కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో
రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత్(Team India) రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది. ఈ మ్యా్చ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సోమవారం సాయంత్రం భారత జట్టు రాయ్‌పుర్‌కు చేరుకుంది. టీమిండియా ప్లేయర్లు హోటల్‌లోకి వెళ్లే ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చిన్నారుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కోహ్లీని చూసి సంబరపడిన పడిన పిల్లలు అతని చేతికి ఎర్ర గులాబీలు ఇచ్చి(Virat Kohli Raipur Welcome) ఘన స్వాగతం పలికారు.విరాట్ కూడా నవ్వుతూ వాటిని స్వీకరించి నెమ్మదిగా ముందుకు కదిలాడు. కోహ్లీని చూసినప్పుడు పిల్లలు సంబరపడిపోయారు. నక్షత్రాన్ని దగ్గర నుంచి చూస్తే.. ఎలాంటి అనుభూతి వస్తుందో.. పిల్లలకు కూడా కోహ్లీని చూసినప్పుడు అలాంటి అనుభవమే కలిగింది. ఆ విషయం వారి ముఖల్లో స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
