ఊరంతా కలిసి..ఏకగ్రీవం చేశారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T153643.741.wav?_=1

 

ఊరంతా కలిసి..
ఏకగ్రీవం చేశారు.

నిజాంపేట: నేటి ధాత్రి

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు వేడెక్కాయి. పలు గ్రామాల్లో పోటీతత్వం ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో గ్రామానికి చెందిన పాతూరి భాను ప్రసాద్ రెడ్డి ని గ్రామస్తులంత ఏకమై ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్న వయసులోని ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T152743.505.wav?_=2

 

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొత్త గట్టుసింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమి టీ ఎన్నుకున్నారు. ఈ సంద ర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు ఆలేటి శ్రీనివాస్ వారితో పాటు మండల అధ్య క్షుడు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి, సదా శివ రెడ్డి, ఆలేటి రాకేష్, కొత్తగట్టు సాయి, పెంబర్తి వినయ్, అఖిల్, సునీల్ తదితరులు కలిశారు.

మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T142916.012.wav?_=3

 

మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడేల సమ్మయ్య మరియు కల్వచర్ల కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం రోజున తెలంగాణ తొలి శాసనసభపతి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సార్ వారి పార్థివ దేహాలను సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, గ్రామపుర ప్రముఖులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T141157.951.wav?_=4

 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..!

◆- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి

◆:- ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం, ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుం టామని ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన రాజకీయ దూషణలో జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలోని ప్రజలు ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకొని శాంతియుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు…

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు

దేశంలో కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

టర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 2 తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,30,200గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,30,350గా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,19,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.1,31,135, రూ.1,20,400గా ఉన్నాయి (Gold Rates on Dec
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,19,350. విజయవాడలో కూడా 24 క్యారెట్ పసిడి ధర రూ.1,30,200గా, 22 క్యారెట్ గోల్డ్ రేట్ 1,19,350గా ఉంది. చెన్నైలో వెండి ధర కిలోకు రూ.1,96,000 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా దాదాపు ఇదే ధర ఉంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,88,000. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ స్పాట్ ధర ప్రస్తుతం 4,215 డాలర్లు. వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 57.22 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. అమెరికా ఫెడ్ రేట్‌లో కోతపై స్పష్టత వచ్చే వరకూ గోల్డ్ రేట్స్‌ ఎగుడుదిగుడులు తప్పవనేది విశ్లేషకుల అంచనా.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

 

 

ఫొటో క్యాప్షన్,భారీ వర్షాల కారణంగా కొలంబోలోని కడువెల ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతం

గమనిక : ఈ కథనంలో కలచి వేసే అంశాలున్నాయి

శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఇప్పటి వరకు 193 మంది చనిపోయారని, 228 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.

వరదల వల్ల 26,114 కుటుంబాలకు చెందిన 9.68 లక్షల మంది ప్రభావితమయ్యారు. భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

దిత్వా తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకి దక్షిణంగా 250 కి.మీ. దూరం ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

అది తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. ఆదివారం (నవంబర్ 30) సాయంత్రానికి తీరాన్ని సమీపిస్తుందని అంచనా

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను కారణంగా తమిళనాడుతోపాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుపాను తూర్పు వైపుకు కదిలి ఇండోనేషియాలో భారీ నష్టాన్ని కలిగించింది.

ఈ వారం బంగాళాఖాతంలో మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్, శ్రీలంకకు దక్షిణంగా దిత్వా అనే రెండు తుపానులు దాదాపు ఒకేసారి వచ్చాయి.

“బంగాళాఖాతంలో ఇది చాలా అరుదైన సంఘటన” అని స్వతంత్ర వాతావరణ శాస్త్రవేత్త శ్రీకాంత్ అన్నారు.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను ప్రభావం తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్,శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

డిసెంబర్ 1న తుపాను వేగం గంటకు 45-55 కి.మీ.లకు (అప్పుడప్పుడు గంటకు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి) తగ్గుతుంది.

తుపానును దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

ఫొటో క్యాప్షన్,శ్రీలంకలోని కాండీ సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

శ్రీలంకలోని కాండీలోని సరసవిగమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు పిల్లలు సహా 23 మంది తమిళులు మరణించారని స్థానికులు బీబీసీతో చెప్పారు. కొండచరియలు విరిగిపడిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.

కొండ చరియలు విరిగి పడినప్పుడు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటికే మరోసారి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెప్పారు.

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి మృతదేహాలను వెదికేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.

ఫొటో క్యాప్షన్,కొలంబో శివారు ప్రాంతం వెల్లంపిటియలో వరద నీటిలో సురక్షిత ప్రాంతానికి వెళుతున్న స్థానికులు.

దిత్వా తుపాను శుక్రవారం శ్రీలంకను తాకింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తింది.

బదుల్లా జిల్లాలో (తేయాకు తోటలు ఉన్న ప్రాంతం) కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.

కాండీ, అంపారా, బదుల్లా జిల్లాల్లోనే తుపాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులను మూసివేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైనవి మినహా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు, రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ ఫైనల్ క్రికెట్‌ మ్యాచ్‌లో తుపాను బాధితుల కోసం శ్రీలంక క్రికెటర్లు ఒక నిముషం మౌనం పాటించారు.

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

 

రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

చెన్నై: ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రి నుంచే పెనుగాలులతో నగరం, శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. వేకువజామున కాసేపు విరామం తర్వాత ఉదయం 7 గంటల నుంచి వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.
చేపాక్‌, ట్రిప్లికేన్‌ రాయపేట, మైలాపూరు, పట్టినంబాక్కం, ప్యారీస్‌ కార్నర్‌, వాషర్‌మెన్‌పేట, టి.నగర్‌, కోడంబాక్కం, కీల్పాక్‌, కోయంబేడు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి విరామం లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాలిలోతున వర్షపునీరు ప్రవహించింది. దీంతో వాహన చోదకులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు హాఫ్‌డే సెలవు ప్రకటించాయి. ఇక నగర శివారుప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రహదారుల్లో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో పూందమల్లి – చెన్నై సెంట్రల్‌, సెంట్రల్‌ తాంబరం మార్గాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. పోరూరు, అయ్యప్పన్‌ తాంగళ్‌, పెరుంగుడి, పెరుంగళత్తూరు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింంది. రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంలో బస్సులు, ఆటోలు, కార్లు నత్తనడక నడిచాయి. ఉదయం 7 గంటల నుంచే పూందమల్లి హైరోడ్డులో సెంట్రల్‌ వైపు, తిరువేర్కాడు వైపు వెళ్లే బస్సులు గమ్యస్థానాలను గంటకుపైగా ఆలస్యంగా చేరుకున్నాయి. విధంగా పోరూర్‌ జంక్షన్‌, గిండి, కోయంబేడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అండమాన్‌ విమానాల రద్దు…

నగరంలో వేకువజాము నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, అండమాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితు ల కారణంగా అండమాన్‌కు వెళ్ళాల్సిన రెండు విమాన సర్వీసులు, అదే విధంగా అండమాన్‌ నుండి నగరానికి రావాల్సిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే విధంగా పలు నగరాల వైపు ప్రయాణించే విమానాలు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.

 

 ఒకింత కష్టంగానే క్యాట్‌..

 ఒకింత కష్టంగానే క్యాట్‌

 

ఆశ్చర్యాలు ఏమీ లేనప్పటికీ ఈ ఏడాది క్యాట్‌ ఒకింత కష్టంగానే ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండుమూడేళ్లుగా క్యాట్‌లో….

ఆశ్చర్యాలు ఏమీ లేనప్పటికీ ఈ ఏడాది క్యాట్‌ ఒకింత కష్టంగానే ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండుమూడేళ్లుగా క్యాట్‌లో ప్రశ్నల కాఠిన్య స్థాయిని క్రమంగా పెంచుతున్నారు. అదే సరళి ఈ ఏడాది క్యాట్‌లోనూ కనిపించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు సెషన్లుగా ఈ పరీక్ష జరిగింది. ఐఐఎంలు సహా ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి తొలి ప్రాతిపదికగా మాత్రమే క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) ర్యాంక్‌ను పరిగణిస్తారు. ఈ పరీక్షలో మూడు విభాగాలు – వరుసగా వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ), డేటా ఇంట్రప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌(డీఐఎల్‌ఆర్‌), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(క్యూఏ) ఉంటాయి. వీఏఆర్‌సీలో 24, మిగిలిన రెండింటి నుంచి 22 చొప్పున మొత్తం 68 ప్రశ్నలు ఈసారి అడిగారు.

డీఐఎల్‌ఆర్‌ విభాగంలో ట్రికీగా ప్రశ్నలు

ఈ ఏడాది క్యాట్‌లో పేరాగ్రాఫ్‌ జంబుల్‌ ప్రశ్నలు కూడా ఇచ్చారు. మల్టీపుల్‌ ఛాయి్‌స(ఎంసీక్యూ)తోపాటు జవాబును నేరుగా టైప్‌ చేయాల్సిన (టిటా) ప్రశ్నలకు ఈసారి సమ ప్రాధాన్యం లభించింది. డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నలు ట్రికీ(యుక్తి)గా ఉండటంతో అభ్యర్థులకు ఈ విభాగం కష్టంగా మారిందని కెరీర్‌లాంచర్‌ కోఫౌండర్‌ గౌతమ్‌పురి అభిప్రాయపడ్డారు. విధానంలో మార్పులు లేనప్పటికీ డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నల కారణంగానే అలా అనిపిస్తోందని టైమ్‌ సీనియర్‌ కోర్స్‌ డైరెక్టర్‌ రామ్‌నాథ్‌ కనకదండి తెలిపారు. మూడో సెషన్‌లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ కష్టంగా అనిపించిందని విద్యార్థులు తెలిపారు. మొదటి సెషన్‌లో అడిగిన ప్రశ్నల తీరు గత ఏడాదితో పోల్చుకుంటే కష్టంగానే ఉందని అంటున్నారు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో మెజారిటీ ప్రశ్నలు అర్థమెటిక్‌, ఆల్జీబ్రా నుంచే అడిగారు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ కింద ఎలకా్ట్రనిక్‌ మ్యూజిక్‌, లా అండ్‌ మెంటల్‌ హెల్త్‌, నాయిస్‌ అండ్‌ సోషల్‌ ఆర్డర్‌, ఇన్‌కమ్‌ ఇనీక్వాలిటీ అండ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌పై పేరాగ్రాఫ్స్‌ ఇచ్చారు. రెండో సెషన్‌లో కాఠిన్య స్థాయి దాదాపు మొదటి సెషన్‌ స్థాయిలోనే ఉంది. 2022, 2023ల్లో మాదిరిగా కష్టంగా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. డీఐఎల్‌ఆర్‌ విభాగం కష్టంగా ఉండగా, వీఏఆర్‌సీ, క్యూఏ మోడరేట్‌గా ఉన్నాయి. డీఐఎల్‌ఆర్‌లో మల్టీపుల్‌ ఛాయిస్‌, టిటా ప్రశ్నలు 11 చొప్పున అడిగారు. వీఏఆర్‌సీలో 10 నుంచి 12.. అంటే సగం వరకు ప్రశ్నలకు జవాబులు సులువుగానే గుర్తించవచ్చు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో ఆరేడు ప్రశ్నలకు జవాబులు కరెక్ట్‌గా గుర్తిస్తే 90 పర్సంటైల్‌, అదే 10-11 సరిగా గుర్తిస్తే 99 పర్సంటైల్‌ వస్తుందని అభ్యర్థులు చెబుతున్నారు. మూడో సెషన్‌ సైతం మొదటి రెండింటి మాదిరిగానే ఉందన్నది సమాచా రం. అయితే, మూడోది కష్టంగా ఉందని కొద్దిమంది విద్యార్థులుతెలిపారు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగం అందుకు కారణమని చెబుతున్నారు. ఈ సెషన్‌లో డీఐఎల్‌ఆర్‌ సులువుగా ఉంది. అర్థమెటిక్‌లో 8-9 ప్ర శ్నలు అడిగారు. రీడింగ్‌ కాంప్రహెన్సన్‌లో నాలుగింటికి రెండు కష్టంగా ఉన్నాయని కొందరు తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దొమ్మటి ఇందిర రమేష్…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T132520.447.wav?_=5

 

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దొమ్మటి ఇందిర రమేష్

పరకాల,నేటిధాత్రి

మండలం మల్లక్కపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొమ్మటి ఇందిర రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ తరపున మల్లక్కపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొమ్మటి ఇందిర రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.పరకాల మండల మాజీ వైస్ ఎంపీపీ,బీఆర్ఎస్ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి వాడి కారి మధుకర్,మాజీ సర్పంచులు భయ్య రాజేందర్,దుమాల శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు బొజ్జం రవి,కార్యదర్శి దొమ్మటి మహేందర్,గ్రామస్తులు పాల్గొన్నారు.

గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్…

గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్

గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్‌మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

గరుడవేగ (Garudavega.com) కంపెనీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం సంస్థ సైక్లింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, వారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేలా ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ (Pedal to Progress) పేరిట 12 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీని నిర్వహించింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీ రామ్ దుర్వాసుల మాట్లాడుతూ Pedal to Progress కార్యక్రమం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. వారి ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ చైతన్యం తమ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఇంతకు ముందు కూడా ఓ వాకింగ్ ఈవెంట్‌ను నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని సూచించారు. ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T130002.257.wav?_=6

 

ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-

పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ, డా. కె.పట్టాభి రామారావు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

మంగళవారం నాడు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ,   డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రక్తదానం చేసిన న్యాయవాదులను మరియు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇరు బార్ అసోసియేషన్ లను మరియు రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు.

ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ ల కమిటీ మెంబెర్స్ మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సూపర్.. నీతా అంబానీ పెద్ద మనసు..

సూపర్.. నీతా అంబానీ పెద్ద మనసు.. స్టాఫ్‌ మెంబర్‌ పుట్టిన రోజున సెలబ్రేషన్స్..

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు. కోట్లకు పడగలెత్తిన నీతా తన ఉద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో చాటి చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది 
నీతా అంబానీ తన టీమ్ మెంబర్ పుట్టిన రోజును దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేశారు. తన దగ్గర పని చేసే మహిళా ఉద్యోగి పుట్టిన రోజున నీతా అంబానీ దగ్గరుండి కేట్ కట్ చేయించారు. కేక్‌ తినిపించి మరీ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. టీమ్‌లోని మిగిలిన వారు ‘హ్యాపీ బర్త్‌డే’ పాట పాడుతుండగా, నీతా అంబానీ తన స్టాఫ్ మెంబర్ పక్కన నిలబడి ఉన్నారు. ఈ వీడియోను బర్త్ డే జరుపుకున్న ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు (viral Ambani video).

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ…

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ

 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ ఒకటి బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా వాహన తనిఖీల్లో గుర్తించారు అక్కడి పోలీసులు.

శ్రీశైలం టోల్‌గేట్(Srisailam Toll gate) వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్(9mm Pistol) ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీ(Revalver)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

కాగా.. రివాల్వర్ తీసుకువచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ(Cyber Crime SI) అని ఆయన పోలీసులకు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై విచారణలో భాగంగా.. సదరు వ్యక్తి నుంచి రివాల్వర్ సహా ఐడెంటిటీ కార్డు(ID Card)ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్టు శ్రీశైలం సీఐ ప్రసాదరావు(CI Prasada Rao) పేర్కొన్నారు.

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్…

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్

 

ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..మక్కల్‌ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఇటీవల రాజ్యసభ(Rajya Sabha) సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇలా పెద్దలసభలో ఎంపీగా ఎన్నికైనప్పుడు తన అనుభూతి ఏమిటని కేరళ(Kerala)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నించారు. బదులుగా.. ఏడు పదుల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టుగా ఉందని సమాధానమిచ్చారు కమల్. ఆ సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని చెప్పిన ఆయన.. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నట్టు వివరించారు.

‘ఆ క్షణంలో నా తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్(D Srinivasan Iyengar), రాజ్యలక్ష్మి(Rajalakshmi)లను తలచుకున్నాను. నేను రాజ్యసభకు వెళ్లి సంతకం చేసినప్పుడు వారే గుర్తుకొచ్చారు. నేను స్కూల్లో ఓ డ్రాపౌట్ స్టూడెంట్‌ను. కనీసం ఎస్ఎస్ఎల్సీ(SSLC) పాసైనా.. నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. అలాంటిది 71 ఏళ్ల వయసులో సాధించినట్టుంది. ఆ సమయంలో నా తల్లికి ఫోన్ చేసి.. ప్రభుత్వ కొలువులో పనిచేస్తున్నానని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది.’ అని కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ అనుభవాన్ని పంచుకున్నారు.ఇక, కమల్ తన రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతూ.. తనను తాను మధ్యేవాదిగా చెప్పుకుంటానని పేర్కొన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Raj Kamal Films International) కూడా తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలకు మద్దతిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కమల్ చివరిసారిగా.. మణిరత్నం(Director Maniratnam) దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్(Thug Life)’ మూవీలో నటించారు. అయితే.. ఆ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు.

కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో..

కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో

https://youtu.be/fzVO52B4mR8?si=NqiYCThZYp7xzidb

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత్(Team India) రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది. ఈ మ్యా్చ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సోమవారం సాయంత్రం భారత జట్టు రాయ్‌పుర్‌కు చేరుకుంది. టీమిండియా ప్లేయర్లు హోటల్‌లోకి వెళ్లే ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చిన్నారుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కోహ్లీని చూసి సంబరపడిన పడిన పిల్లలు అతని చేతికి ఎర్ర గులాబీలు ఇచ్చి(Virat Kohli Raipur Welcome) ఘన స్వాగతం పలికారు.విరాట్ కూడా నవ్వుతూ వాటిని స్వీకరించి నెమ్మదిగా ముందుకు కదిలాడు. కోహ్లీని చూసినప్పుడు పిల్లలు సంబరపడిపోయారు. నక్షత్రాన్ని దగ్గర నుంచి చూస్తే.. ఎలాంటి అనుభూతి వస్తుందో.. పిల్లలకు కూడా కోహ్లీని చూసినప్పుడు అలాంటి అనుభవమే కలిగింది. ఆ విషయం వారి ముఖల్లో స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

 

నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.

 నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తులను పెంచి పోషించడంతోపాటు గంజాయి మాఫియా నడుపుతూ.. కామాక్షమ్మ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని ఈ సందర్భంగా స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి.. వారి జీవితాలతో చెలగాటం ఆడిందని వారు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మతోపాటు ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
స్థానిక ఆర్డీటీ కాలనీలో కూల్చివేసిన ఇళ్లలో కామాక్షమ్మ తన తల్లి సోదరులతో నివాసం ఉంటుంది. ఈ కాలనీలోని నివాసాలను కేంద్రంగా చేసుకుని ఆమె పలు అరాచకాలకు పాల్పడిందని స్థానికులు వివరించారు. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితులంతా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులేనని స్థానికులు వివరిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులు ఇక్కడే ఉంటూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరంతా.. యువతకు గంజాయి అలవాటు చేసి తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కామాక్షమ్మ, ఆమె మరిదితోపాటు పలువురు అనుచరులపై వివిధ నేరాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారని స్థానికులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఆమె చేస్తున్న అరాచకాలు భరిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో స్థానికులు, సీపీఏం నేతల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాంతో కామాక్షమ్మతోపాటు అమె బంధువులు, అనుచరుల నివాసాలను స్థానికులు కూలగొట్టారు

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T122155.689.wav?_=7

 

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అంగడి బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, రికార్డులు, విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, దీనిపై పర్యవేక్షణ ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయన వెంట ఉన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T121611.527.wav?_=8

 

 

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన నాయకులు గులాబీ కండువా లతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండలం కేంద్రం లో టి.సంగమేశ్ మారత్తమ్మ , మొహమ్మద్ రఫ్ మరియు 20 మంది కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది వారికి గులాబీ కండువాలు తో బిఆర్ఎస్ పార్టీ ఆహ్వానించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ
స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులందరూ సమిష్టిగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజి ఎంపిపి బొగ్గుల సంగమేశ్వర్, మాజి సర్పంచ్ లు జగదీశ్వర్ ,శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఏజెస్ బాబా,మాజి ఉప సర్పంచ్ లు బషీర్,హమీద్,బాల్ రాజ్, అతీక్ ,విలాస్, సామెల్, అజర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు..

ఆర్కేపి లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు….

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T121102.535.wav?_=9

 

ఆర్కేపి లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు….

భూమి కాజేసింది వ్యాపారస్తుడు….టేలాలో కిరాయికి దివ్యాంగుడు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వ భూములను రక్షించే ప్రయత్నం కూడా చేయడం లేదని పుర ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పేదవారు చిన్న పూరి గుడిసె వేసుకుంటే నానా హంగామా చేసే మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు వ్యాపారస్తులు, బడా లీడర్లు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ప్రాంతం నుండి ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో గల ఓ మద్యం దుకాణం వద్ద ఓ వ్యాపారస్తుడు సర్వే నెంబర్ ఏడు లోని ప్రభుత్వ భూమిలో టేలా వేయడమే కాకుండా అట్టి టేలను ఒక దివ్యంగుడికి కిరాయికి ఇచ్చినా సరే సంబంధిత అధికారులు టేలా పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు.అట్టి టేలను శాశ్వతంగా అమర్చి దాని ముందు ప్రాంతం కాంక్రీట్ తో చదును చేస్తున్నా సరే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పుర ప్రముఖులు అంటున్నారు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటే సంబంధిత అధికారులు “మామూలు”గా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది రక్షించాలని ప్రాంత ప్రజల కోరుతున్నారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు…

మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అట్టి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అన్ని హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సర్వే నెంబర్ 7 లో గల ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లయితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాజీవ్ చౌక్ నుండి ఏరియా హాస్పిటల్ వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు పక్కనగుర్తు తెలియని వ్యక్తులు టేలా వేసుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అది ప్రభుత్వ భూమి అని తేలితే తొలగిస్తామని తెలిపారు.

అట్టి భూమి ప్రభుత్వ ఆధీనంలోకే వస్తుంది…

20వ వార్డు బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ రావు.

20వ వార్డులోని ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు పక్కన గల ప్రదేశం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని, అట్టి ప్రదేశం లో గుర్తుతెలియని వ్యక్తులు టేలా వేసి దానిని కిరాయికి ఇచ్చినట్లు మా దృష్టికి వచ్చిందని, త్వరలోనే సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు జర్నలిస్టులకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన రహదారి స్థలాన్ని కబ్జా చేయడం మరి విడ్డూరంగా ఉందని అన్నారు.

జై, ఈశ్వరి బాయి 107 వ.జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T120157.012.wav?_=10

 

జై, ఈశ్వరి బాయి 107 వ.జయంతి

◆:- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డా. జె గితారెడ్డి

◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్,ఉజ్వల్ రెడ్డి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డా. జె గితారెడ్డి గారి మాతృమూర్తి దివంగత మాజీ ఎమ్మెల్యే ఉక్కు మహిళ పేదల పెన్నిధి, జై ఈశ్వరి బాయి గారి 107 వ.జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతి హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రివర్యులు సీతక్క,గడ్డం వివేక్ వెంకటస్వామి,శాసనసభాధ్యక్షులు గడ్డం ప్రసాద్,విజయ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్,ఉజ్వల్ రెడ్డి’ పాల్గొన్నారు.వారితోపాటు జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహ రెడ్డి ఎస్సీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ కె, భీమయ్య,సుభాష్ రెడ్డి షాకీర్ అలీ నరసింహులు టీచర్,జనార్ధన్ పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version