విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అంగడి బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, రికార్డులు, విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, దీనిపై పర్యవేక్షణ ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయన వెంట ఉన్నారు.
