ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో వసతుల పట్ల నివేదిక.

*ప్రభుత్వ ఆసుపత్రులు,
వైద్యకళాశాలల్లో వసతుల పట్ల నివేదిక*

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాల, నర్సంపేట ఆసుపత్రులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన డాక్టర్ సంగీత సత్యనారాయణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వైద్య విద్య కళాశాలలకు ఎన్ఎంసి నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కేఎంసి,నర్సంపేట,జనగామ వైద్య కళాశాలల పర్యవేక్షణ కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.శనివారం నర్సంపేట మెడికల్ కళాశాలలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కళాశాల పిన్సిపాల్ ,కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ దాస్, వివిధ విభాగాధిపతులు, అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లతో ఆస్పత్రి వసతుల కల్పనకు కావలసిన వివిధ అంశాలపై కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

 

ముందుగా నర్సంపేట మెడికల్ కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతులపై సమీక్షించారు.

వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అందుకు గురించిన వివరాలను ప్రిన్సిపల్ డాక్టర్ మోహనదాస్ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిఎమ్సి నర్సంపేటలో ఉన్న ఆసుపత్రిలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి కమిషనర్ సందర్శించి అక్కడున్న వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిని సందర్శించి ఓపి విభాగం, ఆరోగ్యశ్రీ, సందర్శించి ఆయా వార్డుల వివరాలు, ఓపి సేవలు, రిఫరల్స్, ఫాలో అప్, ఇతర సేవల గురించి, వైద్యులు సిబ్బంది, తదితర వివరాలను వైద్యాధికారులను కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎన్ఎంసి నిబంధన ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి కూలంకషంగా చర్చించారు.

 

Dr. Sangeetha Satyanarayana

 

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.

కావలసిన పరికరాలు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర వివరాలు కమిషనర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నర్సంపేట వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సాంబశివరావు, టీజీఎంఐడిసి ఈఈ ప్రసాద్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. కిషన్ , వైస్ పిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ శ్రీదేవి , పలు విభాగాల అదిపథులు,బోధన, బోధనేతర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.

తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి సాయిలు తాడిచెట్లు ఎక్కి కళ్ళు గీసి జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తాడిచెట్టి ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. ఈ సంఘటనలో సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వైద్య చికిత్సల కోసం 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి అక్కడి నుండి హనుమకొండలోని ఎంజీఎం తరలించినట్లు తెలిపారు.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

తహసిల్దార్ ఇమాం బాబా షేక్.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ ఇమామ్ బాబా షేకు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి స్కీం లో మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంలో ఎవరైనా పెద్ద ఏదైనా కారణం చేత మరణించిన చో అతని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉండవలెను మరియు మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వగలరు దీని ద్వారా 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చిట్యాల తహసిల్దారు తెలియజేశారు అవకాశాన్ని చిట్యాల మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని శ్రీరంగాపురం గ్రామంలో డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య శిబిరం నిర్వహించే వ్యాధులతో బాధపడుతున్నవారు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా శానిటేషన్, నీటి నిల్వలు ఆయిల్ బాల్స్ రిలీజ్ , బ్లీచింగ్ చల్లించడం పంచాయితీ కార్యదర్శి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కాచి చల్లార్చి నీళ్లు మాత్రమే తాగాలని హారపదార్ధాలు వెచ్చగా ఉన్నప్పుడు తినాలని తెలిపారు. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, కరకగూడెం పి హెచ్ సి. హెచ్ ఈ ఓ కృష్ణయ్య, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఏ ఎం నరసింహారావు, సుజాత, ఆశాలు, హెల్త్ సూపర్వైజర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..
బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరు పృథ్వీరాజ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఎలిగేడు మాజీ మండల అధ్యక్షులు నారాయణస్వామి సుల్తానాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి మహేందర్ కొలనూరు మాజీ సర్పంచ్ కైరునిస తాజ్ పుల్ల సదయ్య అనిల్ రావు దాత రాకేష్ సత్యం రెడ్డి శంకర్ బిక్షపతి కొంగర అనిల్ తదితర మూర్చ నాయకులు బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. 

విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి.. ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

‘యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి’

◆ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం జహీరాబాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పతాంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. వేడుకల్లో పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను
వశిష్ట యోగా ప్రతినిధులు, క్రీడాకారులు ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు గురువులు వివరిస్తూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు

హాజరైన బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు హాజరయ్యారు.ఈసందర్బంగా మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక,మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ‘యోగ’అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు శరీరం మరియు మనస్సు కలయికకు ప్రతీకగా చేరడం లేదా ఏకం చేయడం అని,నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతోంది మరియు జనాదరణ పొందుతూనే ఉందని,దాని సార్వత్రిక విజ్ఞప్తిని గుర్తించి,11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి 69/131 తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు.యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థాపించే ముసాయిదా తీర్మానాన్ని భారతదేశం ప్రతిపాదించింది మరియు రికార్డు స్థాయిలో 190 సభ్య దేశాలు ఆమోదించాయన్నారు.

జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదనను మొదట ప్రవేశపెట్టారు.యోగా అనేది మనస్సు మరియు శరీరం,ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యతను కలిగి ఉంటుందని మన ఆరోగ్యానికి మరియు మన శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం. యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదు,మీతో, ప్రపంచంతో మరియు ప్రకృతితో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడానికి ఇది ఒక మార్గం,యోగా అనేది శారీరక శ్రమ కంటే ఎక్కువ మరియు రోజువారి జీవితంలో సమతుల్య వైఖరిని కొనసాగిస్తుందని పనితీరులో నైపుణ్యాన్ని ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాచం గురుప్రసాద్,ఆర్పి జయంతి లాల్,కాసగాని రాజ్ కుమార్, ఎరుకలు దివాకర్,మార్తా రాజభద్రయ్య,ఎర్రం రామన్న, సంగా పురుషోత్తం,బాసాని సోమరాజు పటేల్,మార్త బిక్షపతి,సందీప్,కుమారస్వామి నరసయ్య,పావుశెట్టి సునీత,దంచనాదుల కిరణ్ కుమార్,కందుకూరి గిరి ప్రసాద్,కాలుగుల గోపీనాథ్, గోగుల రాజిరెడ్డి,రవీందర్ యాదవ్,నగేష్,బాలాజీ మురళి,ఆర్పీ సంగీత,చెట్ల రజినీకాంత్,సంగా ప్రభాకర్, బండి యాదగిరి,మధుసూదన్ రెడ్డి, రాంబాబు,ప్రజా ప్రతినిధులు,బిజెపి నాయకులు,పతాంజలి వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో “యోగ మహోత్సవం” ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి.నిర్మల గీతాంబ మరియు విశిష్ఠ అతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభా బృందం ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు ప్రదర్శించబడ్డాయి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ మాట్లాడుతూ – ‘‘యోగా మన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక అంశాలలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగా నిత్య ప్రక్రియ వల్ల మనం మన సాధారణ ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు.యోగా టీచర్లు శోభ మరియు భాస్కర్ యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించి, ఆరోగ్యపూరిత జీవనానికి యోగా అవసరమని స్పష్టం చేశారు.

ఈ యోగా కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, వరంగల్ హనుమకొండ జిల్లాలో ఇతర న్యాయమూర్తులు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ డి. రమా కాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాజరయ్యారు.

అనంతరం యోగా గురువులను న్యాయమూర్తులు మరియు వరంగల్ బార్ అసోసియేషన్ వారు శాలువాలతో సన్మానించారు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు..
రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం

కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ

ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు

యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న
పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ..చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో.రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

వెన్నునొప్పి వస్తుందా..

వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..

 

 

 

 

వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే, దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. సాధారణంగా, ఇది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

తప్పుగా కూర్చోవడం:

గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే నేరుగా కూర్చోవాలి, కుర్చీ కూడా మంచిది ఉపయోగించాలి. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

 

 

 

 

శారీరక శ్రమ లేకపోవడం

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడితే, వెన్నెముకకు సరైన మద్దతు లేక నొప్పి వస్తుంది. కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

 

 

 

 

బరువులు ఎత్తడం:

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది. కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి. అవసరమైతే ఎవరైనా సహాయం తీసుకోవాలి.

 

 

 

 

పరుపు లేదా నిద్ర భంగిమ:

మృదువైన లేదా గట్టిగా ఉన్న పరుపులు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వవు. అలాగే నిద్రించే స్థితి సరిగాలేకపోతే ఉదయం నడుము నొప్పితో లేచే ప్రమాదం ఉంటుంది. మితమైన గట్టితనంతో ఉన్న పరుపును ఎంచుకోవాలి. వీపు నేరుగా ఉండేలా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. వెన్నునొప్పి సాధారణమైన సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు మార్చుకోండి. వెన్ను నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.

 

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా..

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..

 

 

కొంతమందికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అయితే, అలాంటి వారు పడుకునే ముందు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

చాలామందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి మేలుకువగా ఉండేటప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది చిప్స్, స్వీట్లు వంటి అనారోగ్యకరమైన వాటిని తింటారు. కానీ ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి, మీకు ఆకలిగా అనిపిస్తే ఈ తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆకలిని తీరుస్తాయని, అదే సమయంలో నిద్రకు ఇబ్బంది కలిగించవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

గోరువెచ్చని పాలు

రాత్రిపూట ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచిగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ప్రతి రోజు పడుకునే ముందు 150–200 మి.లీ పాలు తాగడం మంచిది.

 

 

 

 

 

 

గింజలు (బాదం, వాల్‌నట్స్)

గుప్పెడు బాదం లేదా 2–3 వాల్‌నట్స్ తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గుతుంది. అలాగే రాత్రంతా చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.

 

 

 

 

 

 

అరటిపండు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి కండరాలను సడలించడంతో పాటు నిద్రకు సహాయపడతాయి. అరటిపండు ఆకలిని తీరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న అరటిపండు తినవచ్చు. దీనిని పాలతో కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

 

 

ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల.

పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

హన్మకొండ, నేటిధాత్రి:

 

shine junior college

 

 

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన.

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన *
జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి

జమ్మికుంట :నేటిధాత్రి

shine junior college

ఈరోజు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు గారు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి తనిఖీ లో భాగంగా ఫార్మసీ రూమ్, ల్యాబ్ మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది ఆరోగ్యశాఖ సిబ్బందికి క్రింది విషయాలపై దిశా నిర్దేశం చేశారు
అందులో
1.NCD క్లినిక్స్ ను పగడ్బందీగా నిర్వహించాలి అందులో ఎన్ సి డి పరీక్షలు హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్ ,ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించాలి
2.లెప్రసి సర్వేను ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో విధిగా నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించాలిACF camp పెట్టి,Sputum Samples సేకరించాలి. అవసరం అనుకున్న వారికి Xray తీయించాలి.
3.ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్ర వారం తప్పనిసరిగా నిర్వహించాలని అందులో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని
4.జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని
5.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని
6.వర్షాకాలంలో వచ్చే వ్యాధుల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద ప్రజలకు అవగాహన కల్పించాలని
7.సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ABHA కార్ట్స్ ను ఇంప్రూవ్ చేయాలని ప్రజలందరూ ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ , హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ సదానందం,ఫార్మసిస్ట్ శ్రీధర్,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు

సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )

shine junior college

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ, లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపినారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ పి ఓ ఎమ్ హెచ్ ఎన్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్.ఈ బాలయ్య పాల్గొన్నారు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:.

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు షైక్ రబ్బాని యొక్క తమ్ముడు షైక్ సులేమన్ తనయుని కూతురు అజ్వ యొక్క జన్మదిన సంధర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. షేక్ రబ్బాని మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ షఫీ ఉద్దీన్ షేక్ సజ్జహోద్దీన్ బంధుమిత్రులు కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన
జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును మరియు లోని పిఎస్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ను తనిఖీ నిర్వహించి మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించినారు.

Health Officer Dr. Rajitha.

 

 

 

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ శానిటేషన్ మహిళ సిబ్బంది, స్వయం సహాయక మహిళా సిబ్బందిని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య రక్షణలో తన బాధ్యతగా క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు దీర్ఘకాల వ్యాధుల( మధుమేహం, రక్తపోటు) పై ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డిపిఓ రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version