ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్…

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్

 

ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..మక్కల్‌ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఇటీవల రాజ్యసభ(Rajya Sabha) సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇలా పెద్దలసభలో ఎంపీగా ఎన్నికైనప్పుడు తన అనుభూతి ఏమిటని కేరళ(Kerala)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నించారు. బదులుగా.. ఏడు పదుల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టుగా ఉందని సమాధానమిచ్చారు కమల్. ఆ సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని చెప్పిన ఆయన.. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నట్టు వివరించారు.

‘ఆ క్షణంలో నా తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్(D Srinivasan Iyengar), రాజ్యలక్ష్మి(Rajalakshmi)లను తలచుకున్నాను. నేను రాజ్యసభకు వెళ్లి సంతకం చేసినప్పుడు వారే గుర్తుకొచ్చారు. నేను స్కూల్లో ఓ డ్రాపౌట్ స్టూడెంట్‌ను. కనీసం ఎస్ఎస్ఎల్సీ(SSLC) పాసైనా.. నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. అలాంటిది 71 ఏళ్ల వయసులో సాధించినట్టుంది. ఆ సమయంలో నా తల్లికి ఫోన్ చేసి.. ప్రభుత్వ కొలువులో పనిచేస్తున్నానని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది.’ అని కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ అనుభవాన్ని పంచుకున్నారు.ఇక, కమల్ తన రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతూ.. తనను తాను మధ్యేవాదిగా చెప్పుకుంటానని పేర్కొన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Raj Kamal Films International) కూడా తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలకు మద్దతిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కమల్ చివరిసారిగా.. మణిరత్నం(Director Maniratnam) దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్(Thug Life)’ మూవీలో నటించారు. అయితే.. ఆ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు.

న్యూయార్క్‌లో విజయం తరువాత మమ్దానీ ప్రసంగం.. నెహ్రూ మాటల్ని గుర్తు చేస్తూ….

న్యూయార్క్‌లో విజయం తరువాత మమ్దానీ ప్రసంగం.. నెహ్రూ మాటల్ని గుర్తు చేస్తూ..

 

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం తరువాత తొలిసారిగా ప్రసంగించిన భారత సంతతి నేత జొహ్రాన్ మమ్దానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి మార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాటల్ని కూడా గుర్తు చేసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం తరువాత తొలిసారిగా డెమాక్రెటిక్ పార్టీ నేత జొహ్రాన్ మమ్దానీ తన మద్దతుదారులను ఉద్దేశించి తాజాగా ప్రసంగించారు. భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ట్రిస్ట్ విత్ డెస్టినీ వ్యాఖ్య తనకు ఈ సందర్భంగా గుర్తొస్తోందని అన్నారు. ఎన్నికల్లో తన విజయం ఓ చారిత్రాత్మక క్షణమని అన్నారు. ఒక శకం ముగిసి.. నవ శకానికి స్వాగతం పలికే ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా మాత్రమే వస్తాయని అన్నారు. అణచివేతకు గురైన దేశ ఆత్మ జాగృతమై తన గొంతుక వినిపించిన అద్భుత క్షణం ఇదని కామెంట్ చేశారు. ఈ కొత్త శకంలో న్యూయార్క్ ప్రజలు స్పష్టత, దార్శనికత, ధీరత్వంతో కూడిన నాయకత్వాన్ని చూస్తారని అన్నారు (Zohran Mamdani, Tryst With Desting Nehru Speech).

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్ వేదికగా ప్రసంగించారు. నాటి అమృత ఘడియలను నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీగా అభివర్ణించారు. ఆ అద్భుతం శకం రాక ముందుగానే నిర్ణయమైందని అన్నారు. నాటి నెహ్రూ మాటలనే నేడు మమ్దానీ మళ్లీ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా మమ్దానీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి సంకోచం లేకుండా ట్రంప్ పేరును ప్రస్తావించి మరీ హెచ్చరిక చేశారు. ఈ విజయానికి కారణం న్యూయార్క్‌లోని కొత్త తరం అని అన్నారు. వారి తరపున తామంతా పోరాడతామని హామీ ఇచ్చారు. రాజరిక వ్యవస్థల్ని కూల్చేశామని వ్యాఖ్యానించారు. ‘ట్రంప్.. మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు. మీకు నేను నాలుగే నాలుగు మాటలు చెప్పదలచుకున్నారు. ఇకపై హోరు మరింత పెరుగుతుంది. మాలో ఏ ఒక్కరిని టచ్ చేయాలన్నా మా అందర్నీ ఎదుర్కోక తప్పదు’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో డెమాక్రెటిక్ నేత మమ్దానీ గెలిచి..అత్యంత చిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version