ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్…

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. భాతర బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌ బాట పట్టారు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో 114 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.
‘భారత్‌తో కీలకమైన మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. ఆ సమయంలో పాక్ డ్రెస్సింగ్ రూం నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. ఈ మ్యాచ్ ఎంత కీలకమో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటో మాకు తెలుసు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మేం ఇతర జట్లతో ఐదు మ్యాచ్‌లు గెలిచాం. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. కానీ భారత్‌తో మ్యాచ్‌లో ఓడిపోయాం. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. బంతి అనూహ్యంగా తిరిగింది. మేం సరిగానే ప్రారంభించాం. కానీ ఇషాన్ కిషన్ మా నుంచి మ్యాచ్‌ను దూరంగా తీసుకెళ్లిపోయాడు. మేం తిరిగి పుంజుకుంటాం. మేం ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మంచి క్రికెట్ ఆడాం. ఈ టోర్నమెంట్‌లో రాణిస్తామనే ఆత్మవిశ్వాసం మాకుంది’ అని పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ పేర్కొన్నాడు.

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్….

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..

 

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ నిర్దేశించిన 176 పరుaమదాస స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది (India vs Pakistan T20 World Cup).
ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. గ్యాలరీ నుంచి చాలా సేపు మ్యాచ్ వీక్షించారు. అయితే ఛేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది నఖ్వీ అనే సంగతి తెలిసిందే (Mohsin Naqvi stadium exit).

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం….

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్

 

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు చేశాడు (Akhtar on Pakistan loss).
‘మేము మ్యాచ్‌లో ఏ దశలోనూ పోటీలో లేము. షాహీన్ 125 కి.మీ./గం. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంత వేగం ఆధునిక క్రికెట్‌కు అవసరం లేదు. వీరు ఒత్తిడిని తట్టుకునే ప్రతిభావంతులు కాదు. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఏ దశలోనూ భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేము. గత 15-20 సంవత్సరాలుగా క్రికెట్‌పై మేం నిజాయితీగా పెట్టుబడి పెట్టలేదు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించలేదు’ అని అక్తర్ పేర్కొన్నాడు 
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version