అక్రమ బాయిల్డ్ మిల్లర్లు చేసిన పొరపాటుకు సిఎం. రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కేంద్రాన్ని ఒప్పించేందుకు నానా తంటాలు పడాల్సివచ్చింది. అయినా కేంద్రం ఇంకా ఒప్ప్పుకుంటున్నందన్న నమ్మకం కూడా లేకుండా వుందని తెలుస్తోంది. అయినా కేంద్రం గత కొన్ని సంవత్సరాలుగా బాయిల్డ్ రైస్ తీసుకోమని ఖచ్చితంగా చెబుతూనే వస్తోంది. అయినా రాష్ట్రంలోని సివిల్ సప్లయ్ అదికారులు బాయిల్డ్ రైస్ మిల్లర్లకు వడ్లు ఎలా కేటాయిస్తున్నారు? ఎందుకు కేటాయిస్తున్నారు? పైగా పరిమితికి మించి ఎందుకు వారికి వడ్లు దారాదత్తం చేస్తున్నారు. ఆఖరుకు ఏమైంది. సివిల్ సప్లైశాఖ కొంత మంది మిల్లర్లకు కేటాయించిన 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. వడ్లను బియ్యం చేసి అమ్ముకున్నారు. ఎప్పటిలాగానే మొత్తం బియ్యం మాయం చేశారు. ప్రభుత్వానికి తీరిక లేదనుకుంటున్నారు. ప్రజా సమస్యల ముందు తమ విషయాలు ప్రస్తానవకు రావనుకున్నారు. బియ్యం అమ్ముకొని తిన్నా పట్టించుకోరనుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే వుంది. కాని ఇప్ప్పుడు మెడమీదకు వస్తుంతదని ఊహించలేదు. దాని నుంచి తప్పించుకునేందుకు ఓ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వం కళ్లు కప్పి వారి బండారం బైట పడకుండా చూసుకుందామనుకున్నారు. కాని కదరలేదు. ఆ విషయం నేటి ధాత్రి దష్టికి వచ్చింది. బాయిల్డ్ రైస్ మిల్లర్ల వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా మాయా మశ్చీంద్ర నాటకాలాడదామనుకున్నారు. ఎఫ్‌సిఐ మేనేజర్ తో చేతులు కలిపారు. ఓ 20 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. అందులో ఒక కోటి రూపాయలు అడ్వాన్సు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయం నేటిధాత్రి బైట పెట్టింది. అక్రమ డీల్ ను వెలుగులోకి తెచ్చింది. దాంతో ఆ వ్యూహం బెడిసికొట్టింది. అప్ప్పుడైనా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చి మంత్రి ఉత్తమ్‌కు చెప్ప్పుకున్నా సరిపోయేది. కాని మంత్రికి తెలియకుండానే వ్యవహారం నడిపిద్దామనుకున్నారు. ప్రభుత్వం కళ్లు గప్పి బియ్యం అమ్ముకున్న సంగతి వెలుగులోకి రాకుండానే అంతా చూసుకుందామనుకున్నారు. కాని విషయం నేటిదాత్రికి చేరింది. దాంతో నేటిధాత్రి కధనం రాసింది. ప్లాన్ వన్ ఫెయిల్ కావడంతో ప్లాన్ బి వేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏకంగా ఇరికించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని uద్నాం చేయాలని చూశారు. గతంలో ఎప్ప్పుడో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన ఉత్తరంతో కథ కానిచ్చేద్దామనుకున్నారు. ఎఫ్‌సిఐ మేనేజర్ అందుకు సిద్దమయ్యారు. కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషిని ఒప్పించే బాధ్యత నాది అని ఎఫ్‌సిఐ మేనేజర్ మిల్లర్లను నమ్మించారు. మిల్లర్లు నమ్మారు. రాయబారాలు నడుతున్నారు. అందుకు అవసరమైన బేరాలు మేనేజర్‌తోబాయిల్డ్ రైస్ మిల్లరు నడుపుకున్నారు. ఆ సంగతి కూడా వెంటనే నేటిదాత్రి వెలుగులోకి తెచ్చింది. ఇక బాయిల్డ్ రైస్ మిల్లర్లకు అన్ని దారులు మూసుకుపోయాయి. నేటిధాత్రిలో వచ్చిన వార్త డిల్లీలో సంచనలం సష్టించింది. కేంద్ర మంత్రికి దష్టికి ఈ విషయం వెళ్లింది. జరిగిన సంగతి మొత్తం ఆరా తీశారు. మిల్లర్ల మీద కేంద్ర మంత్రి కోపంతో ఊగిపోయారు? కేంద్రాన్ని, రాష్ట్రాన్ని మోసం చేయాలని చూశారన్న కోపం మంత్రి మిల్లర్ల మీద ప్రదర్శించారు. ఎట్టిపరిస్ధితుల్లో బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు? మిల్లర్లు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. అదే సమయంలో సిఎం. రేవంత్‌రెడ్డి డిల్లీలో వుండడం మంచిందైంది. ఈ విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు సిఎం. రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో కేంద్ర మంత్రి నేటిధాత్రి కధనాన్ని సిఎం. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల ముందు వుంచినట్లు తెలుస్తోంది. అప్ప్పుడు సిఎం. రేవంత్ రెడ్డి ఈ ఒక్కసారి బాయిల్డ్ రైస్‌ను తీసుకునేందుకు ఒప్పించేందుకు ఎంతో శ్రమ పడ్డారని తెలుస్తోంది. సుమారు అరగంట పాటు సిఎం. రేవంత్ రెడ్డి ఈ ఒక్కసారి వున్న బాయిల్డ్ రైస్‌ను తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక్క కండీషన్‌కు ఒప్ప్పుకున్నట్లు కూడా తెలిసింది. సహజంగా బియ్యంలో 16శాతం వరకు నూక వుంటుంది. కాని ఎక్స్‌పోర్టు క్వాలిటీ బియ్యంలో కేవలం 5శాతానికి మించి నూక వుండకూడదు. ఆ రకంగా 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగిస్తే తీసుకునే ఆలోచన చేస్తామని చెప్పినట్లు సమచారం. అయితే ఇది పూర్తి స్ధాయి అదికారిక ఒప్పందం కాలేదు. మంత్రి పూర్తి స్దాయి హమీ ఇవ్వలేదు. ఎందుకంటే బియ్యం నాణ్యత, 5శాతం నూక విషయంలో ఖచ్చితమైన నిబంధన పాటిస్తేనే తీసుకునేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దాంతో మిల్లర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌ను అసలే అంగీకరించడం లేదని తెలిసినా, కమీషన్లకు కక్కుర్తి పడి సివిల్ సప్లై అధికారులు బాయిల్డ్ మిల్లులకు కేటాయించడమే తప్ప్పు. ఆ కేటాయించిన వడ్లను ఆడించి, బియ్యం చేసి అమ్ముకోవడం మిల్లర్లు చేసిన మోసం. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చే సరికి మరో మోసానికి దారి వెతుక్కున్నారు. అందుకే ఒక తప్ప్పు వంద తప్ప్పులు చేయిస్తుందని పెద్దలు చెప్పారు. ఓ వైపు సిఎం. రేవంత్ రెడ్డి ఎలాగో కేంద్రాన్ని ఒప్పించి వచ్చినట్లున్నారు. ఇప్ప్పుడు ఒక వేళ ప్రభుత్వం కేంద్రానికి బియ్యం సమకూర్చమని మిల్లర్లను ఆదేశాలు జారీ చేస్తే ఒక్క బియ్యపు గింజ లేదు. కనీసం వడ్లు వున్నాయా? అదీ లేదు. అటు వడ్లు లేక, ఇటు బియ్యం లేక మిల్లర్లు ప్రభుత్వం ఏ క్షణమైనా ఆదేశాలు జారీ చేస్తే ఏం చేయాలన్నదానిపై తలలు పట్టుకుంటున్నారు. నిన్నటిదాకా ప్రభుత్వాన్ని ఆడించే స్దాయిలో వున్నామన్న ధీమాతో వున్న మిల్లర్లు ఇప్ప్పుడు కుడితో పడిన ఎలుకల్లా తయారయ్యారు. ప్రభుత్వానికి మిల్లర్లు మాట ఇచ్చినా రాబోయే పంట వరకు ఆగాలి. అంత వరకు ఆగే అవకాశం లేదంటే మిల్లర్లు పొరుగు రాష్ట్రాలనుంచి తక్షణం వడ్లు కొనుగోలు చేయాలి. తెచ్చి వాటిని బియ్యంగా మార్చాలి. అందులో ఇష్టాను సారం నూక వుంటే ఒప్ప్పుకోరు. ఎగుమతులను దష్టిలో వుంచుకొని 5శాతానికి మించి నూక వుండకూడదు. అలా బాయిల్డ్ బియ్యం సరఫరా చేయాలంటే మిల్లర్ల ప్రాణం తల నుంచి తోకకు వచ్చే పరిస్దితి కనిపిస్తోంది. ఇప్పటికిప్ప్పుడు వడ్లుకొని, బియ్యం చేసి, నూక 5శాతంతో ఎఫ్‌సిఐకి ఇవ్వాలంటే ఖర్చు తడిసి మోపెడౌతుంది. ఇంత కాలం తిన్నదంతా కక్కినట్లౌవుతుంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇంత కాలం మిల్లర్ల ఆటలు సాగాయి. కాని ఇకపై సాగేలా లేవు. వారు చేసే పొరపాట్లు వారి చేతనే చెప్పించుకున్నారు. వారి గోతులు వాళ్లే తవ్వుకున్నారు. బియ్యం పెట్టాలంటే నుయ్యి, పెట్టకపోతే వెనుక గొయ్యి లా తయారైంది మిల్లర్ల స్దితి..పరిస్ధితి.